Home » Kommanapalli ganapathi rao » Goruvechani Suridu

   వెళ్ళిపోయారాయన.    
    అప్పుడు చూసింది కృషి....విజయ గర్వంతో నవ్వుతున్నాడు విస్సు- కొన్ని వారాల శ్రమకి దీక్షకి సమాధి కట్టి తననో నేరస్థురాలిగా మార్చాడు.    
    ఉగ్రనేత్రాలలో నుంచి జారిపడ్డ మొదటి అగ్ని కణంలా ఓ నీటి బొట్టు పైకి రాబోయి ఆమె కను కొలకుల్లోనే ఆగిపోయింది.    
    "తప్పదు కృషి నీ స్థానం ఈ ఇంట బలహీనపడుతూంది. నువ్వీ దేశం వదిలి వెళ్ళక తప్పదు" పరిహాసంలా అన్నాడు విస్సు.    
    అతడికి సరైన బదులు చెప్పాలి. అంత వరకూ మనసుకి వూరటలేదు. ఉద్రిక్త చైతన్యానికి తిరుగులేని ఓ విరామం లాంటి పదునైన బాణాన్ని సంధించాలి.    
    "ఓ సారి నా గదిలోకి రా" ఆహ్వానంలా పిలిచింది.   
    ఉలిక్కిపడ్డాడు విస్సు.    
    "ఊర్ధ్వోష్టంపై పుట్టుమచ్చ గల అమ్మయి శక్తేపాటిదో చెప్పిన నువ్వు ప్రాక్టికల్ గా దాన్ని రుచి చూడాలిగా.... రా...."  
    విస్సులో చలనం లేదు. ఇప్పుడు తనను ఓ ట్రాప్ లో ఇరికించబోతుందేమో అన్న సందిగ్ధంతో నిలబడిపోయాడు.    
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్. నేను ట్రాంక్విలైజరు మత్తులో వుంటే తప్ప గదిలోకి అడుగుపెట్టలేవేమో కదూ! ఫర్వాలేదు పిలుసున్నది నేనేగా కమాన్"    
    అది ఓ ఆదేశంలా వినిపించింది.    
    "పది సెకండ్ల గడువిస్తున్నాను"    
    వెళ్ళిపోయింది కృషి.... ఆరు సెకండ్ల పాటు టెన్సన్ గా నిలబడ్డ విస్సు ఆ తర్వాత జాప్యం చేయలేదు. సరాసరి ఆమె బెడ్ రూంలో అడుగుపెట్టాడు.    
    నవ్వింది భావరహితంగా "అర్దమైందిగా విస్సూ. సంకోచించే ఆడపిల్లని చూసి మగాడు వ్యాకోచిస్తాడు. యుద్దమే వద్దనే మనిషితో పోరాటానికి సిద్దమంటాడు. మూర్ఖుడైన నీలాంటి మగాడు. కాని యుద్దానికి నేను సిద్దమని పది సెకండ్ల గడువిచ్చేసరికి...
    "నేను వచ్చింది నీకు భయపడి కాదు"
    "నేనంటే నీకు భయమే లేకపోతే ఆ రాత్రి కాంప్లాన్ మత్తుమందెందుకు కలిపావ్....నిన్ను గుండెలపైకి లాక్కుని ఫోటోలు తీయించుకుంటానని ముందే చెప్పగలిగేవాడివిగా"    
    "ఎందుకు పిలిచావో చెప్పు"    
    "నా స్థాయికి...." క్షణం ఆగింది కృషి "ప్లీజ్ అండర్ లైన్ దిస్ సెంటెన్స్ మిస్టర్ విశ్వనాథ్... నా స్థాయి గల  ఆడపిల్లకి నిన్ను నేలమట్టం చేయడం కష్టం కాదు.... ఓ లక్ష నాది కాదనుకుంటే చాలు నిన్ను మించిన మొండితనం గల ఓ మగాడ్ని లేదూ ఓ గూండాని రంగంలోకి దింపి నీ కథని ముగించేయగలను. కాని ఆ పని చేయలేదూ అంటే కారణం నాకు జన్మతః వచ్చిన సభ్యత సంస్కారాలు... యస్ మిస్టర్ విశ్వనాథ్! ఈ క్షణం దాకా నిన్ను కాపాడింది అదే... నిజానికి నువ్వు ఫోటోలు చూపించి బెదిరించగానే నేను ఆగింది నీకు భయపడి కాదు...గ్రాండ్ పాకి నన్ను నేనలా పరిచయం చేసుకోవటం యిష్టం లేక....అసలు ఆ ఫోటోలు చూపించి నువ్వేం సాధించగల ననుకున్నావ్.... నీకూ నాకూ సంబంధం వుందని నిరూపించి నాకీ యింటిలో స్థానం లేకుండా చేయాలనుకున్నావ్. అంతేకదూ, కాని ఆ తర్వాత జరిగేదేమిటో తెలుసా నీ స్థాయి మనిషితో సంబంధం వున్న నన్ను గ్రాండ్ పా ద్వేషించే వాడేమోకాని బయటికి తరిమేసేవాడు మాత్రం కాదు విస్సు..... కాని నీ స్థాయి నువ్వు మరిచినందుకు నీకు వెంటనే ఉద్వాసన పలికేవాడు.....అంటే నాకు ఓ తాత్కాలికమైన నష్టాన్ని మాత్రం కలిగించిన నువ్వు మాత్రం శాశ్వతంగా బయటికి వెళ్ళిపోయేవాడివి...చెప్పు....ఏ ఫోటోలు నువ్వు మారణాయుధాలుగా భావించి మురిసిపోయావో వాటిని నన్నే స్వయంగా మా గ్రాండ్ పాకి చూపించమంటావా"    
    హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.    
    కోరి మూర్కంగా ప్రవర్తించే అలవాటు గల విస్సుకే అర్ధమైపోయింది. ఆమె ఎత్తులకి చివరి పై ఎత్తులా ఫోటోల ప్రహసనానికి సిద్దపడ్డాడు కాని అవి తన ఉనిక్కే ప్రమాదమని బోధపడిపోయింది.    
    "మాట్లాడు విస్సూ...ఇప్పుడు బలహీనపడిందెవరు....నువ్వా నేనా"    
    ఆమె ఊహించలేదు విస్సు అలాంటి సాహసం చేస్తాడని.... ఎటో చూస్తున్న కృషి చేతిలోని కవరుని గభాలున లాగేసుకున్నాడు - ముందు అవాక్కయిపోయిన కృషి ఆ తర్వాత అతడిపై కలియబడాలనుకుంటూనే ఆగిపోయింది ఇబ్బందిగా.   
    "ఏమిటి నువ్వు చేసింది" రొప్పుతూ అడిగింది.   
    "సింపుల్ కృషి - నువ్వో పరీక్ష రాస్తున్నావ్...ఇచ్చిన గడువు పూర్తయిపోయింది." చాలా నిశ్చలంగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడిప్పుడు. "ఇంతలో ఇన్విజలేటర్ వచ్చి నీ ఆన్సర్ షీటు లాక్కుపోయాడు..... అప్పుడు గుర్తుకొచ్చింది నువ్వు చివరగా ఓ బిట్ క్వెశ్చనుకి ఆన్సరు తప్పు రాశావని....అరక్షణం ఛాన్సు దొరికితే దాన్ని కరెక్టు చేసుకుంటావ్ - ఛాన్సిమ్మని ఇన్విజలేటర్ ని అడుగుతావ్ - ఇదీ అంతే - అయితే నేను నిన్ను అడగలేదు. అవకాశం తీసుకుని లాగేసుకున్నా ఆడపిల్లవిగా."    
    ప్రతి మొండివాడిలోనూ ఓ పసికందు వుండడమే నిజమైతే ఇక్కడ విస్సు కూడ పసిపిల్లాడిలా కనిపించాడు..... యోధుడైనవాడు ప్రత్యర్ధిని పోరాటంతో నిరాయుధుడ్ని చేస్తాడు తప్ప ఆయుధాన్ని దొంగతనం చేయడు.    
    వచ్చిన పనైనట్టు అతడు వెళ్ళబోతుంటే "ఆగు" అంది.    
    "నీకు కావాల్సింది నేనీ దేశం వదిలి వెళ్ళటమేగా."    
    "అదీ ఈ ఇంట నా సాహసానికి భంగం కలగకుండా" గుర్తుచేశాడు విస్సు.   
    "వెళతాను కాని నువ్వు యోధుడివే అని నిరూపించుకోవాలి" చెప్పింది కృషి. "సిద్దమేనా"    
    "ఏం కావాలి" సాలోచనగా చూశాడు. తన ఉనిక్కి యిబ్బంది లేకుండా వుంటే ఆమెను సాగనంపటానికి తను దేనికైనా సిద్దమే.    
    అరక్షణం తర్వాత అడిగింది "నీకే ఓ చెల్లి వుందనుకో....ఆ చెల్లి అమాయకంగా ఓ మగాడ్ని నమ్మి పెళ్ళి  కాకుండానే తల్లయే పరిస్థితి వచ్చిందనుకో ఎం చేస్తావు....నీ చెల్లిని చంపుకుంటావా లేక మోసం చేసిన మగాడ్ని నిలదీస్తావా"    
    "నిలదీస్తాను చీరేస్తాను."    
    "సరిగ్గా జీవిత అనే ఓ అమ్మాయి ఇప్పుడు అలాంటిక స్థితిలోనే వుంది విస్సు... దానికి కారణం మీ చౌదరి కొడుకు రాజేష్."    
    నిశ్చేష్టుడిలా చూశాడు.    
    "ఇది కల్పన కాదు విస్సూ. నిజం చావటానికి సిద్దంగా వున్న ఆమెను రక్షించిన నేను ఆమె బ్రతుక్కి హామీ ఇచ్చాను" కృషి మొహంలో ఇందాకటి చిలిపితనం లేదు. సీరియస్ గా చెప్పుకు పోయింది. "ఆమె కోసం పోరాడటానికి యిప్పుడామె అన్న బ్రతికిలేడు. చెప్పు నీకూ ఓ మనసుంటే ఆ మనసుకి ఆర్ద్రత వుంటే మోసగింపబడిన ఆ అభాగినికి న్యాయం చేయగలవా. అది నువ్వు చేయగలిగితే నీ మాట ప్రకారం నేను దేశం వదిలి వెళ్ళిపోతాను"   
    రెండు నిముషాల నిశ్శబ్దం తర్వాత అన్నాడు "సరే"    
    సంతృప్తిగా చూసింది తన కోసం పోరాటంలో అడుగుపెడతానన్న విస్సూని.    
                                       *    *    *    *    
    నిద్రపోతున్న రామనాథచౌదరి ఉలికిపాటుగా లేచాడు బెడ్ పక్కనున్న ఫోన్ రింగవుతుంటే.    
    "ఎవరు" విసుగ్గా అడిగాడు రిసీవర్ అందుకుని.    
    "నేనే"    
    అది కృషి కంఠం అని తెలియగానే ఆవేశంగా అరిచాడు "ఇంత రాత్రివేళ ఫోనెందుకు చేశావ్?"    
    "డిఫెన్స్ టెండర్ సాధించగలిగిన నిన్ను అభినందించాలని."    
    "దటీజ్ రామనాథచౌదరి"    
    కృషి నవ్వు వినిపించింది.    
    "దటీజ్ కృషి" వెంటనే అంది మళ్ళీ "ఇంతవరకూ మనమధ్య బేరీజు వేసుకుంటే నువ్వే ఎక్కువ నష్టపోయావ్ చౌదరీ. ఈ సత్యం నీకీపాటికే తెలిసే వుండాలి."    
    "అందుకే నిన్ను శాశ్వతంగా నష్టపరచాలని విశ్సూని నీ ఇంటికే పంపేను."    
    "కాని ఎం సాధించగలిగాడు?"    
    "ఇంకా వ్యవధి వుంది"    
    "అని నవ్వనుకుంటే చాలదు చౌదరీ. నువ్వు ధైర్యవంతుడివేమో కాని తెలివైన వాడివి కావు"    
    "ఎందుకలా అనిపించింది"    
    "ఓ జోక్ చెబుతాను విను"    
    నిద్ర లేపిన కృషి ఇప్పుడింత ప్రశాంతంగా మాట్లాడుతుంటే చౌదరికి చిర్రెత్తుకొస్తున్నా నిభాయించుకున్నాడు.    
    "నీలాంటి ఓ తెలివైన వాడిననుకునే ఓ చౌదరి, ఇంకో స్కూలు విద్యార్ధి, డాక్టరు ముగ్గురూ ఓ విమానంలో ప్రయాణం చేస్తున్నారట, హఠాత్తుగా విమానం ప్రమాదంలో చిక్కుకుంది. విమానం నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లో నుంచి బయటకివచ్చి ముగ్గురితో అన్నాడట."    
    "ఏమని" వ్యగ్యంగా అడిగాడు చౌదరి.    
    "విమానంలో రెండు పేరాచ్యూట్స్ వున్నాయి. మీ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే వాటి సహాయంతో దూకి ప్రాణాలు కాపాడుకోవచ్చని అంతే అందిన ఓ పేరాచ్యూట్ తో చౌదరి దూకేసాడు. తర్వాత డాక్టరు దూకేసాడు తర్వాత స్కూలు విద్యార్ధి దూకటానికి ప్రిపేరవుతున్నాడు అప్పుడు పైలెట్ అన్నాడు విద్యార్ధితో 'నువ్వెలా నీ ప్రాణాలు కాపాడుకుంటావూ' అని పేరాచ్యూట్ ఉందిగా అంటూ చూపించాడట స్కూలు విద్యార్ధి. నేను ఇచ్చినవి రెండే పేరాచ్యూట్స్ గా అన్నాడు ఫైలట్, మూడోది ఎక్కడనుంచి వచ్చిందో అర్ధం కాక. డాక్టర్ పేరాచ్యూట్ సాయంతోనే దూకాడు గాని మొదట దూకిన చౌదరి మాత్రం నా స్కూలు బేగ్ ని పేరాచ్యూట్ గా భ్రమపడి దానితోనే దూకేసాడని చెప్పాడా విద్యార్ధి."    
    అతని మొహంలో రంగులు మారేయి.    
    "అంటే ఆ తర్వాత చౌదరి ఫేట్ ఏమైవుంటుందో ఈపాటికి నీకు అర్ధమై వుండాలి మిస్టర్ చౌదరీ... దీన్ని బట్టి నీది ఎంత తెలివితక్కువ దూకుడో తెలిసిపోతూందిగా.  చెప్పొచ్చేదేమిటంటే నువ్విప్పుడు ఖచ్చితంగా అలాంటి సమస్యలో ఇరుక్కున్నావు."    
    "క్లియర్ గా చెప్పక..." పళ్ళునూరేడు చౌదరి.    
    "రేపు ఉదయం దాకా ఆగితే నీకే అర్ధమౌతుంది." క్షణం ఆగి అంది కృషి. "పాపం టెన్షన్ కి గురవుతున్నట్టున్నావ్ కదూ....అయితే విను. నువ్వు నీ కొడుక్కి ఓ సెంట్రల్ మినిస్టర్ కూతురితో పెళ్ళి సెటిల్ చేసినట్టున్నావ్. బహుశా అలాంటి సంబంధంతో నీ ఎంపైర్ ని కాపాడుకోవడం నీ అభిమతం కావచ్చు కానీ మీవాడు జీవిత నే ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు. మోసగించబడిన ఆ అమ్మాయి ఆత్మహత్యకి సిద్దపడితే నేను కాపాడి జరిగిన వ్యవహారం గురించి పోలీసుల దగ్గర స్టేట్ మెంట్ ఇప్పించాను. సో.. నీ కొడుకు ఇప్పుడు ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి."    
    హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.    
    "ఏం చౌదరీ గొంతు పెగలడం లేదా"    
    "నువ్వు చెప్పిన వ్యవహారం నాకు తెలీనిది కాదు"    
    "మరిప్పుడేం చేయాలనుకుంటున్నావ్".        
    జవాబు చెప్పలేకపోయాడు వెంటనే. అదికాదు చౌదరి ఆ క్షణంలో ఆలోచిస్తున్నది. తన సామ్రాజ్యానికి సంబంధించిన ఆనుపానులే గాక తన కుటుంబానికి చెందిన వ్యక్తుల కదలికల్ని కూడా ఆమె గమనిస్తూంది. వాటి పరంగా తనపై దండ యాత్రకి ప్రిపేరవుతూంది. ఇంతవరకూ వెళ్ళిన కృషి ఇక విడిచిపెట్టదు. ఏదో రాద్దాంతం చేస్తుంది. అసలు 'జీవిత లాంటి శతృశేషం మిగిలివుండడమే ఈ అనర్ధానికి కారణం' అని చౌదరి ఆ క్షణంలో అనుకుంటే అది అతడి తప్పుకాదు    
    "జీవితకి నువ్వు హాని చేయలేవు చౌదరీ....ఎందుకంటే మీవాడు రాసిన ప్రేమలేఖలు ఇప్పుడు జీవిత దగ్గర భద్రంగా వున్నాయి ఇప్పుడు నువ్వు తెలివైనవాడిలా తొందరపడటం ఇందాక నేను చెప్పిన జోక్ లో చౌదరి స్కూలు బేగ్ తో విమానంలోంచి దూకడమవుతుంది. సో...సెంట్రల్ మినిస్టర్ కూతురు సంబంధాన్ని పక్కకిపెట్టి జీవితని కోడలుగా చేసుకుంటే బ్రతికిపోతావ్"   
    ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు...    
    అప్పటికే చౌదరికి ముచ్చెమటలుపోసాయి. తన స్థాయివాడికి ఆ సమస్య చాలా చిన్నది కావచ్చు. కాని ఇప్పుడు జటిలంగా మారిపోయింది. విషం సీసాలో వున్నంతసేపూ ప్రమాదం కాదు. గొంతులోకి దిగితేనే ప్రాణ హాని కలిగించేది. ఇప్పుడు ఆ చిన్న సమస్య కృషిదాకా వెళ్ళడంతో గొంతుదిగి కంగారు పుట్టించేదిగా మారిపోయింది.
   ఆ రాత్రి రామనాథచౌదరి నిద్రపోలేదు.....సమస్య పరిష్కారానికి ఏ మార్గం అనుసరించాలీ అన్న మీమాంసలో తెల్లవార్లూ గడిపాడు.    
    ఉదయమే లాయర్ రంగధాంతో ఆ విషయం చర్చించాలనుకున్నాడు. కనీసం ఎమ్మెల్యే రాజారావు సహాయంతో ఏదన్నా చేయాలనుకున్నాడు. కాని కృషిని ఎదుర్కోటానికి మరేదో అనూహ్యమైన మార్గాన్ని వెదకాలని నిర్ణయించుకుని ఇద్దరితోనూ సంప్రదించడం మానేశాడు.    
    ఇక్కడ చౌదరి కొడుకు చేసిన తప్పు గురించి ఆలోచించడం లేదు. కృషి పరంగా ఎదురయ్యే యిబ్బంది గురించే ఆందోళన పడుతున్నాడు.    
    సరిగ్గా ఆ సమయంలో విస్సూ అతడి దగ్గరికి వచ్చాడు.    
    అసలు కృషి అంతలా రెచ్చిపోవటానికి విస్సూ వైఫల్యమే కారణమనిపించడంతో ఆవేశంగా అనేశాడు విస్సూని చూడగానే "నువ్వో సమర్దుడివి అని పంపితే ఇంతవరకూ ఒక్క అరంగుళం ముందుకు సాగలేకపోయావ్. అసలు నీ వలన సాధ్యమవుతుందా అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra