Home » Vasundhara » Vasundhara Kadhalu - 15

 

    "మీకు బలముంది. కానీ బలానికి తగ్గ ధైర్యమున్నట్లు లేదు" అందామె.
    ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. మరొక్కసారి ఆమెను చూశాను. ఆమె నిస్సంకోచంగా నావంక చూస్తోంది. ఆమె ముఖంలో నవ్వు తప్పితే సిగ్గు లేదు. అదే సమయంలో పాలవాడోచ్చి తలుపు తట్టాడు. అక్కణ్ణించి పరుగెత్తాను."
    "అబ్బ - అదృష్టమంటే మీదే నండీ. ఆ తర్వాత ఏం జరిగింది?" అడిగాను క్యూరియాసిటితో.
    "నిన్న రాత్రి ....నిన్న రాత్రి....ఆమెను....అనుభవించాను" అన్నాడు రంగనాధం.
    "నిజం...." అన్నాను అప్రయత్నంగా. అలా ఎందుకున్నానో నాకే తెలియదు.
    ఆ తర్వాత రోజు నాకు రంగనాధం చాలా చెప్పాడు. తన భార్యతో అన్నాళ్ళుగా కలిసి ఉంటె కలగని థ్రిల్ ఒక రాత్రి మాలతితో గడిపిన అనుభవ మిచ్చిందిట. బహుశా పరాయి ఆడదానితో గడిపితే అలా థ్రిల్ కలుగుతుందేమో అన్నాడు రంగనాధం.
    నిజమే ననిపించింది నాకు. కాస్త అలోచించి ఈ సిట్యుయేషన్ని ఎనలైజ్ చేయడానికి ప్రయత్నించాను. ఇది నాది. దేని మీద నాకు సర్వ హక్కులూ ఉన్నాయి. అని తెలిసినప్పుడు మనిషికి ఆ వస్తువు మీద అంత ఆసక్తి ఉండదు. అలా కానప్పుడు ఎక్కడ లేని ఆసక్తి పుట్టుకొస్తుంది. అందులోనూ ఆ వస్తువు మరోకరిదైనప్పుడు మరీను.
    మాలతి పరిచయం రంగనాధం ప్రవర్తన నే మార్చి వేసింది. అతనిప్పుడు ఏమాత్రమూ జిడ్డు గాడు కాదు, అదే విధంగా నేను జోడ్డు గాడి స్నేహితుణ్ణి కాదు.
    మరో విధంగా కూడా నేను జిడ్డు గాడి స్నేహితుణ్ణి కాను. ఎందుకంటె రంగనాధం పట్ల నాకిప్పుడు అసూయ కలిగి దిన దినభివ్రుద్ది చెందుతోంది. అతనిలాంటి జిడ్డు గాడిని ఓ అందమైన మాలతి వరించినప్పుడు నన్ను మాత్రం మరో మాలతి ఎందుకు వరించదు అనిపించసాగింది.
    ఈ ఆలోచన క్రమంగా నాలో వింత వింత మార్పులు తీసుకు రాసాగింది.
    నాకు చాలామంది స్నేహితులున్నారు. కుటుంబంతో సహా వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు. మా కుటుంబము వాళ్ళ ఇంటికి వెడుతుంటాం. ఎంతో ఆప్యాయంగా సరదాగా కాలం గడుపుతుండే వాళ్ళం. ఐతే ఇప్పుడు నా ఆలోచనలు మారాయి. నా స్నేహితుల భార్యల వంక నేను కొత్త రకంగా చూస్తున్నాను. వాళ్ళలో ఎవరికైనా నా పట్ల వాంఛ ఉన్నదా అని వెతుకుతున్నాను.
    రంగనాధం నాలో ప్రతిష్టించిన వ్యభిచారభావాలు నన్నొక మానసిక వ్యభిచారిని చేశాయి.
    ఐతే ఈ వ్యభిచార భావాలను ఎవరితోనో ఒకరితో చెప్పుకోవాలి. అప్పుడు గానీ నా కసి తీరదు. అందుకు నా భార్యని ఎన్నుకున్నాను. మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు తెలిసిన ఇతర స్త్రీల గురించి కొద్దిగా అసభ్యంగా మాట్లాడుతుండడం , నా భార్య శరీరావయవాల పరిమాణాలతో ఆ స్త్రీలని పోల్చడం చేస్తుండేవాడిని. ఆ పోలికలతో నా భార్యనే ఎక్కువ చేస్తుండడం వల్ల అమేఎ మాటలు కుతూహలం గానే వినేది.
    కొద్దిగా గర్వపడేది కూడా - అసలు సిసలు స్త్రీ మూర్తి తనేనని.
    ఐతే క్రమంగా నేను మితిమీరాను. ఫలానా ఆమె నన్ను చూడగానే కావాలని పైట జారుస్తుందనీ , మరో స్త్రీ ద్వంద్వార్దాలతో మాట్లాడుతుందనీ అనేవాడిని. ఐనా నా హృదయ రాణివి నీవే ననేసరికి నా భార్య గర్వపడేది.
    మనకు తెలివితేటలుండాలి కానీ ఏ మాటలకైనా ఏ రకమైన అర్ధమైనా తీయవచ్చు. స్నేహితుల ఇంటికి వెళ్ళి వచ్చాక అక్కడి స్త్రీలు మాట్లాడిన మాటలకు అర్ధాన్ని వివరించి చెబుతుండేవాడిని నా భార్యకు.
    ఈ మాటలన్నీ నా భార్య దగ్గరే ఎందుకు చెప్పుకునేవాడినంటే - మగవాడి దగ్గర ఇలాంటి మాటలు చెబితే ప్రమాదం. ఆ విన్నవాడు నా భార్య ను కూడా అలా చూసే ప్రమాదముంది. ఇలాంటి మాటలు ఆడవాళ్ళ దగ్గరే అనాలి. నాకు ఆడవాళ్ళలో ఇలాంటి మాటలు చెప్పుకునేటంత సన్నిహితులెవరున్నారు - నా భార్య తప్ప!
    క్రమంగా నా భార్య నా మాటలకు సంతోషించడం తగ్గించింది. ప్రతిదానికి క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టింది.
    "నాకు మాములుగానే ఉన్న మాటల్లో మీకలాంటి అర్ధమెందుకు కనిపించాలి? అంటే మీరు కూడా ఆ అర్దాల కోసం వెతుకుతున్నారానేగా ?" అనేది. 'ఆమె పైట జార్చినట్లూఅదీ మీ కోసమే ననీ ఎలా గమనించాను/ అసలు మీ దృష్టిలో ఉంది దోషం" అంటుండేది.
    "నా బాధ నీకేం తెలుసు. నా స్నేహితులేందరికో పరాయి ఆడదా నన్నుభవించిన థ్రిల్ లభించింది . నా ఒక్కడికే - " అంటూ ఆవేశంలో నోరు జారాను.
    అంతే ! నా భార్య కళ్ళు ఎర్రబడ్డాయి.
    "అదా సంగతి? పరాయి ఆడదాని కోసం ప్రాకులాటనమాట! ఇక ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఈవేళే పుట్టింటికి వెళ్ళిపోతున్నాను' అంది తీవ్రంగా.
    ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. అనుకోకుండా నోరు జారాను. ఇప్పుడేమనీ లాభంలేదు. అదీకాక ఇప్పటి నా మానసిక స్థితికి ఒకవిధంగా భార్య దగ్గరుండక పోవడమే మంచిదనిపించింది.
    రంగనాధం లాగే మాకూ ఒక పక్కిల్లు ఉంది. మాలతి అంత అందంగానూ ఉండే ఒక కోమలి ఉంది. ఏమో- ఎప్పుడే అవకాశం వస్తుందో ఎవరు చూడొచ్చారు.
    అందుకే - "పొతే పో!" అనలేదు నేను. అలా అంటే నా భార్య వెళ్ళదు. ఉండిపోతుంది.
    బ్రతిమాలడం మొదలుపెట్టాను. తను లేకపోతె ఒక్క క్షణం కూడా గడవదన్నాను. తనను పెళ్ళి చేసుకున్నాకే నా జీవితానికో అర్ధం కనిపించిందన్నాను.
    నేను బ్రతిమాలిన కొద్ది నా భార్య చేట్టేక్కింది. చిట్టచివరకు నిస్సహాయుడిలా ముఖం పెట్టి "నిన్నెలా ఆపాలో తోచడం లేదు . ఏమీ పాలుపోవడం లేదు" అన్నాను.
    "నన్ను మీరు ఆపలేరు" అంది గర్వంగా శ్రీమతి. నేను అపదల్చుకోలేదని మాత్రం ఆమెకు తెలియదు. అందుకే ఆమె వెళ్ళిపోయింది.
    ఆరోజు రాత్రి ఏడుగంటలకు పక్కింటి కోమలి మా ఇంటికి వచ్చింది. 'అక్కగారూ, అక్కగారూ" అంటూ తలుపు తట్టింది.
    వెళ్ళి తలుపు తీశాను. "అక్కగారు లేరండీ !" అనడిగింది.
    వరస బాగానే ఉందే. అనుకున్నాను. "లేదు, ఈరోజే పుట్టింటికి వెళ్ళింది" అన్నాను. మా శ్రీమతి పుట్టింటికి వెళ్ళినట్లు కోమలికి తెలిసే ఉంటుందని నా అనుమానం.
    'అరె, అలా అర్ధాంతరంగా వెళ్ళి పోయారేమిటి. ఎప్పుడు వెళ్ళినా నాతొ చెప్పే వెళ్ళేవారు" అంటూ ఆశ్చర్యంగా నిలబడి పోయింది కోమలి.
    నేనేం మాట్లాడలేదు.
    "మీ తమ్ముడీ రోజే క్యాంపుకు వెళ్ళారండీ. ఏమీ తోచడం లేదు. ఏమైనా పుస్తకాలుంటాయోనని అడిగి తీసుకు వెడదామని వచ్చాను" అంది కోమలి.
    "దానికేముంది? గదిలోకి వెళ్ళి మీ క్కావలసిన పుస్తకాలు తీసుకోండి" అన్నాను.
    కోమలి నిస్సంకోచంగా లోపలకు వచ్చింది. అందంగా నడుచుకుంటూ డ్రాయింగు రూములోకి వెళ్ళింది. పుస్తకాలు ఎక్కడుంటాయో ఆమెకు తెలుసు. నేను గుమ్మం దగ్గరే ఉండిపోయాను కానీ, నా మనసు తీవ్రంగా పనిచేస్తోంది.
    కోమలి భర్త ఊళ్ళో లేడు. నా భార్య ఊళ్ళో లేని సమయం చూసి పుస్తకాల వంకతో ఇంట్లోకి నిస్సంకోచంగా ప్రవేశించింది. నా భార్యను అక్కా అని పిలిచి నాకు మరదలైంది. ఇప్పుడేమిటి చేయడం?
    ఐదు, పది , పదిహేను నిముషాలు గడిచినా కోమలి ఇంకా బయటకు రాలేదు.
    పుస్తకాలు తీసుకోడానికి ఇంతసే పెందుకు? ఒకవేళ ఆమె నాకోసం ఎదురు చూస్తుందేమో. తీరా వెడితే బాగుంటుందో , బాగుండదో , కానీ నాలో ఏదో తొందర చేస్తోంది. అందుకే ధైర్యం చేసి ఆ గదిలోకి వెళ్ళాను.
    నేను వెళ్ళేసరికి కోమలి ఇంకా పుస్తకాలను పరిశీలిస్తూనే ఉంది. నన్ను చూస్తూనే "వెధవది జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయిందండీ . ఏది చదివానో, ఏది చదవలేదో సరిగా గుర్తుండి ఏడవడం లేదు. ప్రతిదీ ఓ రెండు పీజీలు చదివి చూసేసరికి చదివినట్లే ఉంటోంది. మీకు తోచిన మంచి పుస్తకాలేమైనా ఉంటే ఇద్దురూ" అంది.    
    ఒక్క పిసరు హతాశుడనయ్యాను. రంగనాధం కన్నబిడ్డ లాంటి దృశ్యం చూస్తానని నేనూ ఆశపడ్డాను. కానీ అలా జరగలేదు. ఐనా కోమలి ఇంకా నా గదిలోనే ఉంది. ఆమె భర్త ఊళ్ళో లేడు. చూడాలి. నా అదృష్ట మెలాగున్నదో.
    నేను వెళ్ళి పుస్తకాలు వెదకడం మొదలు పెట్టాను. ఆమె కూడా నా పక్కనే ఉండి పుస్తకాలు వెదుకుతోంది.
    నిజం చెప్పాలంటే మేమూ, కోమలి దంపతులూ ఏక కుటుంబంలా కలిసి ఉంటున్నాం. ఇద్దరిలో ఎక్కడా అరమరికలు లేవు. ఇదివరలో కూడా చాలాసార్లు నా దగ్గరకు కోమలి చనువుగా వచ్చింది.
    ఐతే అప్పట్లో నా దృష్టి వేరు కాబట్టి ఆమె పైన దురభి ప్రాయం లేమీ కలుగలేదు. కానీ ఈరోజు చెప్పలేని ఆవేశం కలుగుతోంది. ఆమెకు దగ్గరగా లాక్కుని గట్టిగా కౌగలించుకోవాలని పదేపదే అనిపించసాగింది. కానీ అలా చేయలేక పోతున్నాను. పుస్తకాలు వెతుకుతున్నానన్న మాటే గానీ, ఏం చూస్తున్నానో నాకే తెలియదు.
    అలా ఐదు నిముషాలు గడిచేక చేతికి తోచిన పుస్తకాలు రెండు తీసి ఆమెకు ఇచ్చాను.
    రెండు పుస్తకాలనూ పరీక్షగా చూసి, పేజీలు  తిరగేసి "చాలా థాంక్సండీ. ఇవి నేను చదవనివే" అంటూ ఆమె వెనుదిరిగింది.
    "వెళ్ళిపోతున్నావా కోమలీ" అనుకున్నాను మనసులో.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra