సెక్స్ షోస్!
అడమాంసం అమ్మకం!
అన్యాయాలు!
తిరగాబడాలి తను - తిరగాబడాలి.
ఏదో శక్తి తనని నడిపిస్తున్నట్లు.
ఏదో శక్తి తనని నడిపిస్తున్నట్లు.
అ పరాయిదేశంలో-
మాఫియా ముఠాలతో, పుట్టగానే పుచ్చిపోయిన ఆ కొత్త వ్యవస్థలో -
తన జీవితం మీద విరక్తి, తనలాంటి ఎందరో ఆడపిల్లల జీవితాల మీద అనురక్తితో -
ఆ చీకటి రాత్రిలోకి అడుగులు వేయడం మొదలు పెట్టింది మీనాక్షి.
* * *
ఇంటర్నేషనల్ డాన్ ల, టెర్రరిస్టుల కాన్ఫరెన్స్ లో ..........
క్లయివు లేచి నిలబడి గొంతు సవరించుకుని మట్లాడడం మొదలెట్టాడు.
"ఈ ఇండియా అనేది వుందే, ఇది ఉత్త దరిద్రపుగొట్టు దేశం! బాగుపడే లక్షణాలు బొత్తిగా లేవు. ఇక్కడంతా మురికి మనుషులు, ఇరుకు మనుసులును. ఫ్రిండ్స్! ప్రపంచంలో ఏ దేశమైనా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటుంది. శరవేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న దేశాల్లో మొట్టమొదటిఇండియా! అక్కడి ప్రజలు అతి బీదవాళ్ళు! అక్కడ వుండే మనుష్యుల్లో అత్యధిక శాతం మంది వెనుకబడిన తరగతులకు చెందినవాళ్ళు కూడా!
ఫ్రెండ్స్! ఈ బీదరికం గురించి, వెనుకబడిన తనం గురించి ఒక చక్కటి నానుడి వుంది. అదేమిటంటే "నువ్వు నీ బీదరికాన్ని అదో ఘనతగా కూడా భావించకు. నీ బీదరికాన్ని చేతనయితే త్వరగా వదిలించుకో! అని.
కానీ ఇండియాలో అలా కాదు!
అక్కడ బీదవాళ్ళు , వెనుకబడిన తరగతుల వాళ్ళు వుంటే తప్ప రాజకీయవేత్తలు ఓట్ల రాజకీయాలు నడపడానికి వీలువుండదు. అందుకే అర్ధం పర్ధం లేని రిజర్వేషన్లు, ఎక్కడికక్కడ విభేదాలు సృష్టించడం, బీద వాళ్ళని బీదవాళ్ళుగానే వుంచడం వెనుకబడిన వాళ్ళని నిరక్ష్యరస్యుకుగానే వుంచడం ఇవన్నీ అక్కడి నేతలకి అత్యవసరం!" క్లయివు అలా ఇండియా గురించి చులకనగా చెబుతూ వుంటే అక్కడ వున్న అందరూ నవ్వు మొహాలతో వింటున్నారు.
క్లయివు పక్కనే కూర్చుని వున్న రాజా మాత్రం నవ్వకుండా సీరియస్ గా మొహం పెట్టుకుని క్లయివు చెబుతున్న ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా విని మనసులోనే నోట్ చేసేసుకుంటున్నాడు.
అపహాస్యంగా అన్నాడు క్లయివు స్పెన్సర్.
"ఇంకే దేశంలోనైనా అయితే ఒక వర్గం వాళ్ళని వెనబడిన వాళ్ళని చెప్పి వ్యవహరిస్తే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. కానీ ఇండియాలో అలా కాదు. అక్కడ వెనబడి వుండడమే ఒక క్వాలిఫికేషన్! ఒక ఘనత. ప్రజల ఉద్రేకాలని ఎలా రేచ్చగోట్టాలో , ఆ రెచ్చగోట్టబడిన ఉద్రేకాలని ఎలా క్యాష్ చేసుకోవాలో ఇండియన్ పొలిటిషియన్స్ కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇందులో ప్రజల తప్పేమీలేదు. తప్పంతా కూడా ప్రజలచేత తప్పులు చేయించే నాయకులది."
"ఇంతకీ నువ్వు చెప్పదలచుకున్నదేమిటి?" అన్నాడు అధ్యక్షస్థానంలో వున్న కార్లోస్ ద జాకాల్ అసహనంగా.
"పాయింట్ కే వస్తున్నాను. ఇండియాలో కులాల కుమ్ములాటలు వున్నాయి. వాటిని పెంచి పోషిస్తారు లీడర్లు. మతపరమైన ఆవేశాలున్నాయి. ఆ అవేశాకావేషాలు తగ్గకుండా చూసే రాజకీయ పార్టీలు వున్నాయి. ప్రాంతీయ విభేదాలు , భాషాబేధాలు వున్నాయి. అవే ఉపిరిగా బతికే ప్రాంతీయ పార్టీలు వున్నాయి. ఇక్కడ నమ్మలేని నిజం ఒకటి చెబుతాను!"
"క్లుప్తంగా చెప్పు." ఆన్నాడు కార్లోస్ కట్ చేస్తున్నట్లు.
"ఒకే! ఒకే తమిళనాడు రాష్రం వుంది. అక్కడ "ద్రావిడ" పార్టీలు వున్నాయి. ఉత్తరాది వాళ్ళంతా ఆర్యులు దక్షణాది వాళ్ళంతా ద్రవిడులు అని వాళ్ళ వాదం. కొన్ని వేల సంవత్సరాలు క్రిందట జాతి భేదాలని ఆ పార్టీలు ఇప్పటికి కేలుకుతునే వుంటాయి. విజయవంతంగా. ఇండియాకి రాష్ట్రభాషగా హీందీ ఎన్నికయింది. కానీ ఆ ద్రావిడ పార్టీలు మాత్రం రాష్ట్ర భాషగా హిందీని అంగికరించవు. హిందీ ఆర్యుల బాష అనీ, అందుకే తాము హిందీని వ్యతిరేకమనీ అంటాయి. పరాయి భాష అయిన ఇంగ్లిషునయినా భరిస్తాంగానీ ఉత్తరాది అరీల భాష అయిన హిందీని ప్రతిఘటిస్తామంటాయి. ఈ ప్రతిఘటనకి లేటెస్టు ఉదాహరణ ఏమిటంటే మెడ్రాస్ యునీవర్సిటిలో వున్న "హిందీ శాఖ" ని "పనికిరాని శాఖ" గా పరిగణించి ఎత్తేయాలని ప్రయత్నాలు జరుగుతూ వుండడం! కానీ నిజానికి అక్కడి స్టూడెంట్స్ లో హీందీ నేర్చుకోవడం పట్ల చాలా అభిమానం వుంది. వందల సంవత్సరాలు పాటు ఇండియాని బానిసత్వంలో వుంచిన ఇంగ్లిషు కావాలి వాళ్ళకి, కానీ హిందీ మాత్రం వద్దుట!"
మళ్ళీ గొల్లున నవ్వులు.
తను కూడా నవ్వు మొహంతోనే నిశ్శబ్దం అన్నట్లు సైగ చేసాడు క్లయివు.
"సౌత్ అమెరికాలో బనానా రిపబ్లిక్ వుంటాయి చుడండి. అక్కడ రోజుకో విప్లవం జరుగుతూ వుంటుంది. రోజుకో రాజ్యం అక్కడ. అలాంటి చోట్ల క్రిమినల్ మాఫియా గ్యాంగులకీ , ప్రభుత్వానికి లాలూచి వుండడం మామూలు. కానీ ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అయిన ఇండియాలో పరిస్థితి కూడా అలాగే వుంది. పోలిటిషియన్స్ క్రిమినల్స్ మీద ఆధారపడే స్థితి దాటిపోయి అక్కడ ఇవాళ క్రిమినల్సే పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారు. దీనికి సూపర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియాలో ఒక రాష్ట్రంలో ఒక హోంమినిస్థర్ వున్నాడు. అతని నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. ఆ నిందితుడిని అరెస్టు చేసారు. అతను బెయిల్ కోసం అప్లయ్ చేశాడు. బెయిల్ గ్రాంట్ అయింది. ఆ నిందితుడు తాలూకు వాళ్ళు విజయోత్సాహంతో ఒక ఊరేగింపు చేసారు. దానికోసం ఒక ట్రాక్టర్ ను అలంకరించారు. ఆ ఊరేగింపులో ఆ ట్రాక్టర్ లో నిందితుడితో బాటు కూర్చున్నదేవరో తెలుసా? సాక్ష్యాత్తు హోం మినిస్టర్ గారే! ఆ తరువాత ఈ విషయంలో పెద్ద గలభా జరిగింది. అప్పుడు హోం మినిస్టర్ తనని తాను సమర్ధించుకున్న పద్దతి ఏమిటి? ఆ ఊరేగింపు నిందితుడికి బెయిల్ దొరికిన సందర్భంలో ఏర్పాటు చేసారనీ తనకి తెలీదట. అదేదో కాలేజీ తాలూకు ప్రారంభోత్సవ సందర్భంలో ఆ ఊరేగింపు జరిగిందని తను అనుకున్నాడుట. నీ నియోజక వర్గంలో జరిగిన హత్య కేసులోని నిందితుడు ఎవరో నీకే తెలియకపోతే ఇంక నువ్వేం హోంమినిస్టర్ వి! అని ప్రజలు చీత్కరించినా కూడా అతను పట్టించుకోలేదు.
ఇంకపోతే -
ఇండియాకి ఫైనాన్షియల్ కేపిటల్ అనదగ్గ బాంబేలో అండర్ వరల్డ్ డాన్ లకీ, రాజకీయవేత్తలకీ వున్న సంబంధం మన ప్రీమ్ పూజారిని అడిగితే తెలుస్తుంది."
"ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి?" అన్నాడు కార్లోస్ ద జాకాల్ అసహనంగా.
ఇంక పొడిగించకుండా తక్షణం చెప్పాడు క్లయివు స్పెన్సర్.
"కక్షలతో, కార్పణ్యాలతో కుతకుతలాడిపోతోంది ఇండియా! కొట్టుకు చస్తున్నారు జనం! ఆ మంటలని మనం ఆరిపోకుండా చూడాలి. గ్రీన్ పారట్స్ ల్యాండ్ మైన్స్ ని సబ్సిడీ రేట్లకు అన్ని ముఠాలకీ పార్టీలకి ఇవ్వాలి. ఆ విధంగా ఇండియా తరతరాలపాటు తలెత్తలేనట్లు చేయాలి."
"అందరికి ఈ ప్రపోజల్ నచ్చిందా?" అన్నాడు కార్లోస్ ద జాకాల్ సభికుల వైపు చూస్తూ.
అందరూ అంగీకార సూచకంగా కుడిచెయ్యి పైకి ఎత్తారు.
తృప్తిగా చూసి "ఇతను రాజా" అన్నాడు క్లయివు రాజా భుజం మీద చెయ్యి వేసి.
అందరికి తను కనబడేటట్లు లేచి నిల్చున్నాడు రాజా. అభివాదం చేసాడు.
"ఇండియాలో మెడకాయమీద తలకాయ వుండేవాళ్ళు అతి తక్కువమంది. తెలివయిన కొద్దిమంది ఇండియన్స్ లో ఈ రాజా నెంబర్ వన్" అన్నాడు క్లయివు.
"సో?" అన్నాడు కార్లోస్ ద జాకాల్.
"గ్రీన్ పారట్స్ మొదలుకుని విధ్వంసానికి పనికి వచ్చే అన్నిరకాల సామగ్రిని ఇండియాకి చేర్చడం, డిస్ట్రిబ్యూట్ చెయ్యడం ఈ పని అంతా రాజకి అప్పగించాలని నేను ప్రపోజ్ చేస్తున్నాను."
ఇండియన్ డాన్ ప్రేమపూజారి వైపు తిరిగాడు కార్లోస్.
"ఏం ప్రేం? నువ్వేమంటావు!"
వినయంగా లేచి నిల్చుని నసుగుతూ అన్నాడు ప్రేమపూజారి.
"నేను బాంబే డాన్ ని. నన్ను కాదని ఇంకెవరికో ప్రాజెక్టు అప్పగించడం నన్ను చిన్నబుచ్చినట్లే అవదా?"
"దటీజ్ ట్రూ" అన్నాడు కార్లోస్.
క్లయివు స్పెన్సర్ దృడంగా అన్నాడు.
"ప్రాజెక్టు రాజాకే అప్పగించాలి! అతని టాలెంట్ నాకు బాగా తెలుసు. ప్రేమపూజారి కోసం వేరే అసైన్ మెంట్ వెయిట్ చేస్తోంది! అతను విచారించనక్కర్లేదు."
"వాట్ సే యూ ప్రేం?" అన్నాడు కార్లోస్ రిఫరీలాగా!
మళ్ళీ నసిగాడు ప్రేమ[పూజారి.
"క్లయివు సార అన్నీ తెలిసినవాడు. అయన చెప్పినట్లు చేయడం నా ధర్మం" అన్నాడు అయిష్టంగానే.
క్లయివు మొహం వికసించింది.
"దట్ సేటిల్స్ ఇట్! రాజా ఇకనుంచి మనకి అఫిషియల్ గా ఇండియాలో ఏజెంట్! నా పని ఇంక అయిపొయింది. నా పైనల్ సొల్యుషన్ అప్రూవ్ చేసినందుకు కార్లోస్ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేనూ రాజా ఇహ సెలవు తీసుకోవచ్చా?" అన్నాడు.
"బై అల్ మీన్స్" అన్నాడు కార్లోస్ క్లుప్తంగా.
రాజాని తీసుకుని బయటికి నడిచాడు క్లయివు. ఇద్దరూ అక్కడ పార్క్ చేసి వున్న మోటారు సైకిల్ ఎక్కారు. మోటారు సైకిల్ స్టార్టు చేసాడు క్లయివు. కాసేపటి తరువాత అది మాస్కో నగరంలో ఒక చౌకబారు నైట్ క్లబ్ అయిన "రోస్సియా' ముందు ఆగింది.
"ఫ్రెండ్! నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్! కాసేపట్లో నీకు ప్రోగ్రాం అందుతుంది. " అన్నాడు క్లయివు.
తల పంకించాడు రాజా.
"సీయూ!" అని మోటారు సైకిల్ స్టార్ట్ చేశాడు క్లయివు. మళ్ళీ ఇందాకటి ఓల్డ్ కాజిల్ దగ్గిరికి వచ్చేశాడు.
అతను లోపలికి వచ్చేసరికి కార్లోస్ తో సహా అందరూ యధాస్తానాల్లో కూర్చుని వున్నారు.
ఫ్రెండ్స్! ఇప్పుడు మన అసలయిన కాన్ఫరెన్సు మొదలవుతోంది" అన్నాడు క్లయివు స్పెన్సర్ మిస్టిరియస్ గా.
* * *


