Home » Vasundhara » Trick Trick Trick


    నాయుడీ కథవిని తెల్లబోయాడు. గోవిందరావు సంగతి అతడికి తెలుసు. అశోక్ వ్యక్తిగత విషయాలను జాగ్రత్తగా కనిపెడుతూండే మనిషి ఒకడున్నాడక్కడ. అతడిద్వారా నాయుడికి గోవిందరావు గురించి తెలిసి కసికొద్దీ అతడికి బుద్ధిచెప్పే ఏర్పాట్లు చేశాడు. సినిమా హాల్లో సంఘటన, యాక్సిడెంటు నాయుడు సృష్టించినవే! వాటితో గోవిందరావును అంతం చేయవచ్చుననుకున్నాడు. కానీ అశోక్ తన మంచితనంతో గోవిందరావులోని శత్రుత్వాన్ని చంపేశాడు. అదొక పెద్ద విశేషంగా వెండిపతకంతో గుర్తించ బడింది.
    "నాకు చాలా గర్వంగా ఉందిరా-" అన్నది మాలతి.
    నాయుడుమాత్రం కంగారుగా- "నువ్వు రాజకీయాల్లోకానీ దిగాలని అనుకోవడంలేదు గదా-" అన్నాడు.
    "మనం చేసే ఏ మంచిపనికీ ప్రయోజనాన్నాశించకూడదు...." అన్నాడు అశోక్ గంభీరంగా.
    "నాయుడు నవ్వి-"మీ నాన్న డబ్బంతా అన్నీ మంచిపనులు చేసే సంపాదించాడనుకుంటున్నావా?" అన్నాడు.
    అశోక్ గంభీరంగానే- "నాన్నా-పెద్దలకు నీతులు చెప్పాలని నేననుకొను నువ్వు నన్ను ధనవంతుణ్ణిచేస్తే అది నా అదృష్టం. ఎందుకంటే డబ్బున్న వాడికి తన ఆశయాల ప్రకారం జీవించగల స్వతంత్రం ఉంటుంది. డబ్బు సంపాదించాలనుకునే వాడికి అదొక్కటే ఆశయమవుతుంది-" అన్నాడు.
    నాయుడు సాలోచనగా-"నీవంటి కొడుకుండడం నా అదృష్టం. నీ స్వతంత్ర భావాలకు ఎంత డబ్బుకావాలంటే అంతా ఇస్తాను. కానీ నీకులా శత్రువులకు రక్తదానాలు చేయగల సహనం నాకు లేదు. నాకు ఎదురు తిరిగిన వాడిని నేను వదిలిపెట్టలేను. ఈ నా స్వభావాన్ని నువ్వు ద్వేషించనంతకాలం నా అంతటి అదృష్టవంతుడుండడు...." అన్నాడు.
    అశోక్ నవ్వి-"డబ్బు, అధికారం-సామాన్యులకు లభించవు. అవి లభించినవారు కొందరిలో గొప్పవారిగానూ, కొందరిలో రాక్షసులుగానూ చెలామణీ అవుతారు. నువ్వొకవేళ నిజంగా రాక్షసుడివే అయినా-అంతటి రాక్షసుడి చేతకూడా ప్రేమించబడిన నా అదృష్టానికి సంతోషిస్తాను తప్పితే నిన్ను నేను ద్వేషించను. ఇతరుల గురించి నేనెందుకు పట్టించుకోవాలి? నువ్వు నాకెప్పుడూ దుర్మార్గుడివి కాదు-"అన్నాడు.
    నాయుడు తృప్తిగా నిట్టూర్చాడు. కొడుక్కి ఫిరంగిపురంలో ఎలా గడపాలో ఎవరెవరి సాయం తీసుకోవాలో వివరాలన్నీ చెప్పి అతడు తన కార్యకలాపాలు నిర్వహించే బంగళాకు వెళ్ళి-హమీద్ కోసం కబురుపెట్టాడు.
    హమీద్ వచ్చాడు. నాయుడు అతడిని పరీక్షగా చూస్తూ- "ఇప్పుడు నీ వాళ్ళంతా ఏమంటున్నారు?" అన్నాడు.
    "మీరు దేవుడని అంటున్నారు బాస్!"
    "ఇంకా-?"
    "ఫిరంగిపురం పొలిమేరలు దాటితే తమని పోలీసులు కుక్కల్లా వేటాడతారనీ-మీ కారణంగానే తమ ప్రాణాలకు రక్షణ ఏర్పడిందనీ అనుకుంటున్నారు-"
    "వాళ్ళు నీ మాటలు బాగా నమ్మేరా? లేక ఇవన్నీ నేను నీచేత చెప్పిస్తున్నానని అనుమానిస్తున్నారా?"
    "లేదు బాస్! నేను చాలా తెలివిగా ప్రవర్తించాను. ముందు నేను వాళ్ళకు నాయకుడిలా నటించి క్రమంగా మీ గొప్పతనాన్నీ, మా ఇబ్బందులనూ-అసలు యదార్ధాన్ని గుర్తించినట్లు చెప్పాను. వాళ్ళు అంతా నమ్మారు. నేనిప్పుడు వాళ్ళ నాయకుడిని. నేనేం చెప్పినా నమ్ముతారు. నేను నీ మనిషినన్న రహస్యం నాకు తప్ప వేరెవ్వరికీ తెలియదు....."
    "వెరీగుడ్...." అన్నాడు నాయుడు- "కానీ ఒక సమస్య వచ్చింది నాకు. ఆ అనుచరుల్లో నీ అంతస్థు పెంచాలన్నది నాకోరిక. కానీ నీ గురించి నాకు కొన్ని బాడ్ రిపోర్ట్స్ వచ్చాయి. పనివాళ్ళందరికి నాయకుడివై వాళ్ళను నీ గుప్పిట్లో పెట్టుకుని ఆ బలంతో నన్ను సాధించాలనుకుంటున్నావనీ, బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నావనీ విన్నాను...."
    హమీద్ కంగారుగా- "ఇదిచాలా అన్యాయంబాస్! నేను మీరు చెప్పెరనే వాళ్ళకు నాయకుడినైనాను. మీకు అందిన రిపోర్ట్సులో సత్యం లేదు-" అన్నాడు.
    నాయుడు తాపీగా-"ఇక్కడేం మాట్లాడవద్దు. బల్ల కటూ యిటూ కూర్చుని కబుర్లాడుకుంటే ఎటువంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చునని నా అభిప్రాయం-పద-" అంటూ లేచాడు.
    ఇద్దరూ ప్రత్యేకమైన ఆ గదిలోనికి వెళ్ళారు. బల్ల కటూ యిటూ ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు.
    నాయుడు సిగరెట్ వెలిగించాడు. హమీద్ కి ఆఫర్ చేయలేదు.
    నాయుడి కుడిచేయి బల్లమీది యాష్ ట్రేను నెమ్మదిగా తిప్పుతున్నది.
    "హమీద్!" అన్నాడు నాయుడు- "నువ్వు పనివాళ్ళను నామీదకు రెచ్చగొట్టాలనుకున్నావు. అంటే నీ బుడ్డి మంచిదికాదని అర్ధమవుతున్నది. నీ బలహీనత, అసహాయత నిన్ను నాకు దాసుణ్ణి చేశాయి. అప్పుడు నెనుఇ నీ సాయంతోనే నీవాళ్ళ బుద్ధి మార్పించాను. నన్ను దేవుడిగా భావించే స్థితికి వాళ్ళను తీసుకుని వచ్చావు. కానీ అవకాశంవస్తే నువ్వు మళ్ళీ నామీద దెబ్బతియ్యవని నమ్మకమేమిటి? ఒకసారి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవాడిని నేను క్షమించలేను...."
    "నా తప్పుతెలుసుకున్నాను బాస్.....ఇంకెప్పుడూ తప్పుచెయ్యను...."
    "నువ్వు నాకు శత్రువువి. అందులో సందేహమేమీలేదు. నాశత్రువు నన్ను దేవుడిలా భావించే నాపనివాళ్ళకు నాయకత్వం వహించడం నాకు క్షేమంకాదు. నీవల్ల నేననుకున్న ప్రయోజనం సిద్ధించింది. నీ ఉనికి నాకింక క్షేమంకాదు...." ఆగాడు నాయుడు. అతడిచేతిలోని యాష్ ట్రే మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నది.
    హమీద్ శరీరంలో వణుకు ప్రారంభమయింది. అయినా అతడేమీ మాట్లాడకుండా నాయుడు చెప్పేదే వింటున్నాడు.
    "నిజానికి నిన్ను నిర్మూలించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫినిష్ చేయాలనుకున్నది నాశత్రువుని శత్రువును! నిర్మూలించడానికి రెండు పద్ధతులున్నాయని ఈరోజు తెలిసింది...." అంటూ నాయుడు హమీద్ కి అశోక్ కథ చెప్పాడు.
    కధ వినగానే హమీద్ ముఖంలోకి వెలుగు వచ్చింది-"మీరు చెప్పింది నిజం బాస్! ఆరోజు నన్ను వదిలిపెట్టగానే నాలోని శత్రువు చచ్చిపోయాడు-"అన్నాడుత్సాహంగా.
    నాయుడి చేతిలోని యాష్ ట్రే ఆగింది-"నీకు నేను చెప్పినది రెండింటిలో ఒక పద్దతి. అది నాపద్దతికాదు. నాపద్దతి ఏమిటంటే-"అంటూ అతడు తన ఎడమచేతిలోని సిగరెట్ ను యాష్ ట్రేమీద ఉంచాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra