Home » Mainanpati bhaskar » Yama Dootha


    
    ఊతకర్ర గాల్లోకి ఎత్తాడు కుంటివాడు.
    
    మరుక్షణంలో అది విసురుగా జహనారా బేగం తలకి తగిలింది.
    
    ఆ దెబ్బకి రెండుగా చీలింది ఆమె తల.
    
    "జ..లీ..ల్..." అంది జహనారా బేగం, నూతిలోనుంచి పిలుస్తున్నట్లు! అదే ఆమె చివరి పలుకులు! తర్వాత నిశ్చలంగా ఉండిపోయింది ఆమె!
    
    ఊతకర్ర మరోసారి ఎత్తి జహనారా తలమీద ఇంకో దెబ్బ వేసాడు కుంటివాడు. ఈసారి ఆమె తల ఎముకలూ, దవడ ఎముకలూ అన్నీ పిప్పి పిప్పి అయిపోనట్లు ఆకారం లేకుండా అయిపోయింది ఆమె మొహం.
    
    బయటనుంచి రివాల్వర్ తలుపుకి గురిపెట్టి పేల్చిన శబ్దం వినబడింది. ఇన్ స్పెక్టర్ జలీల్ తిరిగి వచ్చేసాడని గ్రహించాడు కుంటివాడు. ఏం చెయ్యాలో అతను నిశ్చయించుకునే లోపల ధన ధన ధన ఇంకో మూడు గుళ్ళు పేలాయి. గొళ్ళెం సడలి తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేశాడు జలీల్.
    
                                                                    * * *
    
    మెకానిక్ ఆహ్వానం మీద ఆ ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చిన మధ్య తరగతి మనుషులు స్నానం వగైరాలు పూర్తి చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చినట్లయింది - వాళ్ళకీ, హోటల్ స్టాఫ్ కీ కూడా! అక్కడి పద్దతులూ అవన్నీ వాళ్లకి కొత్త.
    
    అయినా వాళ్ళని ఏ మాత్రం తక్కువగా చూడలేదు హోటల్ స్టాఫ్. పైగా వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతున్నట్లు మర్యాదలు చేసారు. చెయ్యకపోతే మెకానిక్ ఆ తర్వాత తమ అంతు చూస్తాడని తెలుసు వాళ్ళకి! చండశాసనుడు అతను!
    
    "కాన్ఫరెన్స్ హాలు ఎక్కడ?" అన్నాడు వచ్చిన గెస్టులలోని ఒకాయన, ఆఫీస్ లో తన బాస్ కంటే స్మార్టుగా కనబడుతున్న ఒక స్టివార్డుతో.
    
    స్టివార్డు మర్యాదగా అన్నాడు.  

 

    "ప్రోగ్రాం కాస్త మారింది. ఇవాళ సాయంత్రం దాకా మీకు సిటీ గైడెడ్ టూర్. కాన్ఫరెన్స్ రాత్రికి ఉంటుందని చెప్పారు మా సార్! కింద మీ కోసం టూరిస్టు కోచ్ రెడీగా వుంది. ఇంకో పావుగంటలో బయలుదేరాలని మనవి చేస్తున్నాను. ప్రోగ్రాం హఠాత్తుగా ఎందుకు మారిందో స్టివార్డ్ కి తెలుసు!
    
    రెస్టారెంట్ డెక్ దగ్గర కూర్చుని ఆరెంజ్ జ్యూస్ తాగుతున్న అమెరికన్ అమ్మాయిని చూపులతోనే వశం చేసుకున్నాడు మెకానిక్. తన రూమ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇంకో గంటదాకా బయటికి రాడతను. "డునాట్ డిస్టర్బ్" అనే నోటీసు తగిలించాడు తలుపుకి. గెస్టులందరూ మొహమొహాలు చూసుకున్నారు.
    
    "సరే! మేం రెడీ!" అన్నాడు గెస్టులలో ఒకతను. తీక్షణమైన కళ్ళు, గెడ్డం, ఇంటలెక్చుయల్ లాగా కనబడుతున్నాడు అతను.
    
    పావుగంట తర్వాత వాళ్ళు అందరూ కిందికి వచ్చి ఎయిర్ కండిషన్డ్ టూరిస్టు కోచ్ ఎక్కారు. ఆంద్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలనుంచి వచ్చినవాళ్ళు ఉన్నారు ఆ గ్రూపులో! అందులో కొంతమంది ఇంతకు ముందు హైదరాబాద్ ఎప్పుడూ చూడనేలేదు.
    
    టూరిస్ట్ కోచ్ లో సాయంత్రం దాకా సాగింది వాళ్ళ ప్లెజర్ ట్రిప్పు. సాలార్ జంగ్ మ్యూజియం, చార్ మినార్, గోల్కొండ, జూ -    చూడవలసినవన్నీ త్వరత్వరగా చూసేశారు వాళ్ళు.
    
    మధ్యాహ్నం మంచి హోటల్లో లంచ్!
    
    సాయంత్రం తమ హోటల్లో స్నానాలు.
    
    ఆ తర్వాత మళ్ళీ టూరిస్టు కోచ్ ఎక్కారు.
    
    ఈ సారి టూరిస్ట్ కోచ్ ఊరి చివర ఉన్న ఒక బంగళాలో ఆగింది. బంగళా చుట్టూ చాలా ఖాళీ స్థలం వుంది. అందులో పెద్ద లాన్ వుంది. లాన్ లో కుర్చీలు వేసి వున్నాయి. 

   

    వచ్చిన వాళ్ళందరూ కూర్చున్న తర్వాత హుందాగా వచ్చాడు మెకానిక్.
    
    వస్తూనే అక్కడున్న వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకొన్నాడు.  

 

    "పొద్దున అత్యవసరమయిన పని వుండడం వల్ల మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలవలేకపోయాను! మై అపాలజీస్! ఇప్పుడిహ సమయం వృధా కానివ్వకుండా జరగవలసిన కార్యక్రమంలోకి నేరుగా వెళ్ళిపోదాం మనం! ముందుగా నేను మాట్లాడను. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మన మిత్రులు మాట్లాడతారు. ఆతర్వాత, మన దేశం గురించి దేశంలో బ్రతుకుతున్న మనలాంటి ప్రజలని గురించి చర్చిస్తాం మనం!
    
    మొదటగా శ్రీమతి ప్రసూనగారు....! తీరిక సమయాల్లో సంఘసేవ ఆమెకి హాబీ. ఆమె ఇప్పుడు ఆ ప్రాంతపు స్త్రీల సమస్యల గురించి రెండు ముక్కలు చెబుతారు" అన్నాడు మెకానిక్.
    
    అతను కూర్చోగానే, తను లేచి నిలబడింది ప్రసూన. గొంతు సవరించుకుని చెప్పడం మొదలెట్టింది.
    
    "నేను గుట్టుగా కాపురం చేసుకొనే ఒక సాధారణ గృహిణిని. సంఘసేవ అనేది చాలా పెద్ద మాట. చేతనయినంత వరకూ ఇరుగూ పొరుగూ వాళ్ళకి కాస్త సాయం చెయ్యడం కంటే నేను ఎక్కువగా చేస్తోంది ఏమీ లేదు.
    
    కానీ -
    
    ఇన్నాళ్ళకు -
    
    నేను కూడా పూనుకొని ఏదయినా చేస్తేగానీ లాభంలేదన్న పరిస్థితి వచ్చింది. ఇందులో పరోపకార చింతనకంటే నా స్వార్ధమే ఎక్కువ వుండి వుండవచ్చు."
    
    అందరూ శ్రద్దగా వింటున్నారు.
    
    తర్వాత సిగ్గుతో తల కొద్దిగా దించుకొని చెప్పింది ప్రసూన.
    
    "నాకు నలభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి. నాకూతురికి పద్దెనిమిది. ఓ సంవత్సరం క్రితం మా వీధిలోకి ఓ రౌడీ వచ్చి చేరాడు. వాడికి ఉచ్చం నీచం లేదు. వాడి వయసుకి నేను తల్లిలాంటి దాన్ని. అలాంటిది నేనూ నాకూతురూ కలిసి వీధిలో వెళుతున్నప్పుడల్లా వాడు మా ఇద్దరిమీదా కలిఫై కామెంట్సు చేస్తూ...."
    
    ఇబ్బందిగా....వాక్యం సగంలో ఆపేసింది ప్రసూన.
    
    కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ గొంతుని స్వాధీనంలోకి తెచ్చుకుని చెప్పడం మొదలెట్టింది.
    
    "మొదట్లో వాడి కామెంట్స్ వినీ విననట్లు ఊరుకొన్నాము. తరువాత ఓ రోజున అతన్ని గట్టిగా మందలించాను. వాడు తిరగబడి ఏదో అన్నాడు. ఆరోజున మా వీధిలో పెద్ద గొడవయింది. మాకు బెదిరింపులు అందాయి.
    
    అప్పట్నుంచి మా మీద పగబట్టాడు వాడు.
    
    ఆ కసితో నెలరోజుల క్రితం మా అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. "ప్రసూన గొంతు రుద్దమైపోయింది.
    
    నిశ్శబ్ధంగా వింటున్నారు అందరూ.
    
    కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకొని చెప్పడం మొదలెట్టింది ప్రసూన. "ఆ తరువాత మేము చెయ్యని ప్రయత్నం లేదు. తిరగని పోలీస్ స్టేషన్ లేదు! మొక్కని రాజకీయ నాయకుడు లేడు!
    
    అయినా ఏమీ లాభం లేకపోయింది.
    
    క్రమక్రమంగా తెలిసింది మాకు.
    
    ఆ రౌడీలకు లోకల్ పొలిటీషియన్ల సపోర్ట్ ఉందని!
    
    మా అమ్మాయిని కిడ్నాప్ చెయ్యకముందు, ఇంకొన్ని పనులు కూడా చేసారు ఆ రౌడీలు. మా లొకాలిటీలోని ఆడపిల్లలకి ఆ మాటా ఈ మాటా చెప్పి లోబరుచుకుని కూల్ డ్రింక్స్ పేరుతో మత్తు మందులు ఇచ్చి వాళ్ళు స్పృహలేని స్థితిలో ఉండగా వాళ్ళని నగ్నంగా ఫోటోలు తీయడం - ఆ ఫోటోలని గుప్పెట్లో పెట్టుకుని ఆ అమ్మాయిలనీ, వాళ్ళ తల్లిదండ్రులనీ బెదిరించడం...
    
    ఈ సంగతి కూడా పోలీసులకీ, రాజకీయ నాయకులకీ చెప్పుకొన్నారు లొకాలిటీలో ఉన్నవాళ్ళు.
    
    కానీ ఏం చెప్పుకుని ఏం లాభం!
    
    పోలీసులూ, రౌడీలు, రాజకీయ నాయకులూ ఒకే ముఠా అయినప్పుడు?
    
    మా అమ్మాయి కూడా కిడ్నాప్ అయి ఆచూకీ తెలియకుండా పోయాక, పెద్ద ఎత్తున ధర్నాలూ, అలజడులూ చేసారు లోకాలిటీలో వాళ్ళందరూ కలిసి?
    
    ఫలితంగా పోలీసులు రావడం...    
    
    కాల్పులు జరగడం...    

 

    కాల్పుల్లో మా పక్కింటి కుర్రాడు, పదేళ్ళ పసివాడు చనిపోవడం జరిగిపోయాయి. పొద్దున నుంచి మీ అందరితో కలిసి తిరుగుతూ అన్నీ చూస్తున్నానేగానీ నా పంచప్రాణాలూ కిడ్నాప్ అయిన మా అమ్మాయి చుట్టూరానే తిరుగుతున్నాయి.
    
    ప్రసూన అలా చెబుతుంటే వింటున్న వాళ్ళ రక్తం సలసల మరుగుతున్నట్లు అనిపిస్తోంది.
    
    అప్పుడు మెకానిక్ నెమ్మదిగా అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra