Home » Avasarala ramakrishna rao » Sampengalu Sannajaajulu

 

    వదిన ముద్దులు పెట్టుకుంటుంటే మా మధురిమ ఆమెను తెగ కరిచి వదిలి పెట్టింది. "చంపేసింది బాబోయ్' అని అరిచింది.
    'కోడలు ఇప్పట్నుంచి తాడాఖా బాగా చూపిస్తోందే!'
    'అత్తగారికి ఏమాత్రం అణకువగా ఉంటుందో మచ్చు మాత్రమే కదుటమ్మా చూపిందీ, ఏది దాన్నింకా నేను బాగా తరిఫీదు చేసిందేది?'
    'అలాగేనమ్మా పిల్లదాన్ని చక్కగా తరీఫీదు చేసి యుద్ద రంగానికి పంపు. మా వాడుఒట్టి అమాయకుడు. ఎడం చేత్తో వేసిందంటే ఏడేడు లోకాలు తిరిగి రాగల్డు.'
    ఆ అర్ధ రూపాయిలో పావలా కమిషన్ కొట్టే అమాయకుడు గాడు అప్పుడే గుండాడించుకుంటూ బడిలోంచి వచ్చాడు.
    "అదేమిటి వదినా, పేరుకి పిలకైనా లేకుండా అలా గచ్చు చేయించేశారూ? ఇలా అయితే మా అమ్మాయి ఒప్పుకోదే, అధసలె ఫ్యాషన్ల మారి!"
    "ఫ్యాషన్ల మారో పెద్దమ్మవారో మా కొద్దు తల్లీ. మీకూ మీ సంబంధానికే ఒక్క నమస్కారం. కట్నాల ఎడ్వాన్సులతో ఇల్లు నిండిపోయి మేం బాధ పడుతున్నాం. అందులో ఒకటి చూసుకుంటాంలే."
    అన్నయ్య రాకతో మా సంభాషణ ఆగిపోయింది. వాడికి నా మార్కుల జాబితా చూపించాను.
    "నువ్వు బెనారస్ ఎమ్మేకి లిటరేచర్ తో ఎందుకు వెళ్ళ కూడదే , అన్నిటి కన్న ఇంగ్లీషులోనే ఎక్కువ మార్కులు వచ్చినట్లున్నాయ్?'
    నాకు ఒళ్ళు మండుకొచ్చింది.
    "నీకేం చదువంటే అదో తమాషాగా ఉందా ఏమిట్రా? పుస్తకాలు ముందేసుకుని గంటలు చదువుకోడమన్నది వేళాకోళంగా ఉన్నట్టుందే.' అయినా నన్ను చదువుకోమని ఊ వెంట బెట్టక పొతే నువ్వెందుకు చదవవ్? బి.కాం తోనే ఎందుకు అపెసినట్టూ ? ఉద్యోగంలో అంత తొందరగా ఎందుకు చేరినట్టూ?'
    అన్నయ్య పొడిగా నవ్వేడు.
    'నువ్వు చూస్తూనే ఉన్నావ్ గదా నాకు టైమెక్కడిదే?
    "పోనీ వదిన్నయినా ఎందుకు చదివించవ్?'
    'వదిన సంగతి నీకు తెలుసుగా, ఓసారి నాకు ఇంగ్లీషు లో తను ఎడ్రసు రాసి ఉత్తరం పోస్టు చేస్తే నాలుగు వూళ్ళు తిరిగి - డెడ్ లెటర్ ఆఫీసు చేరి -- అక్కడి నిపుణుల చేత, భూతద్దాల సహయంతో ఏ అక్షరం ఏదో పోల్చుకోబడి ఆర్నెల్ల తరువాత నాకు చేరింది!'
    మేమిద్దరం నవ్వెం. మా ఇద్దరి కన్న ఎక్కువ నవ్వింది వదిన! ఇంతగా హేళన చేస్తున్నా ఇంత తేలిగ్గా నవ్వేస్తోంది , ఇంతకన్న విద్య ఏముంది! హాయిగా నవ్వడం లో ఈవిడకీ 'ఆనరరీ డాక్టరేటు' ఇవ్వచ్చు అనిపించింది నాకు. ఆ మాటే పైకి అనేశాను.
    'ఆ మాట ఒప్పుకున్నావు కద, అయితే ఇక మంగళకి చదువెందుకు?"
    'అయితే అది లేకే కాబోలు నాకు చదువు!' ఇద్దరూ నవ్వేరు.
    'ఈ విషయంలో ఒకరితో పోలిక దేనికి?  అదృష్టమూ అవకాశమూ అందరికీ కలిసి రావు. నువ్వు వెంటనే అప్లై..... చెయ్యకపోతే....'
    "ఒట్లూ, సత్యాలూ వద్దు. దీని మటుకు ఈ మధూ పగలల్లా నన్ను కాల్చుకుతిని...' 'రాత్రేమో మరొకరు కాల్చుకుతిని...'
    
    'ఏమిటి వదినా ఆ హాస్యం? ఎన్నాళ్ళెం ఈ పరీక్షలు? అందరూ గుర్రు పెట్టె రాత్రి వేళ ఒక్కర్తివీ కూచుని ఏళ్ళ తరబడి చదవాలంటే గుర్రుగా ఉండదేం? వరసగా పరీక్షలకి కట్టడం చేతో ఏమో గాని బాగా విసుగెత్తి పోయిందిరా అన్నా.... అయినా నా గ్రూపు ఎకనామిక్స్ కద, ఇంగ్లీషు కి నన్ను కూర్చోనిస్తారా?'
    "అందుకేనే అంత తొందర పడేది ఇదే ఆఖరి చాన్సు. ఈ ఏడు దాటిపోతే రూల్సు ఇంకా గట్టి చేస్తారను]కుంటున్నారు. చదివి పరీక్షకి కూచో' ప్యాసవక పొతే వచ్చే ఏడు చదవచ్చు. ఇప్పుడు వెళ్ళకపొతే ఏ అవకాశమూ ఉండదు."
    'నువ్వు చెప్పిన నిబంధనల ప్రకారం , ఏ గ్రాడ్యూయెటు అయినా బెనారస్ ఎమ్మే కి కూచునే అవకాశమే ఉంటె , బియ్యస్సీ కదా, అయన కూడా రావచ్చు నెమో.'
    'ఏమో నాకు తెలీదు. మొన్నీ మద్యా మా ఫ్రండోకడు ప్రోస్పెక్టస్ తెప్పించాడు. కనుక్కొని నీకు రాస్తాలే.'
    అన్నయ్య బ్యాంకు కి వెళ్ళిపోయాడు. ఆ వేళ సాయంకాలం చిన్నారి నెత్తుకుని వీధిలో నిలబడ్డాను. ఎవరో నలుగురు పిల్లలు పుస్తకాలు పట్టుకుని లోపలికొచ్చేరు. 'మేష్టారు వచ్చారండి?' అంటూ. టైం లేదనే అన్నయ్య ట్యూషన్లు కూడా ఎందుకోప్పుకున్నట్టు? ఆర్ధికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడెమో అని నా మనసు చివుక్కు మంది. నేనూ వాడూ చదువు కొంటున్నప్పుడూ, నా పెళ్ళికి ముందు కొన్నాళ్ళు, కొంత వరకు ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు నేను ఎరిగినవే. 'తృప్తిచెందని మనుజుడు సప్త దీపముల నయిన చక్కంబడునే?' అనే సిద్దాంతం నాన్నగారిది. వాళ్ళిద్దరూ ఇబ్బంది పడైన ఉన్నంతలో నాకు పెట్టడం వల్ల పేదతనం అన్నది నాలో నాటకుండా దానికి సంబంధించిన చికాకులు నాలో పెరక్కుండా నన్ను పెంచేరు.
    ఇక ఈ కులాసా పురుషుల కూటమి లో చేరేక  మేం మహా అయితే ఇస్తో కు పొడి కనక 'కంటికి నచ్చింది ఇంటికి వచ్చింది.' అన్న ధీమా తప్ప లేమితనం లేశమైనా ఎరగం. ముగ్గురు పిల్లలతో రాగాలతో, రోగాలతో అప్పులతో ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం తో అన్నయ్యకు ఈ మహాపట్నం లో ఎలా వెడుతుందో ముందుగా నేనే ఊహించ వలసిన మాట, అడిగితె ఏ మాత్రమూ కోరకబడడు, నేను వచ్చేస్తూ ముగ్గురు పిల్లల చేతుల్లోనూ మూడు  పది రూపాయల నోట్లు నొక్కేను. అంతకన్న ఏం చెయ్యగలను? అది కూడా చెయ్యలేక పోయానని రైలు కదిలేక గాని నాకు తెలిసి రాలేదు.
    'మొగపిల్లలు నూతులు. ఆడపిల్లలు చేదలు. అలా ఊరికే తోడేసుకోటమేట. అదే పనిట. అలా తోడుకుంటుంటే గాని ఇంకా ఇంకా నీరు వూరదట. సౌభాగ్యం పెరగదట-- అని అమ్మ అనేదట. నాన్న చెప్పేవారు, కాదంటావా?' అంటూ అన్నయ్య రైలు కదులుతుంటుంటే వదిన చేత ఏదో పేకెట్టు రైలులో విసిరించాడు. ఆ తరవాత చూసుకున్నాను. అలా అమ్మినా నలబై అయిదుకి తక్కువ రాదు. నా కిష్టమైన కుందనం రంగు కుట్టు పువ్వుల చీర!

                            *    *    *    *
    ఇంటికి వచ్చాక వారం తిరక్కుండా అన్నయ్య నుండి రావలసిన భోగట్టా వచ్చింది. ఆడవాళ్ళకయితే యూనివర్శిటీకి రాసుకుంటే స్పెషల్ కేసుగా చూసి కన్సెషన్ ఇస్తారుట, నన్ను వెంటనే రాసుకోమన్నాడు. మొగాళ్ళ కయితే కనీసం ఒక ఎడాదయినా టీచరుగా అనుభవం ఉండాలి. అందుచేత అయనకవకాశం ఉండదనుకుంటానని రాశాడు. ఆయనతో ఈ విషయం ప్రస్తావిస్తే.    
    'ఈ ఉద్యోగం రాకముందు తునిలో ఓ ఏడాది పాటు నేను మేష్టరీ వెలగబెట్టక పోలేదు గాని ఇప్పుడది పరిగణిస్తారో లేదో! ఏమయినా నన్ను చంపకు - ఇప్పుడు మళ్ళీ చదివే కోరిక నాకు లేదు! అన్నారు. మొట్ట మొదటిసారిగా అమ్మ బలవంతాన బళ్ళోకి పంపుతున్నప్పుడు అబ్బాయి మొహంలా ఉంది అయన మొహం. నాకు నవ్వొచ్చింది. ఆ తరవాత మా సంభాషణ మరీ నవ్వులాట లో దిగింది. నేను --   
    'నాకు చదవాలనుందండీ!'
    'ఒక్కర్తెనీ అయితే చదవగలనో లేవో అని భయంగా ఉందండి!'
    'ఎవరయినా తోడూ కావాలండీ.'
    'మిమ్మల్ని మించి మంచి తోడూ నాకెలా దొరుకుతుంది చెప్పండి?'
    'మీరు కూడా పరీక్ష కి కడితే అంతకన్న నాకు కావలసిందేమిటి చెప్పండి?'
    ఇక అయన --
    'నాకు సరదాగా అలా తిరిగి రావాలనుంది మంజూ!'
    'ఒక్కడ్ని అయితే ఏం సరదా తీరుతుంది చెప్పు?
    'ఎవరైనా చక్కని చుక్క కూడా ఉండాలి.'
    "నీతోడు, నీతోడు కన్న కావలసిందేముంది?'
    'నీతోడు బయల్దేరక పొతే నేను చేసే దేముంది చెప్పు?'
    నేను అయిదు నిమిషాలు ఆలోచించాను. ఆ మనిషిని నా గుప్పెట్లో పెట్టుకోవడం ఆ క్షణం నాకేం కష్టం అనిపించలేదు. రివ్వున లేచి క్షణంలో తయారై వచ్చాను. పాల మీగడ లాంటి చీరకట్టు కున్నాను. పాము కుబుసం లాంటి బ్లౌజు వేసుకున్నాను.
    'ఇదేమిటి! ఎండ వేళ ముస్తాబు! ఎదురు చూడని ముస్తాబు!' ఆశ్చర్యం ఆనందం కలిసి అయన కళ్ళు పెద్దవై వెలిగేయి.
    "కొండంత మీరుండగా కొత్త కొత్త కోరికలు మనసంతా నిండగా , నాకేం లోటు! ఇంకా అలా చూస్తారేం - త్వరగా రండి. మళ్ళీ 'షో' అందదు.'
    'మధూ?'
    'అది పడుకుని అరగంట దాటింది. రంగిని ఈ రాత్రికి ఉంచేస్తాను లెండి. ఇక లెండి మరి ఇవాళ పున్నమి కూడాను. అలా బీచికి కూడా వెళ్లోద్దాం.'
    "ఆల్ రైటో రైటో పెళ్ళి కూతురా' అని విజిల్ వేసుకుంటూ అయన లోపలికి పరుగెత్తేరు.
    ఆ రాత్రి వేళ - ఒక చక్కని సమయాన - ఎలాగైతేనేం ఆయన్ని కూడా పరీక్ష కి కట్టించడానికి ఒప్పించాను. 'ఆ అప్లికేషను ఫారమ్స్ బుక్సూ ఆ భారమంతా నీదే సుమా!; అని అన్నయ్యకు రాశాను. వెంటనే జవాబు వచ్చింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra