Home » Dr c. ananda ramam » Eenati Sakunthala

    ఒకతను ముందుకు వచ్చి తన చేతిలో కాగితం చూసి రమేష్ అపరాధాలు వరుసగా చదవసాగాడు. తేదీల వారీగా ఎప్పుడెప్పుడు ఏ అభాగ్యుల తాకట్టు - వాకట్టు చేశాడో, ఎప్పుడు నమ్మి దాచుకున్న సొమ్ము గుటకాయస్వాహా చేశాడో వివరించబడ్డాయి. కూలీలను పాఠశాల్లో నియమించినందుకు ఒకొక్కరి దగ్గర, ఎంతెంత కమీషను తీసుకొన్నాడో వివరించ బడింది. ఇప్పటికీ కమీషనుకోసం పీడిస్తున్నాడని ఆరోపించబడింది. అన్నిటికంటే పెద్దనేరారోపణ- అతడు ఆటవిక స్త్రీలను వివాహం చేసుకుంటానని నమ్మించి వారి శీలం దోచుకుని మోసగించటం! అలాంటివాళ్ళలో ఇద్దరు ఉన్నఊరు వదలి దేశాలు పట్టిపోయారు. అతడే ఎవరికైనా అమ్మాడేమో కూడా తెలియదు. ఒక్కమ్మాయి కులంవారి వెలి భరించలేక ఆత్మ హత్య చేసుకుంది. ప్రస్తుతం బతికివున్న సాక్ష్యం శామి.    
    ఈ విషయం వినగానే ఉలిక్కిపడింది శకుంతల.    
    అప్పుడు సమస్య పూర్తిగా విడిపోయింది. ఒక వారగా కూర్చుంది శామి_ జుట్టు విరబోసుని దెయ్యంపట్టిన దానిలాగా, ఆటవిక స్త్రీలయినా, ఏ స్త్రీలయినా, ఇలాంటి విషయాలు బయట పెట్టరు. లోలోపల కుమిలి పోతారు. సాధ్యమయితే బయటపడకుండా జాగ్రత్త పడతారు. శృతి మించితే ఆత్మహత్య చేసుకుంటారు. మొగవాడు స్త్రీ మీద అత్యాచారం చేయటానికి సాహసించటానికి ప్రదానంగా స్త్రీలోని ఈబలహీనతే కారణం కానీ, ఈనాడు శామి తనకు జరిగిన అన్యాయం బయటపెట్టటమే గాక పగతీర్చుకోవటానికి సిద్దంగా కూర్చుంది.    
    తరువాత శకుంతల నేరాలు విచారణలోకి వచ్చాయి. రమేష్ లాంటి నీచుడికి కూతురు. అతడి వారసత్వమే కావచ్చు. తమ పొట్టలు కొట్టిన ఆ సంపదను అనుభవిస్తోంది - శ్రమపడకుండా?    
    రమేష్ గడ గడ వణికిపోతూ తన నేరాలన్నీ వొప్పుకున్నాడు. దణ్ణాలు పెడుతూ క్షమాపణ కోరుకున్నాడు- ఏడ్చేస్తున్నాడు.    
    'ఛీ! ఈ నీచుడు ఎంత పిరికివాడు? వీడి బలం అంతా గూండాల బలం. ఆ గూండాలు వీడి వెంట లేని మరుక్షణం వీడు పూచిక పుల్లకి కొరగాడు. చిన్నకర్ర చేత్తోపట్టుకున్న చిన్నపిల్లాడికయినా బెదిరిపోతాడు.'    
    శకుంతల ఏ మాత్రం భయపడలేదు__ "ఇతడు నా తండ్రి కాడు. నా తండ్రి శ్రీధర్ శర్మ. నన్ను మోసంతో ఇతడు తన యింట్లో బంధించాడు. నేను తింటున్నది మీ పొట్టలు కొట్టిన సొమ్మని నాకు తెలియదు. నేను శ్రమపడకుండా తింటున్నది నిజమే! కానీ, శ్రమపడాలనే ప్రయత్నిస్తున్నాను. మానాన్నగారు శ్రీధర్ శర్మగారి ప్రోత్సాహంతో కార్మికులకోసం ఒకపాఠశాల తెరవాలని అనుకొంటున్నాను. నేను పడగల శ్రమ అదొక్కటే! అయితే, నా ఆలోచన కార్యరూపం దాల్చేలోగా కొన్నిచిక్కుల్లో ఇరుక్కున్నాను."    
    "పోలీసు కాల్పుల సమయంలో ఈవిడకు గాయాలు తగిలాయి" అన్నారు ఒకరు.    
    "కానీ, ఆ సమయంలో శ్రామికులను సమ్మెకు వ్యతిరేకంగా ప్రోత్సహించింది" అన్నారు మరొకరు.    
    "ఇందులో మంచి - చెడ్డలు నాకు తెలియవు. సాయుధ పోలీసు దళాన్ని యాజమాన్యం రప్పించిందని నాకు తెలుసు. అనవసరంగా ఆ పసివాళ్ళు ఆహుతి కావటం భరించలేక సమ్మె వద్దన్నాను."    
    ఆనాటి కాల్పులు తలుచుకొంటే, అప్పుడూ శకుంతల కళ్ళలో నీళ్ళు తిరిగాయి.    
    వాళ్ళలో కొందరు తమలో తాము మాట్లాడుకొన్నారు. వాళ్ళలో రాజు కూడా ఉన్నాడు. తరువాత రాజు వచ్చి శామితో ఏదో చెప్పాడు. శామి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.    
    రాజు ముందుకొచ్చాడు. ఈసారి రమేష్ ని ఉద్దేశించి. "నిన్ను విడుదల చెయ్యాలంటే నీకు బదులుగా నీ కూతుర్ని మా దగ్గర వదిలెయ్యాలి. నీకు సమ్మతమేనా?" అన్నాడు.    
    రమేష్ వెంటనే, "సమ్మతమే! నా కూతుర్ని మీ దగ్గిర వదిలేస్తాను. నన్ను వదిలెయ్యండి!" అన్నాడు.    
    వాళ్ళలో ఒకడు కాండ్రించి తుపుక్కున ఊసాడు. విమలమాత్రం గట్టిగా నవ్వింది. తెల్లబోయి చూశాడు రమేష్. అప్పుడు గుర్తించాడు. "విమలా!" అన్నాడు భయంగా.    
    విమల ముందుకొచ్చి అతని నోటిమీద తన అరచెయ్యి వెనక్కు తిప్పి చెళ్ళున కొట్టింది.    
    ఆ దెబ్బకు తల తిరిగినట్లయింది రమేష్ కి. భయంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. "ఛీ! అని వెనక్కి వెళ్ళిపోయింది విమల. అతని ముఖం చూడలేనిదానిలా.    
    అందరూ నిశ్శబ్దంగా ఎదురు చూడసాగారు. దేనికోసమో శకుంతలకు అర్ధం కాలేదు. శకుంతలను స్వాధీనం చేసుకుని, తనను వదిలేస్తారేమోనని ఆశ కలగసాగింది రమేష్ కి.    
    నిముషాలు, గంటలు దొర్లిపోతున్నాయి. కళ్ళకు గంతలతో శామితోపాటు మరి ఇద్దరు ఆటవిక యువకుల మధ్య వచ్చాడు శ్రీధర్ వర్మ.    
    అతడిని చూడగానే "డాడీ!" అని కేకపెట్టింది శకుంతల.    
    ఆ పిలుపు వినగానే తన కళ్ళగంతలు తనే ఊడపీక్కుని శకుంతలని చూసి, "బేబీ!" అంటూ శకుంతలకు రక్షణగా అన్నట్లు శకుంతల భుజంచుట్టూ చెయ్యివేసి నిలిచాడు. అప్పుడు చూశాడు రాజునీ, విమలనీ అయినా మాట్లాడలేదు,    
    వాళ్ళలో ఒకడు ముందుకొచ్చి, "ఈ ఆమ్మాయి నీ కూతుర్నని చెప్పుకొంటోంది. నిజమా?" అన్నాడు.    
    "నిజమే!"    
    "మీరంతా మా శ్రమ దోచుకుతింటున్న సోమరిపోతులు మాకు శత్రువులు. మిమ్మల్ని శిక్షించాలని తీసుకువచ్చాం."    
    "శకుంతల పసిపిల్ల. తప్పేదైనా ఉంటే పెద్దవాళ్ళది. మమ్మల్ని శిక్షించండి."    
    నీ కూతుర్ని మాదగ్గిర వదిలేస్తే నిన్ను విడుదల చేస్తాం. నీకు సమ్మతమేనా?"    
    "నో! నా కంఠంలో ప్రాణం ఉండగా నా బేబీని మీకు వదిలి వెళ్ళను. మీకు కావాలంటే నేను కష్టపడి సంపాదించినదంతా ఇస్తాను. మీరేం చెయ్యమంటే అదిచేస్తాను. ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ నాబేబీని వదిలెయ్యండి. మంచే తప్ప చెడుని ఊహించటం కూడా రాని స్వచ్చమైన మనసు నా కూతురది!" ఉద్రేకంగా అన్నాడు శర్మ.    
    విమల కళ్ళు మెరిసాయి. అప్రయత్నంగా చేతులు జోడించింది.    
    "అంతా విన్నారు. మీ తీర్పు చెప్పండి" అన్నాడు ఒకడు. సమావేశమయిన జనాన్ని ఉద్దేశించి.    
    "ఈడు ఈ రమేష్- తండ్రికాడు-కసాయోడు! శర్మబాబే తండ్రి!" అనే కంఠాలు పలికాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra