Home » Merlapaka murali » Nee Meeda Manasaayaraa


    దోసిట్లో నీళ్ళను తెచ్చి ముఖం మీద చిలకరించింది. తలను కొద్దిగా పైకిలేపి- "వసంత్... వసంత్... నేను సూర్యాదేవిని..... వచ్చేశాను"
    
    అతను నిద్రలోంచి మేల్కొన్నట్లుగా కళ్ళు కొద్దిగా విప్పాడు. ఆనందం ఒక్కసారి ఏడుపై తన్నుకొచ్చింది. అలానే మెరుస్తున్న కళ్ళతో చూస్తూ వుంది.
    
    "ప్రపంచశాంతి" అన్నాడు. మరో లోకంలోంచి మాట్లాడుతున్నట్లు మాటలు చిన్నగా వినిపించాయి.
    
    "ప్రపంచశాంతి" అంది ఏడుపును ఆపుకుంటూ.
    
    "రండి - బొరుగులు తిందురుగాని" అన్నాడు వసంత్.
    
    హోటల్ లాన్ లో కూర్చుని వాళ్ళిద్దరికీ తెలియకుండా దొంగచాటుగా ఇదంతా గమనిస్తున్న ఓ వ్యక్తి కూడా పైకి లేచాడు.
    
                                                        *    *    *    *    *    
    
    సూర్యాదేవి హాల్లో చదువుకుంటూ వుండగా బయట పుస్తకాల బండి తోసుకుని వసంత్ వచ్చినట్లు తెలిసింది.
    
    "కొత్త నవలలు వచ్చాయ్ ఆలసించిన ఆశాభంగం త్వరపడండి. కాపీలు కొద్దిగా వున్నాయి రండమ్మా! రండి!"
    
    వసంత్ అరుస్తున్నది ఆమెకి విన్పిస్తోంది. కానీ ఆమె బయటికి రాలేదు ఆదివారం రోజు అతనితోపాటు ముంత కింద బొరుగులు తినడమే గొప్ప సాహసంగా తోస్తోంది.
    
    ఆమెకి ఆ సాయంకాలమంతా గుర్తొస్తోంది.
    
    అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక ఇద్దరూ బీచ్ వెంట నడవడం ప్రారంభించారు.
    
    తను అతనిని పట్టుకోవడము, ముఖానికున్న యిసుకనంతా తుడవడము, ముఖంపై నీళ్ళు చిలకరించడం- వీటినన్నిటినీ క్యాంటీన్ లాన్ లో వున్న ఓ వ్యక్తి చూడడాన్ని ఆమె గమనించింది. అతనెవరో పోల్చుకోలేకపోయింది. అచ్చం గూఢచారిలా ఉన్నాడు. నల్లటి లాంగ్ కోటు వల్ల లోపలున్న బట్టలు కనిపించడం లేదు.
    
    పెద్ద హ్యాటు పెట్టుకోవడం వల్ల ముఖాన్ని కూడా సరిగా పోల్చుకోలేక పోయింది స్త్రీనో, పురుషుడో కూడా అంతుబట్టలేదు.
    
    తనమీద ఎవరయినా గూఢచారిని పెట్టారేమోనన్న అనుమానం కలిగింది. ఆ అవసరం ఎవరికుంది? తన ప్రవర్తన సక్రమంగా వుందో లేదో తెలుసుకోవడానికి తన భర్త జగదీష్ యీ వ్యక్తిని నియమించాడా? లేక తన తండ్రి తనను రక్షించడానికి ఈ వ్యక్తిని పెట్టాడా?
    
    ఈమధ్య వసంత్ తన జీవితంలోకి చొచ్చుకు వచ్చినప్పట్నుంచీ తఃను మామూలుగా లేదు. ఏదో మార్పుంది. కానీ ఇదీ అని అంతగా గుర్తించేంత పెద్ద మార్పు కాదు. జగదీష్ లాంటివాడు యింత చిన్న చిన్న మార్పుల్ని పసికట్టేంత తెలివైనవాడూ, సున్నితుడూ కాదు. మరి తమను దూరం నుంచి పరిశీలిస్తున్న ఈ వ్యక్తి ఎవరు? లేక ఇదంతా తన భ్రమా? తమను ఎవరూ వెంబడించడంలేదేమో అవును- ఆ నల్లటి వ్యక్తి కనపడడం లేదు. వెళ్ళిపోయాడు.
    
    వసంత్ మాట్లాడడంతో ఆమె ఆ వ్యక్తిని గురించి మరిచిపోయింది.
    
    "ఆరుగంటల వరకు చూశాను. మీరు రాలేదు. మీకు చెప్పినట్లు మీ కోసం తలకిందులుగా తపస్సు చేయాలనుకున్నాను. ఇసుకనంతా చేతుల్తో తీశాను. రెండురోజులుగా భోజనం లేకుండా వుండడం వల్ల నీరసంగా అనిపించింది. కానీ పట్టు వదల్లేదు. గుంతను పూడ్చేసి, కాళ్ళు పైకి లేపాను. శ్వాస పీల్చడం కష్టమై పోయింది.
    
    మరి నేను చిన్నప్పుడు చూసిన ఆ మోళీవాడు ఎలా బతికాడో నా కర్ధం కాలేదు. గాలి రావడానికి వాడేదో అరేంజ్ చేసుకుని వుంటాడేమో. చావు భయాన్ని మరిచిపోవడానికి మీపేరు తలచుకోవడం ప్రారంభించాను. కాలాన్ని గుంత తవ్వి పూడ్చి పెట్టినట్లు కదల్లేదు. ఎంతసేపైందో, ఎన్నిసార్లు మీపేరు ఉచ్చరించానో తెలియలేదు. స్పృహ తప్పింది అంతే"
    
    "గొప్ప పనిచేశావ్ లే ఇంకెప్పుడూ ఇలా ప్రాణం మీదకు తెచ్చుకోకు. ఓ క్షణం నేను రావడం ఆలస్యం అయివుంటే ఈపాటికి ఈ అందమైన బీచ్ మీద రాబందులు తిరిగేవి" అంది. ఎందుకనో ఆమెకి అతన్ని బహువచనంతో పిలవాలనిపించలేదు. తనకంటే రెండు మూడేళ్ళు చిన్న వాడవడం కారణం కాబోలు.
    
    ఇక ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి ఇష్టం లేనట్లు "నా వ్యాపారం బాగానే వుంది. రెండు రోజులకి నలభై రూపాయల లాభం వచ్చింది. నేను బతకడానికి అంతకంటే ఎక్కువ అనవసరమనుకుంటాను. నాకేమీ ఆస్తులు సంపాదించాలని లేదు. సొంత ఆస్తి సంపాదించడానికి నేను వ్యతిరేకిని కూడా.
    
    ఫ్రెంచ్ ఫిలాసఫర్ ప్రూథాన్ చెప్పినట్లు ప్రాపర్టీ ఈజ్ థెప్ట్ ఆస్తి అంటే దొంగతనమే. హింస, దోపిడీ- వీటితోనే ఆస్తి కూడుతుంది. స్వంత ఇల్లు స్వంత కారు, స్వంత సోఫా సెట్లు, స్వంత భూమి ఈ స్వంత అనే మాటంటేనే నాకసహ్యం.
    
    ఇక నాగదిలో అంటారా? ఏవో కొన్ని బట్టలు, పుస్తకాలు తప్ప మరేం లేవు. వాటిని కూడా నా స్వంతం అనుకోవడం ఇష్టంలేకే నేనెప్పుడూ ణ గదికి తాళం వేయను. తాళం వేయడమంటే మొత్తం మానవజాతినే అవమానించి నట్లయింది నాకు."
    
    ఇదంతా వింటే జగదీష్ ఏమంటాడోననిపించింది ఆమెకి. ఇతనొట్టి సోమరిపోతు అనో, సంపాదించలేని వాళ్ళంతా ఇలానే అంటారని వాదిస్తాడు. కానీ ఇతను నిజంగా అనుకుంటే జగదీష్ కంటే ఎక్కువ సంపాదించగలడు. అన్ని తెలివితేటలున్నాయి.
    
    ఇక సోమరిపోతు కూడా కాడు. పనిచేయకుండా తినడాన్ని మహా పాపం అని ఎప్పుడో చెప్పినట్లు గుర్తు నిజంగానే స్వంత ఆస్తి సంపాదించడమంటే ఇష్టంలేదా? మరి ఒకరి స్వంత భార్య అయిన వ్యక్తిని ప్రేమిస్తానంటూ తిరుగుతాడేం?
    
    అతను బొరుగుల బండివద్ద ఆగి కొన్నాడు. రెండు పొట్లాలు తీసుకొచ్చి ఒకటి ఆమె చేతికిచ్చి, మరొకటి తనుంచుకున్నాడు. "సముద్రపు అలల్ని చూస్తూ ఇలా బొరుగులు తినడం చాలా బావుంటుంది. మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా?" అని అడిగాడు.
    
    లేదన్నట్లు తల వూపింది. ఐస్ క్రీమ్ ల్లో ఎన్ని రకాలున్నాయో ఆమె ఠక్కున చెప్పగలదు గానీ ఇంకా ముంతకింది బొరుగులు, ఉగ్గాణం, అటుకులు ఇలాంటివి తినెరుగదు.
    
    అతని కోసం అన్నట్లు అతన్ని చూస్తూ కొన్ని తినది బాగానే వున్నాయి. త్వరగా ఈ తినడం కార్యక్రమం అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇతనితో మాట్లాడటం బావున్నా ఇలా సముద్ర తీరంలో, చీకట్లో నడవడం ఇబ్బందిగా వుంది. జగదీష్ ఇతనిలా వుండుంటే ఎంత హాయిగా వుండేదోనని రెండు మూడుసార్లనిపించింది.
    
    "సముద్రమంటే నాకెంత ఇష్టమో, ఇంత గంభీరంగా, ఇంత అద్భుతంగా ఇంత అందంగా, ఇంతగా భయం గొలిపేది ప్రకృతిలో స్త్రీ తరువాత సముద్రం తప్ప మరొకటి లేదనుకుంటా విశ్వం తాలూకు ఓ భాగాన్ని చూసినట్లుంది. సముద్రం ఎంత పెద్దదో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇలాంటి సముద్రాలు ఎన్నో! ఇవన్నీ కలిపి భూమి ఇలాంటివి ఎన్నో విశాల విశ్వంలో భూమి, సూర్యుడు, చంద్రుడు, చుక్కలు- భూమికంటే కొన్ని రెట్లు పరిణామంలో వుండే నక్షత్రాలు - ఇవన్నీ కలిసి విశ్వమౌతుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra