Home » Ganti venkata ramana » Mogali Podhalu


                                    16
    కృష్ణ ప్రియ తల దించుకుని కూర్చుంది. 'నీకు కొన్ని విషయాలు చెప్పాను. పిన్ని నాకు చెప్పిన సంగతులు యేవీ దాచలేదు. నా జీవితంలో చాలా భాగం కష్టాల్లోనే గడిచిపోయింది.
    'చంద్రమౌళి , భార్యా నన్ను పెళ్లి చేసుకో మన్నప్పుడు నిన్ను చేసుకుంటే ఏం అనిపించింది. ఏమంటావు కృష్ణా!' నెమ్మదిగా అడిగాడు శ్రీనివాస్.
    కృష్ణ ప్రియ మాట్లాడలేదు.
    'నీకు యిష్టం అవునో కాదో చెప్పు. నేను నారాయణ బాబుకి నిన్న రాత్రే చెప్పి వచ్చాను. అయన మనస్పూర్తిగా అభినందించారు. పిన్నిని కనిపెట్టుకుని పిల్లల్ని చూసుకోవడం నాకేవీ సమస్య కాదు. నేను త్యాగం చేస్తున్నానని అనుకోవడం లేదు. నీకూ యెవరూ లేరు. రాత్రిళ్ళు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఈవాడలో. నిన్ను అలా నీ ఖర్మ కి వదిలేయడం నాకు యిష్టం లేదు.'
    కృష్ణ ప్రియ అతని పాదాల మీద చేయి వేసి : 'నన్ను క్షమించండి మాష్టారూ. నేను కొంచెం ఆలోచించుకోవాలి. పెట్టె మనుషులు లేకపోయినా నా చుట్టూ కొంత బలగం వుంది' అంది.
    శ్రీనివాస్ ఆప్రయత్నంగా కృష్ణ ప్రియ చుట్టూ చేతులు వేశాడు ధైర్యం చెబుతున్నట్లు: 'ఒకటి కాదు, రెండు కాదు నీ యిష్టం వచ్చినన్ని రోజులు ఆలోచించుకో. ఆలోచించే ముందు నా గుండెల్ని కోసే నిర్ణయానికి మాత్రం రాకు. నిన్ను చూసినప్పటి నుంచీ వున్న అభిప్రాయం ప్రేమగా మారిపోయింది. నువ్వూ మోసం చేస్తే నేను యీ బ్రతుకంతా దుఃఖం తోనే గడపాలి. నా మీద కొంచెం జాలి చూపించు. నా జీవితాన్ని గురించి ఏది దాచకుండా చెప్పాను. నేను ప్రాధేయపడుతున్నాను,' అతని వెచ్చని బాహు బంధాల్లో రెండు నిమిషాలు ఆలోచనల మధ్య వుండి పోయింది కృష్ణ ప్రియ. అతని దగ్గర సెలవు తీసుకుని యింటి వైపు మళ్ళింది. అన్నపూర్ణ ముద్దుగా కృష్ణ ప్రియని 'కోడలా' అనే అంటుంది. బ్రాహ్మణి అయిన ఆవిడను చూస్తె కొండంత ధైర్యం వస్తుంది. సమాజాన్ని చూస్తె పిరికిదై పోతుంది కృష్ణ ప్రియ.
    యింటి నాలుగు గోడల మధ్య యేకాకిలా మిగిలిపోయిన కృష్ణ ప్రియకి దుఃఖం కట్టలు తెంచు కు వస్తోంది. యెవరూ లేని తనకి శ్రీనివాస్ 'నేనున్నాను రావోయ్' అంటున్నట్లే వుంది. నిజం ఆలోచిస్తే అతను లేకుండా తను బ్రతకలేదేమో అనిపిస్తోంది కూడా. అయినా సంఘం తాకిడికి తట్టుకోగలదా ...తెగించి నిర్ణయానికి వచ్చేసింది. ఏడుస్తూంటే వుత్తరం ముందుకు సాగడం లేదు. అయినా నిగ్రహంగా పూర్తీ చేస్తోంది.
    'మాస్టారూ'
    హృదయ పూర్వక నమస్కారాలు. మీ జీవితం నా ముందు పరిచారు. విని నాలాంటి వాళ్ళు జాలి చూపించడం తప్ప మరేం వుంటుంది? నాకు యెవరూ లేరు. మీరు అత్యంత అనురాగంతో రెండు చేతులూ చాపి మీ బాహు ద్వయంలో నాకు రక్షగా ఆశ్రయం యిస్తానంటున్నారు. ఎంతటి అదృష్టం నాది. ముప్పయ్ యేకరాలకీ మరి కొంత ధనానికీ నేను బానిసను కాలేను ....అమ్మా నాన్నా పోయాక మేనామామ యింట్లో పెరిగాను. మామయ్య దయాభిక్ష తో మీ శిష్యరికంతో నా పరీక్ష పూర్తీ అయింది. దురదృష్టం, మామయ్య కూడా పోయాడు నన్ను మరీ యేకాకిని చేసి.
    మీమీద నాకు గౌరవం వుంది. అభిమానం వుంది. వీటి రెండింటినీ కలిపి నేను 'ప్రేమ' అని ఎలా చెప్పగలను? కొందరికి అర్హత బట్టి అదృష్టం లభిస్తుందిట......నాకు ఆ అర్హత లేదు అదృష్టమూ లేదు. అలాగని ఎక్కడో చదివాను. అదృష్టం మరికొందరి కి పడగ విప్పి గొడుగు పడుతుందిట. నాకు యేమీ లేవు.
    మీ బాబుకు తల్లీగా, మీకు యిల్లాలిగా వుండడం ఎంతటి అదృష్ట వంతులకి? నీకెందుకు లేదు అని నన్ను ప్రశ్న వేస్తున్నారు మీరు. మీకు ఎలా చెప్పను? నేను యేకాకిగానే బ్రతుకుతున్నాను. నిజమే కానీ నా చుట్టూ సంఘం నన్ను యేకాకి అని వదిలిపెట్టేయడం లేదు. కాకుల్లా నా చెవి గూబలు చిల్లులు చేస్తూ అరుస్తుంటే తట్టుకోలేక పోతున్నాను. పెళ్లి కానీ, ఆలంబన లేని ఆడపిల్ల అంటే అందరికీ అలుసే. ఆశ కూడా వుంటుంది. రత్నాకరం వచ్చాడు. తనని పెళ్లి చేసుకోమన్నాడు. ఒకప్పుడు మావయ్య అడిగితె కానీ కట్నం యివ్వలేని నీ కోడల్ని చేసుకునే పాటి ఆదర్శం నాకు లేదన్నాడు. అప్పట్లో రత్నాకరం మేరీ ప్రేమలో చిక్కుకు పోయాడు. మేరీ అతన్ని కాదని వెళ్ళిపోయింది. కట్టుకున్న యిల్లాలైతే పడి వుంటుందని గ్రహించాడు కాబోలు. అందుకే రాత్రి వచ్చి చాలాసేపు కూర్చుని ఆలోచించు కొమ్మని మరీ మరీ చెప్పాడు. ఆలోచించేందు కు కేముంది? ఆనాడు కానీ యిచ్చుకోలేని స్థితిలో మావయ్య వున్నప్ప్జుడు అతనికి ఆదర్శం లేకపోయింది. మేరీ ఒక్కతే అయితే నేనూ చూపించేదాన్ని ఏదో కొంత చదువుకున్న సంస్కారాన్ని. వనజ, లలిత రోజ్ వీళ్ళంతా యేమైపోయారు? కుసుమ ఆత్మహత్య కి కారణం రత్నాకరం కాదని సంఘం అంటుందా? అందుకే నేను ఒద్దనేశాను.
    నా గురించి నేను ఆలోచిస్తుంటే బుర్ర పగిలి పోతుందేమో అనిపిస్తుంది. నేను మంచి కుటుంబం లో పుట్టాను. ఫలానా అయన కూతురు శ్రీనివాస్ ని చేసుకుంది అని నా చెవుల్లో అంటుంటే నేను యెలా భరించను? సంఘానికి కావలసింది కులం -- గోత్రం , మంచీ - చెడూ. మనం చేసింది మంచి అని నిరూపించినా వూరుకోదు. ఈ సంఘం తాకిడి కి నేను తట్టుకోలేను. నాకు యెవరూ వొద్దు. పెళ్లి అనే పదానికి అర్ధం అంటూ వుంటే అది మీ అంతరాత్మ విప్పి చెప్పిన క్షణం లో అప్రయత్నంగా మీ కౌగిలి లో కరిగిపోయిన ఆ  ఘడియే సుముహూర్త బలం అయిపోయిందేమో అనిపిస్తోంది. నేను మీతో కాపురం చేస్తూ చిత్రవధ అనుభవించ లేను. సంఘం తో మనకేవిటి అనచ్చు మీరు? కానీ మనం అరణ్యాల్లో వుండడం లేదు మాస్టారూ! మీకే పాఠాలు చెబుతున్నాని అనుకుంటున్నారా. ఈ సమయంలో ఈ కటిక రాత్రిలో భయంకర వాతావరణం లో , కీచురాళ్ళ ధ్వనిలో , హోరు గాలీ వానలో నాకూ వొక తోడూ, ఆ తోడూ జీవితం అంతా వుండాలని కోరికగా వుంది. అయినా ఏం చేయను? సంఘాన్ని యెదిరించే ధైర్యం సాహసం నాకు లేవు. నేనూ అబలనే. నాక్కావలసిందేదో గ్రహించినా అందుకోలేని అదృష్ట వంతుల్లో దురదృష్ట వంతురాలిని. మిమ్మల్ని చేసుకుంటే ? ....నిజమే నా జీవితం నాతోటే అంతం అయిపోతుంది అనిపిస్తుంది వొక్కోసారి. మరుక్షణం కాటుక కొండల్లాంటి భయం నన్ను ముసురుకొని కర్తవ్యం నూరిపోస్తూ నన్ను అశక్తు రాలీని చేస్తున్నాయి. నా మనసు 'వూ' వుహు' లతో కొట్టుకు పోతోంది. ఇంక మీ సమక్షం లో యిలాగే వుండిపోతే నాకు మనశ్శాంతి వుండదు. ఈ వుత్తరం మీకు అందించాక నేను వెళ్లి పోతాను. నా కోసం వెతికించకండి. జీవితం మీద యే ఆశా లేదు నాకు. అడవిలో మొగలి పువ్వు పూచి అక్కడే రాలిపోయిందనుకోండి. స్త్రీని అలా పోలిస్తే నే బాగుంటుంది. చుట్టూ వున్న ముళ్ళ పోదల్ని తోసుకుని భూమి మీద రాలిపోలేదు. అందుకే ముళ్ళల్లోనే చిక్కుపడి నలిగి, చిరిగి పోతుంది. సమాజం లో నాలాంటి వాళ్ళు యింతే. అసలు స్త్రీ జాతే అంతేమో. ఎన్ని ముళ్ళూ, ఎన్ని దొంక లూ యివన్నీ దాటి రాగలదా మొగలి పువ్వు. ఆ పువ్వు సౌరభం కోసం తహతహలాడే సహృదయులు తప్పకుండా ధైర్యంగా తీసుకుంటారేమో. కానీ ఆ ప్రాప్తి అన్ని పూలకీ వుండాలి కద. మీ కళ్ళ  ఎదుటే మీ పిన్నీ, చెల్లీ నేనూ.... అన్యాయం అయిపోయాం అనిపిస్తోంది. పొదలే లేకపోతె ఆ ఘాబాళింపుకి ప్రపంచం పరవశించి పోయేదేమో. పసివాడికి నా ముద్దులూ, ఆశీస్సులూ , మీకు నా కడసారి నమస్కారాలు.
                                                                                        ఇట్లు,    
                                                                ఎప్పటికీ మీదాన్ని అనుకుని తృప్తి పడే
                                                                          ---మీ కృష్ణ ప్రియ.

          
    ఉత్తరంలో అక్షరాలూ చాలా వరకూ తడిసి ముద్దై పోయాయి. అప్పటికే ఒకటికి పదిసార్లు రాసింది కృష్ణ. ప్రతి అంగుళం లో శ్రీనివాస్ ప్రత్యక్షం అవుతూ రెండు చేతులూ చాపి 'ఎందుకోయ్ వొంటరిగా భయపడతావ్? నీకు నేను వున్నాను రా' అంటున్నాడు విశాల వక్షస్థలం చూపిస్తూ. కంటికీ మింటికీ యేక ధారగా యేడుస్తోంది కృష్ణ.
    'కృష్ణా వీడు చూశావా? పిన్ని అనగానే నీ వైపే వేలు పెట్టి చూపిస్తున్నాడు యేరా రవీ కదూ.'
    కృష్ణ సిగ్గుగా ముడుచుకు పోయింది.
    'సంఘం అంతే వట్టి ఫార్స్ కృష్ణా! భయపడితే కాళ్ళ క్రిందికి నోక్కేస్తుంది. అగాధం లోకి దింపేస్తుంది. ఎదిరించి చూడు నీ జోలికే రాదు,' శ్రీనివాస్ బుగ్గన సొట్టలు పడుతున్నాయి. అతను చాలా కాలానికి కృష్ణప్రియ సమక్షంలో నవ్వుతున్నాడు.
    'నేనేం చేయను మాష్టారూ,' అమాయకంగా అడిగింది.
    'ఆలోచించు , ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు పోనీ యేడాది. సమయం మించిపోతే మాత్రం విచారించి లాభం వుండదు. నా కొడుక్కి తల్లివై నాకు భార్య వై యీ జీవిత కాలంలో అయినా కాస్త మనశ్శాంతిని ప్రసాదిస్తావేమో అనే నా అత్యాశ. నేను నీకు తగనా.....'
    'అది కాదు మాష్టారూ.....'
    'నీకు యెవరూ లేరు. రత్నాకరం , ఆచారి వీళ్ళంతా నిన్ను ఒంటరిగా బ్రతకనివ్వరు. పిన్ని సంగతి నేను అబద్దం చెప్పలేదు. చెల్లిని చూశావు కదా.'
    కృష్ణ తల వూపింది.
    'పిన్ని సర్వనాశనం అయిపోవడానికీ అవిడిని సంఘం వంచించేందుకు కారణం ఆడది వొంటరి దై పోవడం కాదంటావా'
    యెక్కడో పిడుగు పడింది. కృష్ణ ప్రియ వులిక్కి పడింది. ఎదురుగా అద్దంలో ప్రతిబింబం తనని భయపడుతోంది.
    'నీకు యెవరూ లేరు,' గోడలు చిల్లులు పడుతూ ఏదో అదృశ్య శక్తి గోల. తల విదిలించి వుత్తరాన్ని పదేపదే చదువుతోంది కృష్ణ ప్రియ.
    కృష్ణ ప్రియకి 'నా' అనేవారు యెవరూ లేరు. 'నేను' అని బాసటగా నిలిచిన హేమలత మాటలు నిజమో అబద్దమో అర్ధం కావడం లేదు. ఆ పిల్ల అన్న ప్రతి విషయం లీలగా కదులుతుంటే కృష్ణ అంతరంగం ఘోర సంఘర్షణ లో కొట్టుకుంటోంది.
    'నీకు తెలీదు కృష్ణా . ఈ మగవాళ్లు అందరూ అంతే. నేనున్నానోయ్ . నీకేం భయం అంటారు. నిజంగా చెప్పాలంటే ప్రపంచం లో మగవాళ్ళ అంత వంచకులు మరెవరూ కనిపించరు నాకు. నువ్వు ఆడపిల్లవు. వంటరి దానివి. సాధ్యం అయినంత వరకూ వాళ్ళ దాహం తీర్చుకుని పీచే ముడ్ లెఫ్ట్ రైట్ అంటారు. నా మాట నమ్ము. మనసు త్వరగా పదేసుకుంటే జీవితం పొడుగునా యేడ్చే ప్రమాదం వుంది.'
    'నన్నేం చేయమంటావు నువ్వు చెప్పు పోనీ నీ దగ్గర ఏదీ దాచలేదు. అతని వ్యక్తిగత విషయాలు నాకు తెలిసినదంతా చెప్పేశాను.'
    'ఒకమాట చెబుతాను నన్ను నమ్ముతావా.'
    'చెప్పు, నీకన్నా నాకు సన్నిహితులు యెవరూ లేరు. అందుకే నీ దగ్గర ఈ విషయాలన్నీ చెప్పి సలహా అడుగుతున్నాను.'
    'అతన్ని గురించి నువ్వు విన్న చరిత్ర అబద్దం'........
    'హేమా, కృష్ణప్రియ ఆశ్చర్యంలో తలమునకలు అవుతోంది. ఎన్నో వేల పిడుగులు ఒకటొకటిగా పడుతున్నాయి కృష్ణ ప్రియ నెత్తిన. 'నేను నమ్మలేను హేమా. ఆవిడ కూడా వున్నారు. యిదంతా అబద్దం అవుతే మరి ఆవిడా, ఆ ఆస్తీ............'
    'పిచ్చి కృష్ణా! వార్ధక్యం లో వృద్ధులకి తోచింది చేయడం లో ఆశ్చర్యం లేదు. కానీ...అతను భార్యని చిత్ర హింస పెట్టేవాడని అందరూ అనుకుంటూనే వుంటారు. ఆ పిల్లాడిని బలవంతాన తల్లికి దూరంగా తీసుకు వచ్చేశాడు. అండలేని స్త్రీ  అగచాట్ల పాలు అయిపోవడం కన్నా ఆ దేవదాసు ని చేసుకోవడం లో రాజేశ్వరి తప్పేమీ చేయ లేదంటాను.'
    'నువ్వు సమర్శిస్తున్నావా. ఆడది భర్త వుండగా మరో పెళ్లి చేసుకోవడం యిదేం న్యాయం. నేను హర్షించను.'

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra