"చెప్పండి డాక్టర్"
    
    సారధి అన్నాడు.
    
    "కానీ.......అతనికి ప్రత్యేకమైన శ్రద్ధతో ఎవరైనా దగ్గరే వుండి లాలిస్తూ కొన్ని కొన్ని మందులు బ్రతిమాలి ఆప్యాయంగా తాగిస్తూ అతనికి ప్రపంచంపై కలిగిన అపనమ్మకాన్ని తొలిగించి-అతనికి వుండే దేషాన్ని నశింప జేయొచ్చు. అలా అని ఖచ్చితంగా చెప్పలేను. అలా చేస్తే బాగుపడతాడనేదానికి అవకాశం వుంది- ఆస్కారం వుంది. నాకూ చాలా నమ్మకం కూడా వుంది"
    
    ఆయన ఆగుతూ ఆగుతూ చెపుతూ వుంటే గీతాంజలికి-
    
    తనగుండెలో మార్మోగేప్రతిధ్వని అలాచేయిస్తోందా అనిపించింది.  

 

    "అతన్ని నీడలా వెన్నంటి-తల్లిలా ఓదార్చి-ప్రియురాలిలా దరిజేర్చుకుని కన్నకొడుకు లా ఆదరించి, స్నేహితుడిలా మనసు రంజింపజేస్తే-అతనికి నీడగా మసలుకుంటే-అలాంటివాళ్ళుంటే-అలాచేస్తే అతనికి జబ్బునయమౌతుంది"
    
    ఇంకా ఏమైనా చెపుతాడేమోనని ఎదురు చూశాడు సారధి.
    
    "అంతే!"    

 

    డాక్టరుగారు ముగించారు.
    
    "మరిప్పుడేంచేయాలి?"
    
    "అదిమీరు నిర్ణయించుకోవాల్సిన మాట సారధిగారూ
    
    డాక్టరు గారు తనపై మోపుతున్న-మోపబోతున్న" బరువుకి భయపడిపోయాడు సారధి-
    
    "మీరేచెప్పండి ఎలా చేయాలో?"
    
    అమాయకంగా అడిగాడు.
    
    "నా ఉద్దేశ్యంలో-"
    
    వాక్యం మధ్యలో ఆపి గీతాంజలి వేపు ఒక్కసారి చూచి తిరిగి సారధి వైపు చూసి అన్నాడు డాక్టరు అనంతం.
    
    "నా ఉద్దేశ్యంలో మిస్ గీతాంజలిగారు అతన్ని అలా సంరక్షించగలుగుతారని, వారొక్కరే అందుకుతగినవారని తప్పకుండా జయప్రదం చేస్తారని-"
    
    డాక్టరుగారి మాటలు పూర్తి కాకముందే తన గుండెల్లో పిడుగు పడినట్టయింది ఆమెకి.
    
    వెర్రిచూపులు చూస్తోంది.
    
    సాగించాడు డాక్టరు తనమాటల్ని.
    
    "అతనిపై మీకు సానుభూతివుంటే-అతని పైమీరు ఇంతవరకూ చూపినదయ సఫలం కావాలంటే నే చెప్పే మార్గంకాక మరొకటి లేదు. మీరూ ఆలోచించుకోండి"
    
    తన ఉద్దేశ్యాన్ని పూర్తిగా వెల్లడించిబయటికి వెళ్ళిపోయాడు డాక్టరు అనంతం.
    
    ముగ్గురూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు.
    
    అయిదునిమిషాలు గడిచాక మళ్ళీ వచ్చారు డాక్టరుగారు గీతాంజలివేపు చూస్తూ అన్నాడు.
    
    "ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి మరిచాను-అతన్ని ఎక్కడా ఆస్పత్రి వాతావరణంలో వుంచరాదంటే అర్ధం మీ ఇంట్లో వుంచుకుని సపర్యలు చేయమని కాదు. అలా అనుకుని పొరపడేరు. ప్రశాంతమైన ప్రకృతి మాత ఒడిలో-విశదేవునిసన్నిధిలో-విశ్వశాంతిని కలిగించే భగవానుని వైద్యంతో అతను బాగుకావాలి"
    
    గీతాంజలిగారు అతన్ని వెంటదీసుకుని మంచి మంచి చారిత్రాత్మక-ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు-మంచిమంచి ప్రకృతి దృశ్యాలున్న ప్రదేశాలు చూపాలి-    

 

    ఆ నాటిప్రజల జీవితం వర్ణించి చెప్పాలి-
    
    వారి మనస్సు-మమత-శాంతి-సౌఖ్యం-అన్నిటితో కూడుకున్న జీవితాలు-
    
    అన్నీ బోధపరచాలి......
    
    అతన్లో మానసికంగా మార్పు రావాలేతప్ప--
    
    లేకపోతే--
    
    అతను బాగుపడటం కల్ల.
    
    డాక్టరుగా వచ్చినట్లు వెళ్ళిపోయాడు.
    
    ఎవరిముఖములో నూకత్తి వేటుకి నెత్తురు లేదు.
    
    గంభీరమైన ఆలోచనలలో మునిగిపోయారు.
    
    హఠాత్తుగా అన్నాడు మధురం.
    
    "సారధీ.....ఏంనిర్ణయం చేశావు"
    
    గీతాంజలిగుండెలు ఝల్లుమన్నాయ్.
    
    ఏమిటి అతను నిర్ణయించేది. ఇందులో నా ప్రమేయంయేమి లేదా? కేవలం నేను ఆచరణలో పెట్టేదాన్నా?
    
    సారధి ఆలోచనలో మునిగిపోయాడు.
    
    మళ్ళీ అన్నాడు మధురం.
    
    "ఏమిటి?.....ఏమిటా ఆలోచన? ఏదో ఓ నిర్ణయానికిరాక!"
    
    మెల్లిగా అన్నాడు సారధి.
    
    "నిర్ణయానికి వచ్చాను మధూ కానీ చెప్పటానికి నాకునోరు రావటం లేదు"
    
    ఇద్దరి ముఖాలూ వికసించాయ్ ఆ మాటతో.
    
    "చెప్పండి"
    
    ఇద్దరూ ఒకేసారి అన్నారు.
    
    వెంటనే అంది గీతాంజలి.
    
    "ఏదో శుభం జరుగుబోతోంది"
    
    "అవును పెద్దలు అంటారు-ఇద్దరు ఒకేమాటని ఏకకాలంలో అంటే బంధువులైనా వస్తారట లేదా ఏదైనా శుభం జరుగుతుందట."  

 

    సారధిముఖం మాడిపోయింది.
    
    హఠాత్తుగా సారధి అలా మ్రాన్పడిపోయేసరికి గీతాంజలి గాబరా పడింది.
    
    ఒక్క క్షణంలో తేరుకుని అన్నాడు.
    
    "నా నిర్ణయాన్ని పాటించాలి"
    
    "అక్షరాలా"
    
    గీతాంజలి ఏమీ అనలేదు.    

 

    ఆమెవేపు చూశాడు సారధి.
    
    తలవంచుకుంది.
    
    చెప్పసాగాడు.
    
    "అనాధలకి సేవ చేయటంకన్నా ప్రపంచంలో మరొకటి మంచిపని అనేదిలేదు......"
    
    ఆమెగుండె ఝల్లుమంది.
    
    "ఇతరులకి సహాయపడటంకన్నా మానవుడికిజీవితంలో అదృష్టం మరోకటి లేదు. తన అవసరాన్ని వదులుకుని అయినా ఇతరులకి సహాయంచేయాలి. అప్పుడేవాడు పూర్ణ మానవుడు"
    
    సారధి చేయి పట్టుకుని అంది.
    
    "వద్దు సారధీ-ఆ మాట-అనకు-వద్దు-వద్దు-"  

 

    తర్వాత చెప్పలేక పోయింది.
    
    మధురం అన్నాడు ప్రశాంతంగా.
    
    "కానీ......."
    
    "మనం ఇందులో కోల్పోయేది ఏమీలేదు పుణ్యముపురుషార్ధమూ రెండూ కలిసి వచ్చే మంచిపని చేయటంలో ఎప్పుడూ తప్పులేదు"
    
    "తప్పులేదుకోల్పోము ఎంత సులభంగా అనేస్తున్నావ్ సారధీ? నీకేం తెలుసు? ఏం కోల్పోతామో? వద్దు సారధీ. వద్దు ఈ త్యాగమూ-ఈ కీర్తి-నాకు అక్కర్లేదు-మనంపోదాం పద-"
    
    ఆవేశాన్ని అణుచుకోలేక ఏడుస్తూ లేచి నిల్చుంది అతని చేయి పట్టుకుని లాగ సాగింది.
    
    ఆమెచేయిపట్టుకుని మృదువుగా కూర్చోపెడుతూ అన్నాడు.
    
    "మనం ఊహించే ప్రపంచం వైశాల్యం చాలా తక్కువ గీతా! నాకు ఉపదేశాలు ఇచ్చేవేకొన్ని కొన్నిసార్లు? అంతటి భావుకత తెచ్చుకో........అతన్ని అలా పిచ్చివాడుగా బ్రతకటానికి వదిలేసేదానికన్నా అతన్ని సంస్కరించిబాగుపరచి వదిలేస్తే ఒకజీవి జీవితాన్నే చక్కదిద్దినదానివి అవుతావు. త్యాగంలోవున్న ఆనందం స్వార్ధంలో లేదు......ఈతోటనాది......ఈ పూవులునావి.....ఈమేడ నాది.....అన్న అహం వదలుకుని ఈ ప్రపంచమే నాదికాదుమనది ....ఈ సంపదంతామనది అన్న విశిష్టమైన ఊహే మనిషికి ఎప్పుడూ శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది......ఇందులో నిజంగా మనకు నష్టం ఏదీలేదు. ఒక ఏడాదో ఆర్నెల్లో అతనివెంట వెళ్ళి తిరిగిరా.....అతనిజబ్బు నయమవుతుంది.....అతన్నో ఇంటివాడిని చేసివదిలేద్దాం. తర్వాత మనం పెళ్ళిచేసుకుందాంనిజంగా ఇందులో మనంకోల్పోయేది ఏదంటేమన పెళ్ళి....అదిత్వరగా కాదు అంతే కదా? కొంచెం ఆలస్యం అయితే అయింది......సరేనా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra