Home » Adivishnu » Adivishnu Kathanikalu


    ఎగుమతీ దిగుమతులకు సంబంధించిన ఆ వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతున్న విషయం ఆ సంస్థలో ఉద్యోగం చేస్తూన్న మావూరి వాళ్ళు చాలామంది చెప్పేరు. పశుపతి గారి వ్యాపారాభివృద్ధి గురించి అక్కడి ఉద్యోగస్తులందరి మాటా ఒక్కటేగానీనండి. వాళ్ళ ఉద్యోగ నిర్వహణ వగైరా విషయాల్లో మాత్రం భేదాభిప్రాయాలున్నాయి. దీని మూలంగా పశుపతిగార్ని చాలా రకాలుగా వూహించుకోవలసిన అవసరమెంతైనా వుంటుంది. క్లాస్ వన్ ధర్మరాజని కొద్దిమంది చెప్పేరు. వొట్టి దుర్మార్గపు మనిషని చాలామంది అన్నారు. స్వార్ధముంది గానీ, అది  ఎదటివాడిని ముంచేది కాదని కొందరి విశ్వాసం. ఏమైతేనేం పశుపతిగారు దైవ స్వరూపులు. ఒకే దేవుడు అనేకమంది కనేకరకాలుగా ఎలా కన్పిస్తాడో సాక్షాత్తు వీరూ అంతే.
    పశుపతిగారితో నాకు పరిచయమున్న మాట వాస్తవమే. స్థానికంగా ఏర్పాటు చేయబడే సంఘ కార్యకలాపాల్లో ఆయన్నాకు తారసపడ్డారు. మొదటిది (గుర్తున్నది) పట్టణ యువజన సంఘ వార్షికోత్సవంలో నేను వక్తను. ఆనాడు పశుపతిగారు మొదటివరుసలో ఓ అందమైన కుర్చీలో కూర్చున్నారు. కార్యక్రమం పూర్తయిం తర్వాత శ్రీహరితో నాకు పరిచయభాగ్యం కలిగింది. సంఘ నిర్వాహకులు పశుపతి గారికి నా గురించి అతిగానే చెప్పారు. అప్పుడాయన మందహాసం చేసి వీలు చిక్కినప్పుడు తమని తప్పక కలుసుకోవలసిందిగా కోరేరు. రెండో తడవ కాబోలు వారికి నేను కావలసిన మనిషినయ్యాను. నేను రాసిన నాటకాన్ని పురనటులు కొందరు మావూళ్లోనే ప్రదర్శించేరు. ఆ ప్రదర్శనకి సినిమా చిన్ననటులొకరు హాజరయ్యేరు. వారిదీ మావూరే. వారి పక్కకుర్చీలోనే పశుపతిగారు కూర్చున్నారు. ఆనాటి ప్రదర్శన నిజానికి రక్తికట్టిందనే చెప్పాలి. రచయితగా ప్రేక్షక మహాశయులకు నన్నానాడు వేదికమీద పరిచయం చేశారు. తదనంతరం మా పూర్వం మాస్టారొకాయన నా గురించీ, నా నాటకంలోని నటుల గురించీ ఉద్ఘాటించారు. ఆపైన పశుపతి గారు సినిమా చిన్న నటునితో నన్ను కలుసుకున్నారు. వారికి నన్ను పరిచయం చేసి ఆనక నన్నో మంచి నాటకం కొత్తది రాయమని అడిగేరు.    
    కాని, పశుపతి గారంత పట్టుదల గలమనిషని నాకానాడనిపించలేదు. సరిగ్గా వారం రోజులు గడవగానే ఓ సాయంత్రం నన్ను వారింటికి పిలిపించేరు. వెళ్ళాను.
    వారిల్లు అందంగా వుంటుంది. పాలరాతి మేడలా నున్నగా వుంటుంది. చుట్టూతా ముచ్చటైన ప్రహరీ ఒకటుంది. ప్రహరీ అంచున మనోహరమైన క్రోటన్సూ వున్నాయి. నేను వెళ్ళిన వేళకి పశుపతిగారొక్కరూ మల్లెపందిరి కింద ఓ కుర్చీలో (వాలుది ఖరీదైనది) నడుం వాల్చి పుస్తకమేదో తీరుబడిగా చదువుతున్నారు. వారినాస్థితిలో చూచినప్పుడు నేనసూయ చెందాను. ఈమనిషికింత దర్జాని. ఇంత ఆనందాన్ని నిష్కారణంగా ఆ భగవంతుడేల అనుగ్రహించేడాని బాధపడిపోయేను.
    తిన్నగా వెళ్ళి నే నాయనక్కొంచెం దూరంలో నించున్నాను. నేనొచ్చినట్టు పశుపతిగారు గమనించలేదు కాబోలు కాని వారి కుక్క గమనించి మేడమీంచి అరిచి గోలపెట్టేసింది. పశుపతిగారు పుస్తకాల్ని తొలగించి నన్ను చూచిన మీదట చిన్న హసరేఖ పెదాలమీదుగా వెలిగించి, వారి కుక్కని మందలించేరు.
    కుక్కనోరుమూసుకున్నది.
    ఆయన నన్ను కూర్చోమన్నట్టు నటించేరు. అక్కడే ఖాళీగా ఉన్న మరో కుర్చీలో వినయంగా కూర్చోవాలనుకున్నాను గాని, కుదరక చాలా మామూలుగానే కూర్చున్నాను.
    వంటమనిషో, పనిమనిషో తెలియదు గానీ ఒకతను కాఫీలు పట్టుకొచ్చి మాకందించేడు ఇక మరి తాగవలసినదిగా తలతో తెలియజేసి వారమ్మాయిని పిలిపించేరు. ఎందుకలా అనవసరంగా ఆ పిల్లని పిలుస్తున్నారో అర్దమయింది కాదు. వారమ్మాయి దాదాపు నాట్యం చేస్తున్నట్టు వొస్తూ,దార్లోనే ఓ నమస్కారం పారేసి, వొచ్చి మరో కుర్చీలో కూర్చుంది.
    ఈ అమ్మాయి నింతకంటే చిన్నతనంలో నేనెన్నోసార్లు చూసేను. ఆడపిల్లలు సైకిలు తొక్కడమనే విద్యని హర్షించలేని వూరు మాదికాదుగాని, విడ్డూరంగా చూచూ మానవులు నాతోపాటు చాలామంది మా వూళ్ళో వున్నారు. పశుపతిగారమ్మాయి సైకిల్మీద సాయం సమయాల్లో అలా ఆ తార్రోడ్డువెంట షికారుకొచ్చేది. వెనగ్గా ఓ బంట్రోతు నురగలుకక్కుతూ, రొప్పుతే వొచ్చేవాడు. అప్పుడు నాకా అవస్థంతా చిత్రంగాకనుపిస్తూండేది. అందుచేత పశుపతిగారమ్మాయిని నేనీ జన్మలో మరిచిపోలేను.
    "శకుంతల మా అమ్మాయి. బియస్సీ చదువుతోంది. వీళ్ళమ్మ చదువింక కట్టేయమంటుంది. నేనుమొ మెడిసిన్ చదివిద్దామంటాను. శకుంతలేమో సినీమాల్లో చేరతానంటుంది. ఇదండీ మా కథ!" అన్నాడు పశుపతి.
    నేను చాలా కథలు రాశాను. కొన్ని నిజమైన కథలూ  రాసేను. కాని పశుపతిగారు చెప్పిన కథ నాకు నచ్చలేదు. నన్నడుగుతే దానికి కథనే పేరు తగదని చెప్తాను.
    పశుపతిగారి మాటలకు శకుంతల సిగ్గుపడినట్లే కనిపించింది. మరి తనకున్న రెండు జడలల్లో ఓ జడని ముందుకు లాక్కుని రెండు చేతల్తో ఆ జడని అల్లుతూంది.
    కాసేపలా జరిగిం తర్వాత పశుపతిగారు వారి అసలు, ఉద్దేశాన్ని బహిరంగం చేశారు.
    "మీరు మంచి నాటకాలు రాస్తారని నాకు తెలుసు. మరేం లేదు. మాశకుంతల సినీమాల్లో చేరాలనే ఉబలాటాన్నితండ్రిగానేను కొట్టిపారేయలేకపోతున్నాను. మీరు ఓ బ్రహ్మాండమైన నాటకం రాయండి. దాన్లో శకుంతలకి మంచి పోర్షను ఎంచండి. అయ్యిందా ఈ నాటకాన్ని నా సొంత ఖర్చులమీద అటు మదరాసూ, ఇటు హైద్రాబాదు రెండూళ్ళలోనూ ప్రదర్శించే ఏర్పాటు చేస్తాను. నాటకం మాత్రం చాలా బాగుండాలి. పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు, నటులు వగైరాలను ప్రదర్శనకి పిలిపించే బాధ్యత నాదే. అదృష్టం బాగుంటే అమ్మాయికి సినిమాల్లో ఛాన్సు దొరకొచ్చు. అంతేకాకుండా నాటక రచయితగా మీక్కూడా ఏదైనా ప్రయోజనమూ వుండొచ్చు. ఆలోచించండి."
    నేనాయన పథకాన్ని విని తెల్లబోయాను. ఇంతకు మునుపు నాతో యెవరూ ర్ర్ ప్లానుని చెప్పలేదు. పశుపతి గారి తెలివి అమోఘం. మధ్యలో నాగ్గూడా ఇంత 'ఆశ' మేతపెట్టారు. కానీ, చాలాబాగా నచ్చే కొత్తనాటకాన్ని నేనెంతకాలంలో రాయగల ననేది మొదటిసమస్య. ఆ రాసిన నాటకం ఈయనగారి కెంత నచ్చుతుందనేది ముఖ్యమైన రెండో సమస్య. అందుచేత నేనప్పుడాయనకి యేవిధమైన హామీ యివ్వలేకపోయాను.
    నేను వారింటినుంచి తిరిగొచ్చిన నాటినుంచీ నేటివరకూ నేను నాటకం రాయనూ లేదు. ఇప్పటికొచ్చి నేనాయనక్కనిపించనూలేదు. అలాంటప్పుడీ సమయంలో సంగమేశ్వరరావు ఉద్యోగం నిమిత్తం మళ్ళీ నేనాయన్ని చూడవలసి వస్తే నా గొంతుక్కి ఉరి పడేమాట ఖాయం. పోనీ, నేనేదైనా నాటకం రాసివుంటే ఆ సందర్భంగా ఆయన్ను కలుసుకోవచ్చు. నేనీ మధ్య అస్సలేమీ రాయటం లేదు. గనుక ఇక వార్ని కలుసుకోడమనే మాట తీసిపారేశాను.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra