Home » Vasundhara » Vasundhara Kadhalu - 7


    సూటికా తగిలింది కవితకీ ప్రశ్న ఒక్క క్షణం తడబడి-"ఈ విషయమై మీ అభిప్రాయం చెప్పండి" అంది.
    "నా అభిప్రాయ మేమిటంటే బలహీన క్షణాల విషయమెలాగున్నా భార్యా భర్తల మధ్య రహస్యాలన్నవి వుండకూడదు. ఒకరి బలహీనతల నొకరికి చెప్పుకొని అవగాహన పెంచుకొని సమస్యలకు పరిష్కారమార్గాల నాలోచించాలి.
    కవిత చటుక్కున-"నా దగ్గర మీకు తెలియని రహస్యమేదైనా వుంటే అర్ధంచేసుకొని క్షమించగలరా?" అన్నది.
    "నీ రహస్యాలు నాకు చెప్పుకోగలిగితే అది నువ్వు నాకిచ్చిన గౌరవంగా భావించి సంతోషిస్తాను. నీవద్ద ఎలాంటి రహస్యం దాగున్నప్పటికీ నేను నిన్ను వదులుకోలేను. నా ప్రాణంలో ప్రాణానివి నువ్వు...." అన్నాడు చలపతిరావు.
    బ్లాక్ మెయిలర్ గురించి భర్తకు చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది కవితకు ఆ క్షణంలో అయితే అప్పుడే ఆమెకు తను చదివిన కథ ఒకటి గుర్తుకు వచ్చింది.
    అందులో తనవంటి భార్య.....
    ఎటొచ్చీ తను తప్పు చేయలేదు. ఆమె తప్పుచేసింది.
    ఆమె భర్త తన ఆదర్శాల గురించి పదేపదే చెప్పుకుంటాడు. భార్యలో ఎటువంటి తప్పున్నా క్షమించగలననీ భార్యాభర్తల మధ్య రహస్యాలుండకూడదనీ అంటాడు. చివరికొకరోజున తను పెళ్ళికిముందు చిన్నపొరపాటు చేశాననీ-అది తన మనసును వేధిస్తున్నదనీ అంటాడు. భార్య కూడా ఏదైనా చిన్న తప్పు చేసి వుంటే తన మనసుకు తృప్తిగా వుండేదంటాడు. ఆమెను దేవతలా చూస్తూ తానామెకు దూరంగా వుండడం ప్రారంభిస్తాడు.
    భర్త పన్నిన ఈ వలలో భార్య పడిపోయింది భర్త తన్ను తాను నిందించుకుంటూ అసంతృప్తితో బాధపడడమూ, తనను దేవతలా చూడడమూ భరించలేక-ఆమె పెళ్ళికిముందు తను చేసిన తప్పు గురించి చెప్పేస్తుంది.
    "నువ్విలాంటిదానివని చాలాకాలంగా అనుమానిస్తున్నాను. నీచేత ఈ నిజం చెప్పించడానికే ఇన్నాళ్ళుగా నాటకమాడుతున్నాను. నీవంటి కులట నాకు వద్దు-" అంటాడు భర్త.
    అతడామెను వదిలిపెట్టేస్తాడు.
    ఈ కథలోని నీతి ఏమిటో కూడా రచయుత్రి చివర చెప్పింది-"ఆడది తప్పుచెయ్యడం తప్పుకాదు. నీ భర్త తప్పును మన్నిస్తాడని నమ్మకం తప్పు...."
    ఈ కథ గుర్తుకు రాగానే కవితకు బెంగపట్టుకుంది. చలపతిరావు తనను వెంకటేశ్వర్లు, లక్ష్మిల విడాకుల గురించి ఎందుకు చెప్పాడు? తన చేత నిజం చెప్పించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడా? అతడికి తనపై అనుమానం కలిగిందా? శామ్యూల్ గురించి అతడికి తెలిసిపోయిందా?
    ఆలోచనలతో కవితకు నిద్రపట్టేసరికి చాలా  ఆలస్యమయింది. చలపతిరావు ఆ రాత్రికామెను పలకరించలేదు.

                                    6

    ఆ రోజు కూడా చలపతిరావు ఉదయం ఎనిమిది గంటలకే బయటకు వెళ్ళిపోయాడు.
    సరిగ్గా పదిగంటలకు కవిత గదిలో టెలిఫోన్ మ్రోగింది. ఆమె భయపడుతూనే రిసీవర్ తీసింది.
    "గడువు అయిపోయింది-" అన్నాడతను.
    "నేను నిర్ణయం తీసుకున్నాను. మీకు డబ్బివ్వాలని" అంది కవిత.
    "చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు...." అన్నాడతను.
    "కానీ ఈ నెలకు నేను మీకేమీ ఇచ్చుకోలేను. వచ్చే నెలనుంచి ప్రారంభిద్దాం...."
    "వచ్చే నెలనుంచా? అదేమీ లాభంలేదు. ముందే చెప్పాను...."
    "ప్రారంభం ఈ నెలనుంచే.....ఈ నెలకివ్వాల్సిన రెండువేలూ బాకీగా అనుకోండి. వచ్చే నెలలో రెండు నెలలదీ కలిపి నాలుగువేలూ ఇస్తాను...."
    "నథింగ్ డూయింగ్...."
    "ఈ విషయంలో నేను అసహాయురాలిని...."
    "అయితే ఈ రోజే మీ భర్తకు అన్నీ చెప్పేస్తాను."
    "ప్లీజ్....అలా చేయొద్దు...."
    "చాలాబాగుంది లక్షరూపాయలకు యాభై వాయిదా లివ్వడమే ఓ పెద్ద విశేషం. అందులో మళ్ళీ అప్పుకూడానా?"
    కవిత అతడికి తన పరిస్థితి వివరించి చెప్పింది.
    "అయితే ఓ పని చేయండి. మీకింకో ఇరవై నాలుగు గంటల వ్యవధి ఇస్తున్నాను. ఈలోగా ఆ రెండువేలూ ఎలా సంపాదిస్తారో ఆలోచించుకోండి. రేపు ఉదయం పదిగంటలకు మీ దగ్గర నాకివ్వడానికి రెండువేలూ సిద్దంగా వుండాలి. లేనిపక్షంలో అంతే!" అవతల ఫోన్ క్లిక్ మంది.
    కవిత ఆలోచనలో పడింది. తనకింక వ్యవధిలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. విషయం భర్తకేనా చెప్పుకోవాలి. లేదా ఏదో విధంగా డబ్బు సిద్దంచేయాలి.
    లక్షరూపాయలు....
    తను చేయని తప్పుకు మూల్యంగా అంత మొత్తం చెల్లించాలా? భర్తమీది అపనమ్మకంతో అంత డబ్బు పోగొట్టుకోవాలా?
    కవిత మనసు ఉసూరుమంటున్నది.
    అటు జీవితం....ఇటు లక్షరూపాయలు....
    లక్షరూపాయల గురించి ఆమె మరీ అంతగా బెంగ పడడంలేదు. ఈ బ్లాక్ మెయిలర్ బాధ తనను జీవితాంతం వదలదేమోనని ఆమె భయం.
    పిరికివాడికి వెయ్యి చావులు ధైర్యవంతుడికొక్కటే చావు.
    ఏదో ఒకటి అవుతుంది. భర్తకు విషయం చెప్పేస్తే.
    మళ్ళీ ఆమెకు ఆ కథ గుర్తుకు వచ్చింది.
    ఆలోచనలతో కవిత సతమతమవుతూండగా ఆమెను కలుసుకొనేందుకు ఒక యువతి వచ్చింది.
    కవితకు ఆమె ఎవరో తెలియదు. అయినా మర్యాదగా పలకరించింది.
    "నా పేరు రేఖ కానీ నిజానికి మిమ్మల్ని మా అన్నయ్య కలుసుకోవలసింది-" అన్నదామె.
    "మీరెవరో నాకు తెలియదు. మీ అన్నయ్య కూడా నాకు తెలిసివుంటాడని నేననుకోను-" అంది కవిత.
    "అందుకే మా అన్నయ్య నన్ను పంపాడు. అనవసరంగా ఆడవాళ్ళపైన అపవాదులు రావడం అన్నయ్య కిష్టముండదు-...."
    "విషయం చెప్పండి...."
    "అన్నయ్య మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కలుసుకుంటే అది ఎన్నో అపర్ధాలకు దారితీస్తుంది. ఆడవాళ్ళ గురించి అన్నయ్య ఇంతదూరం ఆలోచిస్తాడు. దీన్నిబట్టి అన్నయ్య మంచితనం మీరు అర్ధం చేసుకోనవచ్చును..." అందామె.
    "మీ అన్నయ్య మంచితనం గురించి నేనెందుకు అర్ధం చేసుకోవాలో నాకు తెలియటంలేదు-..."
    "ఎందుకంటే మా అన్నయ్య మీవారి గురించి ఏదైనా విశేషం చెబితే అది మీరు మీపట్ల సానుభూతిగా మాత్రమే అర్ధం చేసుకోవాలి...."
    "చెప్పండి...." అంది కవిత విసుగ్గా.
    "ఇలాంటివి మాటల్లో చెప్పటం ఇబ్బందిగా వుంటుంది.....ఇది చూడండి...." అంటూ ఆమె ఓ కవరు నందించింది కవితకు.
    కవిత ఆ కవరునందుకుంది. అందులో నాలుగు ఫోటోలున్నాయి. అన్నింట్లోనూ ఒక యువకుడు, యువతి, ఇద్దరిమధ్యనూ ఎంత చనువున్నదో ఆ ఫోటోలే చెప్పక చెబుతున్నాయి.
    ఆ ఫోటోలోని యువతి ఎవరో కవితకు తెలియదు. యువకుడు మాత్రం ఆమె భర్త చలపతిరావు.
    కవిత చేతులు వణికాయి-"ఈ ఫోటోలు నాకెందు కిచ్చారు?"
    "అన్నయ్యకు ఆడవాళ్ళంటే సానుభూతి. ఆ ఆడవాళ్ళను మోసగించే మగవాళ్ళంటే చిరాకు. పెళ్ళికి ముందు మీవారి చరిత్ర ఇది. పెళ్ళయినాక ఇంకా ఇలాంటి చరిత్ర ప్రారంభమైన దాఖలాలు లేవు. కానీ చెప్పలేం! మీరు మీవారిని ఆరాధిస్తున్నారు. ఆయన ఆ ఆరాధనకు అర్హుడు కాదు. మీ మనసులో ఆయనకు సరైన స్థానం ఇవ్వటంకోసం ఈ ఫోటోలుపయోగిస్తాయి. వుంచుకోండి" అని చరచరా వెళ్ళిపోయిందామె.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra