Home » Vasundhara » Vasundhara Kadhalu - 7


    "అవును-"
    "ఇది నావల్లకాదు...."
    "నీ సాక్ష్యం లేకపోతే నేను నీకు దక్కను.....నిన్నె నమ్ముకున్నాను. నా ప్రాణాలు రక్షించుకో. సతీసావిత్రి పెళ్ళయ్యాక భర్త ప్రాణాలు రక్షించుకుంది. నీవు పెళ్ళికి ముందే భర్త ప్రాణాలు రక్షించుకుని ఆమెకంటే ఓ మెట్టు పైకెక్కు.....ఇక నేను నా యింటికి వెడుతున్నాను.....నేను చెప్పింది గుర్తుంచుకో...." అనేసి హడావుడిగా వెళ్ళిపోయాడు విజయ్.
    చంప అతడికి వీడ్కోలు కూడా చెప్పలేదు. ఆమె మనసులో తీవ్ర సంచలనం ఆరంభమయింది.
    "నేనిప్పుడేం చేయాలి?"
    ఆలోచిస్తూ కుర్చీలో వెనక్కువాలి కళ్ళు మూసు కుందామె అలా ఎంతసేపుందో తనకే తెలియదు. నిద్ర పోతున్నావా-అన్న మధుసూదన్ పలకరింపుతో-ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచి-"లేదు బాబాయ్!" అంది.
    మధుసూదన్ ఆమె కెదురుగా కూర్చుని-"నువ్వు చేసిన పనేం బాగోలేదమ్మా-ఒక రాత్రివేళ ప్రవీణ్ వచ్చ్డాడు-" అంటూ జరిగింది చెప్పాడు.
    "అంటే అతడికి నేను విజయ్ ని ప్రేమిస్తున్నానని తెలిసిపోయిందన్న మాట....." అంది చంప.
    "నువ్వు విజయ్ ని ప్రేమించడంలేదు. ప్రేమిస్తున్నా ననుకుంటున్నావు-" సవరించాడు మధుసూదన్.
    చంప మాట్లాడలేదు.
    "ప్రవీణ్ ని నువ్వే రక్షించాలి. నిన్న రోజంతా అతడు నీతోనే ఉన్నట్లు సాక్ష్యమివ్వాలి......అదే అతడికి తిరుగులేని ఎలిబీ అవుతుంది....."
    "ప్రవీణ్ కి ఎలిబీగా ఉంటే-విజయ్ ని వదులుకోవడమే అవుతుంది-"
    "హంతకుడి కురికంబం తగిన శిక్షేకదా!"
    "బాబాయ్-శివరాజును చంపడం నేరమంటావా?"
    "మనిషి మనిషిని చంపడం నేరం. శివరాజు మనిషి కాదని నువ్వంటే సరిపోదు. చట్టం ఒప్పుకోవాలి. చట్టాన్ని నిరసిస్తే-అది దేశద్రోహం.....శివరాజును చంపకముందే విజయ్ దేశద్రోహి...." అన్నాడు మధుసూదన్.
    "బాబాయ్-చిన్నప్పట్నించీ నీ చేతుల్లో నన్ను పెంచావు....కానీ నీ దురదృష్టమో నా దురదృష్టమో! నేను నీ ఆత్మీయత నర్దం చేసుకోగలను. నిన్నభిమానించగలను. కానీ నీ అభిప్రాయాలువేరు. నా అభిప్రాయాలు వేరు. ఇది నాకు బాధగానే వుంది. అయినా నిజం!" అంది చంప.
    "అయితే ప్రవీణ్ కి ఎలిబీ యివ్వవా?"
    "ప్రవీణ్ కిచ్చినా, విజయ్ కిచ్చినా ఎలిబీ యివ్వడమంటే-అబద్ధమే అవుతుంది. అంటే నేను తప్పు చేస్తున్నాను. నువ్వు నన్ను తప్పుకు ప్రోత్సహిస్తున్నావు. తప్పు చేసేటప్పుడు నాకు ప్రయోజనకరంగా ఉండే అబద్దమెందుకు చెప్పకూడదు?"
    "అయితే నీ నిర్ణయమేమిటి?"
    "నేను విజయ్ కి ఎలిబీ యిస్తున్నాను...."
    "విజయ్ కా?"
    "అవును విజయ్ కే!"
    మధుసూదన్ ముఖం ఎర్రబడింది-"అయితే నేను నీ ఎలిబీని ఖండిస్తాను. విజయ్ స్థానంలో ప్రవీణ్ ఉన్నాడంటాను...." అన్నాడతడు.
    చంప తెల్లబోయింది.
    
                                    9

    కోర్టులో కేసు ప్రవీణ్ కి బలంగా తయారయింది.
    ప్రవీణ్ కీ, శివరాజుకీ మధ్య జరిగిన సంభాషణ తను విన్నట్లు శివరాజు పనివాడు చెప్పాడు. ఆ సంభాషణ నిజమేనని ప్రవీణ్ ఒప్పుకున్నాడు.
    ప్రవీణ్ కి తనో పెంపుడు పామును వందరూపాయలకు అమ్మినట్లు పాములవాడు సాక్ష్యమిచ్చాడు. ప్రవీణ్ కాదని ఎంతగా ఆక్రోశించినా ఎవరూ పట్టించుకోలేదు. పాములవాడు చెప్పే సమయంలో తను చంపతో పాటు థియేటర్లో ఉన్నట్లతడు చెబితే-చంప-తనూ విజయ్ ఉన్నట్లు చెప్పింది. మధుసూదన్ ఎందుకో ఆమె మాటలు ఖండించలేదు. ఆ విధంగా విజయ్ కు పూర్తి ఎలిబీ వుంది.
    ప్రవీణ్ కి ఎలిబీలేదు. అతడు చెబుతున్నదంతా కట్టుకధలాగుంది. కోర్టులో అతడి మాట ఒక్కటీ నిలబడలేదు.
    "నా మాట లెవరూ నమ్మడం లేదు. నాకు శివరాజును చంపాల్సిన అవసరమేమిటి?" అన్నాడు ప్రవీణ్.
    "చంపకోసం...." అన్నది ప్రాసిక్యూషన్ లాయర్ జవాబు.
    ప్రవీణ్ నిస్సహాయుడైపోయాడు. నిర్వీర్యుడై పోయాడు.
    ఆ సమయంలో-ఓ కొత్త సాక్షి పుట్టుకువచ్చింది. ఆమె పేరు చరిత!
    ప్రవీణ్ ఆ రోజంతా తనతో గడిపాడనీ-ఆ విషయం పదిమంది ముందరా బైటపెట్టడం అతడికిష్టం లేదనీ ఆమె చెప్పింది.
    ఇటీవలే చరితకు వివాహం నిశ్చయమయింది. వరుణుడామె గత చరిత్రను పూర్తిగా తెలుసుకున్నాకనే వివాహానికి అంగీకరించాడు. అతడిది విశాల హృదయం.
    ప్రవీణ్ ని చరిత స్వంత తమ్ముడికిలా అభిమానిస్తోంది. అతడికీ ఆమెకూ విచిత్ర పరిస్థితుల్లో పరిచయమయింది. మనసు బాగోలేక ఆ రోజతడామె ఇంట్లోనే ఉన్నాడు. ఎంతటి విశాలహృదయుడైనా దీన్ని అపార్ధం చేసుకోవచ్చని ప్రవీణ్ విషయం దాచిపెడుతున్నాడు. చంపనైతే తనెలాగూ వివాహం చేసుకుంటాడు కాబట్టి- ఆమెపై ఎటువంటి అపవాదూ ఉండదనుకుని ఆమె పేరు చెబుతున్నాడు. ఒక అమాయకుడి ప్రాణాన్ని ప్రమాదంలో వదిలిపెట్టలేక చరిత తానిప్పుడు ముందుకువచ్చింది.
    ప్రాసిక్యూషన్ లాయర్ ఈ సాక్ష్యాన్ని దారుణంగా పరిహసించాడు. అది ప్రవీణ్ కి సహకరించడం కంటే-చరితకే అవమానకరంగా పరిణమించింది. ఆమె సాక్ష్యాన్ని ప్రవీణ్ కూడా అంగీకరించలేదు.
    అప్పుడు మధుసూదన్ బోనెక్కాడు.
    "చరితను వివాహం చేసుకోబోతున్నది నేనే! ఇప్పటికీ నేనామె సచ్చీలతను నమ్ముతున్నాను. మా ఇద్దరికీ వయోభేదం ఎక్కువే.....కానీ మా పరిచయం వయసూ ఎక్కువే.....ఇంతవరకూ ఆమె జీవితంలో అబద్ధం చెప్పలేదు..."
    ప్రాసిక్యూషన్ లాయర్ మధుసూదన్ ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ-"మీరు చంప వివాహం విజయ్ తో కాక ప్రవీణ్ తో జరగాలనుకుంటున్నారు. అందుకే ఈ తప్పుడు సాక్ష్యాలన్నీ సృష్టిస్తున్నారు. మీ సాక్ష్యం నిలబడదు. కానీ ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు విజయ్ నేందుకు ద్వేషిస్తున్నారు?" అన్నాడు.
    "విజయ్ దేశద్రోహి-" అన్నాడు మధుసూదన్.
    "వివాహం చేసుకోకుండా ఓ అవివాహిత యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న మీకు విజయ్ ని దేశ ద్రోహి అనే అర్హత వుందా?" అన్నాడు లాయర్.
    "దేశద్రోహిని దేశద్రోహి అనడానికి అర్హతుండాలా?"
    "అర్హతలేకపోతే-కనీసం సాక్ష్యముండాలి....."
    "అయితే వినండి.....నేను చరితను పెళ్ళిచేసుకుందామని కొన్నేళ్ళ క్రితమే అనుకున్నాను. కానీ శివరా జీ పెళ్ళికి ఒప్పుకోలేదు..."
    "ఎందుకని?"
    మధుసూదన్ శివరాజు కథ చెప్పి- "పదిమంది దృష్టిలో-ముఖ్యంగా సమాజంలో నేరాలు చేస్తూ పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వారి దృష్టిలో-నేనతడి శత్రువుగా పరిగణించబడాలని అతడి ఉద్దేశ్యం. కానీ అతడి లాకర్ తాళాన్ని దగ్గరుంచుకున్న అసహాయ స్నేహితుణ్ణి నేనే! తను బ్రతికుండగా నేనీ విషయం బైటపెడితే నన్నూ, నా ప్రాణానికి ప్రాణంగా పెంచిన చంపనూ కాలరాస్తానని బెదిరించడంవల్ల ఇంత కాలం నోరెత్తలేకపోయాను. ఇప్పుడు నా కారణంగా విజయ్ ది మాత్రమేకాదు-ఎందరో పెద్దమనుషుల చరిత్రలు బైటపడతాయి.
    విజయ్ కి హత్యకు మోటివ్ వుంది. అతడు చంప నుపయోగించుకుని శివరాజును తనదారినుంచి తప్పించాలనుకున్నాడు. వెర్రి వ్యామోహంలోపడి చంప అతడికి సహకరిస్తోంది. నేను మీ కివ్వగల సాక్ష్యం - ఈ లాకర్ తాళం" - అంటూ ఓ తాళాన్ని లాయరు కందించాడు.
    కోర్టులో పెద్ద సంచలనం...
    ఆ తర్వాత ప్రవీణ్ బైటపడ్డానికీ-విజయ్ కి శిక్ష పడ్డానికీ ఎంతోకాలం పట్టలేదు....
    "విజయ్ ని నేను ప్రేమిస్తున్నానని తెలిసీ నాక్కాకుండా చేసిన ప్రవీణ్ అంటే నేనింకా ఎందుకిష్టపడాలి!" అంది చంప బాబాయితో.
    "అదే అతడి గొప్పతనం. అతడికి నిదానముంది. ఆ నిదానం నీ ఆవేశాన్ని సరిచేస్తుంది. నువ్వు హత్య చేయమన్నావు. అతడు నిదానించాడు. నువ్వు విజయ్ ని తప్పు చేసినా రక్షించాలనుకున్నావు. తెలిసి తెలిసిన అలాంటి వాడి బారికి నిన్నొదలడాని కతడిష్టపడలేదు. నీ సుఖం విజయ్ దగ్గరకాదు. ప్రవీణ్ దగ్గరుంది...నీ వతడి ప్రాణాలతో ఆడుకున్నావు. ఇంకా నిన్నతడు ప్రేమిస్తూంటే నువ్వతన్నే పెళ్ళి చేసుకో-" అన్నాడు మధుసూదన్.
    చంప ప్రవీణ్ ని కలుసుకుని క్షమించమని అడిగింది.
    "నువ్వేం చేసినా భరిస్తాను. నువ్వు నన్ను చంపేస్తానంటే తలవంచుతాను క్షమించమని మాత్రం అడక్కు భరించలేను" అన్నాడు ప్రవీణ్.
    చంప అతడి మాటలు విని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆ ఏడ్పు ఆమెలోని అడ్వెంచర్ స్పిరిట్ ని కడిగేసి-సామాన్య యువతిగా మార్చింది. ఆ స్పిరిట్ తప్పుదారి పడితే ఏమవుతుందో విజయ్ ద్వారా ఆమెకు తెలిసింది.
    కొంతకాలానికి మధుసూదన్ చరితను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతుల ఆధ్వర్యంలో ప్రవీణ్, చంపల వివాహం జరిగింది.


                             -:అయిపోయింది:-

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra