Home » Suryadevara rammohan rao » గోడచాటు ముద్దు


    బటన్ ఆఫ్ చేసి మయూష వేపు చూసాడు జ్వాలాముఖిరావు. తన ఎదురుగా ఫోన్ లో ఆ సంభాషణ ఎందుకు చేసాడో అర్ధంకాకుండా వుంది మయూషకు.
   
    "సీ....యూ...బేబీ....రేపు సాయంత్రం కలుద్దాం" ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోతూ అన్నాడు జ్వాలాముఖిరావు.
   
    తనకేమీ పట్టనట్టుగా నిర్లిప్తంగా బెడ్ దగ్గర నిలబడిపోయింది మయూష.
   
                                                                          *    *    *    *
   
    షవర్ లోంచి పువ్వులా జివ్వుమని నీళ్ళ ధార విరజిమ్మింది.
   
    వానలో తడుస్తున్నట్టుగా షవర్ కింద తడుస్తోంది మయూష. ఒక్కసారిగా తన జీవితంలో అనుకోని మార్పు కలగడం ఆమెకు చాలా ఆశ్చర్యంగా వుంది.
   
    ఇప్పటికీ జ్వాలాముఖిరావు తనని పెళ్ళిచేసుకోవడం ఒక కలలా వుంది. అది కలయితే ఎంత బావున్ను అనికూడా అనుకుందామె.
   
    తనింట్లో వున్నప్పుడు ఉదయాన్నే డాబా ఎక్కడం పక్కింటి వేపు ఆసక్తిగా చూడడం శివాజీ గాయత్రిల సరసాలు. తన మనసులోతు ల్లోని రహస్యపు మధురమైన ఆవేదన తనని అనంతమైన మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి.
   
    భార్గవి కేసుని తనెందుకు టేకప్ చేసింది?
   
    జ్వాలాముఖిరావు తో తన జీవితం ఇంతేనా? తన జీవితమంతా భిన్నధ్రువాల సంఘర్షణతో నిండిపోతుందా?
   
    అమ్మ, అన్నయ్య, వదిన ఎలా వున్నారో? నాన్న....నాన్న.....నాన్న చనిపోవడానికి తనే కారణం కదూ?
   
    తండ్రి పీతాంబరం శర్మ గుర్తుకురాగానే కళ్ళల్లోంచి చివుక్కున కన్నీళ్లు పొంగాయి.
   
    జ్వాలాముఖిరావు గుర్తుకొచ్చిన ప్రతిక్షణం మనసంతా అసహ్యంతో కుతకుతలాడిపోతోంది.

    అతన్ని తనేమీ చెయ్యలేదా? ఏ రకంగా అతనిమీద పగనుతీర్చు కోలేదా?
   
    ఆలోచనల్తో అరగంటసేపు గడిచాక నెమ్మదిగా స్నానంచేసి సుతిమెత్తని టర్కీటవల్తో వళ్ళంతా తుడుచుకుంటూ బాత్ రూమ్ కు పక్కనే వున్న్హ డ్రెస్సింగ్ రూమ్ లో కెళ్ళి నిలువెత్తు అద్దంముందు నగ్నంగా నిలబడింది.
   
    ఇదివరలో మయూష నగ్నంగా అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ మైమరచిపోయి కలలుగనేది-
   
    ఇప్పుడు తన అందమే తనకు శాపం అనే నిర్ణయానికొచ్చింది. తను అందంగా లేకపోతే జ్వాలాముఖిరావు పెళ్ళి చేసుకునేవాడు కాడేమో?
   
    చీకట్లో చిక్కుకునప్పుడు వెలుతురు గురించి ఆలోచించడం సహజం.
   
    సరిగ్గా అదే సమయంలో-
   
    నవనీత్ గుర్తుకొచ్చాడు-
   
    అతని గురించి ఆలోచిస్తూనే చీర, జాకెట్ వేసుకుంది.
   
    ఎందుకో ఆమె జ్వాలాముఖిరావును ద్వేషించినంతగా నవనీత్ ను ద్వేషించలేకపోతోంది.
   
    నవనీత్ అతని రూపం, అతనిమాట, అతని నవ్వు కళ్ళముందు కదలాడుతోంది.
   
    నవనీత్ ఈ హైద్రాబాద్ లోనే వుండి వుంటాడా?
   
    వుంటే తనకెప్పుడయినా కనిపిస్తాడా?
   
    కనిపిస్తే......
   
    బెడ్ రూంలోంచి డైనింగ్ హాల్లో కెళ్ళింది టేబిల్ మీద ఖరీదయిన ప్లేట్లలో రకరకాల టిఫిన్లు-
   
    ఎవరు తెచ్చారో, ఎప్పుడు తెచ్చారో తెలీదు......
   
    ఖరీదయిన జైలు....విరక్తిగా నవ్వుకుంటూ ఆలోచిస్తూ టిఫిన్ చేయసాగింది.
   
                                              *    *    *    *
   
    జీడిమెట్లకు మూడు కిలోమీటర్ల దూరంలో వుందా తోట. తోట మధ్య లైట్ల వెలుగులో మెరిసిపోతోంది ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కు వెనుక వేపున స్విమ్మింగ్ ఫూల్ కి పది అడుగుల దూరంలో కుర్చీ లో కూర్చున్నాడు భుజంగపతి.
   
    కిచెన్ రూమ్ లోంచి ప్లేట్లలో డిషెస్ తెచ్చి గ్లాస్ టీపాయ్ మీద పెట్టాడు కిచెన్ చీఫ్ రంగస్వామి.
   
    "ఎవడ్యినా ముందు మందు తెచ్చి టేబిల్ మీద పెట్టి ఆ మందు గ్లాసుల్లో పోసిచ్చి ఆ తర్వాత ఆ గడ్డిని తగలేస్తాడు. వీడవడండీ బాబూ.....నన్ను తినేస్తున్నాడు" విసుగ్గా అన్నాడు భుజంగపతి.
   
    రంగస్వామికి చిన్నచెవుడు. భుజంగపతి హావభావ విన్యాసం చూసి నవ్వుకుంటూ అక్కడ నిలబడి భుజంగాపతి ఎదురుగ్గా వున్న వ్యక్తులవేపు చూసాడు రంగస్వామి.
   
    "నమ్మకస్తుడని మీరే కితాబిచ్చారుగా తప్పదుగా. ఏవయినా అంటే మమ్మల్నంటారు" అన్నాడు ప్రకాష్ సింగ్ ప్రకాష్ సింగ్ జ్వాలా ముఖిరావు కంపెనీలకు జనరల్ మేనేజర్.
   
    "పతిగారికి, స్వామికి అదేదో లంకె కుదిరిందండీ బాబూ ఎవడయినా డిటెక్టివ్ చేత పరిశోధన చేయించాలి" ప్రకాష్ సింగ్ పక్కనున్న కుటుంబరావు అన్నాడు. కుటుంబరావు జ్వాలాముఖిరావు ఎస్టేట్ మేనేజర్.
   
    "ఇదిగో రంగస్వామి నువ్వెళ్ళి మందు......మందు....తీసుకురా" అంటూ డిటైల్డ్ గా సంజ్ఞచేసి చెప్పగా మరిచేపోయాను అన్నట్టుగా సంజ్ఞ చేసి లోనికెళ్ళాడు రంగస్వామి.
   
    డిటైల్డ్ గా సంజ్ఞ చేసి చెప్పిన వ్యక్తి జ్వాలాముఖిరావు కంపెనీల పర్సనల్ ఆఫీసరు రాందాసు.
   
    "మైడియర్ ఫ్రెండ్సూ టైముకి ఏం లేకపోయినా ఎడ్జస్టయి పోవచ్చుగానీ, ఈ మందు పొందు వ్యవహారం విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా, నా మనసు గిలగిలలాడిపోతుందనుకోండి. అందులోనూ ఇప్పుడు మనకున్న టెన్షన్ ఒకటి....." రంగస్వామి చేతిలోంచి బాటిల్ ని ఆత్రంగా అందుకుని అన్ని గ్లాసులోకి డ్రింక్ ను సర్వ్ చేస్తూ అన్నాడు భుజంగపతి.
   
    "అవునుగానీ పతిగారూ బ్లూమూన్ రాలేదేమిటండీ యింకా" దూరంగా కనిపిస్తున్న గేటువేపు చూస్తూ అన్నాడు రాందాసు.
   
    "ఆవిడకెన్ని ఎంగేజ్ మెంట్సండీ బాబూ తెముల్చుకొని రావాలి గదా" అంటూ మారుతీకారు చప్పుడు కావడంతో గేటువేపు చూసి-
   
    "మాటల్లోనే వచ్చేసింది" అని అన్నాడు భుజంగపతి ఆనందంగా.
   
    "రాగి రంగు చీర, రాళ్ళ నక్లెసు, నలభై ఏళ్ళు పైబడినా వెన్నెల్లో జిగీ.....జిగీ అలాగే వుందండోయ్" యాభై ఏళ్ళ ప్రకాష్ సింగ్ కసిగా గేటువేపు చూస్తూ అన్నాడు.
   
    "హలో.....హలో....అందరికీ గుడ్ ఈవెనింగ్ ఈసారి సడన్ గా ఫోన్ చేసారేమిటి. ఎన్ని ఎంగేజ్ మెంట్స్ ని కాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా పతిగారూ" భుజంగపతివేపు కోరగా, కోలగా చూస్తూ హస్కీ వాయిస్ తో అంది వెన్నెల అనబడే నలభై ఏళ్ళ రవళి.
   
    తెల్లగా ఉబ్బిపోయిన పాలరాతి శిల్పంలా వుంటుంది. జ్వాలా ముఖిరావు కంపెనీలో ఆవిడ పదిహేనేళ్ళ క్రితం టైపిస్టుగానో, స్టెనో గానో చేరిందని అంటారు.
   
    ప్రస్తుతం రవళి జ్వాలాముఖిరావు సెంట్రల్ ఆఫీసులో ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఎందుకో జ్వాలాముఖిరావు విషయాల్లోనూ ఆమెను నమ్ముతాడు. చిన్నప్పుడే ఎవర్నో ప్రేమించి ఆ ప్రేమ విఫలం కావడం వల్ల తనకి పెళ్ళిమీద విరక్తి కలిగిందని రవళి సన్నిహితుల్తో చెప్తుంది. కానీ అదంతా అబద్దమని కొంతమంది అంటారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra