ఆమె లక్ష్యం అతడినీ, అతడిలోని ఆర్టునీ తన స్వంతం చేసుకోవడం.

 

    అతనిలాంటి వాళ్ళని ఎలా మలచాలో ఆమెకు బాగా తెలుసు.

 

    అతను ఆమె వలలో పడకపొతే?

 

    రెండు మూడు పతకాలు అప్పటికే ఆమె సిద్ధం చేసుకుంది...... అందులో మొదటి పథకం.

 

    నందినికి విదేశాల్లో ఆపరేషన్ కు తన పలుకుబడిని వుపయోగించడము ద్వారా అతని అభిమానాన్ని సంపాదించడం. రెండూ అతని అవసరాలకు డబ్బు సర్ది అతడ్ని తనవైపు తిప్పుకోవడం.

 

    మూడు.....

 

    ఆ ఆలోచనే ఆమెకు విచిత్రంగా వుంది.

 

    అందుకు అతను ఒప్పుకుంటాడా? ఎవరి కోసం? తనలాంటి కోటీశ్వరుడి కూతురు, రోజూలాంటి బ్యూటీక్వీన్ ఆఫరిస్తే కాదని వదులుకునే  అమాయకత్వం ఎవరికుంటుంది?

 

    మూడో ఆలోచనని చివరి అస్త్రంగా వాడాలని నిశ్చయించుకుంది చీనాంబర.

 

    రెండోసారి రిక్వెస్ట్ చేశాడు డాక్టర్ కుమరన్.

 

    "డిన్నర్ కేముంది డాక్టర్.....! మీరొక హెల్ప్ చేస్తే మీ ఇంటికి నేను డిన్నర్ కి వస్తాను" అభినవ్ ని స్వంతం చేసుకోవటానికి మొదలెట్టిన గేమ్ లో పావుని కదపడం మొదలెట్టింది చీనాంబర.

 

    "నీకు నేను హెల్ప్ చేయడమా?! వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? టెల్ మీ" వెంటనే అడిగాడాయన.

 

    "ఆ డిన్నర్ కి ఆర్టిస్టు అభినవ్ కూడా వుండేటట్టు చూడగలరా?"

 

    "ఒస్ ఇంతేనా....... ఫైవ్ మినిట్స్  జాబ్ ఫర్ మీ! యూ నో హిజ్ సిస్టర్ ఈజ్ మై పేషెంట్! ఎక్కడున్నా అతన్ని నేను డిన్నర్ కి  తీసుకోస్తాను."

 

    ఆనందంగా చెబుతున్న కుమారన్ కళ్ళవైపు చూస్తూ-

 

    "నా కోసం మీరింకో అబద్ధం ఆడగలరా?" రెండో పావుని నెమ్మదిగా కదిపింది చీనాంబర.

 

    "అబద్ధం ఎందుకు? ఏ విషయంలో ?" అతని ముఖంలో ఆకస్మాత్తుగా  విస్మయం చోటు చేసుకుంది.

 

    "నా కోసం ప్రాంక్ లీ టెల్లింగ్. మై  బిజినెస్  పర్పస్ కోసం."

 

    ఆ సమయంలో కుమరన్ మనసులో అమర్ దేవ్ తో తన అవసరం చీనాంబర తల్లి కేబినెట్ మినిస్టర్ అన్న విషయాలు మెదిలాయి.

 

    "అబద్ధం అనేది ఒక రూపాయి బిళ్ళలాంటిది. నువ్వు స్టార్ట్ చేసే బిజినెస్ ఎలా వుంటుందో నాకు తెలుసు. ఆ లక్షల బిజినెస్ కి నేను కూడా ఒక రూపాయి అబద్ధంగా ఇవ్వగలిగితే" నవ్వాడు కుమరన్.

 

    తన నవ్వుని తనే కట్ చేసుకుని-

 

    "చెప్పు ఏం చెయ్యమంటావు?" ఆసక్తిగా అడిగాడు కుమరన్.

 

    నెమ్మదిగా చెప్పింది చీనంబర.

 

    ఆ మాట వినగానే  విస్తుపోయి చూశాడు కుమరన్ ఆమె కళ్ళవైపు.

 

    డాక్టర్  కుమరన్ లాంటి వ్యక్తులు ఒక అబద్ధాన్ని కూడా తమ అవసరానికి మలచుకోగలరనే విషయం ఇండస్ట్రియలిస్టు కూతురైన చీనాంబరకు బాగా తెలుసు.

 

    చిన్నప్పటినుంచి చీనాంబరకు ఇష్టమైన ప్లే 'చెస్'

 

    
                                         *    *    *

 


    మొదలియార్ గార్డెన్స్ లో ఫోష్ బంగ్లా.....

 

    చీనాంబర కోసం ఆర్భాటంగానే ఎరేంజ్ మెంట్స్ చేశాడు డాక్టర్  కుమరన్.

 

    తనింటికొచ్చి తనని డిన్నర్ కి ఆహ్వనించడం చాలా విచిత్రమనిపించింది అభినవ్ కి. ఆయన వెనకే కారెక్కాడు. ఆ కారు కుమరన్ బంగ్లా పోర్టికోలో ఆగాక లాం వైపు చూసి దిగ్భ్రాంతి గురయ్యాడతను.

 

    చీనాంబర.....

 

    ఫ్లోరోసెంట్ లైట్ల వెలుగులో గులాబీలలో రెక్కల్తో చేసిన లావణ్యంలా  మెరిసిపోతోందామె.

 

    సముద్రపు ఒడ్డున తడిసిన ఇసక రంగు చీర, జాకెట్టు, గాలికి నెమలి పింఛంలా కదుల్తున్న నీలాల కురులు....

 

    కనుబొమ్మల్లో ప్రతిఫలిస్తున్న కాటుక..... మెత్తని చీకటి.... ఎర్రటి పెదాల నిండా వయసు మెరుపులు....

 

    తనని అతను చూడగానే తన వైపు వస్తాడని ఆమెకు తెలుసు. అందుకే స్విమ్మింగ్ పూల్ పక్కనున్న లాన్లో వంటరిగా నుంచుంది.

 

    అతను కారు దిగగానే ఆమె వైపు నడిచాడు. అందుకు కారణం  మమత పెయింటింగ్. దానికి కట్టిన ఖరీదు రెండు లక్షలు. ఆ రెండు లక్షలూ లేకపోతే చెల్లి వైద్యం సాగేది కాదని అతనికి ఎప్పుడూ గుర్తొచ్చే విషయం. అతని వ్యక్తిత్వం నిండా అంతులేని కృతజ్ఞత.

 

    "మరచిపోయారా?" మెల్లగా అడిగింది చీనాంబర.

 

    లేదని చెప్పలేదతను.

 

    "ఈ మధ్య కొత్త పెయింటింగ్స్ వేశారా?"

 

    "లేదు."

 

    "ఏం?"

 

    "పెయింటింగ్ నాకు హాబీ కాదు- ప్రాణం. అందుకే....." చిన్నగా నవ్వాడతను.

 

    'హాబీ కాదు' అన్నమాట  ఎక్కడో గుండుసూదిలా గుచ్చుకుందామెకు.

 

    తర్వాత.....

 

    రంగస్థలం డైనింగ్ టేబుల్ దగ్గరకు మారింది.

 

    చీనాంబర కోసం చాలా హడావుడి చేశాడు కుమరన్. అలాంటి విలువైన భోజనం  అభినవ్ ఎప్పుడూ చేయలేదు!

 

    డిన్నర్  పూర్తయ్యాక....

 

    హాల్లోకి వస్తున్నప్పుడు కుమరన్ అభినవ్ భుజం మీద  చెయ్యి వేసి జ్ఞాపకం వచ్చినవాడిలా నటించి.....

 

    "మిస్టర్ అభినవ్! మీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇప్పుడా విషయం చెప్పకూడదనుకోండి. కానీ డాక్టర్ కీ, ఈస్తటిక్స్ కీ మధ్య సంబంధము లేదు కదా?"

 

    అదే సమయంలో కెన్ ఉయ్యాల్లో కూర్చున్న చీనాంబర వైపు చూశాడు కుమరన్.

 

    "వాట్  డాక్టర్?" ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూశాడు అభినవ్.

 

    "మీ చెల్లెల్ని సాధ్యమైనంత ఎర్లీగా అమెరికాగానీ, లండన్ గానీ పంపించాలి తప్పదు."

 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra