Home » Sreelatha » మనసా....ప్రేమించకే నువ్విలా

    "నువ్వేమంటావు క్రాంత్?" అడిగాడు ఆనంద్.
    "ఏమీ అనలేను. అన్నీ చెయ్యాలంతే!" రెండుముక్కల్లో చెప్పాడు.
    "చెయ్యాలంటే..?" ఈష్ కు అర్థంకాలా!
    "కామిని సెమిస్టర్స్ రెండురోజుల్లో అయిపోతాయి. 'నేనూ, కామినీ పెళ్ళిచేసుకోబోతున్నాం...' అని ఇద్దరి తల్లిదండ్రులకూ  ఉత్తరాలు రాశాం. వాళ్ళు మూడురోజుల్లో నా రూమ్ కు చేరుకుంటారు. ఆ తరువాత చెయల్సింది మీరేలాగూ చూస్తారు!" సస్పెన్స్ పెట్టాడు. "కామిని సెమిస్టర్స్ దెబ్బతినకుండా ఈలోపు ఈ టాపిక్ ను తనముందు తేకుండా ఉండటమే మంచిదనుకుంటున్నాను."
    "నువ్వుమంటావ్ రేవంత్...?" ఆనంద్ అడిగాడు ఫైనల్ గా.
    "నేనూ, జ్ఞాపికా ఇష్టపడ్డ విషయం మీకు తెలిసిందే! అటువైపూ, ఇటువైపూ అభ్యంతరాలు లేని అమ్మానాన్నలున్న అదృష్టవంతులం! నెక్ట్స్ ఇయర్ ఈపాటికి మా కజిన్  ఆఫర్ ప్రకారం ఇద్దరం అమెరికాలో ఉంటాం. ఇద్దరు పిల్లలూ చాలు! కొన్నాళ్లయ్యాక ఇండియాకి వచ్చేసి సెటిలయిపోతాం. కాకపోతే.... ఒకటే బాధ్యత- మా పెళ్ళికి ముందు మా మమ్మా పెళ్ళి కావాలి! జ్ఞాపికను అత్తమామలు కలిసి నా ఇంటికి ఆహ్వానించాలి! మమ్మాని నేను డాడీ పక్కన చూడాలి! అదే ప్రయత్నంలో ఉన్నామిద్దరం౧" అన్నాడు స్థిరంగా! 'ఏ ఘర్షణలేని సాఫీ ప్రేమ, ఏ అడ్డంకులూ లేని జీవితం వారిది!" అనిపించింది వినేవాళ్ళకు.
    ప్రేమ చాలా  మధురం! ఎంత మధురం అంటే.... ప్రాణం పోసేంత మధురం! ప్రాణం తీయగా తీసేంత మధురం! తక్కిన శరీరం అంతా వదిలేసి గుండెను మాత్రం ఆవరించుకునేంత మధురం! ఏ ఆటంకమూ లేకుండా   సాగడం వరం! కొందరికి మాత్రమె అది సాధ్యం! ;మాప్రేమ  ఏ అడ్డంకులూ లేకుండా సాగిందని చెప్పగలిగే ప్రేమజంట ఇలలో ఉంటే....  వారిని ఆ విధమైన ప్రేమ పొందగలినందుకూ, పరిస్థితులు అనుకూలంగా మలిగినందుకూ వారిని  ప్రపంచపు భాగ్యవంతులుగా గుర్తించాలి!
    ప్రతిచోటా ప్రేమ- 'ఘర్షించి సాధించుకున్న విజయం'గానే నిర్వచించబడింది. ఘర్షణలో ప్రేమకై మరణించినట్లు చూపబడింది తప్పితే- అనుకూలించి అనుభవించ బడిందిగా ఎక్కడా ఆధారాలు లేవు! ప్రేమ అంత సులభతరమైన సాధన అయివున్నట్లయితే 'ప్రేమ' అనే  పదానికి అంత విలువ, అపురూపం, గాఢత, అర్పణ, మాధుర్యం, మనోహారం, త్యాగం....లాంటి ప్రతిపదార్థాలు ఏర్పడేవి కావేమో! బాధాకరం, విరహం, పిచ్చి, ఉన్మాదం, మరణం.... లాంటి భావాలు ప్రేమవిఫలంలో ఏర్పడేవి కావేమో! తాజ్ మహల్ నిర్మాణం, రాదాకృష్ణుల రచన, లైలామజ్నూల ఆహుతి, రోమియో జూలియట్ ల హరుడయవిచారం, దేవదాసు పార్వతిల ఆర్పన .... ప్రపంచానికి పరిచయం అయ్యేవి కావేమో! ప్రేమ సులభం అయితే... అది అనుభవైకవేద్యం కాలేకపోయి, అందరికీ అందుబాటులో దొరికే అన్ని  భావాల్లో ఒకటయి దాని ప్రత్యేకత కోల్పోయేదేమో!
    కానీ, వాళ్ళ కళ్ళముందే ఏ ఘర్షణా లేకుండా సాఫీగా ప్రేమను పొందిన ఆ జంట జీవనం కూడా సాఫీగా కొనసాగాలని మనస్ఫూర్తిగా, ఆర్తిగా కోరుకున్నారు.
    "రియల్లీ యువర్  థాట్ ఈజ్ మెచ్యూర్డ్ థాట్ యార్!" ఈష్ మెచ్చుకున్నాడు.
    నీ విషయంలో నీ ఫ్రెండ్స్ గా గర్వపడుతున్నాం!" క్రాంత్ సంతోషపడ్డాడు.
    "కాస్త మా వంతు సాయం కూడా తీసుకో....కావాలంటే!" ఆనంద్ ఎంకరేజ్ చేశాడు.
    "తప్పకుండా! చెయ్యాల్సిందంతా మీరే! మీరు ఫ్రెండ్స్ కాదు యార్....నాకు ఆత్మలో  భాగం! నాలుగు శారీరాలు కానీ, ఓకే ఆత్మ మనం!"  అన్నాడు బాధ్యత గుర్తుచేస్తూ!
    "హాయ్ఁ....హాయ్ఁ!" అంటూ అమ్మాయిల రావడంతో ఆపేశారా టాపిక్.
    చదువుకుంటున్న అలసట కనిపిస్తోంది వాళ్ళ ముఖాల్లో! చదివేసిన తేటదనం అబ్బాయిల్లో! వాళ్ళను చూడగానే లాస్ట్ ఇయర్ వాళ్ళ ముఖాల్లో! చదివేసిన  తేటదనం అబ్బాయిల్లో! వాళ్ళను  చూడగానే  లాస్ట్ ఇయర్ వీళ్ళ పరిస్థితి గుర్తొచ్చి జాలేసింది! వాళ్ళను కొంచెం మాటలతో రిలాక్స్ చెయ్యాలనిపించింది ప్రతి ఒక్కరికీ!
    "పాపం! వాళ్ళు చదివీ చదివీ చిక్కిపోతున్నారు!" ఆనంద్ జాలిపడ్డాడు.
    "అవును! అందుకే నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది!" రేవతి అడిగింది.
    "నిన్ను కాదు చిక్కిపోయిందని అంది! ...మమ్మల్ని!" స్ఫూర్తి అడ్డుకుంది.
    "నువ్వే ఇంకా ఎక్కడా చిక్కలేదని నాకు తెలుసులే!" అని రేవతి బోసి మెడవైపు చూసి అంది.
    "అందరం చిక్కిపోయాం... సరేనా? వాగుడాపండి!"  తిట్టింది జ్ఞాపిక .... లాన్ లో  కూర్చుంటూ!
    "నువ్వేం చిక్కలా! అందరం అంటున్నావ్! పాపం.... రేవంత్ చిక్కిపోయాడు" స్ఫూర్తి జ్ఞాపికను రెచ్చగొట్టింది.
    "మీరాపుతారా..., మమ్మల్ని వెళ్లిపొమ్మంటారా?" అబ్బాయిలడిగేసరికి ఆగిపోయారు. ఏదో అనబోయిన కామిని కూడా ఊరుకుంది.
    "మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి చిన్న గేమ్ ఆడుకుందాం... ఓ.కే!" ఈష్ ప్రపోజల్ పెట్టాడు.
    "ఏం గేమ్! గర్ల్స్ దా, బాయ్స్ దా?" రేవతి అడిగింది కంగారుగా!
    "కొజ్జాలది! ఏదయితేనేం.... ఆడటానికి!" స్ఫూర్తికి మండింది.
    "అదికాదే! మనం  గెలిచే గేమ్ పెడితే బావుంటుంది! మనం గెలవెచ్చు ఎంచక్కా!" రేవతి ఎక్స్ ప్లెయిన్ చేసింది.
    "గేమ్స్ లో బాయ్స్ గేమ్స్ , గర్ల్స్  గేమ్ ఏంటే.... మరీ  సిల్లీగా!" జ్ఞాపిక కోప్పడింది.
    "ఎందుకుండవు? బిళ్ళంగోడు, గోళీలాట  బాయ్స్ గేమ్స్- వాళ్ళే గెలుస్తారందులో! అచ్చంగిల్లా, తొక్కుడు బిళ్ల ,   చెమ్మాచెక్కా అయితే మనం గెలవొచ్చు... ఎంచక్కా!" ఐడియా ఇచ్చింది.
    "ఇది ఇంకా అమ్మమ్మ తరంలోనే ఉందే! ఇప్పుడసలు ఆ గేమ్స్ బాయ్స్ కూ రావు, ఈ గేమ్స్ గేమ్స్ గర్ల్స్ కూ రావు!" కామిని తేల్చింది.
    "దీనికి అచ్చంగిల్లా, తొక్కుడు బిళ్లా, చెమ్మాచెక్కా తప్ప రావులే! అందుకే గేమ్స్ అంటే అవేననుకుంటోందీ అమ్మమ్మ!"  స్ఫూర్తి రేవతిని రెచ్చగొట్టింది.
    "ఆపండి! కామన్ గేమ్.... సరేనా?" పేషెన్నీ చచ్చిపోయి అరిచాడు క్రాంత్.
    "వీళ్ళ మూడ్స్ బాగుచేద్దామనుకుంటే మనందరి మూడ్స్ పాడుచేసేలా ఉన్నారు వీళ్ళు!" గుసగుసగా గొణుకున్నారు ఆనంద్, ఈష్!
    "అందరూ రౌండ్ ఫాం చేయండి!" రేవంత్ ఆర్డర్ చేశాడు.
    కామ్ గా రౌండ్ ఫాం చేశాడు. జ్ఞాపికతో మొదలయి రేవంత్ తో ఎండ్ అవుతుంది ఆ రౌండ్.
    "జ్ఞాపిక ఇప్పుడు తనకిష్టమైన ఒక సెన్ టెన్స్ మీకు చెవిలో చెబుతుంది. అది మీరు పాస్ చేస్తారు. రేవంత్ వరకూ వచ్చాక గట్టిగా చెప్తాడు. జ్ఞాపిక చెప్పిందే కరెక్ట్ గా  రేవంత్ చెప్పగలిగితే రేవంత్ గెలిచినట్టు! లేపోతే ఓడిపోయినట్టు...ఓ.కే.?! రేవంత్ ఓడిపోతే అబ్బాయిల టీమ్ ఓడిపోయినట్టు! జ్ఞాపిక ఓడిపోతే అమ్మాయిలు ఓడిపోయినట్టు!"
    "ఓఁ.... పాస్ ద మెసేజ్ గేమా! మేం రెడీ...!" అందరూ రెడీ అయిపోయారు.
    జ్ఞాపిక తన పక్కనున్న స్ఫూర్తి చెవిలో తనకిష్టమైన మాట కొన్ని నిముషాలు ఆలోచించి మేరీ చెప్పింది. 'ఫర్ ఎవర్ ఐ లివ్ ఫర్ యు" అని గుసగుసగా!
    అది స్ఫూర్తి- ఆనంద్ కు పాస్ చేసింది తనకు వినిపించింది!
    ఆనంద్ కామినికీ, కామిని రేవతికి, రేవతి ఈష్ కు ఈష్ క్రాంత్ కు, క్రాంత్ రేవంత్ కూ! అది కొన్ని మార్పులతో రేవంత్ ను చేరింది. రేవంత్ గట్టిగా చెప్పాలది.
    జ్ఞాపిక వైపు చూశాడు చెప్పేముందు! జ్ఞాపిక కళ్ళు మూసుకుని, రెండు చూపుడువేళ్లు కలిపి నొసలు కానించి మనసు కేంద్రీకరించి వినడానికిసిద్దమయింది... తన ఇష్టాతి ఇష్టమయిన రేవంత్ గుండెల్లోంచి తనకు ఇష్టాతి ఇష్టమయిన పదాలకోసం!
    రేవంత్ గొంతు సవరించుకుని గట్టిగా చెప్పబోయేముందు జ్ఞాపికను చూశాడు. రేవంత్ చెప్పోద్దనుకున్నాడు. చెప్పాలనిపించాలా! చెప్పానని సైగ చేద్దామంటే జ్ఞాపిక కళ్ళు మూసుకుని ఉంది. తప్పనిసరిగా చెప్పాడు కొంచెం బరువుగానే....
    "ఐ నెవ్వర్ గివ్ మై లైఫ్ టు యూ" అని!
    "అంతే..!
    జ్ఞాపిక చట్టుక్కున లేచి కైనటిక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయింది.
    రేవంత్ కు అర్థంకాలా జ్ఞాపిక ఏం చెప్పిందో! "అంతేకదా.... చెప్పింది?!" అడిగాడు అందర్నీ!
    "ఏమో.... ఎలా మారుతూ వచ్చిందో అలా చెప్పాం! మాకు మాత్రం ఏం తెలుసు తనేం చెప్పిందో!" కంగారుపడ్డారు.
    రేవంత్ లేచి బైక్ తీసుకుని వెనకే వెళ్లాడు. హాస్టల్ చేరకముందే ఓవర్ టేక్ చేసి-
    "జ్ఞాపీ... స్టాప్! అది గేమ్! జ్ఞాపీ.... స్టాప్!" స్పీడ్ ను ఆపి ఓవర్ టెక్ చేస్తూ, ఆగుతూ చెప్పాడు. వినకపోతే బైక్ ను అడ్డంగా మాలిపాడు. ఇద్దరి వెహికల్స్ ఢీ కొని  ఆగాయి స్టాండేసి పక్కకొచ్చారు. జ్ఞాపిక కళ్ళు తడిచి ముద్దయ్యాయి!
    "ఓఫ్ఫ్ఁ....జ్ఞాపీ! అది గేమ్ కదా!"
    "అయినా నువ్వలా చెప్పడం నాకు నచ్చలా! నువ్వు నాకు లైఫ్ ఇవ్వనన్న మరుక్షణం నా గుండె ఆగిపోతుంది. తెలుసా?"  కళ్ళనిండా నీళ్లు! ఎద ఎగిసిపడుతోంది ఉద్వేగానికి.
    "ఏయ్ఁ.... సిల్లీగాళ్! అది గేమ్! నీకామాట చెప్పేముందు నేనుండను....తెలుసా?" అన్నాడు తన చెయ్యి పట్టుకుని లాలనగా!
    "ఇంకెప్పుడూ గేమ్ లో కూడా అలా చెప్పకు! ఆ తరువాత నీకు హనీ ఉండదు.... సారీ చెప్పడానికి కూడా!" చిన్నపిల్లలా గుప్పెళ్ళతో కళ్ళనీళ్లు తుడుచుకుంది.
    ఆమెను ఆర్తిగా హృదయానికి హత్తుకుని- "నా లైఫ్ అంటేనే నువ్వు! నిన్ను నీకివ్వనడమేమిటి! హాఁ....నువ్వూ నేనూ వేరా? ఇచ్చి పుచ్చుకోవడానికి!" అరగంట లాలించాకగానీ మూడ్ లోకి రాలా! మళ్లీ సెమిస్టర్ మూడ్ లోకి తీసుకొచ్చి 'గుడ్ నైట్...' చెప్పి వచ్చేశాడు.
    తను ఏమాత్రం నొప్పించినా తట్టుకోలేదని అర్థమైపోయింది రేవంత్ కు.... పిచ్చిదయిపోతుందని కూడా అనిపించింది.
                                                                                             21
    క్రాంత్ రూమ్ లో కూర్చున్నారు ఫ్రెండ్సందరూ!
    వాళ్ళతోపాటు క్రాంత్ అమ్మా, నాన్న, మేనమామ; కామిని అమ్మానాన్న , మరో ఇద్దరు చుట్టాలు! వీళ్ళు 'పెళ్ళి చేసుకుంటున్నాం ఈరోజు! ' అని లెటర్స్  రాసేసరికి తిరుగుటపాలో వాళ్ళే వచ్చేశారు. వాళ్ళ వాదన రెండురోజులుగా సాగుతోంది!
    "అయినా- చదువయ్యీ, కాకుండానే పెళ్ళి తొందరేవిట్రా? ఇప్పట్లో అబ్బాయిలు ముఫ్ఫైఏళ్ల దాకా తిరుగుతుంటేను!" మావయ్య కసిరాడు క్రాంత్ ను.
    "నాకు ఇష్టంగా ఉంది.... చేసుకుంటున్నాను. నీకు ఇష్టంలేపోతే నీపిల్లలకు చేయకు." కట్  చేశాడు క్రాంత్.
    "అలా  విసుర్లేవిట్రా....మేనమామ అనయినా చూడకుండా! అదీ....కిరస్తానీ పిల్లను చేసుకుంటానంటావు! మన ఇంతా వంటా ఉందా?!" అడిగింది క్రాంత్ అమ్మ.
    "ఇదుగోండి...కిరస్తానీవాళ్ళు అనొద్దు! మర్యాదగా మాట్లాడండి!" కామిని నాన్న కయ్యానికొచ్చాడు.
    "అవ్వంగా  లేంది- అంటే తప్పేవిటట? అహఁ- మీరు  కిరస్తానీవాళ్ళు కాదా? కాదని చెప్పండి....అనడం మానేస్తాం!"
    "కాదని ఎందుకు చెప్పాలి? మీ మతం పట్ల  మీకెంత గౌరవం ఉందో, మా  మతం పట్ల మాకంత గౌరవం ఉంది. మేం గర్వంగా చెబుతున్నాం.... మాది క్రిస్టియన్ మతమనీ, మీదే బాపన కులమని!" కామిని నాన్న గొంతు పెంచాడు.
    "బాపన కులమేమిటీ! బ్రాహ్మణులూ అనలేవూ?" ఆవిడ ఛీత్కరించింది.
    "మీరు మాత్రం కిరస్తానీవాళ్ళు అనడం లేదూ?" రెట్టించాడాయన.
    "మీరూ, మీరూ ఏ మతం గొప్పదో తర్వాత తేల్చుకుందురు! పెళ్ళి చేసుకోబోయేది వాళ్ళిద్దరు.... మీరు కాదు. రిజిస్ట్రార్ ఆఫీసుకు ఎవరొస్తారో తేల్చండి!" ఈష్ అడ్డుపడ్డాడు.
    "రాముడికి కోతిమూక లంకె'.... అని, మావాడికి మీరు బాగా దొరికారు నాయనా.... పాడు చేయడానికి! పెళ్ళిట పెళ్ళి!! మా కులంపిల్ల అయితేనే పెళ్ళి....లేపోతే లేదు! అప్రాచ్యపు పనికి అష్టోత్తరాలని- మీరున్నారుగా నాయనా!" తేల్చేసింది.
    "అయితే.... నేను మతం మార్చుకుంటా!" క్రాంత్ మొండిగా చెప్పాడు.
    "అవునూఁ...క్రిస్టియనువు అయిపో బాబూ!" కామినీవాళ్ళ నాన్న సంబరపడ్డాడు.
    "హేమిటీఁ....కిరస్తానీ వాడయిపోవాలా నా కొడుకు! కని, పెంచీ, పెద్దచేస్తే ఇప్పుడొచ్చి గద్దలా తన్నుకుపోదామనే....కూతుర్ని ఎరగా పెట్టి!" చేతులు తిప్పుతూ అడిగింది.
    "సరే....నేనే మతం మార్చుకుంటాను" కామిని అంది.
    "నువ్వు మార్చుకున్నా మేం కలుపుకోం! క్రాంత్ మేనమామ అన్నాడు.
    "మేమూ నీ కొడుకును కలుపుకోం!" కామిని తల్లి అంది.
    "ఇద్దరం మార్చుకుంటాం! రెండు మతాలు! బ్రహ్మ క్రిస్టియన్స్ ము మేము.... సరేనా?" క్రాంత్ అరిచాడు.
    "మన వంశం, గోత్రం మంటగలుపుతున్నావు కదరా....గంగాజాలంలో పంచకం కలిపినట్టు!" తండ్రి ఉరిమాడు.
    "నీ కొడుకు గంగాజాలం! నా కూతురు పంచకమా? చూశావేఁ....ఇకనైనా సిగ్గురాలా? ఈ బాపనవాళ్ళను చేసుకుంటే నిన్నూ, నీ పిల్లల్నీ బ్రతకనివ్వరే! మడీ, ఆచారం అని ఎండగొట్టి చంపుతారు!" కామిని తండ్రి ఆక్రోశించాడు.
    "మీ వంశం కోసం పిల్లల్ని కనదల్చుకోలేదు" క్రాంత్ చెప్పాడు.
    "హవ్వఁ....అవేం మాటలురా! ఉన్న ఒక్కడివీ అలా అంటే నీతోనే మన వంశం ఆగిపోదూ?"
    "పోనీ! గొప్పగొప్ప వంశాలే లేవు! శ్రీ కృష్ణదేవరాయుల వంశం ఎక్కడా? కాకతీయుల వంశం ఎక్కడా? చాణుక్యుడి వంశం ఎక్కడా? మదర్ థెరిస్సా వంశం ఎక్కడా? గురునానక్ వంశం ఎక్కడా? బుద్దుడి వంశం ఎక్కడా? మహమ్మద్ వంశం ఎక్కాడా? మీరు ఆదర్శం అనుకున్న రాముడి వంశం ఎక్కడా? జీసస్ వంశం ఎక్కడా?....వాళ్ళకే వంశం లేనపుడు మన బోడివంశం కోనసాగకపోతే ఏం మునిగిపోదు భూప్రపంచంలో!"
    "ఆస్థి చిల్లిగవ్వ రాదు నీకు!" మావయ్య బెదిరించాడు.
    "ఆస్థి నువ్వే  తీసుకుని, వీలుంటే పిల్లల్ని కూడా కనిపెట్టు! నాకేం వద్దు!" విసురుగా అన్నాడు.
    "ఆఁ...! ఈ కిరస్తానీదాన్ని చేసుకుని, పిల్లల్నికని, అప్పుడు ఆస్థివాటా కొస్తేనో!" మామయ్యకు అనుమానం వచ్చింది.
    "మళ్లీ కిరస్తానీవాళ్ళు అనొద్దన్నానా? మీ ఆస్థి తినాల్సిన ఖర్మ నా బిడ్డకు లేదు. అది సంపాదించుకోగలదు. మీ బాపనపిల్లాడ్ని ఇష్టపడుతుందీ వెర్రిది!లేపోతే ఫారిన్ సంబంధం వచ్చేది దానికి! చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు కూడా!" రెచ్చిపోయాడు కామిని తండ్రి.
    "ఆ ఫారిన్ వాడికే ఇచ్చుకోండి... పీడా పోతుంది!" క్రాంత్ తండ్రన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra