Home » Yerramsetti sai » Rendo Manasu


    "మీరు భలే గా మాట్లాడుతున్నారు! అదివరకు లేదిలా!" తనూ నవ్వుతూ అంది.
    అద్దం ముందు నుంచుని ముస్తాబయి బయటికొచ్చాడు చలపతి. తోటమాలితో ఏదో తోటపని చేయిస్తోంది సావిత్రి.
    "ఎంతసేపట్లో వస్తారు?" చలపతిని అడిగింది.
    "రెండు గంటల్లో వచ్చేస్తాను!"
    "సరే! జాగ్రత్తగా వెళ్ళండి"
    చలపతి బయల్దేరాడు. ఆఫీస్ లో చాలా మార్పులోచ్చినాయ్. గీత రిజయిన్ చేసిందట. ఆమె స్థానంలో మరొక స్త్రీ వుంది. మేనేజర్ని ఉద్యోగంలో నుంచి తొలగించారుట. అతను చేసిన అవినీతి పనులు కంపెనీ వారి దృష్టి కొచ్చాయట! నర్సరాజు , మరి ఇద్దరు గుమాస్తాలు మాత్రమే చలపతికి తెలిసినవారు.
    "నా ఉద్యోగం సంగతి ఏమయింది? "నర్సరాజుని అడిగాడు చలపతి.
    ఏమో మరి! ఇప్పుడు ఆ మేనేజర్ కూడా లేడు! వీడు కొత్తవాడు! నీ కేసంతా చెప్పి చూడాలి! కనీసం మరో వేకెన్సీ వచ్చినప్పుడన్నా కంపాషనేట్ గ్రౌండ్స్ లో నీకా అవకాశం ఇవ్వడానికి వీలుంటుంది"
    "ఇప్పుడు చూడనా ఆయనని!"
    "చూడు! అలాగే ఓ అప్పీల్ కూడా రాయి!"
    చలపతి అప్పీల్ తయారుచేసి టైపు చేయించి మేనేజర్ దగ్గర కెళ్ళాడు. అతని విషయమంతా విన్న మేనేజర్ జాలి పడ్డాడు.
    "ఈ రెండు మూడు నెలల్లో ఏమి లాభం ఉండదు! ఆ తరువాత కొన్ని వేకెన్సీ లు వస్తాయ్! ఆ సమయంలో నేను మీకు సహాయం చెయ్యగలను! అంతవరకూ మీరు వేచి ఉండాల్సిందే....."
    "ఫర్వాలేదు సార్! అప్పటికి దొరికినా చాలు. థాంక్ యూ!" అనేసి బయటికొచ్చాడు చలపతి.
    మరి కాసేపు నర్సరాజుతో మాట్లాడి అక్కడనుంచి బయల్దేరాడు మళ్ళీ.
    ఎందుకో అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదతనికి. అది వరలాగా సావిత్రి సాన్నిధ్యంలోనే ఎక్కువ కాలం గడపాలన్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఆమెను చూస్తుంటే ఏవేవో అనుమానాలు అల్లుకొంటున్నయ్! ఆమె మాటల్లో కల్మషం ఉన్నట్లు అనిపిస్తోంది! ఆమె నవ్వులో నిర్మలత్వం కనిపించడం లేదు.
    తనకోసం ఆమె అన్న భావం రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో తనకే తెలీదు. నిజానికి శ్రీకంతం సావిత్రీ ప్రణయం జరపడం తను చూడలేదు. కేవలం అదంతా తన అనుమానం.
    ఆ అనుమానం నిజం కావచ్చు. కాకపోనూవచ్చు. అయినా , కాకపోయినా తనీ టెన్షన్ భరించలేడు. సమయానికి దేముడు కూడా తనని మోసం చేసేడు. తను బ్రతికించమని వెడుకొన్నాడు. తీరా బ్రతికించి బ్రతక్కుండా ఉంటే బావుండేదన్న ఆలోచన కలిగిస్తున్నాడు తనకి.
    శ్రీకాంత్ ఇంట్లోంచి పారిపోతే గాని తనకు మనశ్శాంతి లేదు. కాని అది కూడా వీలు లేకుండా మార్గాలన్నీ మూసి వేశాడు దేముడు. తన వుద్యోగం పోగొట్టాడు. అంచేత కుక్కలాగా ఆ ఇంట్లో పడి వుండాల్సిందే! ఎలాంటి అనుమానాలున్నా కడుపున పెట్టుకొని భరించాల్సిందే!

        
                                                     * * *
    గమ్యం లేకుండా తిరిగి తిరిగి మధ్యాహ్నం మూడింటికి ఇల్లు చేరుకున్నాడు చలపతి.
    లోపల్నుంచీ మాటలు వినిపిస్తున్నాయ్! శ్రీకాంత్ .........సావిత్రీ. నవ్వులు........
    సావిత్రీ , శ్రీకాంత్, శ్రీకాంత్ సావిత్రీ, సావిత్రీ శ్రీకాంత్ .........
    చిన్నప్పుడు హైస్కూల్లో చదివేరోజుల్లో స్కూలు గోడల మీద రాసిన అక్షరాలు గుర్తుకొచ్చినయ్ చలపతికి.
    బాంక్ మేనేజర్  మనవరాలూ + మురళీ ఎన్నో - ఇంకెన్నో పేర్లు - అన్నీ అక్రమసంబంధాలున్నాయని అనుమాన పడ్డ జంటల పేర్లే.
    ఓ బొగ్గు తీసుకుని శ్రీకాంత్ ఇంటిబయట గోడమీద "శ్రీకాంత్ +సావిత్రీ' అని రాయాలనిపించింది చలపతికి.
    కాని -----కాని--------
    "ఎమిటక్కడే నిలబడ్డావ్ పిలవకుండా?" బయటకు రాబోతూ నిలబడి పోయి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్.
    "ఇప్పుడే వచ్చాను ......అంతే .....' తడబడుతూ సమాధానం చెప్పి లోపలకు నడిచాడు చలపతి!
    సావిత్రి చలపతిని చూడలేదు . టీ వడగడుతోంది అటువేపు తిరిగి.
    "శ్రీకాంత్ గారూ! టీ తీసుకెళ్ళండి!"
    అవునూ - శ్రీకాంత్ ఈ సమయంలో ఇంటిదగ్గర ఎలా వున్నాడు?
    రోజూ సాయంత్రం ఆరింటికి ఇల్లు చేరేవాడు. ఇవాళ అప్పుడే ఎండుకోచ్చాడు? తను ఇంట్లో లేడనా ? కానీ ఆ విషయం అతని కెలా తెలుస్తుంది? ఎవరు చెప్పారు?
    సావిత్రా! సావిత్రి చెప్పడానికి అవకాశం వుందా! వుండే వుంటుంది. వుండే వుంటుందేమిటి వుంది! ఫోన్ లేదూ? దాని పక్కన డైరక్టరీ లేదూ!
    అందులో శ్రీకాంత్ పేరూ దాని కెదురుగ్గా నంబరూ లేవూ? వున్నాయున్నాయ్! మరికేం కష్టం? మరికేం అడ్డం?
    "హలో! శ్రీకాంత్! సావిత్రిని మాట్లాడుతున్నాను - తెలుసా? ఎలా తెలుసు? గొంతు గుర్తుపట్టావా? భలేవాడివే? ఏమిటీ! మనం సరదాగా గడపదానికీ వీలు లేకుండా వుందంటావా? చలపతి ఇంకా హాస్పిటల్లో వుంటే బావుండేదా? అవుననుకో! కానీ ఏం చేస్తాం! అదిసరే గానీ నువ్వు త్వరగా ఇంటికొచ్చేయ్యాలి! ఎందుకూ ఎందుకో నీకు తెలీదా! చలపతి వాళ్ళా ఫీసు కెళ్ళాడు! ఎందుకేమిటి వుద్యోగం కోసం!
    ఆ! అవును సాయంత్రం వరకు వీదులెంబడే తిరుగుతుంటాడు! నువ్వు వెంటనే రావాలి. సాయంత్రం వరకూ మనం హాయిగా -------స్వర్గంలో తేలిపోవచ్చు! వస్తున్నావ్ కదూ వుంటాను మరి! ఫోన్ పెట్టేయ్యానా! వద్దా! భలే బాగుంది! ఫోన్ లో సరసాలేమిటి? త్వరగా రా! ....క్లిక్...."
    అందుకే శ్రీకాంత్ వచ్చేశాడు. అందుకే సావిత్రి ఉత్సాహంగా వుంది! నవ్వుతోంది. త్రుళ్ళుతోంది! విరగబడి పోతోంది! అనందం పొందుతోంది.
    శ్రీకాంత్ అక్కడికొచ్చాడు. తన వెనుకే నుంచున్న చలపతిని చూసి ఆశ్చర్యపోయింది సావిత్రి.
    "ఎంటలా దొంగలా వచ్చి నిలబడ్డారు. చడీ చప్పుడూ లేకుండా?" అడిగింది సావిత్రి.
    శ్రీకాంత్ చూస్తున్నాడు తనవంకే , తన సమాధానం కోసం.
    

                                                               * * *

    "అవును! దొంగాటంటే నాకిష్టం! చిన్నప్పుడు ఎప్పుడూ ఆ ఆటే ఆడేవాడిని! ఏరా శ్రీకాంత్! నీకు ఆ విషయం చెప్పలేదూ చాలాసార్లు? దొంగాటంటే నీకు తెలుసు సావిత్రీ! నేను దొంగనయ్యాననుకో! నా కళ్ళు నువ్వు మూసేస్తావన్నమాట! నా కళ్ళకి గంతలు కట్టేస్తావ్! అంటే ఇంట్లోనే తిరుగుతున్నానా కళ్ళు ఇక కనబడ్డావ్! నువ్వూ , శ్రీకాంత్ ఎక్కడున్నారో, ఏం చేస్తుంటారో కూడా నాకు తెలీదు! నేను మళ్ళీ మీ దగ్గర్లోనే ఉంటాను! నాకు అతి సమీపంలో ఉంటారు! అయినా నేను మిమ్మల్ని చూడలేను! మీరు మాత్రం నన్ను చూసి నవ్వుకుంటారు! వాడికేం కనబడుతుందిలే" అని ధైర్యంగా వుంటారు . నేను మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది! ఏ టేబులో , కుర్చీయో తగిలి ముఖం పగిలిపోతుంది! ఇదే - దీన్నే దొంగాట అంటారు......"
    సావిత్రీ నవ్వుతోంది, శ్రీకాంత్ నవ్వుతున్నాడు. వాళ్ళను చూసి చలపతి కూడా నవ్వేశాడు.
    "మీరు భలేవారే! దొంగాట గురించి అంతగా చెపుతారెందుకు? ఎవరికి తెలియదని?" నవ్వుతూనే అంది సావిత్రి.
    "అవును! మర్చిపోయి వాగేస్తున్నాను! దొంగాట ఎవరికీ తెలీదని! అందరికీ తెలుస్తుంది! లేకపోతే అవతలివాడిని దొంగను చేయడంలోనే వుంది గమ్మత్తు! మనం దొంగయితే అంతకన్నా నరకం మరొకటి ఉండదు! నా ఖర్మేమిటో గానీ సావిత్రీ! ఎప్పుడు దొంగాట ఆడినా నేనే దొంగానవుతున్నాను! నా కళ్ళే మూసేస్తున్నారు. కనబడని గంతల్లోంఛి చూడ్డానికి ప్రయత్నించి, వాళ్ళాకోసం పరుగెత్తి అవుట్ చేయాలన్న తపనతో చేతులు చాచి దారుణంగా దెబ్బతింటున్నాను!......"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra