Home » Dr c. ananda ramam » Velugubata


    హరిజన బాలబాలికలకు, ఉచిత భోజన, వైద్య సదుపాయాలతో ఒక పాఠశాల నిర్మించాలనే ఆలోచన వచ్చింది. పురప్రముఖులకి ఆ పాఠశాల శంఖుస్థాపనకోసం అట్టహసంగా వచ్చాడు. పూలమాలతో స్వాగతం పలికిన తరువాత యం.యల్.ఏ. మేళతాళాలతో మహా వైభవంగా శంఖుస్థాపన జరిగింది. మెడలో పూలదండలతో ఫోటోలుకూడా దిగారు. ఆ తరువాత విశ్రాంతికోసం విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. అక్కడ అభిమానులూ, ఆశ్రితులూ చుట్టూ చేరారు. లోకాభిరామాయణం ప్రారంభమయింది. ఆ  మాటల మధ్య, ఝాన్సీ కుమార్ లు వేరువేరుగా ఉంటున్నారని యమ్మేల్యేగారికి తెలిసింది. సోఫాలో దిండునానుకుని కూర్చుని కులాసాగా కబుర్లు వింటున్న ఆయన ఒక్క సారిగా నిటారుగా కూచున్నారు ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి మనసులో ప్రతీకారజ్వాల రగిలింది.
    ఝాన్సీ తనకు లొంగకుండా తన మర్యాద తాను కాపాడుకొందని ఆయమ్మెల్యేగారి కెప్పుడూ అనిపించలేదు. ఝాన్సీ తననేదో మోసం చేసినట్లు భావించి మండిపడుతున్నాడాయన. అందుకు ప్రతీకారం తీర్చుకోవటానికి మంచి అవకాశం దొరికింది.ఆ మరునాడే, ఝాన్సీ కుమార్ లు భార్యా భర్తలు కారనీ, వారు కలిసి ఉండటం లేదనీ, దొంగ సర్టిఫికేట్ తో ప్రభుత్వాన్ని మోసగించి ఝాన్సీ ఉద్యోగం సంపాదించుకొందనీ, ఈ  కారణాలవల్ల ఆమెమీద చర్య ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇచ్చుకోమంటూ ఆమెకు షోకాజ్ నోటీస్ పంపాడు ఆ నోటీస్ అందుకొన్న ఝాన్సీకి చిత్రంగా కలగవలసినంత బాధ కలగలేదు. బాధలేదు సరికదా, ఏదో సంతృప్తి కలిగింది. తప్పనిసరిగా మోస్తున్న ఏదో భారం నుండి విముక్తి కలిగిన సంతృప్తి- ఆ నోటీస్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి, తల్లి వంట ముగించి తనకోసం ఎదురు చూస్తోంది. వడ్డించటానికి శ్రమపడవద్దని ఎంత చెప్పినా వినదు. అప్పటికప్పుడు పదార్ధాలు వేడిచేసి మరీ వడ్డిస్తుంది. ఆ తల్లి ముఖంలోకి చూస్తే కొంచెం సేపు జాలికలిగింది. ఈ అనారోగ్యపు తల్లీ, మొగుడొదిలేసిన బిడ్డతల్లి అక్కా, చదువుకుని వృద్ధిలోకి రావలసిన తమ్ముడూ, చెల్లెలూ అందరూ తన మీద ఆధారపడి ఉన్నారు. తన సంపాదన లేనినాడు.... ఆలోచించదలుచుకోలేదు. తల్లి చెప్పే  మాటలకు పరధ్యానంగా ఊకొడుతూ భోజనం ముగించింది. ఇంగ్లీష్ పుస్తకాలు ముందేసుకుని చిన్న పిల్లలా చదవటాని ప్రయాసపడుతున్న అక్కని చూస్తే జాలీ నవ్వూ రెండూ కలిగాయి.
    ఆ మరునాడు బుట్టలోంచి పాము బయటికి వచ్చినట్లు అసలు విషయం బయటికి వచ్చింది. టైమయిపోయినా, ఆస్పత్రికి వెళ్ళకుండా చదువుకొంటూ కూర్చుంది ఝాన్సీ అచ్చమాంబ సంకోచిస్తూ భయం భయంగాను చూస్తూ "నువ్వు ఆస్పత్రికి వెళ్ళవా?" అని అడిగింది చేతిలో పుస్తకం మూసి తల్లివైపు చూసింది ఝాన్సీ. ఆ ముఖం చూస్తోంటే ఎంత జాలిగా ఉన్నా,  అసలు విషయం చెప్పక తప్పదు  తల్లికి షాక్ లా రాకుండా నిదానంగా చెప్పాలి. "అమ్మా! అసలు నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో, తెలుసా? అసలిది వెనుకబడి తరగతులకు కేటాయించింన్ ఉద్యోగం నాకు రావలసింది కాదు" అయోమయంగా చూసింది అచ్చమాంబ. ఝాన్సీ ఒకసారి గొంతు సర్దుకుంది.
    "కుమార్ నేనూ కలిసి చదువుకున్నాం. అతనికి మన ఇంటి పరిస్థితులు తెలుసు ఉద్యోగంకోసం నేను పడుతున్న పాట్లు తెలుసు. అందుకని ఈ ఉద్యోగంలో నన్ను వెయ్యటం కోసం, ఊరికే లాంఛనంగా రిజిస్టర్ పెళ్ళి చేసుకుని ఆ సర్టిఫికేట్ తో ఈ ఉద్యోగం ఇప్పించాడు. కానీ...." ఝాన్సీ మాట్లాడుతుండగానే,"ఆఁ!" అంది అచ్చమాంబ పాలిపోతున్న ముఖంతో -దిగ్ర్భాంతితో-ఝాన్సీ చటుక్కున తల్లి చెయ్యి పట్టుకుని తన పక్కన కూచోబెట్టుకుని, మంచి నీళ్ళు త్రాగించింది "అమ్మా! నువ్వు కంగారు పడకు. గాభరాపడకు- కానిపనేదీ నేను చెయ్యలేదు నిజంగానే  మాన కుటుంబం పరిస్థితులనుబట్టి ఉద్యోగానికి ఒప్పుకున్నానే కాని, ఒక్కనాడైనా అతడితో హద్దుమీరి ప్రవర్తించలేదు. ఎంతో కష్టపడి వంటలుచేసి నన్ను చదివించిన కన్నతల్లి మనసుకి కష్టం కలిగించే కృతఘ్నురాలినికాను అతనికీనాకూ ఏ సంబంధమూ లేదు. అతడు మేరీని పెళ్ళి చేసుకోబోతున్నాడు" అంది. ఈ చివరి మాటలంటున్నప్పుడు ఎంత నిగ్రహించుకున్నా, ఝాన్సీ కంఠం వణికింది. అది అచ్చమాంబ దృష్టిని దాటిపోలేదు. అయితే ఝాన్సీ భయపడినట్లు అచ్చమాంబకు షాక్ లాంటిదేదీ రాలేదు స్పష్టంగా పైకి అనకపోయినా, ఇలాంటిదేదో, ఆవిడ అంతరంగం చాలా రోజులుగా వూహిస్తోంది.
    "ఎంతయినా, ఒకసారి పెళ్ళయిందని తెలిసాక, నిన్నెవరు చేసుకుంటారు?" దిగులుగా అంది.
    తల్లి ఆలోచనా సరళికి, లోలోన నిట్టూర్చింది, ఝాన్సీ- అక్కడికి తాను మరొకరిని పెళ్ళిచేసుకోవటానికి రెడీగా ఉన్నట్లు.....
    "అయితే ఇప్పుడు నీ ఉద్యోగం పోతుందా?" ఆందోళనగా అడిగింది.
    తల్లికి గుండెనొప్పి రాకపోవటంతో, పరిస్థితి మామూలుగా తీసుకోవటంతో, ఝాన్సీకి ధైర్యం వచ్చింది. ఒక రకమైన మొండితనమూ వచ్చింది.
    "ఆఁ! ఉద్యోగం తప్పకుండా వూడిపోతుంది ఆ పైన చర్యకూడా తీసుకోవచ్చు" తాపీగా చెప్పింది.  భయంతో పాలిపోయిన తల్లిముఖం చూస్తోంటే, ఆందోళనకు బదులు ఆనందమే కలిగింది. అచ్చమాంబ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. చివరకు మాటలు కూడదీసుకొంటున్నట్లు "పోనీలేవే! జరిగిందేదో జరిగిపోయింది. అయినా పెళ్ళిని కాదనట దేనికి? అతడూ నువ్వూ మామూలుగా కాపురం చేస్తే ఈ గొడవలన్నీ సర్దుకుపోతాయేమో" అనేసింది. ఝాన్సీ మనసు  రగులుకుపోయింది. కాళికలాగ లేచింది "అమ్మా! మీరు చెప్పే కులభేడాలు నాకు సరిగ్గా తెలియవు- కానీ, నా దృష్టిలో నా కులం  కుమార్ కులంకన్న హీనమయినది ఎందుకంటే, వాళ్ళలో ఉన్న నిజాయితీ  మనలో లేదుగనుక. కుమార్ కి భార్యననిపించుకొనే అర్హత నాకులేదు రాదు."
    తన మాటలకు ఝాన్సీ పొంగిపోతుందనుకున్న అచ్చమాంబ ఈ ధోరణికి తెల్లబోయింది. అసలు కుమార్ తో కలిసి ఉండమని ఆనటం, ఆవిడ జాలితో, ఏదో అనుగ్రహిస్తున్నట్టుగా అంది. ఝాన్సీ కోపానికి, ఆవిడ గుండెలు దడదడ లాడాయి.
    "పెద్దదిచూస్తే అలాగ.....నువ్వుచూస్తే ఇలాగ......" అంది కన్నీళ్ళతో. ఆ కన్నీళ్ళకు ఝాన్సీ మనసు కరగలేదు. ఎందుకంటే, అంత జరిగాకకూడా అక్క ఆ శాస్త్రితో వెళ్ళటమే మంచిదని అభిప్రాయపడింది తల్లి. "భార్యా భర్తల మధ్య తగవులు శాశ్వతమా ఏమిటి? ఇంతకంటే  ఘోరంగా ప్రవర్తించినవాళ్ళే తర్వాత కలిసి మెలిసి ఉండటం ఎన్ని సందర్భాల్లో చూడలేదూ" అంది. "పాకీమనిషితో కాపురం చేసినందుకు ప్రాయశ్చత్తం చేసుకుంటే సరి" అని తరుణోపాయంకూడా చెప్పింది. కానీ, చిత్రంగా నాగమాంబ తనే ఎదురుతిరిగింది. ఎప్పుడూ 'నా కాపురమో' అని ఏడ్చే వ్యక్తి మొగుడి  విదిలి పులన్నీ అతి భక్తితో సహిస్తూసకల  సేవలూ చేసే వ్యక్తి, "ఇతనితో కాపురం చేసేకంటే, అడుక్కుతింటాను" అనే దశకు వచ్చిందంటే, ఆ మనసు ఎంతగా చితికిపోయి ఉండాలి?
    తల్లిని దుర్మార్గురాలని నిందించలేదు. కాని, నరనరానా జీర్ణించుకుపోయిన ఆ యాంత్రిక సాంప్రదాయతత్వం పోవాలంటే మాటలా? వీధిలోంచి "ఝాన్సీ!" అనే పిలుపు వినిపించింది. కొద్దిగా సౌకుమార్యమూ, అంతకు మించిన ధీరత్వమూ ఈ రెంటినీ మించిన ఆప్యాయతా, రంగరించుకొన్న ఆ ధ్వని వింటేనే నిలువెల్లా పులకించిపోయింది సర్వమూ మరచి ఒక్క అంగలో వీధి గుమ్మంలోకి వచ్చేసింది. కుమార్ ముఖంలో ఎప్పటి చిరునవ్వులేదు. కళ్ళలో ఆందోళన తొంగిచూస్తోంది.
    "ఝాన్సీ! నీకు షోకాజ్ నోటీస్ వచ్చిందా?"
    "నీకూ తెలిసిందా?"
    "వాటిజ్ దిస్ వెంటనే నా కెందుకు చెప్పలేదూ? పోనీ, ఇప్పుడైనా మా ఇంటికొచ్చెయ్యి. ఈ గొడవలు తగ్గేవరకూ భార్యభర్తలుగా నట్టిద్దాం!" ఈ మాటలకు ఆనందం కలగలేదు ఝాన్సీకి "భార్యాభర్తలుగా నటిద్దాం!" అనే మాట మనసుకు శూలంలా గుచ్చుకుంది.
    "ఏమిటి? నీకు భార్యలా నటించాలా? ఒకప్పుడు ఉద్యోగం కోసమే నిన్ను పెళ్ళి చేసుకున్నాననేకదూ నీ కింతలోకువ? ఇప్పుడుకూడా ఉద్యోగం కోసం నీకు భార్యగా 'నటిస్తానని' గట్టి నమ్మకం! అందుకే ఇలా అడగగలుగుతున్నావు కుమార్! కచ్చితంగా చెప్తున్నాను విను, నీకు భార్యగా "నటించవలసిన అవసరం నాకు లేదు నేనెవరినో తెలుసా? బ్రాహ్మణ పిల్లని! అవసరమయితే హాయిగా వంటచేసుకు బ్రతకగలను."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra