Home » Vasundhara » రాయుడిగారి సినిమాకథ

    ఈ ఏర్పాటు రచయిత చేశాడు. ప్రభాకరం ఆదివారం ఏం బట్టలు వేసుకోవాలో ఆ అమ్మాయి ముందే నిర్ణయించింది. అవేరకం బట్టలు చింపాంజీకి కూడా తీయించి కట్టబెట్టించారు. ఈ విషయమై మొత్తం పథకమంతా అనుకున్న ప్రకారం రూపొందింది.  
    వనజ, అరుణ పొట్ట పొట్ట పట్టుకుని చతికిలబడ్డారు. సుహాసినికి నవ్వురాలేదు. కానీ ఆమెకూడా చతికిలబడింది. బోనులోని చింపాంజీని చూస్తూవుంటే ఆమెకు ఏదోలావుంది. సుబ్బారావు మౌనంగా వారి ముగ్గురికి దూరంగా కూర్చున్నాడు.   
    వనజ సుహాసిని భుజంతట్టి "చూశావుటే చింపాంజీని!" అంది.   
    సుహాసిని చటుక్కున పైట చెంగుతో చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంది. "నా మనసేమీ బాగోలేదే- కాసేపేమీ అనకు" అంది.   
    "ఏమయింది?" అంది వనజ.  
    "బావంటే నాకెంతో ఇష్టం. బావ నిజంగానే చింపాంజీలా ఉన్నాడు. అయినప్పటికీ ఇంతవరకూ ఎదుటపడి బావను చింపాంజీ అని పిలువలేదు. బావ ఇలాంటి వాటికి తట్టుకోలేడు. అతని మనసు ఎంత బాధపడుతోందో ఏమో అది తలచుకుంటే నా మనసేదోలాగైపోయింది" అంది సుహాసిని.   
    ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడలేదు. సుహాసిని మాత్రం ఉండుండి కళ్ళు తుడుచుకుంటోంది. ఆమె మనసు బాగాగాయపడినట్లు అంతా గ్రహించాను.   
    "జూ చూద్దామా" అంది అరుణ.   
    "ఇంకా నేనేమీ చూడను" అంది సుహాసిని.   
    "నాకు చూడాలనుంది" అంది అరుణ.   
    "ఆమెను బలవంత పెట్టొద్దు. నేను నీకు జూ చూపిస్తాను. మనం వచ్చేదాకా వీళ్ళిక్కడ కూర్చుంటారు" అన్నాడు సుబ్బారావు. అతడికి వనజ కారణంగా కాస్త యిబ్బందిగా ఉంది. ఎక్కడక్కన్నించి తప్పించుకుందామా అని చూస్తున్నాడు.  
    వనజ సుహాసినితో ఆగిపోయింది. సుబ్బారావు, అరుణ వెళ్ళిపోయారు. రామగోపాల్, మోనికా ఒక్కక్షణం డైలమాలో పడ్డారు. సుబ్బారావు ననుసరించాలా? సుహాసిని దగ్గరుండాలా? సుబ్బారావైతే రాయుడి చేతిలోని మనిషి అతడి వివరాలు రాయుడే అడిగి తెలుసుకోగలడు. ఇలా గనుకుని రామగోపాల్ అక్కడే ఉండిపోయాడు.   
    "భలేవాడే- చెల్లెలితో జూ చూడాలనుకున్నాడు" అంది వనజ.   
    "అన్న చెల్లె కి జూ చూపించడా?" అంది సుహాసిని.   
    "చూపించడని కాదు. అప్సరసల్లాంటి ఆడపిల్లలం ఇద్దరమున్నాం. మననిక్కడ వదిలి చెల్లెలితో తిరగడానికి పోయాడంటే అది విచిత్రమే" అంది వనజ.   
    "అతను నీకు నచ్చలేదా?" అంది సుహాసిని.   
    "నచ్చక పోవడమేమిటి?" అంది. "అసలు పెళ్ళి చేసుకోకూడదని చాలా కాలంగా అనుకునేదాన్ని అతన్ని చూడగానే మొదటిసారే నాకు ఏదోలాగనిపించింది. అతని పక్కన నడుస్తూంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. అతడితో పెళ్ళయితే చేయీ చేయీ కలుపుకుని రోడ్డు మీద నడవడానికి నేనెంతో గర్వపడతాను. మాయింట్లో ఈ విషయం చెప్పేయాలనుకుంటున్నాను" అంది వనజ.   
    సుహైస్ని ఆశ్చర్యంగా "మరి చదువుకోవా?" అంది.   
    "ఇలాంటి భర్త దొరికితే ఇంకా చదువెందుకే? అయినా చదువుకుని చేసేదేముంది? ఓ ఉద్యోగమా ఏమన్నానా?" అంది వనజ.   
    "అయితే సుభద్రమ్మగారికి నీ సంగతి చెప్పనా?" అంది సుహాసిని.   
    "చెబితే చచ్చి నీ కడుపున పుడతాను" అంది వనజ. కాని ముందు అతను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవాలి!"   
    "మీ యిద్దరికీ కులం కలవదు గదా!"   
    "మా ఇంట్లో అలాంటి పట్టింపులు లేవు. ఉన్నా నేను పట్టించుకోను. అతడికోసం అందర్నీ ఎదిరిస్తాను. ఈ ప్రపంచమంతా నా కెదురు నిలిచినా భయపడను అతన్ని నావాన్ని చేసుకుంటాను" అంది వనజ.   
    "అతనంత గొప్పవాడంటావా?" అంది సుహాసిని.   
    "అతనెంత గొప్పవాడో చెప్పడానికి మాటలు చాలవు" అంది వనజ. తర్వాత ఒక్కక్షణం ఆగి "అతని గురించి నువ్వేమనుకుంటున్నానే!" అంది.   
    "అతను నాకూ నచ్చాడు. కానీ పెళ్ళి చేసుకోను మా యిద్దరి శాఖలూ వేరు కదా!" అంది సుహాసిని.   
    "హెల్ విత్ యువర్ శాఖలూ!" అని "ఒక విధంగా అదీ నాకు మంచిదే- మా ప్రేమకు నువ్వు అడ్డురావు...సుహాసినీ! నువ్వె మమ్మల్నిద్దర్నీ కలపాలి. అతనికి నా గురించి నచ్చజెప్పాలి" అంది వనజ.   
    సుహైస్ని ఆలోచిస్తూ "నువ్వొప్పుకున్నా అతడొప్పుకోడేమో!" అంది.   
    "ఎందుకొప్పుకోడు? ఈ సృష్టిలో ఏ మగాడైనా సరే అందమైన ఆడదానికి బానిసకాక తప్పదు. అతనికి నేనంటే ఇష్టమవునో కాదో తెలుసుకో - ఆ తర్వాత అతన్ని నేను నా యిష్టం వచ్చినట్లు ఆడించగలను" అంది వనజ.   
    "అతనికి వాళ్ళమ్మ మాట వేదవాక్కు, ఇంతవరకూ వాళ్ళమ్మతో తప్ప సినిమాలు చూడలేదు. వాళ్ళమ్మ కిష్టం లేదని ఆటలకు వెళ్ళడు. వానలో తడిసైనా ఇంటికి వెళ్ళిపోతాడు. తప్పితే ఎక్కడా బయట ఆగడు. అలాంటివాడు నీమాట వింటాడని నేననుకోను."   
    "ఏమిటేమిటీ?" అని వనజ సుబ్బారావు గురించి మరికొన్ని వివరాలడిగి తెలుసుకుంది. అవన్నీ ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేశాయి. అంతా విన్నాక "ఇంకేం? రొట్టె విరిగి నేతిలో పడ్డదన్నమాటే! ఇలాంటి వాడె పెళ్లయ్యాక భార్య మాటలు వింటాడు. భార్య చెప్పినట్లే ఉంటాడు. జీవితంలో అంతకంటే అదృష్టముండదు నేనితన్ని వదులుకోలేను. సుహాసినీ, ప్లీజ్ - నువ్వు నాకు సాయం చేయాలి" అంది వనజ.   
    "ఏం చేయను. నిన్ను ప్రేమించమని అతనికి చెప్పాలా"   
    "అక్కర్లేదు. నేనతన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పు చాలు!"   
    "ఎప్పుడు చెప్పను?"   
    "మీరు పార్కులో కలుసుకుంటూనే ఉంటారు గదా!"   
    "లేదు. అందుకు మా నాన్నగారొప్పుకోవడం లేదు"   
    వనజ కాసేపు ఆలోచించి "అయితే ఓ పని చేస్తాను. అతన్ని సాయంత్రం పార్కుకి రమ్మనమని చెప్పు. ఆ టైముకి నేను మీ యింటికి వస్తాను. నాతో వచ్చినట్లు వచ్చి నువ్వు పార్కుకి వెడుదువుగాని. ఏం జరిగిందీ నువ్వు నాకు చెప్పాలి. నన్ను అతని దగ్గర విపరీతంగా పొగిడి పారేయాలి. ఎంతలా చెప్పాలంటే నా గురించి నువ్వు చెప్పిందంతా విన్నాక, అతను కలలో కూడా మరో ఆడదాన్ని తలవకూడదు" అంది.
    "అలా చెప్పడం నాకు చేతకాదే!" అంది సుహాసిని.  
    "నేను చెబుతున్నాను విను" అంది వనజ- "ముందుగా నేనెవరో అతనికి చెప్పకూడదు. ఒక యువతి మిమ్మల్ని ప్రేమిస్తోంది. ఆమె అపురూప సౌందర్యవతి ఆమెకోసం ఎందరో యువకులు కలగంటున్నారు. తొలి చూపుతోనే ఆమె మిమ్మల్ని ప్రేమించింది. తన హృదయాన్ని మీ పాదాల చెంత ఉంచాలనుకుంటోంది. మీకోసం ఈ ప్రపంచమంతా ఒక్కటై ఎదురు తిరిగినా ధైర్యంగా పోరాడాలనుకుంటోంది. మీరు ప్రేమ కబుర్లు చెబితే విని పరవశించాలనుకుంటోంది..."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra