Home » Mainanpati bhaskar » Daimond Raja Aathin Rani

 

    ఎంతో సిన్సియర్ గా ధ్వనిస్తున్న ఆ మూడు మాటలకి చలించి పోయి, అతని మొహంలోకి ఆర్తిగా చూసింది మీనాక్షి.


    "ఐ ట్రూలీ అండ్ సిన్సియార్లీ లవ్ యూ!" అన్నాడు రాజా మళ్ళీ.


    "కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు" అంది మీనాక్షి.


    "ఎందుకని?" అన్నాడు రాజా.


    "ఎందుకంటె - " నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోదలుచుకున్నాను."


    దెబ్బతిన్నట్లు చూశాడు రాజా.


    "ఎందుకంత కఠినమైన నిర్ణయం?"


    "నా లైఫ్ అంతా సోషల్ సర్వేస్ కి అంకితం చేయదలుచుకున్నాను" అంది మీనాక్షి.


    "ఓహ్!" అని మౌనంగా వుండిపోయాడు రాజా.


    కొద్దిక్షణల మౌనం తర్వాత మళ్ళీ అతనే నెమ్మదిగా అన్నాడు.


    "అలా అయితే మన ఇద్దరికీ చాలా విషయాల్లో ఏకాభిప్రాయం వున్నట్లే."


    "అదెలా సాధ్యం?" అంది మీనాక్షి ఆశ్చర్యంగా.


    "నీలాగే నేను కూడా నా మొత్తం జీవితాన్ని సోషల్ సర్వీస్ కే అంకితం చేసేయదలుచుకున్నాను. " అన్నాడు రాజా.


    చురుగ్గా చూసింది మీనాక్షి.


    "ఎందుకని అలా?" అంది చిన్న గొంతుతో.


    "ఎందుకంటె - నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోదలుచుకున్నాను. మరి నువ్వేమో ఆ జన్మ బ్రహ్మచారిణిగా వుండిపోదలుచుకున్నావు. అందుకని అటోమేటిక్ గా ఇంక నేనూ బ్రహ్మచారిగానే ఉండిపోక తప్పదు!" అన్నాడు భీష్మప్రతిజ్ఞ చేస్తున్నట్లు.


    వింటుంటే విలవిల్లాడిపోయింది మీనాక్షి మనసు.


    ఇంకా అన్నాడు రాజా.


    "నాకు సోషల్ సర్వీస్ అంటే మొదటి నుంచి కూడా ప్రాణమే! ఇప్పుడు నీకు కూడా సోషల్ సర్వీస్ అంటే ఇష్టమని తెలిసింది. గనుక ఇకనుండి సోషల్ సర్వీసె నాకు పంచప్రాణాలునూ!" అని ఆగి, "అందుకే మనిద్దరం ఒకచోటే, ఒకటిగా కలిసి ఉండాలి." అన్నాడు.


    ఎందుకని?" అంది మీనాక్షి అయోమయంగా.


    "మనిద్దరం కలిసి సోషల్ సర్వీస్ చెయ్యాలి. నువ్వు కాదనకుండా నా దగ్గర ఉద్యోగంలో చేరాలి. నా అసిస్టెంట్ గానో, సెక్రటరీగానో, మేనేజర్ గా, చీఫ్ ఎగ్జిక్యూటివుగానో, ఎనీ కెపాసిటీ - నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉండాలి.


    సరోజ లాంటి అభాగ్యులు ఈ దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. వాళ్ళని మనం ఆదుకోవాలి! ఏమంటావు?" అన్నాడు .


    అదే సమయంలో .........


    ఇంకో ప్రదేశంలో -


    జస్వంతరావుకి -


    నింగి నేలా ఏకమైపోయేటట్లు చేయగల మహాశక్తివంతమయిన సమాచారం ఒకటి తెలిసింది!


    తన దగ్గర ఉద్యోగంలో చేరమని ఆఫర్ చేసినా కూడా , మీనాక్షి ఇంకా తటపటాఇస్తూనే వుండడం చూసి డైమండ్ రాజా అన్నాడు.


    "నిన్నం మనం చూశాం కదా - "ఇది దొంగ" అని నుదుటి మీద పచ్చబొట్టు పోడిపించుకోబడ్డ సరోజ స్థితి - అలాంటివాళ్ళు ఊరికి నూరుమంది ఉంటారు మీనాక్షి - వాళ్ళందరి కోసం నాకు చేతనయినది నేను చేయదలుచుకున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా వెయ్యి ఉన్నాయి నా మనసులో !"


    సరోజ స్థితికి రాజా గుర్తు చేయగానే ఒక్కసారిగా గుండె నీరయిపోయినట్లు అయింది మీనాక్షికి.


    అందుకని ఇంక అట్టే ఆలోచించకుండానే - "సరే! మీ దగ్గర ఉద్యోగంలో చేరడానికి నాకేం అభ్యంతరం లేదు" అంది .


    తేలిగ్గా నిట్టూర్చాడు రాజా.


    "అయితే నువ్వు వెంటనే డ్యూటీలో జాయినవవలసి వుంటుంది" అన్నాడు నవ్వుతూ.


    తను కూడా చిరునవ్వుతోనే చెప్పింది మీనాక్షి.


    "ఒక్కరోజు జాయినింగ్ టైము కావాలి నాకు - రేపు వచ్చి చేరతాను."


    "ఇట్సాల్ రైట్! నేను వెళ్ళేముందు ఒక్కసారి మీ అమ్మగారిని పలకరించి వెళ్ళనా?" అన్నాడు రాజా.


    "అమ్మ నిద్రపోతూ వుండవచ్చు. తనకి రాత్రిళ్ళు నిద్రపట్టదు. తెల్లవార్లు ఝామున ఎప్పుడో సొమ్మసిల్లి మగతనిద్రలోకి జారుకుంటుంది" అంది మీనాక్షి ఇంట్లోకి దారి తీస్తూ.


    ఆమె వెనకే నడిచాడు రాజా.


    అది చాలా చిన్న ఇల్లే. అయినా కూడా అతి శుభ్రంగా సర్ది వుంది.


    ఆ ఇంటిని చూస్తే చాలు అర్ధమయిపోతుంది - మీనాక్షి ఎంత పొందిక గల మనిషో!


    మీనాక్షి తల్లి వసుధ జ్వరం వచ్చిన తమలపాకులా ముడుచుకుపోయి పడుకుని వుంది. ఒక్కక్షణం తదేకంగా ఆమె వైపు చూసి తర్వాత శ్రద్ధాసక్తులతో ఆమె పాడాలని స్పృశించి తలుపు దగ్గరికి నడిచాడు రాజా.


    తలుపు దగ్గరికి రాగానే "ఇంక వుండనా?" అంది మీనాక్షి . ఆమె గొంతులో స్నేహభావం ధ్వనిస్తోంది.


    "రేపు తప్పకుండా రావాలి!" అని మళ్ళీ ఇంకోసారి చెప్పి, వచ్చి కారులో కూర్చున్నాడు రాజా.

 

                                                 * * *


    రాజా పాలెస్ కి తిరిగి వచ్చేసరికి -


    అక్కడంతా కార్నివాల్ అట్ మాస్ ఫియర్ కనబడుతోంది!


    అక్కడ ఏనుగులూ వున్నాయి.


    ఒంటెలు వున్నాయి.


    గుర్రాలు వున్నాయి.


    భల్లూకాలు వున్నాయి.


    పులులు, సింహాలు కూడా వున్నాయి.


    బనీను వేసుకుని వున్న ఒక చింపాంజీ వుంది. దాని బనీను మీద "రోమియో " అన్న పెద్ద అక్షరాలు స్టెన్సిల్ చేసి వున్నాయి. పుల్ యునిపారంలో వున్న రాజభటులు వేలాదిమంది బారులు తీరి నిలబడి ఉన్నారు.


    అక్కడ ఏం జరుగుతుందో ఉహించడానికి అరనిమిషం పట్టింది రాజాకి.


    జరుగుతున్నదేమిటో అర్ధం అయ్యాక , చిన్నగా నవ్వుకుంటూ కారు దిగి , అక్కడే ఉన్న చిన్న గోడ లాంటి దానిమీద అరామ్ గా కూర్చుని చూడడం మొదలెట్టాడు.


    ఈలోగా ..


    "ఫీల్దు.....పీల్డు" అనే కేకలు వినబడ్డాయి.


    కొద్దిక్షణాల దాకా అర్ధం కాలేదు రాజాకి. ఆ కేకలు తనని ఉద్దేశించినవి.


    అతనికి అర్ధం అయఎలోపలె, ఒక మహాకాయుడు చేతిలో కర్ర పట్టుకుని రాజా కూర్చున్న వేపే పరిగెత్తి వచ్చాడు.


    "ఫీల్దు .....పీల్డు" అన్నాడు.


    "ఏం ఫీల్దు?" అన్నాడు రాజా.


    "అరె కళ్ళు కనబడట్లేదా? ఇక్కడ సినిమా షూటింగు జరుగుతోంది. నువ్వు కూర్చున్న [ప్లేసు కెమెరాలో కనబడుతుంది. ఫీల్దు అంటే అదీ! ఇక్కడ నుంచి లే!" అన్నాడు మహాకాయుడు మొరటుగా.


    "ఎవరిని అడిగి షూటింగు చేస్తున్నారు ఇక్కడ -? అన్నాడు రాజా.


    "అడగాల్సిన వాళ్ళని అడిగాం లేవోయ్!" అన్నాడు మహాకాయుడు మొరటుగా. తన ఎదురుగా కూర్చున్నది ఆ పాలెస్ కి చెందిన రాజా రాజశేఖరసింహా అని అతనికి తెలియదు. అందుకే అన్నాడు. "నువ్వే ఈ పాలెస్ కి రాజవైనట్లు ఫోజు కొడుతున్నవే మహా!"


    మాట్లాడకుండా భుజాలు ఎగరేశాడు రాజా.


    "అరె! చింపాంజీలాగా గోడమీద కూర్చున్నావు! దిగు దిగు ! ఫీల్దు!" అన్నాడు మహాకాయుడు.


    రాజా కదలలేదు. మెదలలేదు.


    మహాకాయుడివైపు ఎగాదిగా చూస్తూ "నీ పేరేమిటి?" అన్నాడు.


    "భైరవన్" అన్నాడు మహాకాయుడు.


    "ఇక్కడేం చేస్తుంటావ్?" అన్నాడు రాజా.


    "నేనా? నేను మెగా ప్రొడ్యుసర్ నటరాజన్ కి రైట్ హాండ్ ని! దిగు ఫీల్దు!"


    ఎక్కడలేని నీరసం అభినయిస్తూ అన్నాడు రాజా.


    "ఆన్ణా! భైరవన్ణా! నేను అర్భకుడిని! కూర్చుంటే లేవలేను - లేస్తే కుచోలేను! అనేమియా దగ్గర్నుంచి అన్ని జబ్బులూ నాకు ఉన్నాయి. ఈ గోడ దిగడానికి కాస్త సాయం చెద్దూ!" అన్నాడు దీనంగా గొంతు పెట్టి.


    సినీవిలన్ లా వికటాట్టహాసం చేశారు భైరవన్.


    "ఓరి అర్భకన్! నేను శాండోని! గట్టిగా చెయ్యి వేశానంటే నీ ఎముకలు పటపటమని విరిగిపోయాయి. ఎట్లా గొట్లా నువ్వే ఓపిక చేసుకుని దిగు!" అన్నాడు.


    భైరవన్ అట్లా అనగానే , కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు రాజా. తర్వాత దిగులుగా అన్నాడు. "లాభంలేదు! ఎవరన్నా దింపాల్సిందే నన్ను!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra