Home » Vasundhara » Vasundhara Kadhalu - 15

 

    పరుగెత్తుకు వెళ్ళి ఆమెను అపాలనిపించింది. కానీ ఏమీ చేయలేకపోయాను.
    వీధి గుమ్మం దాకా వెళ్ళి ఒక్కసారి ఆగి వెనక్కు తిరిగి వస్తానండీ. రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తాను పుస్తకాలు" అంది కోమలి. అనేసి నేను చూస్తుండగానే వెళ్ళిపోయింది.
    "ఒరేయ్ రంగనాధం! నువ్వెంత అదృష్ట వంతుడివిరా!' అనుకున్నాను మనస్సులో.
    తర్వాత కోమలి కోసం ఆశగా నాలుగు రోజులు ఎదురు చూశాను. కానీ ఫలితం లేకపోయింది.
    ఐడో రోజున "తలనొప్పిగాఉంది. మీ ఇంట్లో ఏమైనా టాబ్ లెట్స్ ఉన్నాయా" అని కూడా వెళ్ళి అడిగాను. రెండు కోవాల్టిన్ బిళ్ళలు నా చేతిలో పెట్టింది కోమలి.
    "చాలా థాంక్స్. నొప్పి వల్ల ఈరోజు ఆఫీసుకు కూడా సెలవు పెడుతున్నాను" అని చెప్పి మా ఇంట్లోకి వచ్చేశాను.
    నా సెలవుకు కారణం తలనొప్పి కాదు. కోమలి వస్తుందన్న ఆశ. ఉదయం సుమారు పది గంటలకు తలుపు చప్పుడయింది. వెళ్ళి తలుపు తీశాను.
    కోమలి --- నిజంగా కోమలి!
    నా హృదయం పరవళ్ళు తొక్కింది. ఉత్సాహాన్ని ముఖంలో కనపడనీయకుండా జాగ్రత్త పడ్డాను. "ఇంకా తగ్గలేదు తలనొప్పి" అన్నాను నీరసంగా.
    'అందుకే మీ కోసం వేడి వేడి మిరియాల చారు తెచ్చాను. వెంటనే భోం చేసేయండి- భోజనం అయిపోయి వుంటే చారు కొద్దిగా తాగండి. గ్లాసు సాయంత్రం పంపిద్దురు గాని " అని గ్లాసు టేబిల్ మీద పెట్టి వెళ్ళిపోయింది కోమలి.
    ఈసారి నిజంగా నీరసం వచ్చింది.
    తలుపులు వేసి కొద్దిగా చారు తాగాను. కొమలిచేతి వంట అమృతం. గ్లాసు ఖాళీ అయిపొయింది. గ్లాసు ఇవ్వడం కోసం కోమలి ఇంటికీ అప్పుడే వెళ్ళాలని పించింది. అలా చేయలేదు. మంచం మీద పడుకుని ఆలోచిస్తుండగా ఎప్పుడో నిద్రపట్టింది.
    ఎవరో తలుపు తడుతున్న చప్పుడికి మెలకువ వచ్చింది.
    టయిము చూసుకున్నాను - రాత్రి ఎనిమిదిన్నరయింది. తలుపు తడుతున్న చప్పుడు స్పష్టంగా వినబడుతోంది. ఆ తడుతున్నది గాజులున్న చేయి అని కూడా స్పష్టంగా తెలుస్తోంది. నాలో ఏదో ఆశ అంకురించింది.
    తలుపులు తీసి చూసి హతాశుడనయ్యాను.
    ఎదురుగా శ్రీమతి . "నువ్వా ?" అన్నాను నీరసంగా.
    "ఏం - పరాయి అడదనుకున్నారా?" అంది శ్రీమతి వెటకారంగా. ఆమె లోపల అడుగు పెట్టి తలుపులు వేసి నా దగ్గరగా వచ్చింది.
    ఒక రకమైన ఆవేశంలో ఆమెను నా దగ్గరగా లాక్కున్నాను. ఆమె నా చెంపలు నిమురుతూ నా కళ్ళలో కి చూస్తోంది. ఆ కళ్ళలో కాంక్ష ఉంది. కొత్త మెరుపు ఉంది. నేను మరింత గట్టిగా ఆమెను హత్తుకున్నాను.
    ఆమె కన్నులు మూతపడ్డాయి. తన చేతులతో నా భుజం మీద గట్టిగా నొక్కుతూ "బావా?" అంది పరవశంగా.
    ఉలిక్కిపడ్డాను. ఆమె కూడా చటుక్కున నాలిక్కరుచుకుంది. నా పట్టు సడలింది. సాలోచనగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను.
    శ్రీమతి పుట్టింటి నుంచి వస్తోంది. వాళ్ళింట్లో ఆమె బావ కూడా ఉన్నాడు. అతగాడక్కడుండి రీసెర్చి వెలగబెడుతున్నాడు . మగవాడు కౌగాలిన్చుకున్నప్పుడు కలిగిన పరవశం లో "బావా' అనడం ఆమెకీ నాలుగు రోజుల్లోనూ బాగా అలవాటయింది.
    "బావా ఏమిటి అసహహ్యంగా?"
    "అదేంటండీ - మీరు నాకు బావ కాదా" అంది శ్రీమతి. ఆమె మాట్లాడుతుంటే కొత్త రకంగా ఉంది నాకు. బహుశా నాలో తల ఎత్తిన అనుమానమే అందుక్కారణం కావచ్చు.
    "కావచ్చు , కానీ ఇదివరకెన్నడూ అలా పిలవలేదు నువ్వు!"
    "నీ కిష్టం లేకపోతె అననులే బావా? "మళ్ళీ నాలికర్చుకుంది శ్రీమతి.
    నాకేదో అనుమానం వచ్చింది. శ్రీమతి నన్ను 'నువ్వు' అంది. 'బావా' అంది. ఈసారి పొరపాటు నటించినా- అది పొరపాటు కాదనీ, కావాలనే అన్నదనీ నాకు అనిపించసాగింది .... అంటే ....
    ఒక్క క్షణం ఆలోచించేసరికి ఏదో అర్ధమయిందనిపించింది. నేను పదేపదే పరాయి ఆడదాని ప్రసక్తి తీసుకోస్తున్నందుకు ప్రతిగా తనూ పరాయి మగవాడి ప్రసక్తి తీసుకురావాలని నన్ను దెబ్బ కొట్టాలని ప్లాను వేసిందేమో!
    ఇది తట్టగానే నాలో నేను నవ్వుకుని - "ఏమిటి విశేషం అలక మీద వెళ్ళి నాలుగు రోజుల్లోనే వెనక్కు వచ్చేశావ్!" అన్నాను వెటకారంగా.
    "మీమీద మోజు కొద్దీ " అంది శ్రీమతి.
    నిజం చెప్పొద్దు - ఆ క్షణంలో శ్రీమతిని చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ అలా చేయలేదు. చేస్తే ఆమెకు లైకువై పోతాను. ఆమె నన్ను యేడిపించదలచుకుంది. నేనూ ఆమెను ఎడిపించాలి.
    అందుకే నాలోని కోర్కెల గుర్రాలకు తాళం వేసి ఒక్కడినే సెకండ్ షో సినిమాకు పోయాను. ఇంట్లో ఉంటే శ్రీమతికి లొంగి పోతానని.
    అట్టే జనం లేరు గానీ - సెకండ్ షో కి అప్పుడే చాలా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూ మధ్యలో నాకు సుబ్రహ్మణ్యం కనపడ్డాడు. అతను నన్ను చూడలేదు.
    సుబ్రహ్మణ్యం భార్య పేరు పుల్లాయమ్మే కానీ మనిషి సినిమా స్టారులా ఉంటుంది. ఉండడమే కాదు -- అలాగే చూస్తుంది కూడా. అనేక పర్యాయాలు ఆమె నా వైపు కాంక్షతో నిండిన చూపులు చూసింది. అదివరలో పట్టించుకోలేదు.
    బుర్ర లో ఏదో తళుక్కున మెరిసింది. గిరుక్కున వెనక్కి తిరిగాను.
    నా అడుగులు సరైన మార్గంలోనే పడుతున్నాయి. దారి పొడవున - బాత్ రూం లోని రంగనాధం, మాలతి కళ్ళ ముందు మేదుల్తున్నారు. "సరదాకన్నాను కానీ కళ్ళు మూసుకోనవసరం లేదు. నేను బట్టలు వేసుకునే ఉన్నాను' అంటోంది మాలతి. రంగనాధం కళ్ళు తెరిచాడు. ఆ తలపుకె పరవశంతో నా కళ్ళు మూతలు పడ్డాయి.
    ఆడవాళ్ళలో ఇలాంటి వారుంటారనీ , రంగనాధం వంటి దేభ్యం గాడికి అలాంటి అవకాశాలు వస్తాయనీ, తెలిసుంటే, నేను మొదట్నుంచీ ఇటువంటి దృష్టిలో ఉండి ఉండేవాణ్ణి. కాస్త ఆలస్యంగా అయితే మాత్రం - మేలుకోగలిగాను.
    అదే సుబ్రహ్మణ్యం ఇల్లు. తలుపు తడదామా అనుకుని ఎందుకైనా మంచిదని ఒకసారి తోసి చూశాను.
    ఎందుకంటె తన భార్యకు తలుపు గడియ వేసే అలవాటు లేదని సుబ్రహ్మణ్యం చాలసార్లు నా దగ్గర వాపోయాడు.
    ఎందుకంటె ఆమెకు విపరీతమైన నిద్రట. ఒకోసారి సుబ్రహ్మణ్యం ఆఫీసు నించి ఇంటికి వచ్చేసరికి కూడా నిద్ర పోతుంటుందిట. తలుపు తట్టి ఆమెను మేల్కొల్పడం అసంభవం కాబట్టి - అమెతలుపులు వేయకుండానే వదిలేస్తుంది.
    సాధారణంగా సుబ్రహ్మణ్యం ఇంటికి ఎవరూ రారు కాబట్టి ఫరవాలేదు. అనేక పర్యాయాలు మేమిద్దరం కలసి అతనింటికి వెళ్ళినప్పుడు తలుపు తోసుకునే లోపలకు వెళ్ళాం.
    నా అదృష్టం బాగుంది. తలుపు తెరచుకుంది. నేను నెమ్మదిగా లోపలకు అడుగు పెట్టాను.
    అది వరండా. దాన్నానుకునే వాళ్ళ బెడ్ రూమ్ ఉంది. సాధారణంగా అతిధుల్ని వరండాలోనే కూర్చో పెడతారు కానీ నాకు మాత్రం సరాసరి అతని బెడ్ రూమ్ లో అడుగు పెట్టె అధికారముంది. వంటింట్లోకి వెళ్ళడానికి బెడ్రూమేదారి నేనెప్పుడూ వాళ్ళ వంటింట్లోనే కాఫీ తీసుకుంటుంటాను.
    నేను చప్పుడు చేయకుండా అడుగులు వేసుకుంటూ వాళ్ళ బెడ్ రూమ్ లో అడుగు పెట్టాను.
    అంతే - నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను. పుల్లాయమ్మ వీపు నా వైపుకు ఉంది. ఆమె టర్కిష్ టవల్ తో ఒళ్ళు తుడుచుకుంటోంది. ఇది కలా నిజమా నాక్కూడా రంగనాధం లాంటి అవకాశమా?
    కొద్దిగా అడుగులు చప్పుడు చేస్తూ వరండా లోకి వచ్చి చిన్నగా దగ్గాను. "ఎవరూ?" అంటూ పుల్లాయమ్మ తలుపు దగ్గరకు వచ్చింది. ఆమె టవల్ ని శరీరానికి చుట్ట బెట్టుకుని ఉన్నప్పటికీ - అది సరిపోలేదని తెలుస్తూనే ఉంది.
    "వేరిసారీ అండీ -సుబ్రహ్మణ్యం ఉన్నాడేమో నని -" అంటూ నసిగాను.
    "ఫర్వాలేదు -- రండి. కాఫీ తాగి వేడుదురు గానీ " అందామె.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra