Home » Vasundhara » Vasundhara Kadhalu - 15

 

                        మిలటరీ అనుభవాలు ?

                                                                         వసుంధర

    అయన పూర్తీ పెరెందరికి తెలుసో నాకు తెలియదు. కానీ అందరూ ఆయన్ని రాయుడు గారంటారు. అయన ఇంటి పేరు కూడా క్లుప్తంగా కలిపి -- కె. రాయుడు అని పిలుస్తారు చాలామంది. అలా పిలవడానికి అసలు కారణమది కాదనీ అయన కోతలు కోయడంలో స్పెషలిస్ట్ నీ -- అందుకే కోతలరాయుడని స్పురించేలా కె. రాయుడు అంటారనీ చాలా మంది అనుకుంటుంటారు. ఈ కోతల రాయుడు గారు నాతొ కబుర్లాడ్డానికి వచ్చినప్పుడల్లా చుట్టూ పక్కల నుంచి నలుగురైదుగురు నిరుద్యోగులు కూడా మా ఇంటి కోస్తుంటారు. అందుకు కొన్ని కారణాలున్నాయి.
    రాయుడు గారు కోతలు కోసేమాట నిజమే కానీ అయన ఆ విద్యలో సిద్దహస్తుడు. అయన ఎన్ని అబద్దాలు చెప్పినా అతికినట్లుంటాయి. అందువల్ల అయన మాటలు నమ్మినా నమ్మకపోయినా -- అబద్దమని ముఖం మీద అనడం కష్టం .
    ఆయతే సునిశిత పరిశీలన నాకు వెన్నతో పెట్టిన విద్య. వ్రుత్తి రీత్యా లాయర్ని కాకపోయినప్పటికీ ఎదుటి వారి మాటల్లో మాత్రం లోపమున్నప్పటికీ వెంటనే పట్టేసుకోవడం నా ప్రత్యేకత. కోతల రాయుడు గారు నా దగ్గరకు వచ్చి కోతలు కోసినప్పుడల్లా -- అంతా వినడమయ్యేక -- అయన చెప్పినడబ్బద్దమని సకారణంగా రుజువు చేసి చూపించే వాణ్ణి. నాకు దొరకని విధంగా అబద్ద మాడాలన్న పట్టుదలతో రాయుడు గారు రోజూ ఇంటికి వస్తే -- ఆయన్ను నేనెలా దొరకపుచ్చుకుంటానో చూడడం కోసం ఆ నిరుద్యోగులు మా ఇంటికి వస్తుంటారు.
    సాయంత్రం నేనాఫీసు నుంచి తిరిగి రాగానే టిఫిన్ తిని పేపరు చూసే సమయానికి రాయుడు గారు మా ఇంటికి వస్తారు. అయన రావడం చూస్తూనే చుట్టుపక్కల నిర్యుద్యోగులు కూడా వస్తారు. వాళ్ళు రాగానే రాయుడు గారిలో ఉత్సాహం వస్తుంది.
    ఎప్పటిలాగే ఆరోజు రాయుడు గారు ఉత్సాహంగా తన కధ మొదలుపెట్టారు.
    "మిమ్మల్ని చూస్తె జాలేస్తోందయ్యా -- రోజూ ఎంత ఆశగా ఉత్తరాల కోసం ఎదురు చూస్తారు. సాధారణంగా మీ ఉత్తరమే వుండదు. ఉన్నా అది ఏ రిగ్రేట్ లేటరో అయుంటుంది. ఆ బాధ పగవాడి క్కూడా వద్దు. అంతకంటే మిలటరీ లో ప్రయత్నించి...." అని అగడాయన శ్రోతల ముఖంలో భావాలను పరిశీలించడానికి.
    "చెప్పడం సులువే కానీ, ఆచరణ లో కష్టమండి. ఏ క్షణం లోనైనా యుద్ధం వచ్చేలా వున్న ఈరోజుల్లో మిలటరీ సర్వీస్ గురించి ఆలోచించడం ప్రాణాంతకమే" అన్నాడు సుదర్శనం అనే పేరు గల నిరుద్యోగి.
    "అందరి సంగతీ తెలియదు కానీ, నేను మాత్రం స్వానుభవంలోంచే సలహాలనిస్తాను. నా చిన్నతనంలో ఉద్యోగం దొరక్క నేనూ ఇబ్బంది పడ్డాను. ఇబ్బందిల్లో నూ ఇలాంటలాంటివి కాదు" రాయుడు గారు పడక్కుర్చీలో వెనక్కి జార్లగిలబడి "మిలటరీ సర్వీస్ లో జాయినయే వరకూ నా ఇబ్బందులు తీరలేదు" అన్నాడు.
    "మీరు మిలటరీ పని చేశారా" అన్నాడు రంగారావు ఆశ్చర్యంగా. ఆప్రయట్నంగా అందరమూ ఆయన్ను పరిశీలించి చూశాం. వదులువదులుగా వున్న అయన శరీరం ఎప్పుడూ కూర్చునే వాడి కుండెంత పెద్ద బొజ్జ. ఆయనకు మిలటరీ చాలా దూరమని స్పురింప జేస్తోంది.
    "ఏం నన్ను చూసి నమ్మలేకపోతున్నారా" అనడిగేడు రాయుడు నవ్వుతూ "ఎల్లకాలం మనిషి మీకులాగే తుళ్ళుతూ ఉంటారనుకోకండి. రేపు మీకు ఏభై ఏళ్ళు దాటనివ్వండి. అవతారాలేలా తయారౌతాయో చూడవచ్చు"
    'అవుననుకోండి. కానీ, నాకు తెలిసిన మిలటరీ అఫీసారోకాయనున్నారు. అయన వయస్సు యాభై అయిదేళ్ళుటుందేమో నాకంటే చలాకీగా ఉంటాడు. నాకున్నపాటి బొజ్జ కూడా వుండదు" అన్నాడు కృష్ణ మోహన్.
    రాయుడు గారు నవ్వి "అయన సర్వీస్ వదిలేసినా వ్యాయామం మాని వుండడు. ఎప్పుడూ వ్యాయామం చేసేవాడు హటాత్తుగా మానేస్తే మనిషి రూపం చాలా అసహ్యంగా అయిపోతుంది" అన్నాడు.
    "సరేలెండి. మీ మిలటరీ అనుభవాలు చెప్పండి" అన్నాను. రాయుడు గారిని పట్టడాని కింకా సమాచారం కావాలని గ్రహించినవాడనై.
    రాయుడు గారు నవ్వేడు. ఆ నవ్వులో నా ఉద్దేశ్యం గ్రహించిన అభిప్రాయం వ్యక్త పరిచేడాయన. "చెప్పడానికేముందీ అందరకూ ఉన్న లాంటనుభవాలే. మిలటరీ సర్వీస్ లో నేను నేర్చుకొన్నదేమిటంటే క్రమశిక్షణ" అన్నాడాయన.
    మేమేవ్వరమూ అయన మాటలను ఖండించదల్చుకోలేదు. మేము పూర్తిగా మౌనం వహిస్తే తప్ప అయన అసలువిషయంలోని రాడని అనుభవం మీద మాకు తెలుసు.
    రాయుడు గారు మళ్ళీ మొదలుపెట్టాడు. "క్రమశిక్షణఅంటే అలాంటిదిలాంటిది కాదు. ఐరన్ డిసిప్లెన్ అన్నమాట. ఒకసారేమయిందంటే -- " రాయుడు గారికిదగ్గు వచ్చినట్లుంది సన్నగా దగ్గి మళ్ళీ మొదలుపెట్టాడు. "అయిదారు నెలల సర్వీస్ లో ఉన్నాక ఇంటికి కాస్త డబ్బు పంపగలిగాను. నేనేమైపోయానో తెలియని పరిస్థితుల్లో ఉన్న తలిదండ్రులకి డబ్బుతో నా ఆచూకీ తెలిసిపోయింది. బహుశా ఆనందంలోనే అయుంటుంది. ఒక పుస్తకం రాశారు. అది చదువుకోబోతున్నాను. నాకూ ఆరాటంగా వుంది. ఇంటి దగ్గర నన్ను గురించి ఏమనుకుంటున్నారో పరిస్థితులెలా గున్నాయోననివెంటనే కవరు చించి లోపలి కాగితం బయటకు తీశాను. చదవబోతుండగా నాచేతులు వణికాయి. చేతిలోని వుత్తరం కింద పడింది. గాలి కూడా ఎక్కువగా వుండడం వల్ల వంగుని కాగితాన్ని తీయబోయాను. కానీ ఇంతలో ఏమయిందంటే పై అధికారి వచ్చాడు. అంతే చటుక్కున తిన్నగా నిలబడి అటేక్షన్ ఫోజులో ఆయనకు సెల్యూట్ చేశాను. నా ప్రియమైన వుత్తరం ఎగిరిపోయింది.
    "మిలటరీ లో వచ్చిన తంటాయే ఇది -- మనిషి మనిషిలా బ్రతకలేడు. పై అఫీసరంటే సింహానికో, పులికో భయపడినట్లుండాలి" అన్నాడు రంగారావు నిట్టూర్చి.
    "అలా అనేయకు. మీరంతా మనుషుల్లా బ్రతకడం కోసం మిమ్మల్నందర్నీ పులుల్నించీ , సింహల్నీంచీ రక్షించడం కోసం మిలటరీ ఉంది. అదొక త్యాగపూరిత జీవితం. ఎన్ని కష్టాలు పడినప్పటికీ నా అయిదేళ్ళ మిలటరీ అనుభవాలు నాకంతులేని సంతృప్తి నిచ్చాయి---" అన్నాడు రాయుడు.
    "మిలటరీ కి సంబంధించినంతవరకూ మీకు మిగిలిన అనుభావాలోక్కటేనా -- లేక ...." అని భావగర్భితంగా నవ్వాను.
    నా అభిప్రాయం రాయుడు గారి కర్ధమైంది. "అ ధైర్యం ఆ పరాక్రమం ఇప్పటికీ నా దగ్గరున్నాయి. అన్నిటికీ మించి క్రమశిక్షణ అది మాత్రం వదులుకోలేను. మొన్న ఒకసారి హటాత్తుగా నిద్రలోంచి సెల్యూట్ చేశానట. నా భార్య కంగారు పడి నన్ను కుదిపి మెలకువ తెప్పించి విషయం ఏమిటని అడిగింది. కంగారు పడకు, కలలో మిలటరీ ఆఫీసరు వచ్చేడని చెప్పాను."
    కృష్ణమోహన్ - ఇది ఇటీవలే జరిగిందంటూన్నావు. మీ మిలటరీ సర్వీసు చాలా పాతకాల విషయం. అప్పట్నించీ ఇప్పటివరకూ మీ కలలోకి ఏ మిలటరీ ఆఫీసరూ రానే రాలేదనుకోవాలి. ఎందుకంటె మీఅవిడ కంగారు పడ్డారంటే అని ఆగిపోయాడు.
    "భలే వాడివయ్యా" అని నవ్వేశాడు రాయుడు. "రామాయణాన్ని నేను నమ్మకపోవడానికి ఒకే కారనముండేది . అందుక్కారణం కుంభకర్ణుడు అంత నిద్ర పోయేవాడే జాతిలోనూ ఉండడని నాకు బాగా నమ్మకం. మా ఆవిణ్ణి పెళ్ళి చేసుకున్నాకనే నేను రామాయణాన్ని నమ్మడం ప్రారంభించాను" రాయుడు క్షణం ఆగి "మొన్న మొన్న కాదనుకో ఓ ఏడాది క్రితం జరిగిందిది. మా వైవాహిక జీవితంలో మొట్టమొదటిసారిగా నేను నా భర్య కంటే ముందర నిద్ర పోయాను. బహుశా అదే ఆఖరు సారి కూడా అనుకుంటాను" అన్నాడు.
    "అందుకే కూడా మిలటరీ ఆఫీసరు కూడా కలలోకి వచ్చి ఉంటాడు" అన్నాను నేను నవ్వుతూ "ఏదైనా మీకా అఫీసరంటే భయమో, లేక క్రమశిక్షనో నాకు తెలీకుండా ఉంది."
    "అఫీసరంటే నాకు భయమా ?" రాయుడు చాలా పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు ఎంత భయంకరంగా ఉందంటే లోపల్నించి చేత్తో బుల్ బుల్ తో నా తమ్ముడు వచ్చాడు.
    నా తమ్ముడి పేరు రాంబాబు. వాడి వయస్సు పద్నాలుగు ఏళ్ళు.
    "ఎవరూ?రాయుడు గారా నవ్వింది?" అన్నాడు రాగానే.
    ఏదో వంక పెట్టుకుని మా మధ్యకు రావాలనుంటుంది వాడికి. రాయుడు గారి కబుర్లు వినడానికి వాడికంత ఉత్సాహం లేదు- హటాత్తుగా వచ్చినట్లు చేత్తో బుల్ బుల్ తో వస్తే -- మాలో ఎవరైనా ఓ పాట వాయించమంటామేమోనని వాడి ఆశ. మొహమాటానికైనా వాణ్ణి వాయించమనడానికి నాకు భయం. ఎందుకంటె నాకు అన్నిరకాల పాటలూ ఇష్టమే. ఇష్టం లేని పాటంటూ ఉండదు. వీడు న్యాయం చేకూర్చిన పాటంటూ ఒక్కటి కూడా లేదు.
    "అవునోయ్ -- నవ్వి అలిసిపోయాను. ఏదైనా పాట వాయించు" అన్నాడు రాయుడు. అయన నోట్లోంచి మాట ఊడి పడకుండానే రాంబాబు ఒక పాట వాయించాడు. తమ్ముడిని పరాయి వాళ్ళ ముందు చిన్నబుచ్చడం ఇష్టం లేని నేను చేవులుమూసుకోలేదు. కళ్ళయితే చేతులు ఉపయోగించకుండా మూసుకోవచ్చు. చెవుల క్కూడా అలాంటి ఎర్పాటుంటే ఎంత బాగుండేది -- అనుకున్నాను.    
    అలా వరసగా నాలుగు పాటలు ఖూనీ చేయడంయ్యాక అంతా మొహమాటాన్ని వదలుకుని "నీకు బాగా వచ్చినపాట లేదా?' అన్నారు.
    "అయితే ఇంకా జనగణమనే" అంటూ ఆ పాట వాయించాడు. అదీ తప్పే వాయించాడు. ఎటొచ్చీ పాట ఫలానా అని తెలుస్తూనే వుంది.
    "చాలా బాగా వాయించావోయ్ " అన్నాడు రాయుడు. తమ్ముడింక లేచి వెళ్ళిపోయాడు. వాడి పని అయిపొయింది కదా! వాడు వెళ్ళిపోగానే "నాకు పాటలంటే అట్టే ఆసక్తి లేదు. మిలటరీ లో పనిచేసిన మూలాన జనగణమన మాత్రం బాగా వంటబట్టింది. బాగా వాయించాడు. మీ తమ్ముడు అన్నాడు రాయుడు.
    "నిజంగానే అంటున్నారా?" అన్నాను.
    "మెప్పుకోలు మాటలు నాకిష్టముండదు" అన్నాడు రాయుడు.
    "వాడు ట్యూను తప్పు వాయించాడండీ-- పాట ఇది అని తెలుస్తుంది కానీ -- వాడు సరిగ్గా వాయించలేదు. అది నీకు బాగా వంట బట్టిన పాట కాబట్టి మీరు గ్రహించే ఉంటారనుకుంటాను--" అన్నాను.
    రాయుడు దెబ్బతిన్నట్లు కనబడ్డాడు. కానీ త్వరగానే తమాయించుకుని "మీవాడింకా టీనేజర్. అలాంటి వాడి దగ్గర్నించి పేర ఫెక్ట్ ట్యూనేలా ఎక్స్ పక్ట్ చేస్తాం. పాట అది అని తెలిసేలా వాయించగలగడమే గొప్ప విశేషం. నేను మెచ్చుకున్నది మీవాడి వయసుకు తగ్గ ప్రావీణ్యాన్ని -- అంతేకానీ -- " అని ఆగి "అదంతా ఎందుకు గానీ ఇందాకా పై అఫీసర్లంటే నాకు భయమేమోనని మీరంటే నాకు నవ్వొచ్చింది. కారణం తెలుసా?" అన్నాడు రాయుడు.
    త్వరగా విషయం మార్చేయాలని రాయుడనుకుంటున్నట్లు గ్రహించాను.
    "చూడండి రాయుడు గారూ! మీరు మిలటరీ లో నిజంగా పనిచేసే ఉంటె మీకు క్రమశిక్షణ వంట బట్టలేదనీ, అందువల్లనే పై ఆఫీసర్లకు భయపడే వారనీ అనుకోవలసి ఉంది. అసలు మీరు మిలటరీ లో పని చేయనే లేదు. అందువల్ల మీరు మిగతా కధ చెప్పనవసరం లేదు ....." అన్నాను.
    రాయుడు కాస్త చిరాగ్గా పడక కుర్చీలోంచి లేచి "ఊరికే మాటంటే కుదరదు" -- కారణం చెప్పాలి" అన్నాడు.
    'ఇప్పుడు కాకుండా -- ఇందాకా జనగణమన పాటకు మీరు కుర్చీలోంచి లేచి నిలబడి ఉంటె -- మీ కధలన్నీ నేను నమ్మి ఉండేవాడినెమో" అన్నాను నేను తాపీగా.

                                     ***

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra