Home » Dr c. ananda ramam » Velugubata


    "నాపేరు నూకాలమ్మ వీధులూడ్చుకుని బతికే దాన్ని. గవర్నమెంటోరు  స్కాలర్ షిప్పిస్తున్నారని నా కూతుర్ని సవటోడ్జి సదివిస్తున్న   సదువు సెప్తాను రమ్మని ఇంటికి పిలిచి, పసిదాని బతుకు అన్నేయం చేసేసాడు. ఇదేంటని గోలసేస్తే దానిమెడలో పుస్తెగట్టాడు. ఇదుగో" తన వెనకవున్న కూతుర్ని ముందుకిలాగి పైటక్రిందఉన్న మంగళసూత్రాలు తీసి పైన పడేసింది. ఆ పిల్ల తల అవమానంతో భూమిలోకి దిగిపోతోంది. బలికోసం కాళ్లూ చేతులూ కట్టి పడేసిన మేకపిల్లలా ఉంది అందరి మధ్యా కనీసం మేకపిల్లలా అరవను కూడా అరవటంలేదు.

    "ఇంతా సేసి, చెప్పకుండా చెయ్యకుండా పారొచ్చాడు ఆల్లనీల్లని అడిగడిగి సివరకు పోస్టాఫీసులో అడిగితే అడ్రసివని చెప్పారు. యెదవ సచ్చినోడు సారోస్తే వోదుల్తాననుకున్నాడేటో! పెళ్ళిలో తీసిన ఫోటోలున్నాయి. నా బిడ్డనన్నేయం సేస్తే ఉజ్జోగం ఊడపీకించేస్తాను."

    మహంకాళిలాగ ఆవేశంతో ఊగిపోతోంది నూకాలమ్మ. నాగమాంబ భరించలేక పైటకొంగుతో ముఖం కప్పుకుని భోరుమని ఏడుస్తూ కింద కూలబడింది.

    అచ్చమంబా తల గిర్రున తిరిగిపోసాగింది. వీధులూడ్చే మనిషి, అంటే మనిషి. ఒకనాడు, భర్త బతికి ఉన్నప్పుడు పాకీమనిషి ముఖం కూడా చూసేవారుకాదు. అది వీధిబయట నిలబడి గట్టిగా కేకపెడితే తలుపులన్నీ వేసేసుకునేవారు. అప్పుడది సందులోంచి లోపలికొచ్చి పాకీదొడ్డి బాగుచేసి వీధిలోంచి పోతున్నానని కేకవేసేది. అప్పుడు తలుపులు తెరుచుకునేవారు. అలాంటి పాకీ మనిషి కూతురు, తన కూతురి జీవితం ఈ అల్లుడు.....కళ్ళముందు మసకలు.... చెవిలో ఏదో హొరు, గుండెలపై ఏదో బరువు.

    లోపలికి దూరిన శాస్త్రి బయటికి రాలేదు. నూకాలమ్మ బండతిట్లు తిడుతోంది. ఝాన్సీ  ఆవిడని శాంత పరిచి, ఆ చిన్న పిల్లని దగ్గరికి పిలిచి "ఏం జరిగిందమ్మా?" అంది. ఈ అనునయానికి ఆ పిల్ల కళ్ళలోంచి కూడా నీళ్ళు వచ్చేశాయి.

    "మా అమ్మ నన్ను చదివిస్తోంది కదండీ! మా ఇంట్లో చదువుకోవటానికి తీరికే ఉండదండి. ఎప్పుడూ ఏదో పని- పొద్దున్నే లేచి నీళ్ళు పట్టుకోవాలి, ఆ పంపుళదగ్గర తగవులతోనే ఎక్కడలేని టైమూ అయిపోతుంది. అమ్మ పొద్దున్నే వీధులూడపటానికిపోతే నే వంటచెయ్యాలి. తమ్ముడికైనా, చెల్లెలికైనా జ్వరంవస్తే బడికి వెళ్ళటానికే పడదు. ఇలా చదువులో నేను బాగా వెనకపడ్డాను. ఎలాగైనా పదో క్లాసు పాసయి నర్స్ ట్రైనింగ్ కి వెళ్ళాలని ఆశ. ఈ మాస్టారు "నిన్ను పదోక్లాసు పాసుచేసే పూచీనాది. మా ఇంటికిరా! చదువు చెప్తాను" అన్నారు ఆశపడి వెళ్ళాను. అప్పుడు...అప్పుడు....."

    ఆపైన మాట్లాలేక, తలెత్తి ఎవరి ముఖమూ చూడలేక చేతుల్లో ముఖం కప్పుకుంది. దుఃఖంతో ఆ అమ్మాయి శరీరమంతా ఎగిసిపడుతోంది.
    "ఛీ! ఎంత అన్యాయం! విద్యార్ధులను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దవలసిన టీచర్ ఉద్యోగంలో వుండి, ఎంత నీచంగా ప్రవర్తించాడు? కంచే చేను మేస్తే, పాపం ఈ పసిపిల్ల  ఏం చెయ్యగలదు? ఈ నీచుడితో పెళ్ళి జరిపించటమే పరిష్కార మార్గంగా తోచింది తల్లికి. అంతే! సంఘంలో ఎవరయినా అలాగే ఆలోచిస్తారు? ఏమిటీ విలువలు> మొగ్గలోనే అంధకార బంధురమయిపోయిన ఈ పసిపిల్ల జీవితం ఎలా బాగుపడుతుంది?
    "అమ్మా!" అనే అక్క కేకకు తన ఆలోచనలలోంచి ఉలికిపడి చూసింది ఝాన్సీ. అచ్చమంబా తెలివితప్పి పడిపోయింది. ఝాన్సీకి మతిపోయినట్లు అయింది ఏ తల్లి ఆరోగ్యం కాపాడాలని ఇంతకాలం చిత్రహింస అనుభవిస్తూ వచ్చిందో, ఆ తల్లి ఇలా పడిపోయింది.
    "అమ్మా! అమ్మా!" అంటూ తల్లి శరీరాన్ని కుదిపింది చైతన్యరహితంగా ఎటు కదిపితే అటు పడిపోతోంది తల్లి శరీరం. ఝాన్సీ గాభరా పడిపోయింది. డాక్టర్ గా తల్లి పరిస్థితి ప్రమాదంకరంగానే వుందని వెంటనే  అర్ధంచేసుకుంది. మొదటినుంచీ క్లిష్టపరిస్థితుల్లో ఝాన్సీయే మొండి ధైర్యంతో కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చింది. ఇప్పుడూ మనసెంత అల్లకల్లోలంగా ఘోష పెడుతున్నా, ముందు కర్తవ్యం గురించి ఆలోచించింది. కొంచెం దూరంలోనే ఎద్దుబండి వున్న మల్లయ్య వున్నాడు. వెళ్ళి అతడిని  బండికట్టు తీసుకురమ్మని బ్రతిమాలింది. పరిస్థితి తెలుసుకున్న అతడు  వెంటనే  బండికట్టి  తీసుకొచ్చాడు. ఏడుస్తున్న అక్కను గదమాయించి "ఇప్పుడు ఏడుస్తూ కూచుంటే అమ్మ బ్రతకదు. ముందు సాయం పట్టు, బండిలో పడుకోబెట్టాలి!" అంది. మంత్రం వేసినట్లు నాగమాంబ ఏడుపు ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ ధీర గంభీరమూర్తి అయిపోయి అందరినీ ఆజ్ఞాపిస్తుంటే, అవును, కాదనటానికి ఎవరికీ  నోరు రాదు. ఝాన్సీ ఒక్కర్తే మనిషి అయినట్లు, తామంతా మరబొమ్మలయినట్లూ, ఝాన్సీ ఏం చెబితే అది చేసేస్తారు. అక్క సాయంతోనూ, మల్లయ్య సాయంతోనూ తల్లిని బండిలో పడుకోబెట్టింది ఝాన్సీ. బిత్తర చూపులు చూస్తున్న  అక్కతో "రా! నువ్వూ  వచ్చి కూచో" అంది తను బండి ఎక్కుతూ. నాగమాంబ బండిలో కూచుంది. మల్లయ్యతో "కుమార్ బాబుగారి ఆస్పత్రికి పోనియ్యి" అంది. "అట్టాగే!" అంటూ వాడు ఎద్దులను అదలించాడు. నాగమాంబ కళ్ళు పెద్దవిచేసి భయంగా చూసింది. ఆ చూపులు లక్ష్యపెట్టనట్లు ముఖం పక్కకు తిప్పుకుంది. ముందు తల్లి  ప్రాణం రక్షించుకోవాలి. అది ముఖ్యం. ఇంకో ఆలోచనకూ అవకాశము లేదు. ఆనాడు అతన్ని అలా విదిలించి వచ్చేసింది. ఈనాడు  అతని సాయానికి వెళుతోంది. ఏమనుకుంటాడు? ఏమనుకున్నా తల్లి ప్రాణాలుమాత్రం కాపాడాతాడు. అది నిజం. అతని మంచితనంలో తనకీ నమ్మకం వుంది.
    కుమార్ ఆస్పత్రిముందు బండి ఆగింది. ఝాన్సీ, మల్లయ్య, నాగమాంబ సాయంపట్టి అచ్చమాంబను లోపలికి తీసికెళ్ళారు. ఎవరో పేషెంట్ ని చూస్తున్న కుమార్ వెంటనే వీళ్ళిదగ్గరకి వచ్చి. ఝాన్సీ! ఏం జరిగింది?" అన్నాడు.
    "అమ్మా....."అంతవరకే అనగలిగింది ఝాన్సీ. కుమార్ కనపడగానే, అంతవరకూ నిలుపుకున్న నిగ్రహం సడిలిపోసాగింది. కుమార్ ఇంకేమీ అడగలేదు. స్పృహలేని అచ్చమాంబ రెండు చేతులలో ఒక్కడూ ఎత్తుకుని ఎమర్జన్సీ రూంలోకి తీసుకుపోయాడు. త్వరత్వరగా కృత్రిమ శ్వాసకు ఏర్పాట్లుచేశాడు. ఆవిడకు కూడా అతడు చేసేవి చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది ఝాన్సీ.
    కుమార్ ప్రేమగా ఆమె భుజం తట్టి "ఏంఫరవాలేదు! ఆమె ప్రాణాలు నేను కాపాడతాను" అన్నాడు.
    అతడి రెండుచేతులూ తన చేతులతో గట్టిగా అదిమింది, నువ్వే నాకు దిక్కన్నట్లు. అంతటి దుఃఖంలోనూ అతడు అలా తన  పక్కన  నిలబడితే, ధైర్యం చెబుతోంటే, మనసుకెంతో ఊరటగా వుంది. ఆ రోజంతా అతడు మిగిలిన పేషెంట్స్ ని చూడకుండా అచ్చమాంబ దగ్గరే ఉన్నాడు. ఉదయ పదిగంటలకి ఆస్పత్రిలోచేర్పిస్తే రాత్రి పదిగంటలకు కళ్ళు తెరిచింది అచ్చమాంబ ఝాన్సీ పట్టరాని ఆనందంతో తల్లి మంచం పక్కన మోకాళ్ళమీద కూచుని "అమ్మా!" అంది.
    అచ్చమాంబ కళ్ళలో ఝాన్సీని గుర్తించిన ఛాయలు కనిపించాయి కానీ అంతలోనే అలసటతో వాలిపోయాయి అక్కడే ఏడవబోతున్న నాగమాంబని చెయ్యి పట్టుకుని బయటకు  ఈడ్చుకొచ్చింది ఝాన్సీ.
    కుమార్ విజయగర్వంతో "ఇంక ప్రాణాపాయం లేదు. కానీ, కోలుకోవటానికి మాత్రం కొంత కాలం పడుతుంది" అన్నాడు. రెండు చేతులూ జోడించింది ఝాన్సీ. ఆ చేతుల మీద చిలిపిగా కొట్టాడు.
    "అక్కా! నువ్వింటికి వెళ్ళి భోజనం చేసిరా! అప్పటి వరకూ నేను అమ్మదగ్గరుంటాను" అంది ఝాన్సీ.
    "ఇల్లు" అనగానే నూకాలమ్మ, ఆ పసిపిల్ల, తకింత ద్రోహం చేస్తూకూడా  ఒక బానిసను ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించే భర్త గుర్తుకొచ్చారు నాగమాంబకి.
    "ఝాన్సీ ఆ ఇంటికి నేను పోలేనే" అంది దిగులుగా అక్క ముఖంచూస్తె జాలికలిగింది ఆమెకి. ఈ సమాజంలో ఎంతమంది స్త్రీలకో ప్రతినిధి ఈ అక్క. భర్త ఏమి చేసినా  ఎంత నీచంగా చూసినా, ఎంత అధికారం చెలాయించినా, సహించింది. డబ్బు తీసుకొస్తేకాని, తన ఇంట్లో ఉండటానికి వీల్లేదని తరిమేసినా, నోరు మూసుకుని పుట్టింటికొచ్చింది. అప్పుడయినా, డబ్బు ఎలా జమచేసి  భర్త అనుగ్రహం సంపాదించాలా అని ఆలోచించిందే తప్ప, అతడిని ధిక్కరించి తన బ్రతుకు తను ఎలా  దిద్దుకోవాలా అని ఒక్కసారికూడా ఊహించనైనా ఊహించలేదు ఇంత జరిగాక భర్తవస్తే ఏమీ జరగనట్లు సకల మర్యాదలూ సకల సేవలూ చేస్తూ అతడి అనుగ్రహం పొందాలని తాపత్రయ పడింది. ఏ కాపురం నిలుపుకోవాలని ఇంత హీనాతి హీనంగా సొంత వ్యక్తిత్వమనేది నిలుపుకోకుండా, ఆరాటపడుతోందో ఆ కాపురమే కళ్ళముందు కూలిపోయినపుడు ఈ అభాగ్యురాలు ఏం చెయ్యగలదు?

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra