Home » Mainanpati bhaskar » Bhama Kalapam

 

    సుదీర వింటుందని భారతి వారిస్తున్నా కూడా కోపాన్ని ఆపుకోలేక పెద్దగా మాట్లాడేస్తోంది సుమిత్ర. "చూడన్నయ్యా! దీనికి లక్షణంగా మంచి కోర్సులో సీటు దొరికే ఛాన్సు వచ్చింది- నా కోటాలో. అయితే , ఇక్కడొక చిన్న టెక్నికల్ పాయింటు సీటు నా పిల్లలికి మాత్రమే ఇస్తారట. అదేం పెద్ద ఇబ్బంది కాదులే! నేను భారతిని దత్తత తీసుకున్నట్లు డాక్యుమెంటు ఒకటి రాసుకుంటే చాలుట! డబ్బులు పడేస్తే అయిదు నిమిషాల పని. దానికి ఇది పెద్ద రాద్దాంతం చేస్తోంది. నీ జీవితం బాగుపడుతుందే తల్లి అంటే ఈ మొద్దు రాచ్చిప్పకు అర్ధం కాదే!"


    "సారీ! అత్తయ్యా!" అంది భారతి స్థిరంగా. ఇందాకటి అమాయకత్వము, అనుకువా ఇప్పుడామె గొంతులో ద్వనించడం లేదు. "నాకు పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఉంది. ఆ కోర్సులో సీటు రావడమంటే న మటుకు నాకు భాగ్యలక్ష్మి లాటరీ తగిలినట్లే! అయితే, ఇలాంటి పద్దతుల్లో సీటు వచ్చినా నాకు వద్దు - దత్తత అనేది ఉత్త ఫార్మాలిటి అయినా సరే. సీటు రావడం నాకు చాలా ముఖ్యం! కాని సీటు కంటే కూడా సదాశివరావుగారి కూతురిగా చలామణి కావడమే చాలాచాలా ముఖ్యం నాకు. ఇది అయ్యే పని కాదు. నన్ను క్షమించత్తయ్యా!" అంది.


    అసహనంగా సదాశివరావుగారి వైపు తిరిగింది సుమిత్ర. "దానికి తెలియకపోతే నువ్వన్నా చెప్పకుడదా, అన్నయ్యా? ఇట్లా మడిగట్టుకు కూర్చుంటే ఈ రోజుల్లో ముందుకు పోలేం మనం. నీతి నిజాయితీ , దేశం గిశం అంటూ నువ్వు చేతులు కాల్చుకున్నది చాలు. పిల్లలనన్నా భాగుపడమని చెప్పు!" అంది విసురుగా.

 

    సదాశివరావుగారు శాంతంగా వింటూ, మౌనంగా ఉండిపోయారు.


    "నువ్వన్నా చెప్పరా భరత్!"


    "శాంతి.........శాంతి!" అన్నాడు భరత్ -౦ ఆ భావాన్ని అభినయించి చూపుతూ.


    అవమానంతో, ఆగ్రహంతో ఉగిపోయింది సుమిత్ర. "చీ! చీ! ఈ ప్రపంచంలో మీకన్నా అప్రయోజకులు. అవివేకులు, అసమర్ధులు - అరచేతిలోకి వస్తున్నా అదృష్టాన్ని అరికాలితో తోక్కేసుకునే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. వుండరు గాక ఉండరు!" అంది తీవ్రంగా. ఆమెకి ఉక్రోషంతో కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి.


    అందరు మౌనంగా ఉండిపోయారు.


    హలో కూర్చుని ఉన్న సుదీరకు ఇదంతా వినబడుతూనే ఉంది. వాళ్ళు అలా  గొడవ పడుతుంటే తను ఇక్కడే ఉండడం బావుండదేమో అనిపించింది. నిశ్శబ్దంగా లేచి నిలబడి , అప్పటిదాకా చేతిలోనే పట్టుకుని ఉన్న డబ్బు టేబుల్ మీద వుంచింది.


    లోపల కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని అందరి మొహాల వైపు ఒకసారి చూసింది సుమిత్ర.

 

    తర్వాత తన్ని తాను సంభాళించుకుని వణుకుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నది. "మీరెందుకు పనికిరాని అవివేకులు! అయినా, అక్కడక్కడా మీలాంటి అవివేకులు, అప్రయోజకులు, అసమర్ధులు ఇంకా మిగిలి ఉండి న్యాయం. ధర్మం, అంటూ పాకులాడుతూ ఉండడం వల్లనే ఈ ప్రపంచం ఈ మాత్రంగా నైనా మిగిలి ఉందేమో!"

 

    "అత్తయ్యా!" అంటూ ఆమె దగ్గరగా వెళ్ళింది భారతి.


    సుమిత్ర ఆప్యాయంగా ఆ అమ్మాయి చేతిని వత్తింది. "సరే! నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక్కడ నా డ్యూటీ అయిపొయింది. ఇంకా యునివర్సిటిలో నా తప్పనిసరి డ్యూటీకి వెళ్లిరానా?" అంది నవ్వుతూ. ఆర్ద్రంగా వుంది ఆమె గొంతు. మళ్ళీ మామూలు మూడ్ లో పడిపోయారు అందరూ.


    వాళ్ళు బయటికి వచ్చే లోపలే త్వరత్వరగా తన కారు దగ్గరికి వెళ్ళిపోయింది సుదీర. అప్పటికే వెనక సీటులో ఎక్కి ఉంది కుక్క సిల్వర్.


    దూరంగా నిలబడి సిగరెట్ కాల్చుకుంటూ వున్న డ్రైవర్ ఛోటూ సుదీరని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు.


    ఫ్రెంట్ సీట్లో కూర్చుంది సుదీర. కారు కదిలింది.


    సుదీర ఇంటి కొచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారు సీతా, రత్నాకరరావు, లాయర్ సారధి కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. సీతా, రత్నాకరరావు కలిసి తీరిగ్గా మాట్లాడుకునేది పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే! ఆ తరువాత ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. లంచ్, డిన్నర్ సాధారణంగా బయటే తీసుకోవలసి వస్తుంది.


    తల్లిదండ్రులిద్దర్నీ ఒక చోట చూసినప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది సుదీరకి. చట్ట ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ అసలు భార్యాభర్తలు కారు. వాళ్ళు విడాకులు తీసుకుని విసిపోయి చాలా సంవత్సరాలయింది. బేధాభిప్రాయాలు వచ్చి వాళ్ళు విడిపోలేదు. విడిపోవాలని ఏకాభిప్రాయానికి వచ్చే విడాకులు తీసుకున్నారు. చట్టం బారి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న ఉత్తిత్తి విడాకులు అవి!


    లాండ్ సీలింగ్ చట్టం అమల్లోకి రాబోతుందని పెద్దవాళ్ళందరికి చూచాయగా తెలిసి ఎవరికి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నప్పుడు లాయర్ సారధి చెప్పాడు. వాళ్ళకి ఆ సలహా, భూగరిష్ట పరిమితిని దాటి చెయ్యి జారిపోతున్న మిగులు భూమిని కొంతవరకైనా దక్కించుకోవాలంటే సీతా, రత్నాకరరావు విడాకులు తీసుకోవాలి. అప్పుడు సీత పేరుమీద కూడా కొంత భూమి ఉంచుకోవచ్చు.....మిగులు భూమి అంతా గరవ్నమెంటుకి ఒప్పగించకుండా.


    "ఇందులో సిగ్గు పడాల్సింది ఏమి లేదు. గొప్ప వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం నాటకం ఆడుతున్నారు. సేలింగ్ లోనుంచి తప్పించుకోవడానికి. కొందరు బంగారం లాంటి మాగాణి భూములని పాడు పెట్టారు. ఇంకొందరు సిటిలో తమకు ఉన్న ఎకరాల మేర ఖాళీ స్థలాల్లో పేరుకి ఒక గుడిసె వేసి దాన్నే ఇల్లుగా చూపించి , స్థలాలని అమ్మేసుకుంటున్నారు. ఈ పనులన్నీ మీరూ చెయ్యాలి. మీరూ ఇద్దరు భార్యభర్తలుగానే ఉంటె యెంత భూమి మిగులుతుందో విడాకులు తీసుకుంటే అంతకు రెట్టింపు భూమి దక్కించుకోవచ్చు." అని హెచ్చరించాడు సారధి.


    ఒక్క ఈ విషయంలోనే కారు. మరెన్నో విషయాల్లో కూడా చట్టాన్ని చట్టు బండలు చేసి తప్పించుకునే పద్దతులెన్నో అతను చెబుతూ ఉంటాడు వాళ్ళకు. పూతరేకులు యెంత పలచగా ఉంటాయో అంత పలచటివి సీతా, రత్నాకరరావు నైతిక విలువలు!


    వాళ్ళకి సారధి ఎక్కువ నచ్చ చెప్పవలసిన అవసరం లేకపోయింది. విడాకులు తీసేసుకున్నారు. చట్ట ప్రకారం విడిపోయినా, ఇద్దరూ భార్యా భార్తల్లా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.


    సుదీరని చూడగానే - రా బేబి! ఏమన్నాడు అతను? రెండొందలు ఎక్కువిస్తే ఎగిరి గంతెశాడా?" అడిగాడు రత్నాకరరావు. సఫారి సూట్ వేసుకున్న ఖడ్గమృగంలా మోటుగా ఉన్నాడతను.

 

    "లేదు డాడ్! మాములుగానే మాట్లాడాడు. పాపం చాలా అమాయకులు డాడ్- అతను , అతని సిస్టరు, వాళ్ళ ఫాదరు కూడా? దానికి తోడు చెప్పలేనంత చాదస్తం."

 

    "ఎమయిందెం?" అంది సీత.

 

    సుమిత్ర రావడం, సీటు వస్తుందని చెప్పినా ఏ ఫార్మాలిటి కోసం కూడా భారతి దత్తతకి ఒప్పుకోకపోవడం- అంతా చెప్పింది సుదీర నవ్వుతూ.


    రత్నాకరరావు విరగబడి నవ్వాడు, " ఇలాంటి పట్టింపులన్ని పెట్టుకు కూర్చుంటే ఇహ బాగుపడినట్లే! ఒక పది లక్షలు కలిసోచ్చేటట్లుంటే చెప్పు. మీ అమ్మని మళ్ళీ పెళ్ళి చేసుకుని, మళ్ళీ వదిలేస్తాను." అన్నాడు పాలూ, కార్న్ ఫ్లేక్స్  కలిపి ఉన్న వెండి డిష్ సారధి వైపు జరుపుతూ.


    అది గమనించి తీవ్రంగా చూసింది సీత. కాకికి ఎంగిలి చెయ్యి విడల్చలేని స్వభావం అమెది. భర్త దుబారా అంటే ఆమెకి చిరాకు. మోటు మనిషి అయినా, తప్పుడు పనులు చేసే డబ్బు సంపాదిస్తున్నా ఖర్చుకి వెనకాడడు రత్నాకరరావు. తన ఆశ్రితుల పట్ల చాలా ఉదారంగా ఉంటాడు.


    సీత చూపులు సూదుల్లా గుచ్చుకున్నాయి సారధికి. కార్న్ ప్లెక్సు అందుకోవాదానికి జాచిన చేత్తో కాఫీ ప్లాస్కు తీసుకుని కొద్దిగా కాఫీ మాత్రం కప్పులోకి ఓంపుకున్నాడు.


    "వాళ్ళ ఇల్లే ఎంత తమాషాగా ఉందొ తెలుసా, మమ్మీ! తిరపతి గుడిలో పెయింటింగ్స్ వరసగా పెట్టి వుంటాయి చూడూ- అలా తగిలించారు దేశనాయకుల ఫోటోలు. గాంధీని మాత్రం గుర్తుపట్టాను నేను. గాంధీ సినిమా చూశారా మీరు? సింప్లీ సుపర్బ్! మిగతా మొహాలన్నీ ఎవరో! సో మెని ఓల్డ్ ఫెలోస్! పాత చింతకాయ పచ్చడి లాంటి పేర్లూ వాళ్ళును! ఫోటోల కిందే పేర్లూ రాసి ఉన్నాయి గానీ, సరిగా గుర్తు లేదు నాకు. ఒకడు గుంట ఊరి, ఒకడు మంచి కట్ట, ఒకడిది పట్టాభిషేకం లాంటి పేర్లు...బాయ్! ఓ బాయ్!...... అంటూ నవ్వింది సుదీర.


    "నీకు తెలుగే సరిగ్గా రాదు!" అంది సీత, అసలైన తెలుగు మమ్మిలా మురిపెంగా. "పైగా చిన్నప్పటి నుంచి ఉటిలో, ఆ తర్వాత అమెరికాలో చదువుకుంటివి. అందుకే వాళ్ళెవరు నీకు తెలియదు. వాళ్ళు టంగుటూరి ప్రకాశం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, పట్టాభి సీతారామయ్యా అయుంటారు. ఇంతకీ ఎవరు తల్లి అన్ని పాతాకాలపు ఫోటోలు తగిలించిన దేశభక్తుడు?"


    కాఫీ మెల్లగా సిప్ చేస్తూ వింటున్న సారధి నెమ్మదిగా కప్పు కిందపెట్టి చెప్పాడు. "అయన ఇండిపెండెన్సు రాకముందు దేశం కోసం ఆస్తి అంతా తగలేశాడు. ఇప్పుడుంటున్న ఇల్లు తప్ప మరేం మిగల్లేదు ఆయనకి. అది తాకట్టులో ఉంది. గవర్నమెంటు ఆయన్ని స్వాతంత్ర్య యోదుడిగా గుర్తించి తామ్రపత్రం ఇచ్చింది. కానీ, పెన్షను ఇంతవరకూ గ్రాంట్ కాలేదు. అయన గవర్నమెంట్ లెక్క ప్రకారం ఉండవలసిన దాని కంటే రెండు రోజులు తక్కువ వున్నాడట జైల్లో........అందుకని! జైల్లో వున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింసల వల్ల ఆయనకి ఒక చెయ్యి, కాలు పడిపోయాయి. అయినా అయన ఇంకా పరోపకారం మానలేదు. తన ఇంటి ముందే ఒక చలివేంద్రంలాంటిది పెట్టి, మిగిలిన ఆ ఒక్క చేత్తోనే చేతనయినంత చేస్తూ ఉంటాడు. ఒక కొడుకు, ఒక కూతురు . కొడుకు డాన్స్ ప్రోగ్రాముల మీద వచ్చే డబ్బుతోనే అతి కష్టం మీద ఇల్లు జరుగుతుంది.


    సీతా, రత్నాకరరావు సారధి వైపు ఆశ్చర్యంగా , ప్రశంసా పూర్వకంగా చూశారు. బ్రిలియంట్ లాయర్ అతను. ఎక్సెలెంట్ పైనాన్షియల్ మానేజర్. అద్భుతమైన కంప్యుటర్ లాంటి వాడు కూడా. వాళ్ళకు అవసరమవుతుందనుకున్న సమాచారాన్ని ముందే సైలెంటుగా సేకరించి ఉంచి, సమయం వచ్చినప్పుడు వాళ్ళని ఆశ్చర్య చాకితులని చేయడం ఇది మొదటిసారి కాదు.


    "అయన పేరేమిటి?" అంది సీత.

 

    "1947 కి ముందు అయన, మీరూ ఒకే ఉళ్ళో ఒకే పేటలో ఉండేవారు. అయన పేరు సదాశివరావు" అన్నాడు సారధి.

 

    అతను ఉహించినట్లే సీత మోహంలో రంగు తగ్గింది. తాగుతున్న డ్రింకింగ్ చాకొలేట్ కప్పుని దూరంగా నెట్టేస్తూ, రత్నాకరరావు వైపు భావగర్భితంగా చూసింది. అతను మాట్లాడకుండా లేచి వాష్ బేసిన్ దగ్గిరి కెళ్ళి తుపుక్కున వుమ్మేశాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra