Home » Vasundhara » Vasundhara Kadhalu - 14

 

    
"ఏం జరిగింది ?" కుతూహలంగా అడిగింది శిరీష.
    "నా చెల్లికి తల్లి లేదు. అందువల్ల అది నాకు చెప్పుకుంది. ఏం జరిగిందో నువ్వు యింటికి వెళ్ళి నా తల్లికి చెప్పుకుందువు గాని...."
    శిరీష ఇంకేమీ అడగలేదు. తను బైటపడడం ఆమెకు యిష్టం లేదు. "పూర్ కుమార్!" అనుకుందామే. మనసులో "నువ్వు నాకు నచ్చావు. నువ్వు నన్ను తెచ్చిన పద్దతి కూడా నాకు నచ్చింది. నన్ను బాధ పెడుతున్నానని నువ్వను కుంటున్నావు. కానీ నాకిదొక థ్రిల్ అని నీకు తెలియదు" అనుకుంటూనే తన భావాలు ముఖంలోకి కలనబదకుండా జాగ్రత్త పడిందామే.
    శిరీష అనాఘ్రాత పుష్పం కాదు. విచ్చలవిడిగా తిరగడం ఆమెకు అలవాటే! శీలం ప్రాముఖ్యతనామె నటిస్తుంది తప్పితే ఫీలవదు. పెళ్ళి గురించి కూడా ఆమెకు బెంగలేదు. డబ్బుతో తండ్రి వరుణ్ణి కొనగలడని ఆమెకు తెలుసును.
    కుమార్ లేచి "అతను రావడాని కింకా గంట టయముంది" అని "ఈ గంటా మనది!' అన్నాడు.
    "అతను....అతను....అని నన్ను భయపెట్ట'వద్దు - ప్లీజ్ !" అందామె సన్నగా వణుకుతున్న కంఠంతో.
    "నీ భయం నాకు సరదా" అతను అదోకలా నవ్వేడు.
    ఆ నవ్వు శీరీషకు నచ్చింది. కానీ పైకి చెప్పలేదు.
    అతడామెను సమీపించాడు. ఆమె అభ్యంతరాన్ని నటించింది.
    అతడామెను హింసిస్తున్నాననుకుంటున్నాడు. ఆమె సంతోషిస్తోంది.
    
                                       2
    శిరీష ఏడుపు నటిస్తూ "నన్నన్యాయం చేశావు. పెళ్ళి చేసుకో "అంది . కప్పుకున్న చేతివ్రేళ్ళ సందుల నుండి ఆమె అతడి ముఖాన్ని చూస్తోంది.
    సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది. 'అతను వచ్చాడు" అంటూ లేచాడు కుమార్.
    శిరీష గుండె దడదడలాడింది. అతను నిజంగా వస్తాడా?'
    "ప్లీజ్ -- అతన్ని పంపెయ్ ."
    కుమార్ క్రూరంగా నవ్వి "నిన్ను శారీరకంగా , మానసికంగా హింసించాడమే నా ఆనందం " అన్నాడు.
    కుమార్ తలుపు తీశాడు. అతను వచ్చాడు.
    శిరీష అతడి వంక ఆశ్చర్యంగా చూసింది.
    "ఇదీ నీకాబోయే భార్య అసలు స్వరూపం. బరితెగించిన ఆడది. ఆమెలో ఎక్కడా ప్రతిఘటించిన లక్షణాలు లేవు. కావాలంటే పరీక్షించుకో."
    'అక్కర్లేదు . ఆమె ఆసలు స్వరూపం తెలిసింది. ఇంక నేనీమేను శాశ్వతంగా నా దాన్ని చేసుకోలేదు. తాత్కాలికంగా ఈ పూటకు నాదాన్ని చేసుకుని తర్వాత నా హృదయం లోంచీ శాశ్వతంగా చెరిపేస్తాను...."
    "కుమార్ ఎంత పని చేశాడు?" అనుకుందామే. ఇతడి పైన తన తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటల్లుడిగా చేసుకుని అన్ని బాధ్యతలూ అప్పగించాలను కుంటున్నాడు. ఇంటి ఆయువు పట్టు మీద దెబ్బ తీశాడు.
    అతను ఆమెను సమీపించాడు.
    "రమేష్ -- ప్లీజ్ నా జోలికి రాకు" అంది శిరీష.
    "నన్ను నువ్వు ఆపలేవు" అన్నాడు రమేష్.
    "ఇది హత్య కన్నా ఘోరం రమేష్!" అందామె.
    "నీ విషయంలో నేను హంతకుడి కన్నా ఘోరమయిన వాడిననుకో!"
    "ప్లీజ్ రమేష్!" అందామె.
    రమేష్ అక్కడ బీరువా తెరిచి ఓ లుంగీ పంచ, షర్టు తీసి ఆమె చేతికిచ్చి -- "వెళ్ళి స్నానం చేసి - ఇవి కట్టుకుని రా !" అన్నాడు.
    కాసేపు అవీ యివీ చెప్పినా ఆమెకు తప్పలేదు.
    స్నానాల గదిలోకి వెళ్ళింది.
    బయట నుంచి కుమార్, రమేష్ ల మాట లామెకు వినిపిస్తున్నాయి. కుమార్ అంటున్నాడు. "ఆమె నిజంగా భయపడుతున్నట్లుంది. ప్రమాద ముండదు కదా!"
    "ప్రమాద మెందు కుంటుంది ? వేశ్య ఒక రాత్రిలో ఒకో సారి పదిమంది మగాళ్ళను భరిస్తుంది ...." అన్నాడు రమేష్.
    తన కిక్కడ నుంచి మోక్షం లేదని గ్రహించింది శిరీష. ఆమె స్నానం చేస్తూ మానసికంగా ఉల్లాసంగా వుండడానికి ప్రయత్నించింది. స్నానం కాగానే రమేష్ ఇచ్చిన బట్టలు వేసుకుంది.
    గది తలుపులు తీసింది. జరుగబోయేది తలచుకుంటుంటే ఆమె శరీరం వణుకుతోంది.
    "{గుడ్! వెళ్ళి పౌడరు , సెంటు రాసుకుని రా - " అన్నాడు రమేష్ ఆమె వంక కాంక్ష నిండిన చూపులు ప్రసరిస్తూ.
    శిరీష ఏమీ మాట్లాడలేదు. గదిలో కుమార్ లేడు. ఇదే అనుభవం కుమార్ చెల్లెలికి జరిగిందా ? జరిగితే అంత కంటే ఘోరం వుండదు. యట్టే ఒక ఆడదానికి జరిగిన అన్యాయం తీర్చుకునే మార్గం ఇదేనా? మరో ఆడదానికి అన్యాయం చేయడమే తప్ప పురుషుడికి మరో విధంగా బుద్ది రాదా?
    ఇది పురుష ప్రపంచం....కానీ అన్యాయాన్ని సహించక తప్పదు....
    శిరీష భగవంతుణ్ణి ప్రార్ధించుకుంది. తన ప్రాణాలు రక్షించమంది.
    ఆమె పౌడరు రాసుకుంది. సెంటు జల్లుకుంది. రమేష్ బాహువుల్లో ఇమిడిపోయింది. రమేష్ అంటే ఆమె కిప్పుడు నరనరాల ద్వేషం ....
    కానీ తప్పలేదు....
    నిస్సత్తువగా మంచం మీద పడి వుంది శిరీష. ఆమె వంటి మీద బట్టలు సరిగ్గా లేవు. సర్దుకునే ఓపిక కూడా లేదు.
    "రమేష్ వెళ్లిపోయాడు " అది కుమార్ కంఠం.
    "ఊ" నీరసంగా మూలిగిందామె. ఆమె తల గోడ పక్కకు తిరిగి వుంది. ఇటు తిప్పే ఓపిక కూడా వున్నట్లు లేదు.
    'అలా నీరసపదిపోతే ఎలా?" అన్నాడు కుమార్ వెటకారంగా -- "ఇప్పుడే తెలిసింది. ఇంకా మూడో మనిషి ఉన్నాడని."
    శీరిష గుండె ఆగిపోయినట్లయింది.
    "నేను చచ్చిపోతాను" అని ఆమె అరవాలను కుంది. అయితే పెదవి దాటి మాట బయటకు రాలేదు.
    'అయిదు నిమిషాలే టయిం...." అన్నాడు కుమార్ 'అవసరమయితే నువ్వు మళ్ళీ స్నానం చేయాలి . మనసు నుల్లస పరుచుకో -"
    అతణ్ణి వేడుకుని ప్రయోజన ముండదని ఆమెకు తెలుసు. వేశ్య ఒక్క రాత్రికి పదిమందిని భరిస్తుందని తెలుసు. అదెలా సాధ్యమో? అందులో ఇంత బాధ ఉన్నదా?"
    ఆమెలో ఓపిక కలగలేదు.
    అయిదు నిమిషాలు గడిచినట్లున్నాయి. ఎవరో గదిలో ప్రవేశించారు. అడుగుల చప్పుడు ఆమెను సమీపించింది.
    "ఇటు తిరుగు ... నిన్నేమీ చేయను. ఇలా నిస్త్రాణగా వున్న ఆడదాన్ని వళ్ళంతా తడిమి ఆనందించడం నాకు సరదా -- ఈ మనుషుల్ని నేనే నియమించాను....ఒక్కసారి ఇటు తిరుగు.
    ఆమెకు మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. కానీ కదిలే ఓపిక కూడా లేదు. అతడి చేతులు తన వంటి మీద అస్తవ్యస్తంగా వున్న బట్టల్ని మరింత అస్తవ్యస్తంగా చేశాయి. ఆ తర్వాత ... అతడి చేతులు ఆమెను తన వైపు తిప్పుకున్నాయి.
    తెరిచీ.. తెరవని ....కన్నులతో ఆమె అతి కష్టం మీద అతణ్ణి చూసింది. అంతే -- అ కన్నులు పెద్దవయ్యాయి.
    'అమ్మా-- శిరీషా!" అన్నాడు మాణిక్యాలరావు.
    "సార్!" అంది వెనుక నుంచి కుమార్ కంఠం - "పరీక్షగా చూడండి. ఆమె వంటి మీద ప్రతిఘటించిన లక్షణాలు కనబడవు. పైగా మనిషి ఘుమఘుమ లాడిపోతోంది కూడా !"
    "కుమార్ -- దుర్మార్గుడా -- ఎంత పని చేశావు?"
    "సార్! ఎప్పుడూ మీవల్ల ఇదేపని జరుగుతోంది.  ఇంతకాలం మీరు ఆ యువతుల ముఖాలను పరిశీలనగా చూడలేదు. చూస్తె వాళ్లలోనూ మీకు కూతురు కనబడి వుండేది"అన్నాడు కుమార్.
    మాణిక్యాలరావు కుమార్ ను దుమ్మెత్తి పోస్తున్నాడు. కుమార్ అవేమీ పట్టించుకోకుండా శిరీష వంక తిరిగి - "మిస్ శిరీష ! నీ తండ్రి లతాసదనం లో ఏం చేస్తాడో తెలుసుకున్నావు గదా - ఈయన నా చెల్లిని వేశ్యా వాటికకు అమ్మేశాడు. ఆయన్నడిగి ఆమెను నాకు తిరిగి యిప్పించు. ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆడదానిగా వేశ్య పడే బాధను అర్ధం చేసుకునే వుంటావు. నాకీ సాయం చేయి" అన్నాడు.
    శిరీష నీరసంగా మూలిగి, కళ్ళు తిరిగి పక్క మీద అచేతనంగా పడిపోయింది .

                                         ***

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra