Home » Suryadevara rammohan rao » Premaku Pettubadi Kavali


    "మీకు జెన్యూన్ రిపోర్ట్ కావాలా..... ఫాల్స్ రిపోర్ట్ కావాలా?" ఆ ప్రశ్నకు మరి జవాబు చెప్పలేకపోయాడు సుల్తాన్.

 

    "మూడ్రోజుల్లో కలుస్తాం" అని చెప్పి ఇద్దరూ ఏజెన్సీలోంచి బయటకొచ్చేశారు.

    
                                             *    *    *

 

    జగదంబా థియేటర్ కి ఎదురుగా వున్న ఫుట్ పాత్ మీద సీరియస్ గా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

 

    "జెన్యూన్ రిపోర్ట్..... అన్విత ఏ సమయాల్లో, ఎలా ఎందుకు ఫీలవుతుందో చెప్తాడు."

 

    "చెప్తాడంటావా..... ఎలా చెప్తాడ్రా...... జ్యోతిష్యమా..... వాస్తా?"

 

    "ఏడిసినట్టే వుంది. వాస్తు అంటే ఇళ్ళ గురించి చెప్పే వ్యవహారం. ఇది సైన్స్..... బైనాక్యులర్స్ తో పరిశీలిస్తాడు. గోడ దూకుతాడు. సైకలాజికల్ హంటింగ్."

 

    "నిజం కాకపొతే?"

 

    "మన ఏభై మనవే."

 

    "ఆ మాట మనం చెప్పలేదు."

 

    "అడ్వాన్స్ ఇచ్చే ముందు చెప్తాం."

 

    "పద...... హోటల్ ఖాళీ చేసేసి ట్రైనెక్కేద్దాం" హుషారుగా అన్నాడు.

 

    అదేరోజు రాత్రి ఏలూరు వచ్చేశారు మిత్రులిద్దరూ.

 

    

                                           *    *    *

 

    ఉదయం తొమ్మిదిగంటల సమయంలో మైదానం నారాయణ ఇంట్లోకి అడుగుపెట్టాడు మధు.

 

    "బిజినెస్ చాలామంచి ఐడియా. ఒకపక్క చదువుకుంటూ మరో పక్క బిజినెస్ చేసుకునేవారిని అమెరికాలో కేట్స్ అంటారు. అంటే  క్యాజువల్ అమెరికన్ టీనేజర్స్ అని. దీనివల్ల రెస్పాన్స్ బులిటీ తెలుస్తుంది. మీ నాన్న ఏభైవేలు అడిగాడు. నీకిమ్మన్నాడు. మీనాన్న చేశాడా? నువ్వు చేయించావా ఫోన్?" సడన్ గా అడిగాడాయన.

 

    "ఆయనే చేశాడు. పంటల ముందు...." ఏదో చెప్పబోయాడు మధు.

 

    "ఈ పంటల్ని నమ్మకూడదయ్యా..... వర్షాలొస్తే పంట..... లేకపోతే తంట. శుభ్రంగా ఫారిన్ తాళాల వ్యాపారం పెట్టుకుంటే, సరుకు పాడవదు, లాభాలకు లాభాలు, ఏమంటావు?"

 

    "సార్" ఘోషించింది మధు ఆత్మ.

 

    ఏభైవేలు తెచ్చి, మధుకిచ్చి-

 

    "మరి కాలేజీ మాటేమిటి?" అన్నాడు నారాయణ.

 

    "అటెండెన్స్ మీరే మానేజ్ చెయ్యాలి సార్. రిక్వెస్టింగ్ గా అన్నాడతను.

 

    "చేస్తాను. కానీ నెలకొకసారైన వరండామీద వెళ్ళిపోతున్నప్పుడు ప్రిన్సిపాల్ కి కనిపించు."

 

    "థాంక్యూ సార్!" అని అతి వినయంగా బయటికొచ్చి హీరో హోండా ఎక్కాడు మధు.

 


                                           *    *    *

 

    ఇంటి ముందు హీరో హోండా ఆగడంతో కంగారుగా బయటికొచ్చిన భీమవరం సోమరాజు, బండిమీద కొడుకుని చూసి "ఏమేవ్" అని శోషోచ్చినట్టు అరిచాడు.

 

    "బండెక్కెడిదిరా?" అడిగాడు సోమరాజు.

 

    "మొన్న ఫోన్ చేసి బాబు చెప్పాడని చెప్పలేదూ..... కాలేజీలో బాగా చదివి మార్కులు తెచ్చుకుంటే 'హీరో హోండా' లిస్తారని అదే ఇది....." అప్పుడే అక్కడకొచ్చిన తల్లి సూర్యాంబ కన్నుగీటుతూ చెప్పింది.

 

    "నమోమాత..... నమోమాత...." అని ఎస్వీఆర్ టైపులొ అనుకున్నాడు మధు.

 

    "చూడు- ఒకసారి ఆ మైదానం నారాయణగాడిని నాకు ఫోన్ చేయమని చెప్పు..... నువ్వెలా చదువుతున్నావో వాడ్ని అడగాలి...." అన్నాడు తండ్రి.

 

    "ఆయన ఫోన్ పాడైంది."

 

    "బాగయ్యాక చేయమను."

 

    "ఇప్పుడు బాగవదట."

 

    "ఏదో టైం చూసుకుని నేనే వెళతాలే- అలా పొలందాకా వెళ్ళొస్తా" అంటూ బయటికి వెళ్ళిపోయాడు సోమరాజు. అప్పుడు గబగబా ఊపిరి పీల్చుకుని, మనిషయ్యాడు మధు.

 

    

                                          *    *    *

 

    "అమ్మా....." అని అభిమానంగా పిలిచాడు మధు.

 

    "చెపుతున్నావా..... అడుగుతున్నావా.....?" కూరలో కారంవేస్తూ అందామె.

 

    "అడుగుతున్నాను."

 

    "అడుగు."

 

    "నేను ఎవరి కొడుకుని?"

 

    "అదేం ప్రశ్నరా? భగవంతుడిలాంటి భీమవరం సోమరాజు కొడుకువి. నా పుత్రరత్నానివి."

 

    "అదికాదు....."

 

    "నేను నీ కొడుకును కదా?"

 

    "అవును" ఆనందంగా, ప్రేమగా కొడుకువైపు చూస్తూ అంది.

 

    "నాన్నల్లో రకాలుంటారు..... కానీ అమ్మ ఒక్కటే! ఏలూరులో అందరూ నా హీరో హోండా, ఫ్లాట్, నా డ్రెస్సులవీ చూసి ఏమంటున్నారో తెలుసా? సూర్యాంబగారి కొడుకుని అని గర్వంగా అంటున్నారు."

 

    "నువ్వు నిజంగా  నా కొడుకువేరా!" అంది గర్వంగా ఆమె.

 

    "నేను  వైజాగ్ లో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. డబ్బు కావాలి" అన్నాడు ధైర్యంగా.

 

    "చదువు మాటేంటిరా?" అర్థంకాక అడిగిందామె.

 

    "చదువు కూడా...... చదువుతోపాటు.... అంతా నీకోసమే కదా!"

 

    "అవును.... మీ నాన్నతో చెపితే చాలా ఆనందిస్తారు కదా....." అందామె.

 

    "పిచ్చి మదరిండియా! అప్పుడే చెప్పగూడదు. నేను కొంత డబ్బు సంపాదించి తెచ్చిస్తా- అప్పుడు చెపితే ఆయనకు నమ్మకం కలుగుతుంది."

 

    "నిజమేన్రోయ్! ఇంతకీ నీకు డబ్బెంత కావాలి?"

 

    మనసులోనే లెక్కలు వేసుకున్నాడు మధు.

 

    "లక్ష."

 

    "లక్షే.....?" షాక్ తిన్నట్టు చూసిందామె.

 

    "అవును- లక్షే!"

 

    "ఇవాళ వుంటున్నావు కదా నువ్వు?" అడిగిందామె.

 

    "సాయంత్రానికి వెళ్ళిపొతే బావుంటుంది."

 

    "అంత అర్జంటా?"

 

    "అర్జంటే- డబ్బు బ్యాంక్ లోనే కదా వుంది? ఆ బ్యాంక్ మేనేజరు మన రిలిటివే కదా? నువ్వు ఫోన్ చేస్తే యివ్వడా?"  

 

    "ఓరి పిచ్చినా కన్నా! మీ నాన్నకు బ్యాంకుల మీద నమ్మకం లేదు."

 

    ఆశ్చర్యపోయాడు మధు.

 

    "మరి డబ్బు ఎక్కడ పెడతాడు నాన్న?" ఆశ్చర్యపోతూ అడిగాడు మధు.

 

    "చెప్తానుండు" అని వీధి గుమ్మం లోపల గడియపెట్టి, కిటికీ రెక్కలన్నీ గట్టిగా మూసేసి..... వంటగది పక్కన వున్న కొట్టు గదిలోకి తీసికెళ్లింది.

 

    అక్కడ పది బస్తాల బియ్యం, మిగతా సరుకులన్నీ వున్నాయి.

 

    "ఈ బియ్యం అమ్ముకుంటే ఏమొస్తుందే?" అన్నాడతను.

 

    "ఆ పలుగు, పార అందుకో..... ఆ ఎడమ పక్క ఎత్తుగా వున్నచోట తవ్వు" అంది.

 

    ఆమె చెప్పినట్లుగానే చేశాడు మధు. మోచెయ్యి లోతుకు తవ్వగానే టంగ్ - టంగ్ మని చప్పుడు విన్పించగానే "ఆపు" అని, తనే లోపలికి చేయి పెట్టి-

 

    బ్రిటానియా బిస్కెట్స్ డబ్బాలాంటి డబ్బాని తీసి, దాన్ని ఓపెన్ చేసింది. దాన్నిండా నోట్లకట్టలు.....పదికట్టల్ని తీసుకుంది. మళ్ళీ మూత గట్టిగా బిగించేసి, యధాస్థానంలో పెట్టేసి- మట్టి కప్పేసింది. మధు ఆ ప్రాంతాన్ని మళ్ళీ చదును చేసేశాడు.

 

    "అమ్మ.....కిలాడీ డాడీ..... అలాంటి పెట్టెలు ఎన్నున్నాయే?" అడిగాడు అమితాశ్చర్యంగా.

 

    "కొట్టు గదిలో అయిదారు..... పెరట్లో పదో పన్నెండో."

 

    అయితే లక్ష తీసుకోవడంలో తప్పులేదన్న మాట అనుకున్నాడతను.

 

    "ఒరే బాబూ! దేనికైనా పెట్టుబడి పెట్టావనుకో- లాభాలు రాకపోయినా ఫర్వాలేదు. పెట్టుబడి వచ్చెయ్యాలి గుర్తుంచుకో......!" అంది తల్లి కొడుకు బయలుదేరేముందు.

 

    "ఈ పెట్టుబడి అనే మాట వినలేక చచ్చిపోతున్నాను" మనసులో అనుకుని హీరో హోండాని స్టార్ట్ చేశాడు మధు.

 

    కానీ అన్విత విషయంలో తల్లితో అబద్ధం చెప్పడం గిల్టీగా వుంది అతనికి.

 

    'ఈసారి నిజం చెప్పెయ్యాలి' అనుకున్నాడతను.

 

    
                                          *    *    *    

 

    సాయంత్రం నాలుగు గంటలైంది.

 

    "క్యాంటీన్ బయట చెట్టుకింద నిలబడ్డాడు రవి, రమణ, బుచ్చిబాబు షాజహాన్.

 

    "అన్విత వైజాగ్ వెళ్ళిపోవడం, మధు కన్పించకపోవడం నాకేదో అనుమానంగా వుంది" అన్నాడు రమణ.

 

    "ఆ మధు, అన్వితల మధ్య ఏదో జరుగుతోందని నా అనుమానం" అన్నాడు  బుచ్చిబాబు.

 

    "అన్విత కేరెక్టర్ నాకు తెలుసు...... అంత తేలిగ్గా పడే రకం కాదు" అన్నాడు రవి.

 

    "ఒరేయ్ రవీ! మధు విషయం మనకు  తెలియాలంటే  మైదానం మాస్టారు కరెక్ట్ ఛానల్..... ఆయన క్లాసు లోంచి రాగానే పట్టుకుంటే?" సలహా ఇచ్చాడు షాజహాన్.

 

    "గుడ్ ఐడియా!"

 

    నిమిషాలు గడుస్తున్నాయి.....

 

    మైదానం నారాయణ క్లాసులోంచి బయటకివచ్చి, స్టాఫ్ రూంలో బుక్స్ పడేసి, స్కూటర్ స్టాండ్ దగ్గరకెళ్ళి స్కూటరు ఎక్కి స్టార్ట్ చేశాడు.

 

    బర్- బర్ మని ముందుకొస్తున్న స్కూటరుకి అడ్డుగా వెళ్ళి నుంచున్నాడు రవి.

 

    "ఏమిటోయ్ రవీ..... ఏమిటీ?"

 

    "సార్.... నాదో డౌట్ సార్! అసలు తాళాలు, కప్పులూ ఎప్పుడు పుట్టాయి సార్? మీకైతే తెలుస్తుందని- మీకోసమే వెయిటింగ్ సార్!"

 

    తాళం, కప్ప అనగానే మైదానం నారాయణ ముఖం ట్యాంక్ బండ్ మీద లైటులా వెలిగిపోయింది.

 

    "అసలూ......" అంటూ స్కూటరు స్టాండ్ వేశాడు.

 

    "టీ తాగుతూ మాట్లాడుకుంటే బావుంటుంది సార్.....!" అంటూ క్యాంటీన్లోకి నడిచారందరూ.

 

    ఛాయ్ తాగుతూ చెపుతున్నాడు నారాయణ.

 

    "తాళాల్నీ, కప్పల్నీ ఆదిమానవుడే కనిపెట్టాడోయ్...... కొన్నివేల సంవత్సరాల క్రితం మనకు రాతికప్పలూ, రాతి తాళాలూ వుండేవి. తర్వాత కొన్నివందల సంవత్సరాలు గడిచాక బ్రిటన్లో బంగారు తాళాలు, కప్పలూ వుండేవి. సర్ ఎడ్వర్డ్ లాక్ అనేవాడు మోడ్రన్ కప్పని కనిపెట్టాడు........ఆయన పేరు మీదే మనం కప్పల్ని లాక్ అంటున్నాం. తర్వాత....." చెప్పుకుపోతున్నాడు నారాయణ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra