Home » Mainanpati bhaskar » Claimax

"మన జాడ సులభంగా కనుక్కోవడానికిగానూ వేటకుక్కలను వెంటబెట్టుకు వచ్చి వుంటారు కరుణా పోలీసులు!"
అవునన్నట్లు తోకాడించాయి కుక్కలు. తర్వాత మొరుగుతూ , కొంతదూరం పరిగెత్తి మళ్ళీ వెనక్కి వచ్చాయి.
"తమతో రమ్మంటున్నాయి అవి" అన్నాడు హరీన్.
"మంచి ట్రైనింగ్ పొందిన డాగ్స్ అయి వుంటాయి ఇవి. పోలీస్ డాగ్స్. మా ఇంట్లో వున్న నా షర్టో, ప్యాంటో వీటికి వాసన చూపించి వుంటారు.
ఆ వాసన పసిగడుతూ మనని చేరుకున్నాయి."
వాళ్ళని తమతోబాటు త్వరగా వచ్చెయ్యమన్నట్లు అరవడం ఎక్కువ చేశాయి కుక్కలు.
వాటి ఉద్దేశ్యం హరీన్ కి అర్ధమయింది.
తమని తరుముకుంటూ ఆటవికుల బృందం ఒక దిశనుంచి వస్తోంది.
వాళ్ళని తప్పించుకుని మరో దిశ నుంచి వెళ్ళిపోదామని సూచిస్తున్నాయి. ఈ పోలీస్ డాగ్స్ తెలివైనవి.
"కమాన్ " అన్నాడు కరుణతో.
అందరూ కలిసి పరిగెత్తడం మొదలెట్టారు - టెలిస్కోప్ కొండ దిశగా.
ఆ కొండకి సమీపంలోనే వుంది కొండదేవత పూజాస్థలం.
అక్కడ -
పెడరెక్కలు విరిచి కట్టివేయబడి వున్న నాయకుడి చర్మాన్ని చీల్చడానికిగానూ ఒక పదునైన కత్తిని ఎత్తి పట్టుకుని వున్నాడు ఒక ఆటవికుడు.
అదే సమయంలో -
టెలిస్కోప్ కొండమీద నుంచి త్వరత్వరగా కిందికి దిగివస్తోంది రఘుపతి బృందం. అతని వెనుకగా వున్న పోలిసుల చేతుల్లో మెషిన్ గన్స్ వున్నాయి.
మరోవేపున -
ముందు వున్న రఘుపతి మీదికి బాణం సంధించాడు ఒక ఆటవికుడు.
క్షణంలో పరిస్థితి అంచనా వేశాడు హరీన్.
అటువేపు నాయకుడు ప్రాణాపాయంలో వున్నాడు.
ఇటువైపు రఘుపతి ప్రాణాపాయంలో వున్నాడు.
పోలీసులు ఇప్పుడు ఇంత దగ్గరనుంచి గనక గుళ్ళ వర్షం కురిపించడం మొదలెడితే, అమాయకులైన ఆటవికులెందరి ప్రాణాలో పోతాయి.
తను ఒక్క తప్పటడుగు వేస్తె వీరందరి మధ్యా చిక్కుకుని తనూ, కరుణా ప్రాణాలు పోగొట్టుకోవచ్చు.
ఏం చెయ్యాలి ఇప్పుడు?
ఏం చెయ్యాలో స్పురించింది అతనికి.

                                                    28

అక్కడికి దగ్గరలోనే ఒక పుట్టచాటున నక్కికూర్చున్న ఒక ఆటవికుడు కనబడ్డాడు హరీన్ కి. ఆ ఆటవికుడు మరుగుజ్జు. చాలా పొట్టిగా ఉన్నాడు. అతని వీపు హరీన్ వాళ్ళ వైపు ఉంది. వాళ్లరాకని గమనించలేదు. రఘుపతి బృందం మీదకు బాణాలు వదలడానికి విల్లు సంధిస్తున్నాడు అతను.
చాడీ చప్పుడు కాకుండా వెనుకనుంచి వెళ్ళిపోయి, ఆ మరగుజ్జుని సునాయాసంగా పైకి ఎత్తేశాడు హరీన్. ఆ పళంగా అతన్ని ఆటవికుల మధ్యకి విసిరేశాడు.
ఫిరంగి గుండులా గాల్లో దూసుకుని తమవైపు వస్తున్నావాడు తమ మనిషేనని గుర్తించడానికి కొద్ది క్షణాలు పట్టింది ఆటవికులకి. ఏం చెయ్యాలో చప్పున స్పురించక, అయోమయంగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళందరూ.
వాళ్ళలో ఏర్పడిన తాత్కాలికమైన ఆ గందరగోళాన్ని తెలివిగా ఉపయోగించుకొని, రెండు అంగలలో రఘుపతిని చేరుకున్నాడు హరీన్. రఘుపతికి బాణాలు తగలకుండా ఆయనకు కవచంలా చుట్టేసుకున్నాడు.
కానీ ఆలోగానే ఒక ఆటవికుడు తేరుకుని, బాణం వదిలాడు. అది సర్రున గాలిని చీలుస్తూ మహావేగంతో వచ్చి హరీన్ భుజంలో దిగబడింది. అతను గనుక అడ్డంలేకపోతే అది రఘుపతి గుండెలలో గుచ్చుకునేదే.
బాధని ఓర్చుకుంటూ బాణాన్ని లాగి కిందపదేశాడు హరీన్. రక్తం ధారగా కారిపోవడం మొదలెట్టింది. అయినా లక్ష్య పెట్టకుండా గిరుక్కున వెనుదిరిగాడు అతను. తమ మీదికి విల్లంబులను సంధిస్తున్న వందలాది మంది ఆటవికులు కనబడ్డారతనికి. మరుక్షణంలో తనకి దగ్గరగా ఉన్న ఒక పోలీసు చేతిలోని మెషిన్ గన్ ని అందుకున్నాడు హరీన్. తమకీ ఆటవికులకి మధ్య ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మొదలుకి మెషిన్గన్ ని గురిపెట్టి గుళ్ళ వర్షం కురిపించాడు హరీన్.
వర్షంలా వచ్చిపడుతున్న బుల్లెట్ల తాకిడికి రంపంతో కోసేసినట్లు తెగింది చెట్టు తాలూకు మాను. ఫెళ ఫెళ శబ్దం చేస్తూ - విరుచుకు పడిపోయింది చెట్టు. అది చూసిన ఆటవికులు కకావికులై తలో వేపూ పరిగెత్తిపోవడం మొదలెట్టారు.
హరీన్ దీర్ఘంగా శ్వాసతీసుకుని స్థిమితపడేలోగా, మళ్ళీ ఆటవికుల కేకలు వినబడ్డాయి - ఈసారి మరో దిశ నుంచి.
ఇందాక హారీన్ నీ, కరుణనీ తరుముతూ రహస్యమార్గం వేపు వెళ్ళిన ఆటవికుల గుంపు. వాళ్ళు అక్కడలేరనీ , లోయలోకి తిరిగి వచ్చారనీ కనిపెట్టి గుండెలు అవిసేలా కేకలు పెడుతూ పరిగెత్తి వస్తున్నారు.
అరక్షణంలో పరిస్థితిని అంచనా వేసి, పరిసరాలను గమనించాడు హరీన్. అక్కడే ఉన్న ఒక పెద్ద బండమీద పడింది అతని దృష్టి. ఒక చిన్న బండ మీద పెద్ద బండ చూపరులకు చిత్రం కలిగించేలా నిలబడి ఉంది. కావాలని ఎవరో దాన్ని అక్కడ అలా నిలబెట్టినట్లు కనబడుత్తోంది అది. సర్కస్ లో చిన్న స్టూలు మీద ప్రయసపడుతూ నిలబడ్డ ఏనుగులా కనబడుతోంది ఆ బండ!
ఆ రెండు బండల మధ్య ఉన్న అతికొద్ది ఎడం లోకి బుల్లెట్స్ వదిలాడు హరీన్. కొన్ని బుల్లెట్స్ రాతికి తగిలి, దిశను మార్చుకుని పక్కకి వెళ్ళిపోయాయి. కొన్ని బులెట్స్ రాతిని చిద్రంచేశాయి. ఆ తాకిడికి చిన్న చిన్నరాతి  ముక్కలు గాలిలోకి ఎగిరాయి. దానితో చిన్నబండ మీద బాలెన్స్ చేస్తున్నట్లు నిలబడి ఉన్న ఆ పెద్దబండ పట్టుతప్పి పెద్ద శబ్దంతో కిందికి దొర్లిపోయింది.
కిందపడిన ఆ బండ తమవైపుకే వేగంగా దొర్లిస్తూ ఉండటం చూసి బేజారైపోయారు ఆటవికులు.
బుల్లెట్ల వర్షం కురిపించడం ఆపి, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అన్నట్లు అటూ ఇటూ చూశాడు హరీన్. అందరూ అక్కడనుంచి పారిపోయారు గానీ, దేశింగ్, చిక్ లీ, మంత్రాల మల్లయ్య, నాయకుడు మాత్రం అక్కడే కొద్ది దూరంలో నిలబడి, జరుగుతున్నదంతా కళ్ళప్పగించి చూస్తున్నారు.
"వెల్ డన్! ప్రాణనష్టం అసలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తేగలిగారు!" అన్నాడు పోలీసు అధికారి మెప్పుదలగా. తలపంకించాడు హరీన్.
"హరీన్!" అన్నాడు రఘుపతి.
అయన దగ్గరికి నడిచాడు హరీన్. "సర్........ఎందుకు మాకోసం ఇంత రిస్కు తీసుకున్నారు?" అన్నాడు ఆర్ద్రంగా .
నీరసంగా నవ్వాడు రఘుపతి.
"ఎందుకంటే హరీన్, నువ్వు నా కొడుకు లాంటివాడివి కాబట్టి! నీమీద నాకు ఉన్న వాత్సల్యం నన్ను అక్కడ నిలువనివ్వలేదు"
"సర్....!
అతన్ని ఇంక మాట్లాడనివ్వకుండా , "హరీన్!" అని అతని చుట్టూ చేతులు వేసి, ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రఘుపతి.
రఘుపాతి వీపంతా తడితడిగా ఉన్నట్లు అనిపించింది హరీన్ కి. అనుమానంగా తడిమి చూశాడు.
రక్తం!
ఏమిటిది? ఏమయింది?
మరుక్షణంలో అతని చేతికి తగిలింది. తఘుపతి వెన్నులో దిగబడి ఉన్న ఒక బాణం.
ఆ గందరగోళంలో ఆ బాణాన్ని ఎప్పుడు ఎవరు వదిలేరోగానీ, అది రఘుపతి వీపుని చీల్చుకుని, అయన గుండెలో గుచ్చుకుపోయింది.
"హరీన్!" అన్నాడు రఘుపతి. అయన పెదిమలు కదిలినప్పుడల్లా నోట్లో నుంచి రక్తం తెరలుతెరలుగా వస్తోంది. "హరీన్! ఇంక ఎక్కువ వ్యవధి లేదనుకుంటాను. నేను మరణిస్తే నా భార్య దిక్కులేనిదయిపోతుంది హరీన్! ఆమెనీ నీ సొంతతల్లిగా భావించి, కనిపెట్టి ఉండమని కోరుతున్నాను. నాకోసం ఈ ఒక్క సాయం........"
మళ్ళీ బోళుక్కున చారెడు రక్తం కారింది అయన నోట్లో నుంచి. ఇంక మాట్లాడలేకపోయాడు.
కంపిస్తున్న స్వరంతో అన్నాడు హరీన్ "సర్.......అమ్మను గురించి మీరు ఏమీ బెంగపెట్టుకోకండి! అసలు మీకేమీ కాలేదు. కాదు కూడా. మనం కొద్ది గంటలలో సిటీ చేరుకోగానే .....సర్ .....సర్....!"
అప్పటికే రఘుపతి కళ్ళు మూతలు పడిపోయాయి. కాళ్ళు పట్టుదప్పి కిందికి జారిపోయాడు అయన. అయన ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమైపోయాయి. వికలమైన మనసుతో అయన పాదాల దగ్గర కూలబడిపోయాడు హరీన్.
ఇంత ప్రయత్నం చేసి కూడా రఘుపతి గారిని రక్షించుకోలేకపోయాడు తను.
తనమీద ఉన్న అపేక్షతో ఈ లోయలోకి వచ్చి ఇక్కడ అశువులు బాశాడు ఈయన.
ఈ రుణం తను ఎలా తీర్చుకోగలడు?
హరీన్ మళ్ళీ తలెత్తి చూసేసరికి దేశింగ్ , చిక్ లీ, మంత్రాల మల్లయ్య, నాయకుడు అతని పక్కనే నిలబడి ఉన్నారు. వాళ్ళ మొహలలో ఆశ్చర్యం కనబడుతోంది.
దేశింగ్ తడుముకుంటూ అన్నాడు -
"దూరం నుంచి మీ మాటలు విన్నాను నేను. కాబట్టి సరిగా వినబడలేదు. ఈయన నీ తండ్రా?"
"కాదు" అన్నాడు హరీన్. "అంతకంటే ఎక్కువ!"
"అమ్మను జాగ్రత్తగా చూసుకోమని అయన నిన్ను కోరలేదూ? మరి అయన నీ తండ్రి కాదంటావెం?"
నిట్టూర్చి అన్నాడు హరీన్ - "దేశింగ్ ! పెద్దవయసూ, దొడ్డమనసు ఉంటే చాలు. ఎవరైనా సరే, తమకంటే చిన్నవాళ్ళకు అన్ననో, తండ్రోనో, అక్కనో, అమ్మనో అవుతారు.
మనుషుల మధ్య ఉండే సంబంధం కంటే, మనసుల మధ్య బంధం గొప్పది. ఈ రఘుపతిగారు నన్ను సొంత కొడుకుగా భావించారు. అలాగే మీ నాయకుడు కూడా! అలా భావించబట్టే వృద్దురాలాయి, మరణశయ్య మీద వుండి మనవడి కోసం తపించిపోతున్న తన తల్లికి కొడుకని చెప్పి చూపించాడు."
తలవంచుకుని వింటున్నాడు దేశింగ్. అతనికి ఇదంతా చిత్రంగా వుంది. ఏమిటీ వీళ్ళ వింత ప్రకృతి! ఏమిటీ త్యాగాలు?
లోయలోనుంచి సురక్షితంగా బయటపడి, ప్రాణాలు దక్కించుకునే అవకాశం వుండి, కూడా రఘుపతిని రక్షించడానికి - మళ్ళీ తిరిగివచ్చాడా హరీన్?
హరీన్ ప్రమాదంలో వున్నాడేమోనని చెప్పి , అతన్ని రక్షించడం కోసం ప్రమాదాలను వెదుక్కుంటూ లోయలోకి వచ్చాడా రఘుపతి? ఇక్కడ ప్రాణాలు కోల్పోయాడా?
ఎంత చిత్రంగా వుంది ఇది!
హరీన్ మాటలు అతనికి వినబడుతూనే వున్నాయి.
"దేశింగ్! అందుకని మీ నాయకుడు తన ముసలి తల్లికి నన్ను తన కొడుకని చెప్పి చూపించడంలో తప్పులేదనే భావిస్తున్నాను. ఈ నిజం నీకూ తెలిసివుండాలి. కానీ నాయకత్వం మీద ఉన్న మోజు నువ్వు నిజాలు చెప్పకుండా అడ్డం పడింది. దేశింగ్.....ఒకవేళ నాయకుడు చేసింది తప్పే అనుకున్నా ఆ తప్పుని అతను తన స్వార్ధం కోసం చెయ్యలేదు. చావు మంచం మీద వున్న ఒక వృద్దురాలి ఆత్మతృప్తి కోసం చేశాడు - అవునా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra