Home » Vasireddy seeta devi novels » చిలకలు


    "మీకు తెలియదా?"
    "ఇన్స్ స్పెక్టర్ ఏమిటి మీరనేది? నేను విజయవాడ నుంచి ఇప్పుడె వస్తున్నాను."
    "మీ మేనకోడలు వచ్చిందని తెలియదా?
    "ఎందుకు తెలియదు? నేనే కృష్ణాలో ఎక్కించాను."
    "భారతిని ఎవరో హత్య చేశారు" అన్నాడు నరేంద్ర శంకరరావును చూస్తూ.
    "శంకర్రావు వెర్రి చూపులు చూశాడు.
    అంతలోనే తెప్పరిల్లి ఇంట్లోకి  పరిగెత్తబోయాడు.
    "శవం ఇంట్లో లేదు. ఇంటి వెనక మల్లె పందిరి కింద ఉంది" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    శంకర్రావు ఇంటి వెనకకు పరుగుతీశాడు.
    "దొంగ వెదవ అంతా నాటకం" అన్నాడు అద్వయితం.
    "తొందరపడకు. అతడి వాలకం చూస్తే ప్రయాణం చేసి వచ్చిన వాడిలాగే ఉన్నాడు"
    ఇద్దరూ ఇంటి వెనకకు వెళ్ళారు.
    "అయ్యో తల్లీ. ఎంత పని చేశావమ్మా? నేను వచ్చేదాకా అగకూడదూ" గాద్గిదికం అన్నాడు.
    "అంటే మీ ఉద్దేశ్యం ఆమె ఆత్మ హత్య చేసుకున్నదనా?"
    "అవునండీ! ఆమెను  ఒక దుర్మార్గుడు. మోసం చేశాడు. ఇంటి నుంచి ఏనాడో వెళ్ళిపోయింది. దాని బతుకు బాగు చేద్దామనే బలవంతంగా ఇక్కడకు పంపించాను."
    "మీరు కృష్ణాలో ఆమెతోపాటు రాకుండా నర్సపూర్ లో ఎందుకొచ్చారూ నరేంద్ర అడిగాడు.
    "నా బిజినెస్ పార్టనర్. ఇప్పుడుకాదు ఒకప్పటివాడ్ని కలవాలని ఉండిపోయాను. అతడు నాకు లక్షరూపాయలు బాకీ ఉన్నాడు"
    "అతడి పేరు?"
    "వెంకట్రావ్"
    "ఎక్కడుంటాడు?"
    "లబ్బీపేటలో" తడుముకోకుండా చెప్పాడు శంకర్రావు
    "మీ మేనకోడల్ని మోసం చేసింది ఎవరు?"
    "రూఢిగా తెలియదు. నా అనుమానం  రమణరావనే. అదే తేల్చుకుందామని అమ్మాయిని బలవంతంగా ఇక్కడకు పింపిచాను"
    "అబద్దం. మీకు  రమణరావంటే కోపం. అందుకే అతడి మీద నేరం మోపాలని ప్రయత్నిస్తున్నారు?
    "నాకు అతడి మీద కోపం ఎందుకుంటాడండీ నరేంద్రగారూ?
    "ఎందుకూ? లావణ్య పెళ్ళి మీ మేనల్లుడితో జరగకుండా ఆపు చేసింది రమణరావేనని మీకు తెలుసు" అన్నాడు నరేంద్ర.
    "మీరు అనుకొన్నట్లు మీ మేనకోడలు ఆత్మహత్య చేసుకోలేదు" ఎవరో  హత్యచేశారు. పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే ఆమె అలా వెల్లికిలా పడిపోదు" అన్నాడు నరేంద్ర.
    "అయితే ఇది వాడిపనే"
    "అతడికి మీ మేనకోడల్ని తీసుకోస్తున్నట్టు చెప్పారా?" నరేంద్ర అతడి ముఖంలోకి చూస్తూ అడిగాడు.
    "చెప్పలేదు"
    "ఇంకెవరికైనా  చెప్పారా?"
    కొంచెం తడబడ్డాడు శంకర్రావు.
    "ఎవరికీ చెప్పలేదు" అన్నాడు తనను తాను అదుపులో పెట్టుకుంటూ.
    "మరి మీ మేనకోడలు రాత్రి ఇక్కడకు వచ్చినట్టుగా అతడికి ఎలా తెలుస్తుంది?"
    శంకర్రావుకు ఏం చెప్పాలో తోచలేదు.
    "అయితే ఆమెను నువ్వే చంపించావ్. పనిపూర్తి అయాక రావచ్చని నర్సాపూర్లో వచ్చావ్. ఎలిబీ కోసం విజయవాడలో నీ పార్టనర్ ను నిన్న సాయంకాలం కలుసుకున్నావ్" అద్వయితం గాండ్రించాడు.
    "ఇన్స్ స్పెక్టర్ గారూ! అనవసరంగా నా మీద నిందవేస్తున్నారు. అది రుజువు చెయ్యాల్సిన బాధ్యత మీకు ఉంది." కోపంగా అన్నాడు శంకర్రావ్.
    "చేస్తాను రుజువు చేస్తాను. చెయ్యకుండా ఉంటానా?" కొంచెం తగ్గి అన్నాడు అద్వయితం.
    'ఒట్టి కాగితం పులి" మనసులోనే అద్వాయితాన్ని చూస్తూ అనుకున్నాడు నరేంద్ర.
    "భారతిని కూడా మీతోపాటే నరసాపూర్ కు తీసుకొచ్చి ఉండొచ్చుగా? కృష్ణాలో ఆమెను ముందు పంపాల్సిన అవసరం ఏముంది? రాత్రికి రాత్రి ఆమె ఇక్కడకు వచ్చి చేసేదేముంది?" నరేంద్ర శంకర్రావు ముఖంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు.
    శంకర్రావుకు సమాధానం తోచలేదు.
    "మాట్లాడరేం?" గద్దించినట్టుగా అన్నాడు అద్వయితం.
    "ముందు నేనూ కృష్ణాకే వద్దామనుకున్నాను....."
    "ఆ తర్వాత మనసు మార్చుకొన్నారు. ఆవునా?" ఇన్స్ స్పెక్టర్ కు ఉషారిక్కింది.
    "అవును"
    "ఎందుకు? ఎలిబీ కోసమేనా?"
    "కాదు వెంకట్రావు ఊళ్ళో ఉన్నాడని తెలిసి ఆగిపోయాను. తుఫాన్ తాకిడి ఉధృతం అవుతుందేమోనన్న భయం. అందుకే తీరా కొన్న టికెట్ మార్చడం ఎందుకని ఆమెను వెళ్ళమన్నాను. ఆమె హైదరాబాద్ లోనే  పుట్టింది. నా ఇంట్లోనే పెరిగింది. ఆమెను  ఒంటరిగా ఎలా పంపించడమనే ఆలోచనే నాకు రాలేదు", అని ఆగి మళ్ళీ అందుకున్నాడు.
    "మీ ధోరణి నాకేమీ అర్థం కావడంలేదు. రామకృష్ణ హహ్త్యజరిగినప్పట్నుంచీ నన్నెందుకు అనుమానిస్తున్నట్టు? నేను ఇంతకు ముందు ఎవర్నయినా హత్యచేశానా? హంతకుడిగా మీ లిస్టులో ఉన్నానా? నా మేనకోడల్ని  హత్యచేసే  లేక చేయించేంతటి క్రూరుడ్ని నేనుకాదు. కొన్ని మానవ బలహీనతలు నాలో ఉండొచ్చు. కమలాంబకూ నాకూ ఏవేవో సంబంధాలు ఉండవచ్చు. ఆ సంబంధం ఈనాటిది కాదు. రామకృష్ణ ఆస్తిమీద అజమాయిషీ చేసిఉండొచ్చు....."
    "ఇప్పుడవన్నీ ఎందుకూ? అవసరమైనప్పుడు మేమేఅడిగి తెలుసుకుంటాం లెండి. ఇన్స్ స్పెక్టర్ మనం వెళ్దామా? అన్నాడు నరేంద్ర.
    "ఓ.కే" అంటూ ఇన్స్ స్పెక్టర్  లాఠీ  ఊపుకుంటూ జీపు దగ్గరకు  నడిచాడు. ఆ వెనక్కే నరేంద్ర  వచ్చాడు. జీపు ఎక్కబోతూ ఇన్స్ స్పెక్టర్ ఆగాడు.
    "ఏమిటి?" నరేంద్ర ప్రశ్నించాడు.
    నువ్వెళ్ళు. దిగి జీపు వెనక్కు పంపించు. నేను యస్.ఐ.వచ్చాక వస్తాను.
    నరేంద్ర చిరునవ్వు నవ్వాడు. అతడి నవ్వు నవ్వి ఎందుకు రానంటున్నావో నాకు తెలుసే అన్నట్టుగా ఉంది.
    "నేను కూడా లేకపోతే శంకర్రావు ఉడాయిస్తాడని....." నీళ్ళు నమిలాడు ఇన్స్ స్పెక్టర్.
    "శంకర్రావును అరెస్టు చేస్తున్నావా?"
    "చేద్దామనే"
    "ఇప్పుడే చెయ్యకపోవడం మంచిదని నా అభిప్రాయం."
    "ఏం? ఎందుకని?"
    "అరెస్టు చెయ్యడానికి నీకు అతడు హంతకుడిగా  దొరికిన ఆధారాలు ఏమిటి?" అతడు రాత్రి  ఊళ్లోనే లేనని చెప్తాడు."
    ఇన్స్ స్పెక్టర్ నీళ్లు కారిపోయాడు.
    "నీ ఇష్టం. గుడ్ లక్!?" అని భుజం తట్టాడు నరేంద్ర.
    జీపు ఎక్కి  కూర్చుని "ఆ మిస్టర్ ఇన్స్ స్పెక్టర్ శంకర్ర్రావు అరెస్టు చేస్తావో లేదో నీ ఇష్టం ఆ పోచయ్యను మాత్రం ఇక్కడవదలకు. మీతోపాటు అరెస్టు చేసి తీసుకెళ్ళిపో" అన్నాడు నరేంద్ర.
    "అంటే పోచయ్య ఈ హత్య చేశాడంటావా?"
    "నేను అలా అనలేదు"
    "మరి?"
    "అతడ్ని ఇవ్వాళ ఇక్కడ్నుంచి తీసుకెళ్ళకపోతే రేపు ఉదయానికల్లా నీకు మరో శవం దొరుకుతుంది."
    ఇన్స్ స్పెక్టర్ తృళ్ళిపడ్డాడు.
    "పోచయ్యను ఎవరైనా చంపుతారనా నీ భయం?"
    "ఎవరైనా ఎందుకు చంపుతారు. ఈ హత్యతో సంబంధం ఉన్నవాళ్ళే చంపుతారు. అతడికి కొంతసమాచారం తెలుసు. నాలుగు లాఠీ  దెబ్బలు తగిల్తే నిజం కక్కేస్తాడని హంతకుడు అర్థం చేసుకోగలడు."
    "అంటే శంకర్రావే ఇతడ్ని కూడా చంపుతాడనేగా నువ్వనేది?" తెలివిగా మాట్లాడానని అనుకొన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "నేను శంకర్రావు చంపుతాడని అనలేదు. హంతకుడు చంపుతాడన్నాను"
    "ఆ హంతకుడు భారతితో పాటే ఇతడ్ని కూడా ఖతం చేసి ఉండొచ్చుగా?"
    "భారతి ఆత్మహత్య చేసుకొన్నట్టుగా పోలీసులు భావిస్తారనుకొన్నాడు హంతకుడు. అందుకే పైనుంచి తోసెయ్యడం జరిగింది" అన్నాడు నరేంద్ర.
    "అవునయ్యా!. ఆ ఆలోచన నాకూ వచ్చింది. చూడగానే ఆత్మహత్య అనే అనుకొన్నాడు" స్వగతం మాట్లాడు కొంటున్నట్టుగా గొణిగాడు ఇన్స్ స్పెక్టర్.
    నరేంద్ర చిరునవ్వునవ్వాడు.
    "శంకర్రావును అరెస్టు చెయ్యవద్డంటావా?"
    "తొందరపడటం మంచిది కాదని నా అభిప్రాయం. ఆ తర్వాత నీ ఇష్టం" అన్నాడు నరేంద్ర.
    ఇన్స్ స్పెక్టర్ ఏదో అడిగే ప్రయత్నంలో ఉండగానే నరేంద్ర "పోనియ్" అన్నాడు జీప్ డ్రైవర్ తో. పోలీస్ జీపు కదిలి వేగంగా వెళ్ళిపోయింది.
    ఇన్స్ స్పెక్టర్  జీపు వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడ్డాడు.
    ఏమిటి నరేంద్ర ఇలా ప్రవర్తిస్తున్నాడు? తనకు అందినట్టే కన్పించిన హంతకుడు అతడి దృష్టిలో హంతకులుగా కన్పించడంలేదు. సూర్యనారాయణ, శంకర్రావు వీళ్ళిద్దరి మీదా అతడికి అనుమానం లేదా? లేక ఉండీ తనను పెడదారి పట్టిస్తున్నాడా?
    నరేంద్ర అలాంటివాడు కాడు. కాని ఈసారే అతడి ప్రవర్తన వింతగా ఉంది. హొటల్ ప్యాలెస్ లోని వాళ్ళు  ఇచ్చిన పోలికలు అచ్చు నరేంద్ర రూపాన్నే ఎత్తిచూపిస్తున్నాయి.
    వారం తిరక్కుండా మూడు హత్యలు. అందులో రెండు స్త్రీ హత్యలు.
    ఇన్స్ స్పెక్టర్ జుట్టు పీక్కోవాలనిపించింది.
    వెనక్కు తిరిగి బంళాలోకి వెళ్ళాడు అద్వయితం.
                                                                               16
    సాయంత్రం 4-30 దాటినా వాతావరణంలో వేడి తగ్గలేదు.
    ఇన్స్ స్పెక్టర్ అద్వయితం క్రైం బ్రాంచ్ పోలీసు స్టేషన్ లో కూర్చుని భారతి పోస్తు మార్టం రిపోర్టు చూస్తున్నాడు.
    "హల్లో! ఇన్స్ స్పెక్టర్!"
    "హల్లో! నరేంద్రా! హల్లో విజయ్! రండి! రండి!" అంటూ ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీలు  చూపించాడు.
    "మెడికల్ రిపోర్ట్ వచ్చిందా!" నరేంద్ర అడిగాడు.
    "ఆ వచ్చింది. అదే చూస్తున్నాను" అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ నరేంద్రకు అందించాడు.
    "మనం  అనుకొన్నది కరక్టే. ఇది ఆత్మహత్య కాదు. హత్యే!" అన్నాడు అద్వయితం.
    నరేంద్ర రిపోర్టు చదివి ఫైలు బల్లమీద పెట్టాడు.
    "నువ్వు ముఖం మీదా, చేతుల మీదా ఉన్నా పింగర్ ప్రింట్స్ ఫోటో తీయించమంటే ముందు చేపోద్దూ. నాకు అనవసరం అనిపించింది. తీరా మెడికల్ రిపోర్టు చూశాక చాలా ముఖ్యమైన క్లూ వదిలేసి ఉండేవాళ్ళం అనిపించింది."
    "అది నీకు మామూలేగా!" ఉడికిస్తున్నట్టుగా అన్నాడు విజయ్.
    "ఏమిటి నాకు మామూలు!" ఉడుక్కున్నట్టుగా అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "మేము ఏం చెప్పినా ముందు నీకు తేలిగ్గా కనిపించడం....." అన్నాడు విజయ్.
    "ఓ అదా!" పకపక నవ్వాడు అద్వయితం.
    "శవం ముఖం మీద చేతుల మీదా ఎవరివో గోళ్ళతో రక్కినట్టుగా ఉందనీ, బలవంతంగా పిట్ట గోడపైనుంచి ఆమెను తోసెయ్యడం జరిగిందనీ మెడికల్ రిపోర్టు చెప్తోంది. మనం ఆగిపోయిన గడియారం శవం చేతి నుంచి తీసేశాం. అయినా హత్య ఒంటిగంటా రెండున్నర మధ్యలో జరిగిందని డాక్టర్ రిపోర్టు చెప్తోంది. పై నుంచి రాళ్ళమీద పడటం వల్ల తల వెనక  భాగం పగిలి వెంటనే ప్రాణం పోయినట్టు కూడా ఉంది"
    "పింగర్ ప్రింట్స్ తీసుకున్నారా?" నరేంద్ర ప్రశ్నించాడు.
    "ఆ ఇక హంతకుడి పింగర్ ప్రింట్స్ తో పోల్చి చూడటమే ఆలస్యం."
    "ఏమిటి ఇన్స్ స్పెక్టర్ హంతకుడు నీ చేతిలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నావ్?" అన్నాడు విజయ్.
    "ఆ ఉన్నాడు. వాడి పింగర్  ప్రింట్స్ కూడా పంపించాను. త్వరలోనే ఆరిపోర్టు తెలుస్తుంది...." అంటూ ఉండగానే పోన్మోగింది. ఇన్స్ స్పెక్టర్ ఉషారుగా పోన్  అందుకుంటూ "పింగర్ ప్రింట్స్ ఎక్స్ పర్టు" అని "ఆహల్లో! ఏమిటి రెండు ఒకటి కదా? అపింగర్ ప్రింట్స్ వేరా?" నీరు కారిపోయి రిసీవర్ పెట్టేశాడు.
    ఇన్స్ స్పెక్టర్ ముఖం చూస్తుంటే విజయ్ కు నవ్వు ఆగిందికాదు.
    "ఎవరి వేలి ముద్రలు పంపించావ్?" ఆశ్చర్యంగా అడిగాడు నరేంద్ర.
    "ఇంకెవరివి. పోచయ్య వేలి ముద్రలు పంపించి ఉంటాడు." అన్నాడు విజయ్.
    "ఠట్! విజయ్! నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో. నీ వయసంతా కలిపినా నా సర్వీసంత లేదు. నాకు అసలే మతి పోతున్నది. కాసేపు నువ్వలా కూర్చో" అన్నాడు అద్వయితం రుసరుసలాడుతూ.
    "మిస్టర్ అద్వయితం! నీ సర్వీసూ. వాడి వయసూ తర్వాత తీరిగ్గా కొలుచుకుందాంలే. ముందిది చెప్పు! శంకర్రావును అరెస్టు చేశావా?" 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra