Home » Yandamuri veerendranath » యుగాంతం

   

    ఆమె వెనుదిరిగింది.
   
    ఆమె మౌనంతో అతడు కంగారుపడి, "మాలతీ" అన్నాడు. "నేను.....నేను నీ మనసు నొప్పించానా-"
   
    ఆమె లేదన్నట్టు తల అడ్డంగా వూపింది.
   
    "పద, మీ ఇంటి దగ్గర దింపుతాను."
   
    ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది.
   
    అతడి మనసులో ఏదో అస్పష్టమైన వ్యధ. ఆమె నిజాయితీ ముందు తను ఓడిపోతున్నానేమో అన్నబాధ. "వ్యవస్థను ఎదిరించటం- మన వాళ్ళని కాదనటం-ఇలాంటి పెద్ద పెద్ద మాటలొద్దు. మనం ఏ కారణం వల్ల ఇంతకాలం వివాహం చేసుకోలేదో- ఆ కారణంవల్లే ఈ ఒక్కరోజూ ఆగుదాం."
   
    దూరంగా పదకొండు కొట్టింది.
   
    పదకొండు గంటలా ఐదు సెకన్లు.
   
    అదే సమయం.
   
    ఉన్నట్టుండి పెద్ద కుదుపు. ఫెళఫెళా రావాల్తో భూమి కంపించింది. మూడు సెకన్ ల పాటు ఊగిపోయింది. పెద్ద శబ్దంతో బీటలు వారింది. వాళ్ళిద్దరూ ప్రేక్షకులే అయ్యారు.
   
    చూస్తూ వుండగానే రెండు మూడు ఇళ్ళు కూలిపోయేయి. దూరంగా ఎవరో ఏడుస్తున్న ధ్వని.
   
    రమణ చప్పున ఆగి "అరె!" అన్నాడు.
   
    మాలతి అటుచూసింది.
   
    వృద్దుడు తడుముకొంటూ వస్తున్నాడు. ముందో గొయ్యివుంది. భూమి విడిపోవటంతో ఇరవై అడుగుల కందకంలా ఏర్పడింది. అటువైపు వెళుతున్నాడా అంధుడు.
   
    "ఆగు" అని అరిచేడు రమణ. అప్పటికే ఆలస్యం అయింది. వృద్దుడు కందకంలోకి జారిపోయేడు. రమణ పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. క్రిందికి తొంగి చూసేడు. నాలుగడుగుల క్రింద రాయిని పట్టుకొని వేలాడుతున్నాడు వృద్దుడు. ఏ క్షణమన్నా జారిపోయేట్టు వున్నాడు. రమణ లోపలికి దిగటానికి ఆయత్తమయ్యేడు. అతడి చేతిని ఆమె పట్టుకొని ఆపింది. ఒక్కక్షణం ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.
   
    ఒక వృద్దుడి జీవితకాలాన్ని ఒకరోజు పాటు పొడిగించటం కోసం తన జీవితాన్ని ఒకరోజు తగ్గించుకొనే రిస్క్ తీసుకోవాలా? క్షణంలో వెయ్యోవంతు ఆలోచించి అతడో నిర్ణయానికి వచ్చేడు.

    ఆమె చేతిని విడిపించుకొని అతడు నెమ్మదిగా కందకంలోకి దిగుతూ, "వస్తున్నా తాతా! ఒక్కక్షణం ఓర్చుకో" అన్నాడు. కాలి కింద మట్టిజారి, అడుగు చీకట్లో ఎక్కడికో వెళ్ళి పడ్తూంది.
   
    ఒక్క అడుగు క్రిందికి దిగేడు.
   
    వృద్దుడి చేయి బలహీనంగా వణకటం కనిపిస్తూంది.
   
    పైనుంచి మాలతి ఆత్రంగా చూస్తూంది. ఇంకొ అడుగు నెమ్మదిగా దిగేడు. ఒక చేత్తో రాతిని బలంగా పట్టుకొని ఇంకొ చేయి ముందుకు సాచి, వృద్దుడి చేతిని అందుకొని బలంగా పైకి తోసేడు. ఒక్క ఊపుతో వృద్దుడు పైకి వచ్చేడు కానీ, రమణ పట్టుకొన్న రాయిమాత్రం పట్టు వదిలేసింది.
   
    కెవ్వున అరచిన కేక చుట్టూ ప్రతిధ్వనిస్తూండగా అతడు క్రిందకి జారి, రాళ్ళమధ్య పడిపోయేడు. క్షణం పాటూ, ఏమీ తోచలేదు. కాలు విరిగిందో - చెయ్యి విరిగిందో తెలియలేదు. అంతలో దబ్బున శబ్దం తడిమి చూస్తే పక్కన ఇంకొ శరీరం. "ఎంతపని చేశావు మాలతీ...." అన్నాడు. ఆమెనుంచి సమాధానం రాలేదు. కంగారుగా ఆమెని కుదుపుతూ, "మాలతీ - మాలతీ" అన్నాడు ఆమె హీనస్వరంతో "ఊఁ" అంది. ఆమె తలనుంచి స్రవిస్తున్న రక్తాన్ని చేతితో అదిమిపెట్టేడు.
   
    తల పైకెత్తి చూసేడు. ఇరవై అడుగుల ఎత్తులో చిన్న రంధ్రం బయట చీకట్లో సరిగ్గా కనబడటంలేదు. మట్టి కొద్దికొద్దిగా జారి పడ్తూంది. కొంచెం సేపట్లో రాళ్ళు కూడా పడ్తాయి. మనిషిని సజీవ సమాధి చేసే రాళ్ళు.
   
    "రమణా" అందామె సన్నగా.
   
    "ఊఁ."
   
    "నేను..... నేను నీ చేతిని ఒకసారి.....ఒకేసారి చెంపకు ఆన్చుకోనా?"
   
    అతడు కదిలిపోయి, "మాలతీ" అన్నాడు.
   
    "నీ......నైతిక విలువలూ, మానసిక బంధాలూ దానికి కూడా అడ్దొస్తాయా?"
   
    అతడు చప్పున ఆమె తలని చేతుల్లోకి తీసుకొని హృదయానికి హత్తుకొంటూ "అంతమాట అనకు మాలతీ!" అన్నాడు తడి కళ్ళతో ఆమె అతని చేతిని పట్టుకొని అలాగే వుండిపోయింది. నాలుగు సంవత్సరాల స్నేహపు మొదటి స్పర్శ ఏదో అద్భుతమైన లోకాలలో విహరిస్తున్నట్టూ ఆమె కళ్ళు మూసుకుంది. ఆ కల చెదిరిపోతుందేమో అన్నట్టు అతడు ఆమెను గట్టిగా పట్టుకొని ఉన్నాడు.
   
    భూమికి ఇరవై అడుగుల లోతులో వాళ్ళిద్దరూ అలా ఎంత కాలం వున్నారో తెలియదు. ఏ రాయి వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళిందో తెలీదు. ఏ ప్రకంపనం వాళ్ళని సజీవసమాధి చేసిందో తెలీదు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించిన ఆ ప్రేమికుల చరిత్ర వ్రాయటానికి చరిత్రకారు లెవరయినా భూమ్మీద ఇంకా మిగిలివుంటే వాళ్ళ కథ కూడా చరిత్రకెక్కి ఉండేదేమో!
   
    ది లాస్ట్ డే
   
    ఆగష్టు పదిహేడు

   
    Blow ye the Trumpet in sion alarm in my holy Mountain... the day of lord cometh : a day of darkness and of gloominess, a day of clouds.....there has not been ever the like, neither shell be any more after it.
   
                                                                                                                              (Jeel 2 : 1-2)
   
    సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి. గాలి ఝంఝామారుతమవుతుంది. కారుచీకట్లు కమ్ముకుంటాయి. సూర్యుడు నల్లబడతాడు. నక్షత్రాలు కాంతి హీనమవుతాయి. విరుచుకుపడుతున్న కెరటాల చప్పుడు తప్ప ఇంకేమీ వినబడదు. రాజులు, రాజ్యాలు-గొప్పవాళ్ళు, బీదవాళ్ళు అందరూ నాశనమావుతారు. ఏడు సీళ్ళు విడగొట్టబడతాయి.
   
    ఏడు ట్రంపెట్లు మ్రోగుతాయి.
   
    ఏడుకప్పులతో "రాత్" భూమ్మీద జారవిడవబడుతుంది.
   
    అప్పుడు దెయ్యం విజ్రుంభిస్తుంది.
   
    ప్రజలు దేవుడిమీద యుద్ధం ప్రకటిస్తారు.
   
    ది వార్ ఆఫ్ ఆర్మగాడెన్.
   
    దెయ్యాన్ని నమ్మని మనుషులని రక్షించటానికి మౌంట్ ఆవిల్స్ మీంచి క్రీస్తు దిగివస్తాడు.
   
    దెయ్యాన్ని నమ్మిన మనుషులని ఊచకోత కొయ్యటానికి కల్కి శ్వేతాస్వం ఎక్కి రుద్రభైరవుడిలా వస్తాడు.
   
    దెయ్యాన్ని చంపటానికి అల్లా చివరిసారి శంఖం వూడగానే ఆకాశం తెరువబడుతుంది. ప్రజలు గుంపులు గుంపులుగా లేచి వస్తారు. యోమాయున్ ఫిక్క్ ఫిసూరీ, నిస్సందేహంగా నిర్ణయదినం. ఒక నిర్ణీత సమయం.
   
    ఓమెన్. అలాగే జరుగుతుంది.
   
    పరిత్రాణాయ సాధునాం. మంచివాడు రక్షింపబడతాడు.
   
    రక్షించబడటం అంటే దేవుడ్ని చేరుకోవటమా?
   
    అవును మరి. మంచివాడు తొందరగా చచ్చిపోతున్నాడు.
   
    ఎక్కడుంది ఈ దెయ్యం?
   
    మనిషిలో దెయ్యాన్ని చంపటానికి ప్రళయం రావాలి.
   
    వ్యవస్థని మార్చటానికి ప్రళయం కావాలి.
   
                                   *    *    *
   
    రాత్రి ఎనిమిదయింది.
   
    ఇంకా మూడు గంటలా పన్నెండు సెకన్లు.
   
    పల్లెలో....
   
    భజనలు జరుగుతున్నాయి.
   
    స్వామివారు పూనకంతో వూగిపోతున్నారు.
   
    ఆయన మీద నమ్మకం వున్న ప్రజలు నిశ్చింతగా వున్నారు.
   
    అందులో రంగారావూ వున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra