Home » Vasundhara » Vasundhara Kadhalu - 1


    ఆమెకు నోటమాట రాలేదు. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఏదో చెప్పడానికి పెదవులు కదులుతున్నాయి. అవన్నీ నాలో జాలి కలిగించడానికి బదులు నన్నింకా రెచ్చగొట్టాయి.
    ఫలితంగా ఆ అమ్మాయి నా చేతుల్లో నలిగిపోయింది. ఆమెను అక్కడే వదిలేసి నేను నా రూమ్ కి వచ్చేశాను.
    సుఖ సుఖాల నిద్ర రాలేదు. మాటి మాటికి ఆ అమ్మాయి రూపమే నా కళ్ళముందు మెదుల్తోంది. చేసింది పొరబాటేమోనని నాకు అనిపించింది. కానీ అంతలోనే అంతకు పూర్వపుఅనుభవం గుర్తుకొచ్చింది.
    సమయం కాని సమయంలో బీచివద్ద సీత ఉందంటే-బహుశా ఆమెకూడా ఇటువంటి అనుభవానికే ఎదురు చూస్తుందేమో? ఏమో-ఎవరు చెప్పగలరు? ఈ రోజుల్లో ఎవరిలో ఎటువంటి ఆలోచనలు దాగున్నాయొ ఏమీ చెప్పలేము. అంతా నటనే! మోసం దగా.....
    తరువాత నాకు నిద్ర పట్టేసింది.
    ఉదయం ఇంటివాళ్ళేదో కలవరపడుతున్నట్లు గ్రహించాను. ఏమిటోనని కనుక్కునేందుకు వెళ్ళాను.
    సీత బీచికి వెడతానని వెళ్ళి ఇంటికి రాలేదట!
    ఉలిక్కిపడ్డాను. ఏమయింది సీత!
    సీత ఏమయిందో నాకా సాయంత్రమే తెలిసింది-సముద్రంలో కలిసిపోయింది. ఆత్మహత్య చేసుకుంది!
    ఆత్మహత్య?
    ఎవరో నవ్వినట్లయింది. సీత ఆత్మహత్య చేసుకోలేదు. నేనే ఆమెను హత్య చేశాను.
    నా ఒంటిమీద పట్టాలు వేసినట్లూ ఆ పట్టాల మీద నుంచి ఒకదాని వెనుకగా ఒకటి రైలుబళ్ళు పోతున్నట్లూ అనిపించింది.
    "సీతా!" అంటూ ఆమె తల్లి భోరుమని ఏడుస్తోంది. ఆ కన్నీటి ప్రవాహంలో నే నెక్కడికో కొట్టుకుపోతున్నాను.
    ఒక్కసారి నా జీవితమంతా పునశ్చరణ చేసుకున్నాను. చేసిన మంచిపని ఒక్కటీ కనిపించలేదు. కానీ మంచిపని చేయకపోవడంవల్ల నష్టం ఉండకపోవచ్చు. కానీ చెడ్డ పని చేయడంవల్ల మాత్రం నష్టం ఉండితీరుతుందని ఈరోజే గ్రహించాను.
    సీత చాలా అందంగా ఉంటుంది. ఆమె అందమైన శరీరం తిరుగుతూ ఉంటే ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. అటువంటి ఆమె హఠాత్తుగా మరణించింది. కేవలం నా కారణంగా-
    అసలు సీత ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో నాకు అర్ధం కాలేదు. మానభంగం పొందిన స్త్రీలు ఆత్మహత్య చేసుకోవడం కథల్లోనూ, పేపర్లలోనూ చూడ్డమేకానీ ఇలా నా అనుభవంలోకి వస్తుందనుకోలేదు. అంటే అందులో ఏదో తప్పు ఉందన్నమాట-ఏమిటి ఆ తప్పు!
    అది నాకు అర్ధంకాలేదు. స్త్రీ పురుషుల ఆనందాన్ని వివాహ రూపేణా సంఘమే చట్టబద్దం చేసింది. అయితే అదే ఆనందాన్ని సీతా, నేనూ పంచుకోవడం ఎందుకు తప్పు అయింది?
    తప్పులోని తప్పు గురించి నే నెప్పుడూ ఆలోచించలేదు. మనకు సరదాగా ఉన్నప్పుడు తప్పయితేనేం చేయడానికి- అనుకునేవాడిని. అయితే ఇప్పుడు సీత నా మెదడుకి పని చెప్పింది.
    ఆలోచిస్తూంటే నాకు అర్ధమవుతోంది. సంఘం వివాహాన్ని చట్టబద్ధం చేసిన మాట నిజమే! అయితే సీతకూ, నాకూ వివాహం కాలేదు. మా ఇద్దరి ఆనందం వ్యభిచారం కింద వస్తుంది. కానీ వ్యభిచారం చట్టవిరుద్ధం కాబట్టి సంఘం దృష్ట్యా మేము చేసింది తప్పు పనే!
    అయితే మేము తప్పు చేసిన మాట వాస్తవం. ఈ రోజుల్లో అనేకమంది తప్పు చేస్తున్నారు. అది రహశ్యంగా జరిగినన్నాళ్ళూ ఫరవాలేదు. దర్జాగానే తిరగొచ్చును. ఎటొచ్చీ బయటపడినప్పుడే సిగ్గు పడాలి. అయితే సీత తప్పు చేసిందని ఎవరికీ తెలియదు. అటు వంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
    చూసిన సినిమాలూ, చదివిన కథలూ విన్న అనుభవాలూ కలిసి నాకిలా చెప్పాయి. "సీత మహత్తర వ్యక్తి. ఆమెకు ప్రాణంకంటే శీలం ముఖ్యం. నువ్వొక దుర్మార్గుడివి. నీవల్ల పాడైన శీలంతో ఆమె బ్రతకలేక మరణించింది."
    నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఆదర్శంకోసం ప్రాణాలు బలిపెట్టేవారు కథల్లోనే కాకుండా ప్రపంచంలో కూడా ఉంటారా?
    ఎందకు ఉండరు? నేతాజీ, టంగుటూరి ప్రకాశం, తిలక్, గాంధీజీ-వీళ్ళంతా ఎవరు? మన భారతీయులు.....ఇలాంటివాళ్ళు చాలామంది జ్ఞాపకం రావడంతో నాకు తల తిరిగిపోయింది.
    ఆ రాత్రి సీత నాకు కలలో కొచ్చింది. జుట్టు విరబోసుకుని-నాలిక వెళ్ళబెట్టి నామీద పడి నన్ను రక్కేసింది. చంపేస్తానంది. నాకు చాలా భయం వేసింది. లైటు వేసుకుని పుస్తకం చదువుతూ కూర్చున్నాను.
    మర్నాడే రూమ్ కాళీ చేశాను.
    నా మెదడు ఇప్పుడు కొత్తపంధాలో ఆలోచించడం మొదలుపెట్టింది.
    అలవాటుపడ్డ ప్రాణమేమో-రోజు గడిచేకొద్దీ-మళ్ళీ నా దృష్టి దురలవాట్ల మీదకు సాగింది. కానీ సిగరెట్టు కాల్చాలనిపించినా, అమ్మాయిని చూసినా, బ్రాందీని చూసినా ఏం చూసినా సీత నా మనస్సులో మెదుల్తుంది. వెంటనే భయం వేస్తుంది. ఆ పని మానేస్తాను.
    ఏమాత్రం చెడ్డ తలపు నా మనసులో ప్రవేశించినా వెంటనే సీత గుర్తుకొచ్చి నేను ఆపాదమస్తకం వణికిపోతాను. విచ్చలవిడిగా పరుగెత్తే నా మనస్సు హఠాత్తుగా మారిపోయి ఆదర్శాలను అనుసరిస్తోంది.
    సీతకు నేను సర్వదా కృతజ్ఞున్ని.
    నలుగురి దృష్టిలో మంచిది కానిదే తప్పని, నలుగురి అభిప్రాయాలతో ఏకీభవించసాగాను. ఇప్పుడు నేను బాగా మారిపోయానని నా స్నేహితులందరూ అంటారు. అది నిజమే-కానీ నాలో ఈ మార్పుకి కారణమయిన ఆమెకు నేను మారకున్ని.
    కానీ ఒక్క విషయం మాత్రం నిజం-సీత మరణించి ఉండకపోతే నేను మారి ఉండేవాణ్ణి కాదు.
    నేను మనిషిని కాదు. నన్ను మనిషిగా చేసింది సీత. నన్ను మనిషిగా చేయడంకోసం తను దేవతగా మారిపోయింది. నాలాంటి వారిని మనుషులుగా మార్చడానికి మరికొందరు సీతలు దేవతలుగా మారకుండా అపడానికైనా ఈ నా కథ పనికి వస్తుందని నా ఆశ!

                                      * * *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra