Home » Dr c. ananda ramam » Velugubata


    ఝాన్సీకి ఇంత కోపం ఎందుకొచ్చిందో అర్ధంకాక, బొమ్మలా నిలబడిపోయాడు కుమార్. లోపలినుంచి ఈ సంభాషణ అంతా వింటున్న అచ్చమాంబ కలవరపాటుతో నొచ్చుకుంటున్నట్లు "లోపలికి రానాయనా! బయటే నిలబడి మాట్లాడుకోవం ఏమిటి?" అని ఆహ్వానించింది. అప్యాయంగా. కుమార్ ముందుకు అడుగువేయబోతుంటే, ఝాన్సీ పిచ్చిదానిలా అడ్డుతగిలి రెండు చేతులుజాపి, "వద్దు! లోపలికి రావద్దు నువ్వు లోపలికి అడుగు పెట్టావంటే, మళ్ళీ  ప్రాయశ్చిత్త కాండ జరిపించుకోవాలి, ఇప్పుడు నా దగ్గర  అంత డబ్బులేదు" అంది. కుమార్ కేమీ అర్ధంకాలేదు కాని, అచ్చమాంబ కర్ధమయిపోయింది. చాలా సేపటినుంచీ ఝాన్సీ మనసులో రగులుతున్న జ్వాలకు కారణం తెలిసింది. పాళీ పోయిన ముఖాన్ని క్రిందకు వాల్చుకోవటంకంటే ఏమిమాట్లాడలేకపోయింది. తనకు ప్రాణదానం చేసిన వ్యక్తి ముందు, నిన్ను ముట్టుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేయించు కొన్నానని ఎలా చెప్పగలదు?
    కుమార్ అప్పటికీ వెళ్ళలేక "ఝాన్సీ! ప్లీజ్ నా మాట విను నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను. అన్ని రోజులు కలిసి ఉన్నా, ఏనాడైనా అనుచితంగా ప్రవర్తించానా? అనవసరంగా గొడవలు కొని తెచ్చుకోకు" అన్నాడు, తనకేదో ఉపకారం చెయ్యమని ప్రాధేయపడుతున్నట్లు ఝాన్సీ కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంత ప్రేమ, ఇంత సహృదయత భరించలేకపోతోంది.
    "కుమార్! ప్లీజ్ వెళ్ళిపో? మైండ్ యువర్ ఓన్ బిజినెస్-" అనేసింది.
    దెబ్బతిన్నట్లు చూసి వెళ్ళలేక వెళ్తున్నాట్లు వెళ్ళి పోయాడు. సద్బ్రాహ్మణుడైన తన పెద్ద అల్లుడితో, ఈ  అల్లుడుకాని అల్లుడిని పోల్చుకుని "అబ్బా! ఎంత మంచి వాడు!" అనుకుంది నీళ్ళు తిరుగుతున్న కళ్ళతో సర్వమూ పోగొట్టుకొన్నట్లు శూన్యంగా ఉన్న కూతురి  ముఖం చూస్తుంటే మనసు పిండినట్లయింది. ఏదో తనకే అర్ధంకాని మధన ప్రారంభమయింది ఆ వృద్ధురాలిలో.


                                                     *    *    *


    ఝాన్సీ ఇంట్లోంచి అడుగు బయటపెడితేచాలు, జనం గుసగుసలు చెప్పుకోసాగారు. ఏదో వింత జంతువుణు చూసినట్లు విడ్డూరంగా చూడసాగారు. కొందరు పెద్ద ముత్తయిదువులు ముఖంమీదే "అయితే, పెళ్ళిళ్ళు చేసుకుంటావమ్మా! ఉద్యోగం కోసం ఒక పెళ్ళి, సంసారం కోసం ఒక పెళ్ళి, సంతాణంకోసం ఒక పెళ్ళి, భలే!" అంటూ వెటకారంగా నవ్వసాగారు. ఈ పల్లెటూళ్ళల్లో దేనికదే! డాక్టర్ గా గౌరవించినా, ఇలాంటి అవకాశాలొస్తే వదులుకోరు వాళ్ళకిదే మంచి కాలక్షేపం, అందులో తనమీద ఇప్పుడు డాక్టర్ గా కూడా గౌరవం లేదు. ఈ ఊళ్ళో డాక్టరంటే, కుమార్ మాత్రమే.
    ఆ ఊళ్ళోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది ఝాన్సీ. ఆ మాట తల్లికీ, అక్కకూ చెప్పింది. తల్లి మనసు విల విల లాడి పోయింది. జీవములేని కూతురి ముఖంలోకిచూసి "ఝాన్సీ! తొందరపడకు మరోసారి ఆలోచించుకో-: అంటూ ఏదో నచ్చజెప్పబోయింది. ఆవిడ మాటలు పూర్తికాకుండానే ఝాన్సీ విసురుగా "అమ్మా! నువ్వు దిగులుపడకు డాక్టర్ ని కాకపోయినంతమాత్రాన కుటుంబాన్ని పోషించలేకపోను ఇంకా, అనేక పనులు చేయగలిగే శక్తి సామర్ధ్యాలు నాకు ఉన్నాయి-" అని కసిరింది. అక్కడితో తల్లి నోట్లో గుడ్డ కుక్కకొని ఏడుపు అపుకొంటూ వెళ్ళిపోయింది. అంత  కఠినంగా  అన్నందుకు ఝాన్సీ కొంచెం బాధపడినా, అప్పటి ఆమె మనసు విపరీతమైన చికాకుతో నలిగిపోతోంది. నాగమాంబ మాత్రం తల్లిలా వెళ్ళిపోకుండా, "ఝాన్సీ! నీ అదృష్టం కూడా నా రాతలాగే కాలిపోవాలా? అంత మంచివాడిని భర్తగా పొందటానికి ఎంత పుణ్యం చేసుకోవాలో! చేజేతులా నీ అదృష్టాన్ని నువ్వే చేసుకోకే" అని నచ్చజెప్పబోయింది.
    "నిజమే అక్కా! అంత మంచివాడిని భర్తగా పొందటానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి. నే నంత పుణ్యం చేసుకోలేదు. మంచివాళ్ళు కదా అని ఆ మంచిని మరీ స్వార్ధానికి వినియోగించుకోనేటంత దుర్మార్గురాలీనికాను నేను"
    ఝాన్సీ ఏం మాట్లాడుతోందో, అర్ధం కాలేదు నాగమాంబకి ఆ స్థాయిలో ఆలోచించడం ఆమె తరంకాదు.
    ప్రయాణం నిశ్చయమయ్యాక, అప్పుడు చాలరోజుల తర్వాత మేరీ ఇంటికి బయలుదేరింది ఝాన్సీ ఆ సమయంలో ఇంట్లో అంతా ఉన్నారు. ఏదో  నవ్వుతూ కబుర్లు చెప్పు కొంటున్నారు. ఝాన్సీ రాకతో అందరూ ఒక్కసారిగా మౌనం వహించారు. ఝాన్సీ పొడినవ్వు నవ్వుతూ, మీ అందరి ఆనందాన్ని పాడుచేసి నట్టున్నాను, అయామ్ సారీ" అంది.
    మేరీ వెంటనే, "అదేం లేదు, అకస్మాత్తుగా రావడంతో కొద్దిగా ఆశ్చర్యం కలిగింది అంతే!" అని చెయ్యి పట్టుకొని పక్కన కూచోబెట్టుకుంది.
    "నేను రేపు ఈ ఊరునుంచి వెళ్ళిపోతున్నాను" తల వంచుకొని చెప్పింది ఝాన్సీ.
    "అంటే? మీ మీద చర్యతీసుకుంటారన్నమాట!"
    "తీసుకోవచ్చు."
    "తీసుకుంటే, ఏమవుతుందో తెలుసునా?"
    "నా  ఉద్యోగం ఎలాగూ ఊడిపోతుంది. ఒక వేళ నా డిగ్రీ కూడా కాన్సిల్ చెయ్యవచ్చు. అలా జరిగితే, ఇక ఈ జీవితంలో డాక్టరయ్యే అవకాశం ఉండదు."
    "ఇంతకూ సిద్ధపడుతున్నారే కాని...." ఆ తరువాత వాక్యం పూర్తిచెయ్యలేక పోయింది మేరీ. తనకోసం ఇంత బాధపడుతున్న మేరీని చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు. మేరీ చూపుల్లో నిరసన, తన పట్ల వ్యక్తావ్యక్తంగా ఉండేనిర్లక్ష్యం భావం మరిచిపోలేదు ఝాన్సీ.
    తన మనసులో సంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ తన వేలినున్న ఉంగరం చూసుకుంటూ, నెమ్మదిగా "మేరీ! ఇవాళ నేను వచ్చింది, ఈ ఉంగరం నీకియ్యటానికి. ఇది నా చేతికి ఉండటం భావ్యంకాదు" అంటూ ఉంగరం తియ్యబోయింది. మేరీ గభాలున ఉంగరం తీయ్యకుండా చెయ్యి గట్టిగా పట్టుకొని కొంచెం తీక్షణంగా "ఈ ఆలోచన ఇవాళే ఎందుకు వచ్చిందీ?" అంది.
    ఝాన్సీ మాట్లాడలేదు. మేరీ మళ్ళీ "నీ చేతికి ఉన్న ఉంగరం కుమార్ పెళ్ళిసందర్భంలో నీకు తొడిగిన ఉంగరం, నాకు ఇయ్యటం మాత్రం ఏం భావ్యం!" అంది.
    "నువ్వు కుమార్ భార్యవి కాబోతున్నానా? ఎవరు చెప్పారు?" తెల్లబోతూ అడిగింది మేరీ.
    ఆశ్చర్యపోయింది ఝాన్సీ. ఆ ఆశ్చర్యంలో ఆనందమూ ఉంది. ఏం మాట్లాడలేక శాంతమ్మవైపు చూసింది. శాంతమ్మ మేరీతల్లి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చివరకు శాంతమ్మ నిజం ఒప్పేసుకుంది.
    "అవును నేనే అట్టా చెప్పాను. ఓ వంక బాపనమ్మ శాపాలు యినలేక పొయ్యేదాన్ని నువ్వేమో మాటినావు. ఇట్లా చెప్పేస్తే ఇక ఈ ఊసోదిలేస్తావని....."
    శాంతమ్మ నిజం చెప్పటం ప్రారంభించేసరికి మేరీ తల్లి కూడా ధైర్యంగా అందుకుంది. "అప్పట్లో నా మనసులో నిజంగా ఆ ఉద్దేశం ఉంది. నీకు జ్ఞాపకం ఉందో, లేదో"చేతనయితే మీ అమ్మగారిని ఒప్పించిరా. కాని, రహస్యంగా రావద్దన్నాను. నువ్వు తలదించుకొని వెళ్ళిపోయావు నువ్వెలాగూ మీ అమ్మని ఎదిరించలేవు. అంచేత నీకు అన్యాయం చేస్తున్నానని అనిపించలేదు. మా మేరీకి కుమార్ లాంటి భర్త దొరికితే కావలసిందేముందీ! కానీ......"
     తల్లి మాటలు పూర్తికాకుండా మేరీ అందుకుంది. "ఆ తరువాత నేను చెప్తాను. అప్పుడు కుమార్ నాతో  ఏమన్నాడంటే, "అయామ్ సారీ మేరీ! నాకిదివరకే పెళ్ళయిపోయింది. నా భార్యపైన నాకు ఎంతో ప్రేమ. నేను మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్ళి చేసుకోలేను" అన్నాడు. నాకు కుమార్ పైన కోపం రాలేదు. ఎంతో గౌరవం కలిగింది. ఆ తర్వాం నేనూ బాలయ్య పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాత. మేమంతా ఒక కుటుంబంలాగానే ఉన్నాం! నేను నీ  మీద  చూపిస్తున్న కోపం చూసి నువ్వు ఈర్ష్య అనుకున్నావు కదూ? కాదు. ఇంత చదువుకొని కొంచెం చిన్నచూపు కలిగింది నీ మీద. కాని, మీ అమ్మగారికి గుండెపోటు వచ్చినప్పుడు అర్ధమయింది, నువ్వెందుకంత సహనం చూపించావో! నీ మీద జాలీ, గౌరవము రెండూ కలిగాయి. ఝాన్సీ! ఆ ఉంగరం తీయకు. నీ కర్తవ్య మేమిటో నిదానంగా నిర్ణయించుకో."
    "ఓ గాడ్!" ఇంత సేపటికి నోరువిప్పాడు కుమార్. దిగ్భ్రాంతిలోంచి ఒక్కసారిగా తెప్పరిల్లినట్లు అతని కనురెప్పలు రెపరెపలాడాయి. అంతమందిలోనూ సంకోచంలేకుండా ఝాన్సీ దగ్గరకు వచ్చి ఆమె రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకున్నాడు.
    "అయామ్ సారీ ఝాన్సీ! ఇన్నాళ్ళుగా నీ మనసులో ఇంత సంఘర్షణ ఉందని ఊహించలేకపోయాను. అప్పుడప్పుడు నువ్వు మేరీ గురించి నా అభిప్రాయం అడుగుతోంటే నర్స్ గా అడుగుతున్నావనుకున్నానే కాని, ఈ ఉద్దేశం మనసులో పెట్టుకొని అడుగుతున్నాననుకోలేదు. అకారణమయిన నీ చికాకుచూసి ఆనాడు  ఎంతో బాధపడ్డాను. అది సకారణమని తెలుసుకొని ఈనాడు ఇంకా బాధపడుతున్నాను పూర్ ఝాన్సీ! అయామ్ రియల్లీ సారీ!"
    ఝాన్సీ మాట్లాడలేకపోతోంది. ఆనందంతో ఆమెకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా వుంది. కుమార్ ఇంకా అనునయంగా "అమ్మమాటలకు బాధపడకు ఝాన్సీ. వాళ్లు మనకంటే పై తరం మనుషులు. వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలలా ఉండవు. మనం అర్ధం చేసుకోవాలిగాని, తప్పు  పట్టకూడదు" అన్నాడు.
    ఝాన్సీ చిరునవ్వు నవ్వింది,అదే  సమాధానమన్నట్లు. ఆమె మనసుకెంతో తేలికగా ఉంది. అప్పుడు గమనించింది కుమార్ చేతులలో తన చేతులున్నట్లు. నెమ్మదిగా విడిపించుకొని" వెళ్ళొస్తాను" అని లేచింది.
    మేరీ నవ్వుతూ "ఇంక ఆ ఉంగరం తీస్తాననవుగా!" అంది.
    "ఈ జన్మలో తీస్తానని అనను" అంటూ లేచి అందరికీ నమస్కారం చేసింది. ఒక్క నిముషం తటపటాయించి శాంతమ్మ దగ్గరికివచ్చి, ఆవిడ పాదాలకు నమస్కరించి ఆవిడ విభ్రాంతిలోంచి తేరుకొనేలోగానే బయటకు వచ్చేసింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra