Home » Sreelatha » మనసా....ప్రేమించకే నువ్విలా

     తల్లీతండ్రికి ఆ విషయం ఏమాత్రం తెలిసినా- పిల్లల క్షేమంకోసం జీవితాన్నే వదులుకున్న వాళ్ళు.... ఆఖరి రీలులో ఆనందం కోసం తమ పిల్లల్ని బలితీసుకున్నమనే అవగాహన వారిని ఏ అఘాయిత్యం అయినా చేయించొచ్చు! ఏ అనర్థానికయినా దారితీయొచ్చు' అనే  భయం....వారిలో దానివల్ల ఏర్పడిన అసంతృప్తిని వాళ్ళ ముందు బయటపెట్టలేక మరింత వత్తిడవ్వసాగారు.
    అసలు ఒకరికి ఒకరి ముందు ఘర్షించో, వర్షించో కొంత ఊరట పొందే అవకాశం కూడా వాళ్ళిద్దరికీ లేదు! వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటిమార్పూ చూపడానికి లేదు. లోపల రగులుతూ, పైకి లేనిఆనందాన్ని ప్రదర్శించే ఆ ఘర్షణ, దుఃఖం భావన, ఆనంద ప్రదర్శన మధ్య ఘర్షణ వాళ్ళను మరింత ఆత్మ బలహీనతకు లోనుచెయ్యసాగింది! తడిబట్టను ఆరేసేముందు బిగించి పిండినట్టు గుండె మెలిపెట్టినట్లున్నా.... ఒక్కచుక్క కళ్ళనీళ్లు రాల్చుకునే హక్కును కూడా వాళ్ళు వాడుకోదల్చుకోలేదు....ఒకరి ఆత్మబలం ఒకరం క్షీణింపచేస్తామేమో, బలహీనత పెంచుతామేమో....అనే భయంతో! అది వయసుకు మించిన అవగాహన! ప్రేమను మించిన ఆప్యాయత!!
    కులం, మతం, ఆస్ధి, చదువు, అందం, పెద్దలు, సమాజం, దేశం....వీటిలో ఏది వాళ్ళిద్దరి అడ్డుపడ్డా అవలీలగా నరికిపారేసి ఇద్దర్నీ కలిపేసి విజయసంకేతపు జెండా పాతేవారు..... స్నేహితులందరూ జనరేషన్ గా మారి! కానీ- సంస్కృతి, సంస్కృతి.... అతిసున్నితమయిన సెంటిమెంట్..., 'న్నా చెల్లెళ్ళ వరుస' అనే సెంట్ మెంట్, సంస్కృతి ముందు ఒక తరమే బలహీనమయిపోయింది! ఆ సెంటిమెంటుకున్న బలం ముందు వాళ్ళ ఆత్మబలం, ఆశయం, సిద్దాంతం, పటుత్వం....ఏవీ పనికిరావడం లేదు.
    నిజంగా ఎంత  బలమైన సెంటిమెంట్లు! ప్రాణాలు పోయగలవు...., అవలీలగా ప్రాణాలు తీయగలవు!
    ఆ సెంటిమెంటే తమ స్నేహితుల ప్రాణాలను క్షణానికో అడుగు చొప్పున మరణంవైపు నడిపిస్తుంటే....'ఇలా క్షణానికోసారి చచ్చేబదులు ఒక్కసారే మరణించడం నయమేమో.... అనిపించేలా కనిపించసాగారు తమ స్నేహితులిద్దరూ- అందరికీ!
    అందుకే వాళ్ళు కలిసి ఆ పరిష్కారం లేని విషయాన్ని చర్చించి, కెలికి, వాళ్ళ గుండెలను కుళ్లబొడవడం ఇష్టంలేక ముగింపులక్ష్యం వాళ్ళకే వదిలేసి, చేతులు కట్టుకుని అశక్తులై చూస్తూ నిలబడిపోయారు. ఆ మనసుల దగ్థపు సెగలవేడి తమను కూడా  తగలబెడుతున్నా.... ఆ దగ్దిత హృదయాలతో వాళ్ళు శాంతికోసం ఏ నిర్ణయం తీసుకున్నా  'అవు'ననడం తప్ప ఏవీ చెయ్యలేని స్థితిలో వాళ్ళున్నారు.
    నిజానికి- ఆ సెంటిమెంటును చంపేసి, ఇద్దర్ని కలిపేసి కోటగోడలా నిలవాలని చాలా బలంగా ఉంది వాళ్ళకు....ప్రేమగాఢత తెలుసు కనుక! కానీ,  కలవడానికి ముందుగ వాళ్ళంతట వాళ్ళు నిర్ణయించుకున్నాక- వాళ్ళునిర్ణయించుకోలేరెన్నటికీ! అందుకే ఏవీ....ఏవీ చెయ్యలేకపోయారు- మౌనమావ్వడం తప్ప!
                                  *    *    *
    ఎయిర్ పోర్ట్ హడావిడిగా ఉంది!
    రేవంత్ లగేజ్ చెకప్ కెళ్లింది. రేవంత ఫ్రెండ్స్ బోకేస్ తో సెండాఫ్ ఇస్తున్నారు. మమ్మా కంగారుపడుతూ జాగ్రత్తలు చెబుతోంది! డాడ్ 'నాతో కొన్నాళ్లయినా గడపకుండా వెళ్లిపోతున్నా'వని బాధపడుతున్నారు.
    రేవంత్ లో ఏ భావనా లేదు. రోబోట్ లా అందర్నీ రిసీవ్ చేసుకుంటూ, క్షణానికోసారి జ్ఞాపికను చూసుకుంటూ!
    దూరంగా.... అదేదో తన జన్మకు సంబందించైనా విషయం కాదన్నట్టు టీ.వీ.లో సినిమా చూస్తున్నట్టు గాజుగోళీల్లాంటి కళ్ళతో చూస్తోంది జ్ఞాపిక.
    "ఈష్, క్రాంత్, ఆనంద్....రేవంత్ ను కౌగిలించుకున్నారు! కన్నీళ్లతో భుజం చరిచారు. ఏంచెయ్యలేకపోయినందుకు కళ్ళతోనే క్షమాపణ అడిగారు. ప్రియమిత్రుణ్ణి దూరం చేసుకుంటూన్న గుండెలు బరువెక్కాయి!
    కామినీ, స్ఫూర్తి, రేవతీ తడికళ్ళతో తలలూపారు... వెళ్లి రమ్మని! వాళ్ళకేం తెలుసు- తను వెళ్తాడుకానీ, రాడనీ!
    రేవతి షేక్ హ్యండ్ ఇస్తూ ఏడ్చేసింది! "మమ్మల్నందర్నీ కలిపి, మీరు విడిపోతుంటే ఏం చెయ్యలేకపోతున్నాం!" అంది.
    చిట్టిచెల్లెల్ని తడిమినట్టు తల తడిమి ముద్దుపెట్టుకుని ఆనంద్ దగ్గరకు చేర్చాడు రేవతిని- "జాగ్రత్త..." అంటూ! ఆనంద్ కూడా ఏడ్చేశాడు.
    ఫ్రెండ్సందరూ  దగ్గరికొచ్చి రేవంత్ చుట్టూ కట్టలా నిలబడ్డారు. దూరంనుండి జ్ఞాపిక అలాగే చూస్తూ వుంది... కదలిక లేకుండా!
    దగ్గరికొస్తే బావుందని జ్ఞాపిక వైపు చూశాడు రేవంత్! ఆ కళ్ళలో ఎలాటి భావనా లేదు. ఒక్కసారి నవ్వితే బావుండు! ఒక్కసారి కళ్ళతో వీడ్కోలు చెబితే బావుండు! ఒక్కసారి పెదవి విప్పి 'వెళ్లి రమ్మని,' 'ఆల్ ది బెస్ట్ ' అని వీడ్కోలు పలికితే చాలు- ఆనందంగా వెళ్లిపోతాడు. తను అనుమతి ఇచ్చిందన్న ఆనందంతో  వెళ్లిపోతాడు!
    కానీ....చూపుల్లో కదలిక లేదు! ఆ పెదవుల్లో దరహాసం లేదు. ఆ మొహంలో అనుమతి లేదు. తన గుండెనెవరో పెకలించుకుపోతున్న భావన కనిపించింది..., ఆ నుదుటి ముడతల్లో బాధ గాడులు పరుచుకున్నాయి.
    జ్ఞాపికకు మాట్లాడాలని వుంది-
    'సఖీ ప్రియా .... సజీవ చిత్రమా- వీడ్కోలు! నిను చూడడం కుదరని నా చూపు జీవం కోల్పోతుంది! నిను పొందని నా జన్మ  నిర్జీవం అవుతుంది! కానీ, మన సిద్దాంతానుకర్తగా నువ్వు మాత్రం మిగిలి ఉండు. నేను నీలో లీనమై నీ కన్నులతో ప్రపంచాన్ని చూస్తా! నీ మనస్సులో మమేకం చెంది నువ్వున్నంత వరకూ జీవిస్తా! నీతో కలిసి మరణిస్తా..' అని!
    కానీ, ఎయిర్ పోర్ట్ లో కొచ్చినపుడు సూదితో గుచ్చినట్టు సన్నగా మొదలయిన గుండెనొప్పి- క్షణక్షణానికీ ఎక్కువయి ఊపిరి కూడా ఆడనంత బిగువయింది! అప్పుడేదయినా బయటకు చెప్తే రేవంత్ ప్రతి కదలికనూ నిశ్చలంగా చూస్తూ ఉండిపోయింది.... కళ్ళలో ప్రాణాలాపుకుని!
    అనౌన్స్ మెంట్ విని జ్ఞాపిక దగ్గరికొచ్చాడు రేవంత్! అమ్మానాన్నలను పిలిచి జ్ఞాపిక చెయ్యి తీసుకుని వాళ్ళ ముగ్గురి చేతులూ కలిపాడు. అప్పుడూ ఏ చలనం లేదు జ్ఞాపికలో! గాజుబొమ్మలా చూస్తూండిపోయింది.
    "మమ్మా...జ్ఞాపీకి అమ్మలేని లోటు తెలీనీవు కదూ!" కన్నీళ్లతో అడిగాడు.
    "బిట్టూ! నేనేవీ చిన్నపిల్లను కానురా- మీ  మమ్మాను!" ముద్దుగా కోప్పడింది.
    "డాడ్! మమ్మా జాగ్రత్త!" మమ్మా చెయ్యి డాడ్ కు అందిస్తూ.
    "ఇప్పుడు తను మీ మమ్మా మాత్రమే కాదు.... నా ఆరోప్రాణం!" నిండుగా నవ్వుతూ సుహాసిని భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నారు. ఇద్దరి మధ్య జ్ఞాపిక!
    ముగ్గుర్నీ అలానే  చూస్తూ సంతృప్తిగా  వెనక్కి చూస్తూ....చెయ్యి ఊపుతూ వెళుతుంటే గుండెల్లో ఏదో కలుక్కుమన్న భావన! అలాగే గుండె పట్టుకుని సాగిపోతూ- 'మనసా....ప్రేమించకే నువ్విలా!' కోప్పడుతూ, జీవితంలో తను తన జ్ఞాపీని మళ్లీ చూడలేని చోటుకు వెళ్లిపోతూ!
    కళ్ళకు కనిపించడకుండా వెళ్లేవరకూ చూసి కనురెప్పలు మూసుకుంది జ్ఞాపిక- ఆ చిత్రం చెరిగిపోకుండా కనుపాపలలో నిలుపుకుని!
    మూసిన ఆ కనురెప్పలతో రాలిపోతున్న  బిడ్డను తల్లీతండ్రీ కంగారుగా పట్టుకున్నారు.
    ఫ్రెండ్స్ చుట్టుముట్టారు!
    డాడ్ కు పరిస్థితి అర్థమయి కంగారుగా కార్డియాలజిస్ట్ దగ్గరకు వెళ్లాలని తొందరపడ్డారు. కారులో డాడీ ఒళ్ళో తలపెట్టుకుని, డాడీనే చూడాలని రెండు మూడుసార్లు ప్రయత్నించి ఓడిపోయింది.
    వెనుదిరిగి చూసిన రేవంత్ ఎవ్వరూ కనిపించలా! తనకు హ్యండ్ బ్యాగ్ కూడా మోయలేనంతగా  గుండె బరువెక్కి  అడుగు ముందుకు పడాల! ఒక్కసారి....ఒక్కసారి మళ్లీ జ్ఞాపికను చూడాలనిపించింది.
                                                                                     24
    అపోలో హడావిడి పడింది!
    థియేటర్ రెడీ అయ్యింది. తలకు అటూఇటూ ఉన్న అమ్మనాన్నలను చూస్తూ చెయ్యి సాచింది జ్ఞాపిక- ఒట్టువేయమన్నట్టు!
    ఎందుకన్నట్టు చూశారిద్దరూ.
    "నాకేవయినా అయితే జీవితాంతం రేవంత్ కు  తెలియనివ్వకండి!" అని అడిగింది తడబడుతూ.
    "ఫ్రెండ్స్ వైపు చూసింది.... వెళ్లోస్తానన్నట్టు!
    'సెలివిక నేస్తాల్లారా! మా ప్రేమసాక్షుల్లారా! మా జీవితపు ఆశయాల్లారా! మా సిద్దాంతపు ప్రవక్తల్లారా!' .... ఒక్కొక్కర్ని చెయ్యితో తడిమింది ఆప్యాయంగా!
    మెల్లగా, చల్లగా నవ్వుతూ డాడ్ నూ, మమ్మాను చూస్తూ-
    మౌనంగా చూపు ఆపేసింది.
    హడావిడిగా పల్స్ చూశారాయన.
    "నో.... హనీ!" అని అరిచి కూతుర్ని గుండెల కదుముకున్నారు.
    ఆగిపోయిన గుండె మారుస్పందించలేదు.
    "హనీ....హనీ!" ఎంత పిలిచినా కూతురికి వినిపించలేదు.
    సృష్టిలో మళ్లీ ఓసారి ప్రేమ గెలిచింది దిగ్విజయమ్గా! యుగాలు మారినా, తరాలు మారినా, మనుషులు మారినా, మనసులు మారినా....'గెలుపు మాత్రం తనదే' నంటూ గెలవబోయింది.
    కానీ, అప్పటికే రేవంత్ వచ్చాడు.... హడావిడిగా!
    చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నూ, మమ్మాను, డాడీని దాటుకుని జ్ఞాపిక దగ్గరకు వచ్చిన వేగంలో బలంగా స్ట్రెచర్ ను తాకాడు.
    అది కారిడార్ లో వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడకు గుద్దుకుంది.
    జ్ఞాపిక శారీరం ఎరిగిపడింది! మళ్లీ నిశ్చలనమైంది.
    పరిగెత్తుకెళ్లాడు దగ్గరకు.
    నిస్త్రాణగా, నిశ్చలనంగా ఊపిరి మరిచి పడిఉంది.... చెట్టు నుండి రాలిన పువ్వులా! స్వచ్చంగా! ప్రేమకు గమ్యంలా ! అన్ని ప్రేమకథల్లాగే అంతంగా! ఇక జవాబే అవసరం లేని ప్రశ్నలా! సమాధానం వెతకని సమస్యలా! జీర్ణించుకున్న భావాల వత్తిడికి నలిగి విముక్తి పొందిన సిద్దాంతంలో.... స్వేచ్చగా!
    జ్ఞాపికను లేపి గుండెల కదుముకున్నాడు.
    "ణా హాని లేదు! బిట్టూ.... నా హనీ పోయింది! నా హనీ ఇక లేదు!" డాడ్ రేవంత్ ను, జ్ఞాపికనూ ఒడిసిపట్టుకుని బిగ్గరగా అరిచారు.
    "బిట్టూ.... జ్ఞాపిక నువ్వలా వెళ్లగానే పడిపోయింది! అంతే.... మాటా, చూపూ లేవు! డాడ్ పల్స్ చూసి చనిపోయిందంటున్నారు! బిట్టూ... జ్ఞాపీ లేదురా! బిట్టూ.... మన జ్ఞాపీ లేదు! మాకు కూతురు లేదురా!" సుహాసిని మొహం చేతుల్లో దాచుకున్నారు.
    ఫ్రెండ్సందరూ గగ్గోలుగా బెంబేలెత్తి పొగిలిపడుతున్నారు. పిడుగుపడినట్టు వాళ్ళ హృదయాలు బీటలువారి మౌనమై రక్తం కన్నీరుగా కారుతోంది! మాట్లాడడానికి గొంతుకు గుండెలు అడ్డంపడ్డాయి. వాళ్ళు కనీసం తలెత్తి రేవంత్ ను చూడలేకపోయారు.... ఆ చావుకు ప్రత్యక్షంగా తామే కారణం... అన్నట్టు! దోషులుగా తలలు  వంచుకుని కుమలసాగారు.... రేవంత్ కు జీవంతో ఉన్న జ్ఞాపికను ఇక చూపలేని తమ ఆశక్తతకు! ఆ చావుకు తామే బాధ్యులన్నట్లు ప్రకృతి కోర్టులో  మానవ నేరస్థులయ్యారు.
    "నో! జ్ఞాపీకేం కాదు" స్పష్టంగా అని, "జ్ఞాపీ! జ్ఞాపీ! లే! నేను వెళ్లిపోలేదు! లే! నేను నీ కోసమే వచ్చాను.... లే!" అంటూ జ్ఞాపికను ఇష్టం వచ్చినట్టు కుదపసాగాడు రేవంత్.
    చలనం లేని బొమ్మలా వాలిపోసాగింది జ్ఞాపిక.
    ఆమె చెవికి పెదాలానించి- "జ్ఞాపీ.... జ్ఞాపీ.... ప్లీజ్ లే! జ్ఞాపీ.... నేనొచ్చేశాను. జ్ఞాపీ.... నేనెళ్లను! నిన్ను తీస్కెళ్తాను.... లే జ్ఞాపీ!" ఒళ్ళో పడుకోబెట్టుకుని తట్టితట్టి లేపాడు. నోటిలో నోరుంచి ఊపిరి మలిపాడు!
    "జ్ఞాపీ.... లే జ్ఞాపీ! నన్ను వదిలి నువ్వు  వెళ్లలేవు! లే జ్ఞాపీ... ప్లీజ్- నన్ను విడిచి వెళ్లకు జ్ఞాపీ! వచ్చేయ్... వచ్చేయ్... జ్ఞాపీ!" విపరీతమైన ఆక్రోశమై, సముద్రంలా ఎగిసెగిసి, తన చెలిని అలలాగా ఎత్తిపడేస్తూ, లేపుతూ... పిచ్చివాడవసాగాడు.
    "లే....జ్ఞాపీ! నా ప్రాణం పోసుకో జ్ఞాపీ! నా ఊపిరి తీసుకో! నా ప్రాణమే నువ్వు జ్ఞాపీ! అదుండగా నువ్వెలా వెళ్తావు... ఆఁ? నువ్వెళ్లవు! లే... జ్ఞాపీ..." రెండు బుగ్గలూ దోసిట్లో ఇముడ్చుకుని తలను కదుపుతూ-
    "అంతగా వెళ్లాలనుకుంటే ఇద్దరం వెళ్లిపోదాం. నువ్వోక్కదానివీ వెళ్లలేవు. నన్ను చీల్చుకుని నాలోంచి వెళ్లాలి. నువ్వు నీలోంచి కాదు. లే.... జ్ఞాపీ... లే! అదుగో... మన  రంగుల కల! లేళ్లలా  పరిగెడుతూ మనం- మనచుట్టూ చిన్ని చిన్ని పిల్లలు... వాళ్ళు పిల్లలు కాదు, మన ఆశయాలు... మన ఆశలు.... మన సిద్దాంతాలు....మన భవిష్యత్తు! లే జ్ఞాపీ..." తన షర్టు బటన్స్ తీసేసి, జ్ఞాపిక అరచెయ్యి గుండె కానించుకుని....
    "చూడు జ్ఞాపీ... నువ్వున్న గుండె కొట్టుకుంటోంది. నేనున్న గుండె ఆగిపోయింది. అంటే...నువ్వుండాలి, నేను  పోవాలా? కానీ, నేనున్నాను... మరి, నువ్వెలా పోతావు?" షోల్డర్స్ కింద చేతులు వేసి, కుదిపి తన ప్రశ్నకు సమాధానం చెప్పమన్నట్లుగా గద్దిస్తున్నాడు.
    "మనది ప్రేమబంధం కాదు జ్ఞాపీ.... ప్రాణబంధం! మనిద్దరి ప్రాణాల మధ్య కుదిరిన ఒప్పందం! 'నువ్వుంటే నేనుంటూ..., నేనుంటే నువ్వుంటూ...' అని మన ప్రాణాలు చేసుకున్న జీవరస సారమిది. మరి, నేనున్నాగా జ్ఞాపీ....నువ్వూ ఉండు! ఉంటావ్... నాకు తెలుసు! నన్నేడిపిద్డామనీ...నిన్ను విడిచి వెళ్లిపోవాలనే నా అపరిపక్వపు ఆలోచనకు అగ్నిపరీక్ష పెడదామని కాసేపలా వెళ్లిపోయావ్... అంతే! అంతేకదా?! దొంగా... ఎన్ని పరీక్షలు పెడతావురా... నన్ను బయటకి రప్పించడానికి! ఎంతేడిపిస్తావ్? లే.... ఇంకచాలు! తిరిగి వచ్చెయ్యి... ఏ బంధువులూ లేనిచోట... ఏ  బందుత్వానికీ అందకుండా.... నాకు నువ్వూ- నీకు నేనూ....అంతే! లే జ్ఞాపీ..." అంటూ కుమిలిపోసాగాడు- గొంతు రాసుకుపోయి మాటరాక ఆగిపోయినా, జ్ఞాపిక  ముఖంలోకి చూస్తూ నిమురుతూ!
    ఆపాలని కానీ, 'ఆగితే బావుండు...' అనికానీ ఎవరికీ అనిపించలా! 'అసలా దుఃఖం సరిపోదు! అతని గుండె బద్దలయి తీరుతుంది. లేకపోతే అతడు విముఖుడు కాలేడు!' ....అని తెలిసిపోయి మరో మృత్యువు జాడలు వాళ్ళకు స్పష్టంగా కనిపించసాగాయి.
    అలాగే కదిపీ కదిపీ...
    కదలని తన ప్రియతమను గుండెల కదుముకుని వెర్రిగా వెక్కిపడుతూంటే.... తన గుండెలమీద చిన్న కదలిక!
    ....జ్ఞాపిక తల చిన్నగా కదిలింది.
    వివుక్కున వదిలేసి మొహం చేతుల్లోకి తీసుకుని చూశాడు.
    మెత్తని పెదాలు మెల్లగా కదిలాయి! ఆ తర్వాత కళ్ళు చికులించి, నుదురు చిట్లించింది!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra