Home » Lalladevi » Mallamma Deviusuru


    "డబ్బు కావాలంటే కోరుకో" అన్నాడు షేర్ ఖాన్.
    "భగవంతుడి దయవల్ల నాకు తినేందుకు లోటులేదు."
    "ఇంత తిని బ్రతకటమేనా జీవితమంటే! మనిషి అన్నాక మజా చేసుకోవటం తెలియవద్దూ?" అని అడిగాడు షేర్ ఖాన్.
    "మజా అంటే-?"
    "మనసులో పుట్టిన ప్రతికోరికకూ ఆకృతి కల్పించుకోవటమే!"    
    "అది సాధ్యమయ్యే పనా?"
    "ఎందుకు కాదు డబ్బుంటే అన్నీ అవుతాయి. నేను మక్కానించి ద్రాక్షసారాయి తెప్పించుకుని తాగుతాను. ఢిల్లీనించి ఆటకత్తెల్ని రప్పించు కుంటాను. అందమయిన ఆడవాళ్ళు నా భార్యలు అవుతారు. యెంతమందో తెలుసా? ఒక వూరంతమంది యే పూట యే మాంసం కావాలనుకుంటే వేటగాళ్ళు ఆ పూతకి ఆ మాంసం సిద్దంచేస్తారు. వంటవాళ్ళు ప్రపంచం లోని వంటలు అన్నీ వండుతారు. యిదంతా సుఖం కాదూ! మజా కాదూ! అయినా నీలాంటి సామాన్యుడికి యివన్నీ యెట్లా తెలుస్తాయిలే!" అంటూ యెగతాళి పట్టించాడు షేర్.
    "పొట్టకింత యెక్కించటమూ, అందమయిన ఆడశరీరాలతో ఆడు కోవటమూ యిదేనా మజా అంటే అయితే ఆ రెండుపనులూ చెయ్యని వాళ్ళు యెవరున్నారు యీ భూమిమీద?" యెదురు ప్రశ్నవేశాడు లింగప్ప దొర.
    "ఆ మజా నీకు అర్ధంకాదులే! యింతకూ నీకు యెంతమంది ఆడవాళ్ళున్నారు?"
    "నీ మాటలు జుగుప్స కలిగిస్తున్నాయి."
    "జుగుప్స కలిగే పనులే కొన్ని ఆనందాన్నికూడా యిస్తాయిలే చెప్పు చెప్పు."
    "నా భార్య"
    "ఒక్క శరీరంతో జీవితమంతా ఖర్చుచేస్తావా? అల్లా.... అల్లా' అని ఆశ్చర్యపడిపోయినాడు షేర్.
    "భార్య అంటే ఒక్క శరీరమనే నేను అనుకోను. ఆమె నా నీడ నా తోడు. నా మనసులోని ఆలోచనలకు వుత్తేజాన్నియిచ్చే శక్తి నాఆత్మ ప్రపంచాన్ని పెనవేసుకున్న ఒక గొప్ప అనుభూతి. మగవాడు నిండయిన ఒక జీవితకాలాన్ని ఖర్చుపెట్టి ఒక్క ఆడదాని ఆంతర్యాన్ని చదవగలిగితే అంతకన్నా గొప్పతనం యేముంటుంది? యిది నీకుఅర్ధం కాదులే నీ గొడవ యేదో నువ్వు పడు" అన్నాడు లింగప్పదొర.
    షేర్ కి యీ మొండిఘటాన్ని సాధించాలన్న పట్టుదల పెరిగింది.
    "నువ్వు నా కుమారుడి ప్రాణదాతవు యీ రోజుకు నా అతిధిగా వుండు" అంటూ లింగప్పను వెనక్కుపోకుండా కట్టివేశాడు.
    లింగప్పదొరకు అతని ఆతిధ్యం వెనుక ఆంతర్యం యేమిటన్న ఆలోచన రాలేదు. సాధారణమయిన మర్యాదగా దానిని అంగీకరించాడు.
    హిందువులకి పట్టిన యీ తలతిక్క ఆలోచనలు వదిలించటం యెలా? వాటి స్వరూపం యేమిటో లింగప్పద్వారా అర్ధం చేసుకోవాలన్న కోరిక కలిగింది షేర్ కి. అతనికి మరొక క్రొత్త తరహా క్రీడా వినోదం అయింది. మనసుతో నిమిత్తం లేకుండా కొన్ని వందల శరీరాల్ని మలినం చేసినవాడూ, ధర్మా ధర్మాలతో నిమిత్తం లేకుండా కొన్ని వందల తలలతో బంతులాడినవాడూ షేర్.
    అతడికి లింగప్పతో ఆడుకోవటం యెంత పని? కాని లింగప్ప హిందూ ధర్మానికి ప్రతినిధి హిందూ ధర్మంతో ఆడుకోవటానికి సాహసించాడు. చరిత్ర యెన్నోసార్లు యెందరో నియంతలకు యెన్నో గుణపాఠాలు నేర్పింది.
    అయినా చరిత్ర పునరావృతం అవుతోంది.
    ఖాన్ కొడుకుకోసం పరితపిస్తున్న జనానాలోకి కొడుకుని పంపేశాడు. లింగప్ప చేయి పట్టుకుని సగౌరవంగా స్నేహపూర్వకంగా లోపలకు తీసుకుపోయాడు. సేవకులకు లింగప్పదొర "నాతో సమానం" అనే అభిప్రాయం కలిగే విధంగా ప్రవర్తించసాగాడు ఖాన్.
    లోపల గదులు విశాలంగా దర్జాగా వున్నాయి. క్రిష్టల్ షాండ్ లయర్స్ ఒక్కొక్కటి లక్షలఖరీదు చేస్తాయి. వేలు కాదు లక్షలు. లింగప్ప అలోచించాడు. యీ దేశసంపదను సృష్టిస్తున్నవాళ్ళు అర్ధణాకూడా ఖరీదు చెయ్యని ఆముదం ప్రమిదలతో కాలం వెళ్ళదీస్తున్నారు. యీ దేశాన్ని దోచుకుంటున్నవాడు లక్షలఖరీదుచేసే క్రిష్టల్ షా డ్ లయర్స్ వెలిగించు కుంటున్నాడు. దీని పేరేమిటి? దోపిడీ కాదూ? అవును అవును.
    నేలమీద రత్నకంబళిలాంటి తివాచీ పరిచి వుంది. దాని అంచులలో వెండిబంగారు జరీతో కుట్టిన పూలున్నాయి.
    ఖరీదయిన బల్లలూ, కుర్చీలూ అమర్చి వున్నాయి. ఖాన్ సరాసరి తన స్వంత గదిలోకి నడిచాడు ఆ గదిలోకి యెవరికీ ప్రవేశం వుండదు. ఆఖరుకు అతని అంతరంగిక సలహాదారులకుకూడా ప్రవేశం వుండదు. అతి ముఖ్యమయిన అంతరంగిక సమస్య వుంటే ఆ గది వెలుపల అటు వంటిదే మరొక గది వుంది. దాన్లో చర్చలు జరుగుతాయి. కాని యీ గదిలోకి యెవ్వరికీ ప్రవేశం లేదు సేవకులకు తప్ప.
    లింగప్పను తీసుకుని ఆ గదిలోకి వచ్చాడు ఖాన్.
    ఆ గదిలో మాటలతో వర్ణించటానికి వీలుకాని వస్తువులు అనేకం వున్నాయి. పాలరాతి బొమ్మలున్నాయి. రత్నాలున్నాయి వజ్రహారా లున్నాయి. మణిదీపాలున్నాయి. సింహాసనం బంగారం పూతవేసి వుంది.
    రనసెల్లాలున్నాయి. వెండి మంచంమీద పట్టు పరుపులూ, ముఖమల్ దిళ్ళూ వున్నాయి. చీనా పింగాణి పళ్ళాలూ, పాత్రలూ వున్నాయి. వాటి మీద బంగారు కరిగించి చిత్రించిన బొమ్మలున్నాయి.
    బంగారు చిలుంతో హుక్కా వుంది. బంగారు చషకాలూ, అచ్చమయినప్పటికంతో తయారయిన పానపాత్రలూ వున్నాయి.
    ఆ గదిలో అద్భుతమయిన శృంగార చిత్రాలున్నాయి. దంతంతో చేసిన బొమ్మలున్నాయి. యింకా యెన్నో వున్నాయి.
    ఉమర్ ఖయ్యాం బాగా డబ్బున్న వాడయితే యెటువంటి గదిలో వుంటాడో అటువంటి గదిలా వుంది ఖాన్ స్వంత గది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra