Home » Kurumaddali vijayalakshmi » Ardharatri Arthanadam


    "గమనించాను."
    "అయితే గమనించి కూడా చూస్తూ వూరుకున్నారన్న మాట."
    "కొన్ని వూరుకోక తప్పదు. వూర్కోవడమే మంచిది కూడా.
    "మీరు...మీరేనా! ఇలా మాట్లాడుతున్నది" చాలా ఆశ్చర్యంగా అంది ఊర్మిళాదేవి.
    "నేను నేనే, కాకపోతే  నటిస్తున్నాను."
    "మీరు నటిస్తున్నారా! ఎందుకు?"
    "చెప్తాను. ముందు నీ విషయం చెప్పు. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు."
    "నేనైతే దాన్ని బాబాయ్ గాడ్ని నాలుగుకడిగి, ముక్క చివాట్లుపెట్టి నువ్వు బజారు రకానివి. నీ బాబాయ్ కేమో గుర్రపందాలు, పేకాటపిచ్చి. మీ ఇద్దరూ బయటకు వెళ్ళి అరచిచావండి, అడుక్కొని తినిచావండి. ఎలా చచ్చినా మాకు అక్కరలేదు. వెధవేషాలువేస్తే మాత్రం పోలీసులకి పట్టిస్తాం. లేకపోతే రౌడీలచేత మిమ్మల్ని చావ చితకకొట్టిస్తాం. అని బెదిరించి మెడబట్టుకొని బయటకు గెంటేయాలి. మన మాటలకు అది భయపడిందా సరే లేక అల్లరిచెయ్యటానికి ప్రయత్నిస్తే మాత్రం ఏ రౌడీనో పంపించి నాలుగు తన్నించాలి. దాంతో అది నోరుమూసుకుంటుంది. మనకి సంఘములో డబ్బు, పరువు, పేరు ప్రఖ్యాతి అన్నీ వున్నాయి. కిరణ్ కి మంచి కుటుంబంలోని పిల్లనిచ్చి సలక్షణంగా వివాహం చేద్దాము. చాలా తేలికగా చెప్పింది ఊర్మిళాదేవి.
    రావుగారు పైకే పక్కున నవ్వాడు. ఈ మధ్యకాలములో ఆయన అలా మనస్ఫూర్తిగా నవ్వింది లేదు.
    ఊర్మిళాదేవి తెల్లబోయి భర్తవైపు చూసింది.
    "నువ్వు ఒక్క నిమిషంలో చెప్పినంత తేలికగా ఈ వ్యవహారం  పూర్తికాదు. కిరణ్ ఆ పిల్లనేమీ అననివ్వటం లేదు గమనించావా!"
    "గమనించాను కాబట్టే ఈ బాధ."
    "ఇప్పుడర్ధమైందికదా! కామిని మనవాడిని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నది అంటే, వాడు ఏదో తీవ్ర విషయంలో భయపడి కామినీకి లొంగిపోయినట్లు తెలియడంలేదా! కామిని ఏదో విషయంలో కిరణ్ ని బెదిరిస్తున్నది. అంతవరకూ ఖాయం.
    "ఏ విషయంలో బెదిరిస్తున్నది. నీ వల్లనే నా కడుపొచ్చింది. పెళ్ళిచేసుకుని నా మాటవినకపోతే నలుగురిలోనూ అల్లరిచేస్తానని వుంటుంది. దాంతో వీడు భయపడి నోరు మూసుకొని వుంటాడు.
    "అది చాలా అల్పమైన విషయం. ఇంకేదో బలీయమైన కారణం వుంటుంది." రావుగారు అన్నారు.
    "ఇంకేమైవుంటుంది? వీళ్ళిద్దరినీ కలిపి వాళ్ళ బాబాయి ఫోటో తీసివుంటాడు. లేకపోతే వీళ్ళిద్దరి సంభాషణ రికార్డు చేసివుంటాడు. ఆ చిన్న బెదిరింపుకే మనవాడు అమాయకముగా లొంగిపోయి వుంటాడు.
    "అదికాదు"
    "కాదా?"
    "కాదు."
    "కాదు, లేదు అనకపోతే విషయమేమిటో వివరంగా చెప్పవచ్చు కదా అదేదో నాకర్ధమయితే నేను ఇంత మధనపడను కదా! మీ ఆలోచన ఏమిటో చెప్పండి. మీరు ఏ విషయములో నోరుమూసుకున్నారో చెప్పండి."
    "నువ్వు చెప్పిన విషయాలే అయితే నీవు ఊహించి నంతవరకే కధ జరిగివుంటే ఇదీ పరిస్థితి డాడీ అని కిరణ్ నాతో చెప్పేవాడే? ఆ మాత్రం చెప్పగల చనువు, ధైర్యం నేనెప్పుడో ఇచ్చాను. ఇది అదికాదు. అంతకన్నా జటిలమైనదే."
    "మీరు చెప్పేదేంటో నాకు ఒక్క ముక్కా అర్ధంకావడంలేదు. మరికాస్త వివరముగా చెప్పండి." అన్నది ఊర్మిళాదేవి.
    "ఇందాక నువ్వు చెప్పాఉ చూడు, అవి అత్యల్ప విషయాలు, వీడి రహస్యమేదో గుప్పెట్లో పెట్టుకుంది. ఆ విషయము చెప్పి బెదిరించి వుంటుంది.
    "ఆ విషయము ఏమైవుంటుంది అంటారు?"
    "అది ఏదైనా కావచ్చు. ఆ విషయం చిక్కుముడి లాగినకొద్దీ బిగుసుకోవడమేకాని, దానిలోనుంచి బయటపడటమనేది జరగని పని. మన కిరణ్ సాలెగూటిలోని ఈగలాగ చిక్కుకున్నాడు. ఆ సాలెగూటిలోనుండి బయటపడలేక గిలగిలలాడుతున్నాడు. వాడి చేతలను బట్టి, మాటలనుబట్టి నేనీ విషయం గ్రహించాను."
    "మీరుచెపుతూంటే నాకు చాలా భయముగా వుంది. చాలా పెద్ద ఆపదలో చిక్కుకొని ఉండవచ్చు. పోనీ ఆ విషయమేమిటో చాటుగా మీతో చెప్పినట్లయితే, తగు పరిష్కారం చూసేవారు కదా!"
    "ఇప్పటికైనా అర్ధమైందా వూర్మిళా! కిరణ్ నాతో కూడా చెప్పలేనంత భయంకరమైన వూబిలో కూరుకుపోయి ఉంటాడు."
    "అయితే ఇలా చూస్తూ వూరుకోవల్సిందేనా అండీ!"
    "నేనీ పరిస్థితులలో వేయికళ్ళతో గమనిస్తున్నాను. అడిగినా కిరణ్ చెప్పడని గ్రహించాను. కనుక నేను నోరుతెరచి అడగకుండానే ఆ భయంకర రహస్యమేదో సమయం చూసి బైటికి లాగుతాను. సమస్య పరిష్కరిస్తాను.
    "అంతవరకు కిరణ్ భయపడుతూ దానితో కాపరం చెయ్యవలసినదేనా?"
    "వాడంతట వాడు చెప్పడు. అది ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. అప్పటిదాకా ఓర్పుగా మనము వేచి ఉండకా తప్పదు" రావుగారు అన్నారు.
    "ఇదేం ఖర్మండీ!" అంది ఊర్మిళాదేవి.
    ఇరువురు కొద్దిసేపు ఎవరో ఆలోచనలో వారు ఉండిపోయారు.
    చావగొట్టి చెవులు మూస్తే అప్పటికప్పుడు సమస్య పరిష్కారము అయిపోతుంది. అనుకుంటున్నది వూర్మిళాదేవి. ఆవేశము తప్ప వివేకము లేని ఆలోచన ఆమెది.
    రావుగారు సంఘంలో నేరాలు ఘోరాలు ఎన్నో చూసినవాడు. సమస్యకన్నా పరిష్కారము కష్టమైనది అని గ్రహింపు కల్గినవాడు. ముళ్ళమీద పడ్డ వస్త్రాన్ని జాగ్రత్తగా నెమ్మదిగా తొలగించాలిగాని, వేగంగా లాగితే ముళ్ళల్లో ఇరుక్కున్న వస్త్రం చిరిగిపోతుంది. ముళ్ళకెప్పుడూ నష్టం వుండదు. వస్త్రనైకే నష్టం. చీలికలయిపోయేది వస్త్రమే. ఎదుటివాడు ఆవులిస్తే పేగులు లెక్కపెట్ట గలిగే రావుగారు ఇంకా పేగులు లెక్కపెట్టలేదూ అంటే ఎదుటివాళ్ళు ఆవులించలేదని అర్ధం.
    రావుగారు, ఊర్మిళాదేవి మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి బాగా తెలిసిన రాజన్ బాబు అక్కడికి వచ్చాడు.
    ఆయన్ని చూసి నవ్వుతూ ఆహ్వానించాడు రావుగారు.
    రాజన్ ఫారిన్ లొ వున్న కొడుకు దగ్గరికి నాలుగు నెలల క్రితము వెళ్ళి మూడు రోజులక్రితమే వచ్చాడు. తన కొడుకు కోడలు ద్వారా రావుగారి ఇంటి విషయాలు విని వున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra