Home » Sreelatha » మనసా....ప్రేమించకే నువ్విలా

    వాళ్ళు వెనక్కి వచ్చాక ఆ తొక్కిడిలో బయటపడ్డాయి... పది శవాలు! తుక్కుతుక్కు అయ్యాయి. తొక్కిన చెరుకుపిప్పిలా అయ్యాయి. నేలకు అతుక్కుపోయాయి. రోడ్డుమీద చచ్చిన కుక్క శవంపై పది లారీలు వెళితే ఎలా అణిగిపోతుందో అలా అణిగిపోయాయవి.... దారుణంగా, అతి దారుణంగా!
    స్టూడెంట్స్ అంతా దూరంగా నిలబడి, చితికిపోయిన గుంపును చూస్తూ కాలుతున్న షర్టులను ఆ శవాల మీదకు విసిరేశారు. అవి ఒక్కొక్కటీ శవాలపై రగులుతూ పడుతూ కుప్పగా మారి, ఆ శవాలు కనబడకుండా కప్పెట్టి మండసాగాయి.... యజ్జగుండంలా! ఎవరూ ఆర్పడానికి ప్రయత్నించలా! ప్రోఫేసర్స్, వైస్ ఛాన్సలర్ కూడా ప్రయత్నించలా- స్టూడెంట్స్ ను  రెచ్చగొట్టడం ఇష్టంలేక!
    ఎవరు కొట్టారు?
    అందరూ!
    ఎవరు చంపారు?
    అందరూ!
    ఎవరు నేరస్థులు?
    అందరూ!
    ఎవరు నిర్దోషులు!
    అందరూ!
    ఎవర్ని అరెస్ట్ చెయ్యాలి?
    అందర్నీ!
    ఎన్ని బేడీలు కావాలి?
    కొన్ని వందలు!
    ఎక్కడా ప్రత్యేకమయిన వేలిముద్రలు లేవు! చంపడానికి ఏ ఆయుధమూ వాడబడలేదు. హంతుకులెవ్వరూ పరారుకాలేదు. ఎవరు చంపారన్న దానికి 'ఐ విట్ నెస్' లేదు. ఏమయిందో చెప్పడానికి ఓరల్ సాక్ష్యం లేదు. ఏ ఆధారమూ లేకుండా క్యాంపస్ నడిబొడ్డున పదిమంది రాక్షససంహారం....యూనివర్శిటీ చరిత్రలోనే కాదు...,ప్రపంచ చరిత్రలో అది మొట్టమొదటి సంఘటన! అద్భుత విప్లవం!  కనీవినీ ఎరుగని కథావిధానం!!
    సగం  కాలిన శవాలను తరలించుకుని పోలీసులు వెళ్లేసరికి మరుసటిరోజు  సాయంత్రం  అయింది. అప్పటివరకూ ఒక్క స్టూడెంట్ కూడా ఇంటికి వెళ్లలా! అమ్మాయిలూ, అబ్బాయిలూ అలాగే నిలబడ్డారు-గుండ్రంగా, పెద్దగుమిగా గూడి ప్రతి ఒక్కరూ అరెస్ట్ కు సిద్దమయి! భోజనం లేదు, నిద్ర లేదు. అయినా అలాగే ఎండలో శిలావిగ్రహాల్లా మౌనసాక్ష్యాలుగా స్థాపితమయినట్లు నిలబడే ఉన్నారు. ఒక్కరూ నోరు విప్పలా! ఒక్కరూ దాహమని కూడా అడగలా! ఒక్కర్నీ ఏవయిందని అడిగేందుకు బయట ఏ ఒక్కరికీ ధైర్యం  సరిపోలా! కదిలిస్తే పేలే  పర్వతంలా ఉన్నారొక్కక్కరు! తపస్సు చేసుకుంటున్న బుద్దుడిలాగా కూడా ఉన్నారు.
    "నేను సైతం
    ప్రపంచాగ్నికి
    సమిధనొక్కట్టి ఆహుతిచ్చాను.
    నేను సైతం
    ప్రపంచాబ్జపు
    తెల్ల రేకై పల్లవిస్తాను.
    నేను సైతం
    విశ్వ వీణకు
    తంత్రినై మూర్చనలు పోతాను.
    నేను సైతం
    భువన భవనపు
    బావుటానై పైకి లేస్తాను.
    నేను సైతం- నేను సైతం!'
    ...ప్రతి ఒక్కరూ 'నేను' అనే భావనలో అలాగే సిద్దమయ్యారు- తమను తాము సమిధలుగా మార్చుకుని! ప్రోఫెసర్స్ విస్తుబోయారు....స్టూడెంట్స్ యూనిటీకి!వైస్ ఛాన్సలర్ నోట మాటరాలేదు. జనరేషన్....జనరేషన్...మారుతున్న  జనరేషన్! రక్తం చచ్చిన జనరేషన్ కాదిది..., రగులుతున్న జనరేషన్! సమస్యలూహించని అనుభవాలు కావు వారివి..., పరిష్కారం తెలుపగల  ప్రతిభావంతపు అనుభూతులు! అన్యాయానికి న్యాయనిర్ణేతలు కోర్టులు, పోలీసులూ కాదు..,యువకులే! యువత నిద్దురలేచిన శతాబ్దం వచ్చింది. కొన్ని పదాలకు కొట్ట ఆర్తాలను  రాసే ప్రతిపదార్ధం తెచ్చింది! ఖబడ్దార్! ఖబడ్దార్! కుత్సితులారా! చీడ పురుగుల్లారా! పీడ పట్టిన పుంగవులారా! ఖబడ్దార్! స్త్రీని చింపే కుక్కల్లారా! ఖబడ్దార్! మానాపు మర్యాద మరచి తల్లితనాన్ని అపహాస్యం చేసిన అసహ్యులారా....ఖబడ్దార్!
    గిరులు,
    సాగరులు, కంకెళికా మంజరులు,
    ఝరులు... మా సోదరులు!
    మేమొక దుర్గం-
    మాదొక స్వర్గం-
    అనర్గళం.., అనితర సాధ్యం... మా మార్గం!
    మర్నాడు పేపర్లు రాశాయి- పెద్ద ఫోటోలతో! టీ.వీ. ఛానల్స్ చూపాయి- 'అతిదారుణం...' అంటూ!
    'సిటిలో బ్రౌన్ ఘగర్ వ్యాపారస్దులేకాక టెర్రర్స్ గా పేరుపొంది, పోలీసులకు దొరకకుండా చాలాకాలం నుండి అనేక హత్యలూ, రేపులూ చేసి 'రేప్ గాంగ్' గా పేరుమోసి ఎంతోమంది అమ్మాయిల శీలాలను చెరిపి, మానాలను దోచి, మరణాలను రేపి ఆత్మహత్యలకు  ఉసిగొల్పిన కిరాతకుల ఘోర దారుణహత్య! మొత్తం గాంగ్ నూ తుక్కుతుక్కు చేసిన యూనివర్శిటీ విద్యార్థులలో నిందితులను ప్రత్యేకంగా గుర్తించగలిగే ఆధారాలు లేనందున, యూనివర్శిటీ విద్యార్థులందరూ 'నేను ఈ హత్యలకు కారణం! నేను కారణం!' అని ప్రతి ఒక్కరూ అరెస్ట్ కు ముందుకురావడం వలన ఇది విద్యార్థులు విద్యాలయంలో జరిగిన అపభ్రంశాన్ని తొలగించుకున్న హక్కుగా పరిగణించి కేసును క్లోజ్ చేయడం జరిగింది'....అని!
    ఏ న్యాయస్దానమూ, ఏ న్యాయచరిత్రలోనూ ఇవ్వని కొత్త తీర్పు నిచ్చింది. న్యాయ చరిత్రకు కొత్త శాసనం రాసింది. న్యాయనిర్ణేతలకు సరికొత్త పరిష్కారం నేర్పింది పార్లమెంటు నుండి ఐక్యరాజ్యసమితి వరకూ విప్లవశంఖపు నాదం విస్ఫోటనమై పేలింది. శాంతియుతశాసనం సామాజికశిలపై చైతన్యపు ఉలితో కొట్టిమరీ రాయబడింది.
    బిడ్డల్ని కోల్పోయిన రాజకీయనాయకులేం చెయ్యలేకపోయారు. ప్రత్యేకంగా ఏ  వ్యక్తీ ఇందుకు కారణం కారు కనుక- వారి రాజకీయ పలుకుబడీ, రాజకీయ కుతంత్రం, కోట్ల విలువచేసే వాళ్ళ ఆస్థులు, వారి చతురంగ బలాలు, తిరుగులేని విధంగా రాజ్యమేలుతున్న వారి అధికారం, చెదపురుగుల్లా కాళ్లతో తొక్కబడి, కొట్టుకుని చచ్చి సగంకాలిన వాళ్ళ బిడ్డల శవాల దరికి కూడా వారిని చేర్చలేకపోయింది. ఒక్కరంటే ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయించలేకపోయింది. పోలీసు బలగాలు నిస్తేజమయ్యాయి. అది బహిరంగ చట్టమయ్యింది! అది బహిరంగ న్యాయస్థానమయింది. బహిరంగంగా మౌనంతో, మౌనంలో, మౌనతీర్పు నిచ్చింది.
    'విద్యార్థులారా... కలిసికట్టుగా ఉండండి~ యువతలారా....పిడికిట్లో ఇమడండి! ఏదయినా మీ వల్లనే సాధ్యం!  మీరు భవిషత్తు సాధకులు! చరిత్రలో నిలవబోయే శిలాక్షరాలు! మీరేకమయితే అపజయమే లేదు. మీరు విడిపోతే జయమన్నటికీ రాదు' అని గతం భవిష్యత్తును ఆశీర్వదించింది! భవిష్యత్తు వెన్నెముక బలిసింది.
    తిరుగులేని పదఘట్టన తీవ్రమై సాగింది.
                                            20
    ఇయర్ ఎండింగ్ లో జరిగి దేశమొత్తం కుతకుతలాడించిన విద్యార్థుల విషయపు వేడి తమ స్టూడెంట్స్ కు స్టడీస పట్ల ఉన్న కానసన్ ట్రేషన్ మీద దెబ్బకొడుతుందేమోనని ప్రొఫెసర్స్ 'జరిగింది- జరగలేదనుకుని స్టడీస్ మీద దృష్టి కేంద్రీకరించండి. ఏ  పత్రికల ఇంటర్వ్యూకు అండ్ కాకండి! మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి!' అని మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు.
    స్టూడెంట్స్ కూడా చిన్నపిల్లలేం కాదు.
    తమ మేజర్ గోల్, తుది లక్ష్యం....వారికి  బాగా తెలుసు! ఇంత జరిగినా వాళ్ళ కానసన్ ట్రేషన్ దెబ్బతినకుండా  చూసుకుంటూనే ఉన్నారు.
    ఫైనల్ సెమిస్టర్స్ పూర్తయ్యాకగానీ ప్రోఫెసర్స్ ఊపిరి పీల్చుకోలేదు. అప్పుడు 'అమ్మయ్య..' అనుకున్నారు.
    తమ స్టూడెంట్స్ మీద ఎంతప్రేమో వాళ్ళకు!
    ఎవరన్నారు- తల్లిదండ్రులు మాత్రమే బిడ్డలను ప్రేమిస్తారని! అంతకంటే ఎక్కువగా స్టూడెంట్స్ ను, వాళ్ళ భవిష్యత్తునూ, వాళ్ళ  విజయాలనూ అనుక్షణం గురువులు ప్రేమిస్తారు. వాళ్ళను దండించి మరీ ప్రేమిస్తారు. తల్లిదండ్రులు కోమలంగా ప్రేమిస్తే...గురువులు కఠినంగా ప్రేమిస్తారు! చరిత్రలో పిల్లల్ని ద్వేశించిన తల్లిదండ్రులు ఉన్నారేమో కానీ...శిష్యుల్ని ద్వేశించిన గురువులు లేనేలేరు.
    ఎనీహౌఁ.... ఒక బ్యాచ్ విప్లవశంఖం పూరించి దిగ్విజయమ్గా యూనివర్శిటీ ని విడిచి రెక్కలు తొడుక్కుని ప్రపంచంలోకి ఎగిరెళ్లింది- రాజహంసల బారులా డిగ్రీల రెక్కలు విప్పుకుని గమ్యంవైపు! యూనివర్శిటీ మొత్తం వారు కనుమరుగయ్యేవరకూ చూసి 'టాటా...' చెప్పి బరువెక్కింది...ప్రియతమల ఎడబాటుకు!
    లాస్ట్ రోజు ప్రతి స్టూడెంట్ తమకు భవిష్యత్ ఏర్పరచి యూనివర్శిటీలోని ప్రతి హృదయానికీ ప్రతి అంగుళానికీ కలిపి ఒక్కో ఆనందబాష్పం, ఆవేదనా బాష్పం కానుకగా అభిషేకించి భావికి వెన్నెముకాలుగా సాగిపోయారు. ఆటోగ్రాఫ్ లు, అడ్రసులు, 'మరిచిపోకం'డని ప్రామిస్ లు.., లెటర్స్ రాయమనీ, ఫోన్స్ చెయ్యమనీ అభ్యర్థనలూ... అన్నీ పెనవేసుకుని, పెనవేసుకుని విడివడి వెళ్లిపోయాయి.
    జూనియర్స్ సెమిస్టర్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకోసం, వాళ్ళకు గైడెన్స్ కోసం అప్పుడప్పుడూ సీనియర్స్ రావడం, పోవడం జరుగుతూనే ఉంది.
    ఓరోజు నలుగురు ఫ్రెండ్స్ ఒకచోట చేరి క్యాంపస్ లో చిట్ చాటింగ్ చేస్తూ చేస్తూ-
    "ఇక మాట్లాడుకోవడానికి సబ్జెక్ట్  ప్రస్తుతానికి అనవసరం కదూ!" ఈష్ అన్నాడు.
    "య్యా! ఇప్పుడు భవిష్యత్తు గురించీ, జీవితం గురించీ మాట్లాడుకోవాలి!"
    "ఓ.కే.! నువ్వేం చెయ్యదలచుకున్నావ్ ఆనంద్?" క్రాంత్ అడిగాడు.
    "నాది సింపుల్ ప్రాబ్లమ్! నేనేదో జాబ్ కు ట్రై చేసుకుంటున్నా! అది రాగానే  రేవతీ, నేనూ మారేజ్ చేసుకుంటాం! రేవతి ఇంటినుండే వచ్చి చదూకుంటుంది" తేల్చేశాడు.
    "వాట్ యార్! చాలా సింపుల్ గా  చెప్పెశావే పెళ్ళి గురించి!" ఈష్ ఆశ్చర్యపోయాడు.
    "మరి! మేము ప్రేమించబడటమే చాలా గొప్ప విజయంగా జీవితంలో! అందులో పెళ్ళి చాలా సింపుల్ విషయం!" అని తేలిగ్గా పెళ్ళిని కొట్టేస్తున్న ఆనంద్ లో అందర్నీ నవ్వించే అమాయకత్వం కనిపించలా! తమకంటే ఎత్తు ఎదిగిన హిమాలయం కనిపించింది. అందుకే ఆనంద్ వైపు నమ్మలేనట్టు చూశారు.
    "యస్ యార్! మనం- పెద్దవాళ్ళు మళ్లీ పెళ్ళి చేసుకోవాడం.. అని ఒప్పుకున్నాం అదే న్యాయం నన్నూ, రేవతినీ అన్యాయం చేసింది. రేవతి వాళ్ళమ్మ రెండోపెళ్ళి వల్ల  రెండోతండ్రి అలక్ష్యానికి, రెండోపిల్లలు చేసే అవమానాలకీ డ్రగ్ ఎడిక్ట్ అయింది. చిన్నప్పటినుండీ హాలీడేస్ కు కూడా ఇంటి కెళ్లకుండా తనవాళ్ళకు దూరంగా హాస్టల్లో బ్రతికింది. డబ్బు తప్పితే జీవితం మీద ఇంట్రస్ట్  లేకా,  డ్రగ్  ఎడిక్ట్ అయ్యి- జ్ఞాపికా, కామినీ, స్ఫూర్తిల స్నేహంతో జీవితపు విలువ  తెలుసుకుని మామూలు మనిషయింది. ఇన్నేళ్ల జీవితంలో నవ్వంటే తెలీని తమ  ప్రతిక్షణం నవ్వుతూ, అందర్నీ నవ్వించగలిగే స్థాయికి ఎదిగింది. తననుతాను పరిపూర్ణంగా మలచుకుంది.
    నేనూ అంతే! మారుతల్లిలో మమకారం, అసలు తండ్రిలో ఆప్యాయత లేక సైకియాట్రిస్ట్ పేషెంట్ నయి ఒంటరిగా నాలో నేను  గొణుక్కుంటూ, గుణుకుంటూ చదువే లోకంగా బ్రతుకుతుంటే రేవతి- బ్రతుకులోని కొట్ట అర్థాన్నీ, మీ స్నేహం- జీవితంలోని  మాధుర్యాన్ని తెలియచేసింది!
    ప్రేమంటే తెలియని మా ఇద్దరికీ ఒకరి ప్రేమ ఒకరికి దక్కడమే బ్రతకాలనే ఆశను పెంచింది! ఆ ఆశే తోడుగా మేము కలిసి బ్రతుకుతాం! మా పెళ్ళికి ఎవరి అభ్యంతరాలూ రావు! ఎందుకంటే... మమ్మల్ని ఉన్నామో, చనిపోయామో పట్టించుకునేవాళ్ళు లేరు కనుక!"
    "పెళ్ళి చేసుకుని ఏమీ  సాధించాలని లేదా?" రేవంత్ అడిగాడు.
    "మాకు ఒకరిని ఒకరు సాధించుకోవడమే పెద్ద విజయం! మేము అల్పసంతోషులం! మాకు మేము చాలు ఇంకే విజయాలూ, సాధనాలు వద్దు. మేం ఒకరికి ఒకరంగా బ్రతుకుతూ పోతామంతే! చివరి దాకా, చిట్ట చివరిదాకా! జీవితపు ఆఖరి అడుగుదాకా!" ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఆనంద్.
    ఒంటరిగా బ్రతికిన వాళ్ళిద్దరికీ ఒకరికొకరు కావాలంతే! చిన్ని ఆశ..., అతి చిన్నిఆశ! తమ స్నేహితుడి జీవితపు వ్యక్తీకరణ ఎంతో ఆపురూపంగా తోచింది. వాళ్ళ ప్రేమ 'ప్రేమ' అనే పదానికి సరిపొదనిపించింది! కొట్ట పదమేదయినా దొరికితే బావుండనిపించింది ఫ్రెండ్స్ కు! మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పారందరూ. 'ఆల్ ది బెస్ట్ !' అని వారి క్షేమాన్ని కోరారు.
    "నువ్వేమనుకుంటున్నావ్ ఈష్... నీ జీవితం గురించి?" రేవంత్ అడిగాడు ఇంట్రస్టింగ్ గా!
    "మాదేవుంది?!
    ఎలాగూ పెళ్ళయిపోయింది! వన్ ఇయర్ స్ఫూర్తి చదువయ్యాక కెనడా వెళ్లిపోతాం! అక్కడ మా అంకుల్ ఉన్నారు. ఆయన ఆఫర్ ఇచ్చారు జాబ్స్ కు! స్ఫూర్తి కోసం  ఉండాలి నేనిక్కడ! వన్ ఇయర్ ఉంటాను! ఒకవేళ హయ్యర్ స్టడీస్ కు అక్కడ పాజిబిలిటీ అన్నట్లయితే వీసా ఎప్పుడొస్తే అప్పుడెళ్లిపోతాం!" చెప్పాడు- ముందే నిర్ణయించుకున్నది ప్లానుగా!
    "మరి పెళ్ళి గురించి!" అడిగాడు క్రాంత్.
    "మేము ప్రేమకోసం పెళ్ళి పడాల్సిన ఘర్షణంతా పడ్డాం! చెయ్యాల్సిన పోరాటం చేశాం! గెలిచి  విజయులమై మీ సన్నిధిలో వివాహం చేసుకున్నాం. అప్పుడే మా జీవితం మొదలయిపోయింది! మా ఇద్దరి దృష్టిలో, మీ దృష్టిలో మేము భార్యాభర్తలమే కానీ- స్ఫూర్తికి అమ్మానాన్నల, బంధువుల సమక్షంలో పెళ్ళి జరగాలనే కోరిక ఉంది! తన జీవితపు ఆపురూపమయిన ఆశను నేను ఆపదలుచుకోలేదు. ఈ పెళ్ళికి మా అమ్మానాన్నల అభ్యంతరాన్ని నేను లెక్కచెయ్యను! స్ఫూర్తి తల్లిదండ్రులకు విషయమంతా చెప్పాక కాదనరనే నమ్మకముంది! కనుక అందర్లో మా వివాహం జరుగుతుంది స్ఫూర్తి ఇష్టప్రకారం! ఆ తరువాత ఇద్దరు పిల్లలూ, వాళ్ళ భవిష్యత్తుకై ఆరాటం..., పోరాటం!" నవ్వుతూ ముగించాడు..., భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టు చూపెట్టినాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra