Home » Kasinudhuni suvarchala devi » Aakhari Majili

 

    శ్రీధర్, భార్గవి , నిర్మల , జయలక్ష్మీ ని తీసుకుని విశాఖపట్టణం వచ్చారు.
    నెల లోపున జయలక్ష్మీ ని మీనాక్షమ్మ గారు తీసుకు వచ్చింది.
    సెలవయిపోవటంతో శ్రీధర్ కలకత్తా వెళ్తానని చెప్పాడు ఆరోజు భోజనాల దగ్గర.
    "భార్గవి తో పాటు నిర్మల ను కూడా తీసుకుపో. తల్లి దగ్గరుంటే అది పిచ్చి దానిలా తయారయ్యే ట్టుంది. కాస్త ఆ ఊరు అది చూపించి మళ్ళీ దాన్ని మనిషిని చెయ్యి. జయ ఇక్కడే ఉంటుంది' అంది మీనాక్షమ్మ గారు.
    "వద్దు -- పెద్దమ్మా -- అది కూడా ఎదురుకుండా లేకపోతె నేను బ్రతకలేను" అంది ఆదుర్దాగా జయలక్ష్మీ.
    నుదుట కుంకుమతో - తలలో పువ్వులతో మహాలక్ష్మీ లా ఉండే తల్లి ని ఆ స్థితిలో చూస్తున్న నిర్మల ఎంతకీ కోలుకోలేక పోతున్నది. దిగులుతో ముఖమంతా పీక్కుపోయి కళాకాంతులు లేకుండా చిక్కి సగమయిన నిర్మలను కలకత్తా తీసుకు వెళ్ళటం ఎంతైనా అవసరమనిపించింది శేఖర్ కి.
    "అక్కయ్యా నిర్మల కోలుకోవాలని నీకు లేదా?"
    జయలక్ష్మీ బాధగా చూసింది శ్రీధర్ ని.
    "మాతో పంపించు. కొన్నాళ్ళు అక్కడ ఉంటె గాని ఈ షాక్ నుంచి తేరుకోలేదు" అంటున్న శ్రీధర్ మాటను కాదనలేక పోయింది జయలక్ష్మీ.
    కలకత్తా వచ్చిన రెండు మూడు రోజులుగా శ్రీధర్ శేఖరాన్ని కలుసుకునేందుకు వీలు కాలేదు.
    భార్గవి మాత్రం ఫోను చేసింది శేఖరానికి. వెంటనే వచ్చాడు శేఖర్. జరిగిందంతా విని శేఖర్ కూడా ఏంతో విచారపడ్డాడు. ఏమాత్రం కొత్త లేకుండా ఎంతో మాములుగా మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దర్నీ చూసి నిర్మల ఆశ్చర్యపోయింది.
    "మా ఇంటికి రండి -- శ్రీధర్ కి తీరుబడి ఉండదు. కలకత్తా అంతా నేను చూపిస్తాను-- ఏం భార్గవి " అన్నాడు వెళ్ళబోతూ శేఖర్.
    భార్గవి కళ్ళలోకి చూస్తున్న శేఖర్ చూపులు అతని ముందు ఆమె మాట్లాడలేదు -- నిర్మలకు అదోలా అన్పించింది.
    ఆ రాత్రి శ్రీధర్ కి శేఖర్ వచ్చి వెళ్ళినట్టుగా చెప్పింది నిర్మల.
    "నిర్మలా! ఎట్లా ఉన్నాడతను. భార్గవి కి కాబోయే భర్త." అన్నాడు నవ్వుతూ చెల్లెలి వంక చూస్తూ.
    "ఫో! అన్నయ్యా! నువ్వెప్పుడూ ఇంతే" ఆమె బుగ్గల్లో పగడాలు పండినాయి.
    "అమ్మదొంగా! నాతొ చెప్పనే లేదు" అంది నిర్మల భార్గవి చెవి దగ్గర.
    "నువ్వు కూడా నన్ను అట పట్టిస్తున్నావా?" బుంగమూతి తో అంది భార్గవి. నవ్వులతో కులాసాగా ఆ రాత్రి గడిచిపోయింది.
    మర్నాడు పొద్దున్న కాఫీలు తాగుతుండగానే శేఖర్ వచ్చాడు.
    మీరంతా మా ఇంటికి రావాలి. ఈ పూట భోజనాలకి అక్కడే ఏర్పాటు చేశాను" అన్నాడు . శేఖర్ భార్గవి అందించిన కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటూ.
    "ఏమిటి విశేషం?' అన్నాడు శ్రీధర్.
    "ఏమీ లేదు. మీకు తీరుబడి ఉండదు కదా! కలకత్తా అంతా చూపించే భారం నా మీద వేసుకున్నాను" అన్నాడు చిరునవ్వుతో కాఫీ కప్పు కింద పెడ్తూ.
    "ఈ చిరునవ్వేగా ఒకప్పుడు నేను అసహ్యించుకున్నది. ఇంత మధురమైన నవ్వుని నేనలా ఎందు కూహించానో" అని ఆలోచిస్తున్న భార్గవి "ఏమండోయ్! భార్గవి దేవి గారూ! ఏమిటా తన్మయత్వం? అంటున్న శేఖర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి "అబ్బే! ఏం లేదు" అని తప్పించుకుంది.
    గబగబా స్నానాలు ముగించి శేఖర్ కారులోనే అందరూ శేఖర్ ఇంటికి వచ్చారు.
    "రండి , కాఫీ టిఫిన్ తీసుకుందాం" అంటూ డైనింగ్ రూము వైపు దారి తీశాడు శేఖర్.
    "ఇప్పుడా! ఇప్పుడే కదా తాగాం" అంటూ అడ్డు చెప్పింది భార్గవి.
    "కాఫీ కేం , ఫర్వాలేదు , రండి" ఆమె మాటలకు సమాధానం చెప్తూ శ్రీధర్ చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళాడు.
    అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు ఇద్దరు కూర్చుని కాఫీ తీసుకుంటున్నారు.
    టేబుల్ దగ్గరగా వచ్చిన శ్రీధర్ కొయ్యబారిపోయాడు. అతని శరీరంలో రక్తం నూట నాలుగు డిగ్రీల వేడి నందుకుంది. గుండెలు చెవుల్లో మృదంగం వాయించినట్టు హోరెత్తి మోగసాగినాయి.
    కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని పెదవుల దగ్గర పెట్టుకోబోతున్నదల్లా శేఖర్ పిలుపుతో తలెత్తి చూసిందామె.
    "శ్రీధర్! ఈమె నా క్లాస్ మేట్ ఇందిర. ఆవిడ ఫ్రెండ్ నీరజ" అని పరిచయం చేశాడు.
    శ్రీధర్ ని చూసిన ఇందిరకు తల తిరగసాగింది.
    చేతిలో కప్పు జారి కింద పడిపోయింది. చీర మీదంతా కాఫీ ఒలికిపోయింది.
    "సారీ! " అంటూ లేచి అవతలకు వెళ్ళిపోయింది.
    ఆమె వెళ్ళిన వైపే కళ్ళప్పగించి చూస్తున్న శ్రీధర్ భుజం మీద శేఖర్ చెయ్యి పడేసరికి చైతన్యం వచ్చింది.
    "మమ్మల్ని గుర్తు పట్టలేదా? అంది నీరజ.
    "గుర్తు పట్టకేం! కాలం తీసుకొచ్చిన మార్పుల్ని గమనిస్తున్నాను" అన్నాడు శ్రీధర్ కొంచెం తేరుకుని.
    భోజనాల సమయంలో మర్యాదకాదని వాళ్ళ సరసనే కూర్చుని మౌనంగా భోం చేసింది. కాని శ్రీధర్ మాత్రం ఎంతో మాములుగా హాయిగా మాట్లాడసాగాడు.
    ఇందిరను చూసిన అతని హృదయం పున్నమి నాటి రాత్రి కడలిలా పొంగసాగింది.
    ఏకాంతంగా ఆమెతో మాట్లాడే అవకాశం కోసం అతని మనసు ఉరకలు వేస్తున్నది.  సమయం కోసం ఎదురు చూడసాగాడు శ్రీధర్.
    భోజనాలు అయిన వెంటనే భార్గవి, నిర్మల శేఖర్ తో బయలుదేరారు.
    నీరజను రమ్మని భార్గవి బలవంతం చేసింది.
    "నేను రాను భార్గవీ! ఇక్కడికయినా రాకపోదును. ఇందిర బలవంతం మీద రాక తప్పలేదు. అది కాకుండా "శాంతి" కి ఆరోగ్యం బాగాలేదు. అని రావటానికి నిరాకరించింది.
    తలనొప్పిగా ఉందని ఇందిర అంతకు ముందే వెళ్ళిపోయింది. అందుకని ఆమెను బలవంతం చెయ్యలేదు.
    శ్రీధర్ ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
    "రండి -- ఇవ్వాళ ఎక్కడికి లేదు ముందుగా కాళి ఆలయానికి వెళ్ళాలనుకున్నాను-- దేవుడి గుడి కేల్దామంటే వద్దనకూడదు " అంది చొరవగా నిర్మల.
    ఇక కాదనలేక వాళ్ళతో బయలుదేరింది నీరజ.
    వెళ్ళబోయే ముందు ఇందిర దగ్గర కెళ్ళింది . గొంతు వరకు ముసుగు పెట్టుకుని పడుకుని ఉన్నదామె    అందంగా బొద్దుగా ముద్దులు మూట కడ్తున్న "శాంతి' ని ఎత్తుకుంది భార్గవి.
    శాంతిని చూసినప్పటి నుంచీ ఒక్క క్షణం కూడా వదలటం లేదామె.
    వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇందిర గది తలుపులు బిగించి వచ్చి పడుకుంది. ఒక్కసారిగా ఆమెకు దుఖం వెల్లువలా పొంగింది.
    కట్టలు తెంచుకుని విరుచుకు పడిన వరద నీటిలా ఆమె కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీరు కురవసాగింది. టకటక మన్న తలుపు శబ్దంతో కళ్ళు తుడుచుకుని జుట్టు సవరించుకుని తలుపులు తీసింది.
    తెల్లని బట్టల్లో పోటీ పడ్తున్న శరీర చ్చాయలో రెండు చేతులూ జేబుల్లో పెట్టుకుని నిలబడి ఉన్నాడు శ్రీధర్.
    ఆ సమయంలో అక్కడ నిలబడి ఉన్న శ్రీధర్ ని చూసిన ఇందిర కు గుండె ఆగిపోయినంత పనయింది.
    "దారిస్తే లోపలకు వస్తాను" గంబీరంగా అన్నాడు శ్రీదర్.
    "ఈ సమయంలో , ఎవ్వరూ లేకుండా చూసి మీరిలా రావటం సభ్యత కాదు. దయచేసి వెళ్ళిపొండి." తలుపులు వెయ్యబోతూ అంది ఇందిర "వెళ్ళటానికి కాదుగా వచ్చింది -- నేను రావాలి" అంటూ దాదాపు తోసుకుంటూ లోపలి కొచ్చాడు శ్రీధర్.
    "పెళ్ళయినా ఇంకా మీరు..."
    "నన్ను వదలలేదెందుకు? అంటావా?"
    "ఎవరైనా వస్తారు నిర్మల చూస్తె బాగుండదు. నేను వెళ్ళిపోతాను" అని బయటకు పరుగెత్తబోయింది ఇందిర.
    "ఇందిర" వెనక నుంచి ఆమె రెక్క గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఒక వారగా వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూసింది.
    ఆమె చెయ్యి వదిలి పెట్టకుండా అలాగే తన వైపు తిప్పుకుంటూ ఇంకో చేత్తో ఆమెను దగ్గరగా తీసుకుని.    
    "ఇందూ! నాకు పెళ్ళి కాలేదు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఏ జన్మలో తపస్సో -- భగవంతుడు నిన్ను నా దగ్గరకు చేర్చాడు. ఇన్ని సంవత్సరాలుగా నేను పడ్డ మనో వ్యధ నీకు అర్ధం కాదు. దానికి నాఅంతరాత్మే సాక్షి" ఆవేశంగా చెప్పుకు పోతున్నాడతను.
    "అబద్దం! ఇంకా నన్ను మోసగించాలనే చూస్తున్నారు."
    కొన్ని సంవత్సరాలుగా ఏ రక్షణలో తను తల దాచుకోవాలని తపస్సు చేసిందో ఆ అనుభూతి నుంచి దూరం కావటానికి శరీరం ఒప్పుకోలేదు. మనసుని శరీరం జయించింది. ఆర్తితో అతని హృదయానికి తీగలా పెనవేసుకు పోయిందామే.
    ఇంకా ఏదో అనబోతున్న ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడతను.
    కొంతసేపటికి ఇందిరను తన నుంచి వేరు చేస్తూ ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి "చెప్పు ఇందిరా! నన్ను పెళ్ళి చేసుకోవటం ఇష్టమేనా? నిర్భయంగా చెప్పు" అంటున్న శ్రీధర్ ని రెప్ప వెయ్యటం మర్చిపోయి చూడసాగింది ఇందిర    "మాట్లాడు ఇందిరా! ఆలస్యాన్ని భరించలేను నేను త్వరగా చెప్పు" అతని చేతుల్లో ఇందిర భుజాలు బిగుసుకు పోతున్నాయి. ఇందిర శక్తి లేని దానిలా అతని మీదకి ఒరిగిపోయింది. అతని గుండెల్లో తల దాచుకుంటూ "ఏం మాట్లాడను -- ఏం చెప్పను" అస్పష్టంగా గొణిగిందామే"
    "ఇష్టమే కదూ" అన్నాడు శ్రీధర్ మళ్ళీ.
    అవునన్నట్టు తలూపి తన చేతుల్లో తోటకూర కాడలా ఒదిగిపోతున్న ఇందిరను రెండు చేతుల్లోనూ ఎత్తుకుని మంచం మీద పడుకో బెట్టాడు శ్రీధర్.
    కళ్ళు మూసుకునే పడుకుంది ఇందిర.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra