Home » Mainanpati bhaskar » Claimax

ఇప్పుడు తన విషయంలోనూ అదే జరుగుతొందన్నమాట!
తనవి నాలుగు పిక్చర్స్ ప్లాప్!
ఐదో పిక్చరుకి ఓపెనింగ్స్ అనుమానంట.
ఈ హరీన్ పిక్చర్స్కి ఓపినింగ్స్ అనుమానమా?
ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? తెలుసుకుందామన్నా మాట్లాడదామన్నా ఎవరూ కనబడరేం?
ఏరీ తన నిర్మాతలు?
ఏరీ తన పంపిణీదారులు?
తనని రాత్రింబవళ్ళు వదలకుండా కనిపెట్టుకు ఉండే మిత్రులంతా ఏరీ? ఎవరూ కనబడరేం?
వేదాంతంతో కూడిన చిరునవ్వు వచ్చింది హరీన్ పెదిమలమీదికి.
రిపోర్టర్ ధనుంజయ్ హరీన్ తో మాట్లాడి పక్కకి తోలగాగానే జనాన్ని నెట్టుకుంటూ వచ్చి హరీన్ ని వాటేసుకుంది మధుమతి. వెంటనే ఆమె చేతికి చిక్కటి రక్తం తగిలింది.
అది చూసి గాభారాగా అంది కరుణ. "ఆయన వీపులో బాణం దిగబడింది. తక్షణం హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి."
అప్పుడు మొదటిసారిగా కరుణని గమనించింది మధుమతి. "ఓహో..........అయితే నువ్వేనన్నమాట మా హరీన్ కి కొత్త హీరోయిన్ వి!" అంది సన్నగా నవ్వుతూ. "నిన్ను రక్షించడానికే కదూ హరీన్ నదిలోకి దూకేసింది?"
మొహమాటంగా తల దించుకుంది కరుణ.
తెరలు తెరలుగా మైకం కమ్మేస్తున్నట్లు అనిపిస్తోంది హరీన్ కి. వెంటనే హాస్పిటల్ కి తరలించారు అతన్ని. హాస్పిటల్ బెడ్ మీద పడుకోగానే పూర్తిగా స్పృహ కోల్పోయాడు హరీన్.
అలా స్పృహ లేని స్థితిలోనే ఒకరోజంతా ఉండిపోయాడు అతను. అతనికి సపర్యలు చేస్తూ అక్కడే వుండిపోయింది కరుణ కూడా. మధుమతికి ఉటీలో షూటింగు ఉంది. ముప్పయ్ మంది నటీనటులు కలుస్తున్న భారీ సన్నివేశం అది. మానడానికి వీలులేదు. అందుకే కరుణకే వెయ్యి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది మధుమతి.
హరీన్ కి పక్క బెడ్ మీద మరో పేషెంటు ఉన్నాడు. చాలా వ్రుద్దుడిలా కనబడుతున్నాడు అయన. అయన కూడా స్పృహలో లేడు. గురకలా వస్తోంది శ్వాస ఆయనకి.
అతనే విశ్వనాధం అనీ, తన తండ్రికి హత్య చేసిన హంతకుడనీ తెలియదు కరుణకీ. తెలిసి వుంటే ఆమె అంత శాంతంగా ఉండగలిగేది కాదు.
విశ్వనాధం వైపు జాలిగా చూసింది కరుణ. ఈ ముసలాయనకి దిక్కు దివాణం ఎవరూ ఉన్నట్లు లేదు. నిన్నటి నుంచి తను అక్కడే ఉన్నా ఈ ముసలాయన్ని చూడటానికి అయన తాలూకు వాళ్ళెవరూ వచ్చినట్లు కనబడలేదు.
కరుణ అలా అనుకుంటుండగానే, హైహీల్సు టకటకలాడించుకుంటూ అక్కడికి వచ్చింది ప్రియంవద.
నిర్లక్ష్యంగా ఒకసారి విశ్వనాధం వైపు చూసింది ప్రియంవద. ఆ తర్వాత ఆమె చూపులు హరీన్ మీద పడ్డాయి.
ఒకక్షణం సేపు తన కళ్ళని తనే నమ్మలేనట్లు అతనివైపు చూసింది ప్రియంవద. తర్వాత క్రమంగా ఆమె మోహంలో రంగులు మారాయి. అనుమానం, భయం, ఈర్ష్యా మత్సరం చోటుచేసుకున్నాయి. ఏం చెయ్యాలో తోచనట్లు నిలబడి పోయింది. "హరీన్ చనిపోయాడు పీడ విరాగడయిపోయింది' అనుకుంటున్న సమయంలో అతను తిరిగి రావడం ఆమెకి  కలవరపాటుని కలిగించింది.
ఈ భావాలన్నీ అంత స్పష్టంగా అర్ధం కాలేదు కరుణకి. అనుకోకుండా ఒక సినిమా హీరోని అక్కడ ఆ స్థితిలో చూడటం వాళ్ళ ఆమెకి సంబ్రమం కలిగిందని అనుకుని భ్రమపడింది కరుణ.
"డాక్టర్........డాక్టర్!" అని పిలిచింది ప్రియంవద ఆదుర్దాగా.
ఆమె డాక్టర్ తో ఆ ముసలి పేషెంటు సంగతి ఏమన్నా చెబుతుందేమో అనుకుంది కరుణ. ఆ సమయంలో తను అక్కడ ఉండటం సభ్యత కాదేమో నానుకుని, హరీన్ కి గప్పిన దుప్పటి సరిచేసి, బాత్ రూం వైపు వెళ్ళింది.
మగతలో నుంచి అప్పుడే కొద్దికొద్దిగా బయటపడుతున్నాడు హరీన్. అతనికి కూడా వినబడింది ప్రియంవద గొంతు. దూరంగా వున్న నూతిలో నుంచి వస్తున్నట్లు వినబడుతోంది ఆ గొంతు అతనికి. చేదు జ్ఞాపకాలు ఒక్కసారిగా మేల్కొని సుళ్ళు తిరిగాయి.
ప్రియంవద!
నాన్నగారిని వల్లో వేసుకున్న వన్నెలాడి!
అమ్మకు గుండెకోత కలిగించిన రాక్షసి!
అతని మనసు బాధగా మూలిగింది.
ప్రియంవద డాక్టరుతో అనడం వినబడుతోంది.
"అయితే ఇంకేం........తండ్రి చావు మంచం పక్కనే కొడుకు చేరడన్నమాట. డాక్టర్.......ఇంకెందుకు ఆలస్యం? తండ్రీ కొడుకులిద్దరినీ ఒక్కసారే పైకి పంపించేయ్యండి. శత్రుశేషం మిగలకూడదు!"
నవ్వాడు డాక్టరు.
"అది చాలా సింపుల్! ఇప్పటికే గాయం సెప్టిక్ అయి బాధపడుతున్నాడు హరీన్. ఇప్పుడొక ఇంజెక్షన్ ఇస్తాను అతనికి. ఇంజెక్షను ఇచ్చే ముందు సిరెంజీలో గాలి మిగలకుండా కొంత మందుని బయటికి వదిలేస్తారు - తెలుసు కదా! ఎందుకంటే సిరెంజీలో గాలి వుండి, అదిగనక మందుతో బాటు శరీరంలోకి వెళ్ళిపోతే ఆ గాలిబుడగ ప్రాణంతకంగా మారుతుంది. ఒక గాలిబుడగని హరీన్ శరీరంలోకి పంపిద్దాం. పరిస్థితి విషమించి అతను మరణించినా, ఇదీ కారణం అని ఎవరూ ఉహించరు. తగిలిన గాయం వల్లే అతను చనిపోయాడనుకుంటారు."
"ఒకవేళ ఈ చిట్కా పనిచెయ్యకపోతే?" అంది ప్రియంవద.
"అది అసంభవం. అయినా అలా జరిగితే మరో చిట్కా ఉండనే వుందిగా!"
"ఏమిటది?"
"నా చేతిమాత్రా వైకుంఠయాత్రా!"
ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు.
కొద్దిక్షణాల నిశ్శబ్దం.
సగం మగతలోనే ఆరాటం ఎక్కువయింది హరీన్ కి.
ఏం చేస్తున్నాడు డాక్టరు?
తనకి ఇంజెక్షను ఇవ్వడానికి తయారవుతున్నాడా? తక్షణం లేచి కూర్చోవాలి తను. లేకపోతే ప్రమాదం!
కానీ ఎలా?
తన ఇంద్రియాలు తన స్వాధీనంలో లేకుండా పోయాయే! అట్టే సమయం లేదు. ఎలా? ఎలా?
బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు హరీన్. కానీ కళ్ళు తెరిపి పడటంలేదు.
క్షణాలు గడిచేకొద్దీ ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది - తనకీ, తన తండ్రికి కూడా.
తన తండ్రితో తనకి బంధం తెగిపోయి ఉండవచ్చుగాక.
కానీ, ఎంతైనా అయన తనకు జన్మనిచ్చిన తండ్రి. అయన ఆపదలో ఉన్నాడని అర్ధమవుతోంది. ఆయన్ని ఆదుకోవాలి తను.
ఎలా? ఎలా? ఎలా?
మగత మెల్లిమెల్లిగా కరిగిపోతోంది.
నాన్నగారు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారంటే , మరి అమ్మ ఎక్కడ వుంది? తను కూడా నాన్నగారిని కనిపెట్టుకుని ఇక్కడే వుందా? ఉంటే తనని చూడలేదా?
లేక - చూసినా కూడా, తనమీద అసహ్యంతో మౌనంగా , తనకి దూరంగా ఉండిపోయిందా?
తమని కాదని తను చిన్నప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినందుకు అమ్మ మనసు విరిగిపోయిందా?
అలా అయితే ఇంకెప్పుడూ తనతో మాట్లాడదా అమ్మ?
తల్లి గుర్తుకురాగానే , అతని మెదడులోని గ్రేసేల్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అయినట్లు అయింది. చటుక్కున లేచి కూర్చున్నాడు హరీన్.
హరీన్ భుజాన్ని పట్టుకుని ఇంజెక్షను ఇవ్వబోతున్న డాక్టరు ఈ హఠాత్పరిణామానికి ఉలిక్కిపడ్డాడు. ఆ విసురికి అతని చేతిలోని ఇంజెక్షను సిరంజి నేలమీద పడి ముక్కలయిపోయింది.
విశ్వనాధం ఇంకా స్పృహలేని స్థితిలోనే ఉన్నాడు.
తను కోల్పోయిన శక్తి అంతా ఒక్కసారిగా తిరిగివచ్చినట్లు అనిపించింది హరీన్ కి. ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ తీవ్రంగా అన్నాడు.
"నీ ప్రయత్నాన్ని భంగం చేసినందుకు మన్నించు డాక్టర్! కానీ గుర్తుంచుకో ....." అని తన వైపు చూపిస్తూ అన్నాడు - "ఈ పేషెంటుకి గనక ఏదన్నా హాని జరిగితే, ఆ హానిచేసినవాళ్ళని ఊరికే వదలను నేను. ఆయనపోతే ఆయనతో బాటు నువ్వూ పోతావు. ఆయనకి పూర్తీ ఆరోగ్యం చేకురేలా చెయ్యి. లేదా నీ ఆరోగ్యం బాగుండదు ......ఆ తర్వాత నీ ఇష్టం!"
భయంగా తలూపి, ఒక్క గుటక మింగాడు డాక్టరు.
హరీన్ వైపు కొరకొరా చూసి, హైహీల్స్ టకటకలాడించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియంవద.
ఆమె అటూ వెళ్ళి వెళ్ళకముందే పెద్ద పెట్టున రోదిస్తూ లోపలికి వచ్చింది హరీన్ తల్లి వరలక్ష్మి.
తనకి కాపలా ఉంచిన కుక్కలని తప్పించుకురావడంతో ఆమె బట్టలు చిరిగి పీలికలయ్యాయి. కాళ్ళ గాయాలతో రక్తసిక్తములయిపోయాయి.
చూడటానికి వెర్రిదానిలా ఉంది తను.
ఆమెను చూడగానే ఆనందోద్రేకంతో "అమ్మా!" అన్నాడు హరీన్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra