Home » D kameshwari » Aruna

 

    చిన్నప్పటినించి సుఖాలతో పెరిగావు. కష్టాలు తెలియవు డబ్బు విలువ అంతకుముందే తెలియదు. అందుకే అంత సులువుగా మాట్లాడుతున్నావు. నీవు ఏదన్నా గ్రామంలో ప్రాక్టీసు పెట్టడానికి, ప్రాక్టీసు నిలదొక్కుకొనేవరకు నిన్ను ఆదుకోవడానికి మీ నాన్నగారు ఉన్నారు. అరుణా మా ఇంటి పరిస్థితి నీకు తెలుసా? ఈ మెడిసిన్ డిగ్రీ కోసం ఎన్ని ఇబ్బందులుపడ్డానో నీకు తెలియదు. ఆర్దికంగా మా కుటుంబం ఎంత చితికిపోయిందో నా చదువుకయిన ఖర్చుతో ఇప్పుడు ఇంటికి పెద్దకొడుకుగా తండ్రిలేని ఇంట్లో అందరూనా జీతంమీదే ఆధారపడిఉన్నారు. తల్లి, తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళందరినీ నేను ఆదుకోవాలి ఇప్పుడు నీ ఆశయం కోసం రిస్క్ తీసుకొని బ్రతుకుతెరువువదులుకోలేను అది నా విషయంలో అసంభవం" స్పష్టపరిచాడు వేణు.
    అరుణ మొహం నల్లబడింది. వేణు అభిప్రాయం నిక్కచ్చిగా తెలిసిపోయేట్లు చెప్పాడు. అంటేవేణుని పెళ్ళాడదలిస్తే తన ఆలోచన వదులుకోవాలి. తన ఆశయానికి తిలోదకాలివ్వాలి అంతేగా? పెళ్ళాడాక, వేణుకి ఇష్టం లేకుండా తను ఒక్కర్తి ఎక్కడికో వెళ్ళి ఉండడం అన్నది సాధ్యం కాదు అలాంటిపరిస్థితిలో అసలు వివాహం ఆడడంలో అర్ధమూ ఉండదు.
        తన ఆదర్శానికి ఆదిలోనే హంసపాదు తనుఅనుకున్నది. ఆశించినది, ఏదో ప్రత్యేకత, నవ్యత, ఆశించికన్న కలలు.......అన్నీ గాలికి వదిలేయడమేనా? వేణు కోసం తన నిర్ణయాలనిమార్చేసుకుని, వేణుని పెళ్ళాడి అందరిలాగే ఉద్యోగం చెయ్యమన్నన్నాళ్ళుచేసి, అందరిలాగే సంసారం చేసి, అందరిలాగే పిల్లల్ని కని అదే సుఖజీవితం అని సరి పెట్టుకోవాలా? దానితోనే సంతృప్తిపడాలా?
    ఈ జీవితంకాదు తను కోరుకున్నది. జీవితంలో వివహమేకాదు తనకు ముఖ్యమైనది స్వప్రయోజనాలని దూరంగా నెట్టి, ఈ జీవితానికే కాక ఈ చదివిన చదువుకు సార్ధకత చేకూర్చుకోవాలి తన ఆశయాన్ని ఆచరణలోపెట్టడానికి ఏ ఇబ్బందైనా ఎదుర్కోగలదు ఏ త్యాగమన్నా చేయగలదు అసలు త్యాగం చేస్తున్నానన్న ఆలోచనకే తావీయకూడదు. అది తన కర్తవ్యనిర్వహణ కోసం ఎవరినైనా, దేన్నైనా వదులుకోగలదు. ఆఖరికి వేణుకి కూడా ఆవేశంగా ఆలోచిస్తున్న అరుణమొహం వంక ఆశగా, ఆతృతగా చూస్తూ ఆమె నిశ్చయం కోసం, ఆమె జవాబు కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు వేణు

    అరుణలాంటి రూపసి, చదువుకున్న భార్య లభిస్తున్నందుకు కొన్ని క్షణాల క్రితమే మురిసిపోయాడు. ఇన్నిరోజులుగా అరుణతో ఊహలలో విహరించాడు.
    అంతేకాక చదువుకున్న, ఉద్యోగం చేయబోయే అరుణని పెళ్ళాడి తన ఆర్ధిక స్థితి మెరుగుపరచుకోవాలనుకున్నాడు. కొన్నాళ్ళు ఇద్దరూ ఉద్యోగం చేసి కాస్త నిలదొక్కుకున్నాక స్వంతంగా ప్రాక్టీసు పెట్టి రెండు చేతులా ఆర్జించి కష్టాల కథమరచి పోవాలని కలలు కన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అరుణ మీద.
    కాని, ఇలా హఠాత్తుగా అరుణ ఆదర్శాలు వల్లిస్తుందని ఎన్నడూ అనుకోలేదు. అరుణ స్వభావం ఎలాంటిదో అన్నాళ్ళ పరిచయంలో తనకు బాగా తెలుసు. ఆమె పట్టుదల, అనుకున్నది ఎంతకష్టమైనదైనా జరిగేవరకు విడవని అరుణపంతం తను ఎరుగును. అరుణ నిర్ణయం ఎంతపటిష్టమైనదో ఆమె మాటల వల్లనే తెలుసుకోవచ్చు. ఆ నిర్ణయం తన కోసం మార్చుకుంటుందా?
    కథ ఇలా అడ్డం తిరుగుతుందని అతను అనుకోలేదు. హఠాత్తుగా ఇలా అనుకోని మలుపు ఎదురయింది ఏం చెయ్యాలి? ఇన్నాళ్ళూ అరుణ మీద పెంచుకున్న మమతలు వదులుకోవడం అంత సులభమా? అలా అని అరుణ ఆలోచనలనిసమర్ధించలేడు. ఎలా అరుణని తనదారిలోకి తిప్పుకోవడం:
    అరుణ పాలరాతి బొమ్మలా మెరిసిపోతూంది వెన్నెల్లో కాళ్ళు ముడుచుకుని కాళ్ళమీద గడ్డం ఆన్చి నేల చూపులు చూస్తూ ఆలోచిస్తూంది. అరుణ ఊహు ఇలాంటి అందాల రాశిని వదులుకోలేడు. అరుణ స్థానంలో ఇంకొకరిని ఊహించనేలేడు. ఎలా ప్రసన్నురాలిని చేసుకోవడం?
    ఇద్దరిమనసుల్లోనూ ఒకే ఆలోచనలు ఈ ఆశయం పేరిట ఒకరిని ఒకరు ఎలావదులుకోగలరు? ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడు ఒకరి కొకరు దూరం కాక ఏం చేయడం:
    నెమ్మదిగా చేయి చాచి అరుణ భుజం మీద చెయ్యివేశాడు ప్రేమగా. "అరుణా, ఇదంతా తమాషాకి అన్నానని, నిజం కాదని చెప్పవూ" మృదువుగా అన్నాడు వేణు.
    "ఇదంత అబద్దమయితే నాకూ బాగానే ఉండుననిఅనిపిస్తుంది కాని ఇది నిజమే నిజంగా జరగబోతూంది. "నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది అరుణ.
    "అరుణా! నీవిలాంటి నిర్ణయం తీసుకుంటావని కలలోకూడా అనుకోలేదు. అనుకుంటే......"
    "అనుకుంటే?"
    "మన పరిచయం ఇంత దూరంరానిచ్చే వాడిని కాను, నాకంటే నీకు ఈ ఆశయమే ముఖ్యమవుతుందని ఊహిస్తే.....అరుణా ప్లీజ్ ఈనీ నిర్ణయం నాకోసం, మన ప్రేమకోసమైనా మార్చుకోలేవా?" వేడికోలుగా అన్నాడు వేణు.
    "వేణూసరిగా ఇదే మాట నేనూ అడుగుతే? ఒక మంచిపని కోసం నా కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా?" వేణు మొహంలోకి స్థిరంగా చూస్తూ అంది అరుణ.
    అరుణ భుజం మీద నుంచి వేణు చేయి అప్రయత్నంగా జారిపోయింది. ఈ జవాబుతో ఆమె నిర్ణయం ఎంతపటిష్టమైందో తెలిసింది. ఆమె తనకోసం ఆశయాన్ని వదులుకోదని స్పష్టపరిచింది. ఆమెపట్టుదల పంతం వేణుకి కోపం తెప్పించాయి. చెప్పినా అర్ధం చేసుకోకుండా, మూర్ఖంగా తానుపట్టినకుందేటికి మూడేకాళ్ళనే అరుణ మాటలకివిరక్తి కలిగింది వేణుకి. అతని అహం దెబ్బతింది ఆమెకేనా పట్టుదల, పంతం? ఆమె కోసం తను, మగవాడు ఉన్న ఉద్యోగం వదులుకొని ఆమె వెంటరమ్మన్నచోటికి వెళ్ళాలా? ఒక ఆడదాని మాటలు నమ్మి ఆమెకోసం బ్రతుకుతెరువువదులుకొని ఆమె చెప్పినట్లువినాలా? మొహంచిట్లించాడు వేణు.
    "సారీ అరుణా? నా ఇబ్బందులేమిటో ఇదివరకే చెప్పాను నా విషయంలోనీ ఆశయాన్ని ఆమోదించడంనాకు మంచిదికాదు ఇంతకంటే ఏం చెప్పను?"
    "అయితే ఇందాక నీవు అన్నా మాటలకి ఏం విలువ లేదన్నమాట?
    "అరుణా ఎలా మాట్లాడుతున్నావు: నేరం నా మీద మోపుతున్నావా? నిన్ను గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను: నీతో భావిని గురించి ఎన్నెన్ని కలలుకన్నాను: నీవు అంగీకరించినక్షణంలో మబ్బులలో తేలిపోతున్న నాకు నీ ఈ నిర్ణయం ఒక్కసారిగా భూమి మీదికి విసిరికొట్టినట్లయింది. హఠాత్తుగా నీవిలా అంటావని అనుకోని నేను నిన్ను ఎలా ఒప్పించాలో తెలియక ఇందాకటినించి కొట్టుమిట్టాడుతున్నాను. నీ నిర్ణయాన్ని నాకోసం మార్చుకోమని ప్రాధేయపడడం కంటే ఏం చెయ్యను?" హతాశుడై అన్నాడు వేణు.
    అరుణ నిట్టూర్చింది "లాభంలేదు వేణూ: నీది, నాది ఒకతోవకాదు...... మనిద్దరి ఆలోచనలు ఒకటికావు. మన ఆశయాలు ఒకటికావు. మొదట్లోనే మన భావాలు కలవకపోతే మనం ఒక బాటపైన కలిసిప్రయాణం చేయలేకపోతే....."    
 "అరుణా! ఎందుకన్ని మాటలు? నీకు నాకంటే వివాహంకంటే నీ ఆదర్శమేసుఖమా? ఆఖరిసారిగా అడుగుతున్నాను.....స్పష్టంగా జవాబు చెప్పు. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఖచ్చితంగా ఏదో తేల్చుకోవడం ఉభయులకి శ్రేయస్కరం." అసహజంగా అన్నాడు వేణు.
    అరుణజవాబు చెప్పడానికి ఎంతోసేపు ఆలోచించలేదు. దాని సమాధానం.
  ముందే ఒక్కసారే నిర్ణయించుకుంది ఆమె ఆశయం కోసం స్వసుఖాన్ని, స్వలాభాలని లెక్కచేయకూడదని నిర్ణయించుకుంది.    
    వివాహం ఒక్కటే కాదు, ఆమె జీవితంలో ముఖ్యమైనది తను అనుకున్నది ఆచరించడంకోసం వివాహమేకాదు. వేణునైనా సరే వదులుకోగలదు.    
    అరుణ మౌనంలోనే అరుణజవాబేమిటో ఊహించాడు వేణు. అయిదు నిమిషాలుచూసి, ఇంక మాట్లాడవలసిందేం లేనట్లు ఒక్క ఉదుటున లేచి నించున్నాడు. ఆవేశంతో, అవమానంతో బాధతో అతని ముఖం ఎర్రబడింది. అతని శరీరం వణికింది. "థాంక్స్ అరుణా నా కంటే నీ ఆదర్శమే ముఖ్యమని నమ్మే నిన్ను ఇంకప్రాధేయపడ్డం అనవసరం అవివేకం నా అవసరంలేదనుకున్నవారిని దేవిరించేంతటిహీనానికి ఇంకా దిగజారలేదు. నాకూ ఆత్మాభిమానం ఉంది. జరిగిందంతా ఓ కల అని మరచిపోవడానికి ఈరోజునించే ప్రయత్నిస్తాను. పద వెళ్ళిపోదాం."    
    వేణుకంఠంలోని కంపనకి చలించింది అరుణ. నెమ్మదిగాలేచి నిలుచుంది. "వేణూ! నన్ను క్షమించు, నీ మనసుకి బాధ కలిగిస్తే: కాని ఒకటి మాత్రం మరిచిపోకు......ఈనాడు ఈ సంఘటన నిన్నెంత బాధిస్తూందో నన్నూ అంతగానే బాధిస్తూందని. ఇలా జరుగుతుందని ఎదురుచూడని ఈ సంఘటన నా మనసులో ఎంతలోతైన గాయంచేసిందో గుర్తించగలిగితే అంతే చాలు." అరుణ కంఠం ఎవరో నొక్కినట్లుపట్టుకుంది.    
    "హుఅంత బాధపడితే ఇలాంటి నిర్ణయమేచేయవు నామీద నీకు నిజంగా ప్రేమ ఉండి ఉంటే నాకోసం ఈ నిర్ణయం సంతోషంగా మార్చుకొనేదానివి." హేళనగా అన్నాడు వేణు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra