Home » Dr c. ananda ramam » Kanapadutaledu

వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు జీవన్ అతనిలో రోషం, అహం ఎంత వున్నా తన తప్పు అర్ధం చేసుకునే సంస్కారం కూడా వుంది.
"మా అమ్మ రాగ కోసం బెంగ పెట్టుకుంది నిన్ను పంపమంటే పంపవు. అంచేత నా క్లోజ్ ఫ్రెండ్ గిరీశం నౌకర్ని పంపించాను పాపని తీసుకురమ్మని......" ఈ మాటల్లో కొంత నిజం లేకపోలేదు. రాణి అచ్చయ్యమ్మా దేవి యింట్లో ఏ పని చెయ్యలేకపోయినా , కోడలి మీద ప్రత్యేకమైన అభిమానం లేకపోయినా పసితనం నుంచి తన దగ్గిర పెరగబట్టి రాగ మీద మాత్రం మమకారం పెంచుకుంది. అయితే అర్జంటుగా రాగని తన దగ్గరకి తీసుకురమ్మని జీవన్ ని నిర్భందించలేదు. ఏ పని చేస్తున్నా రాగని తలచుకుంటూ వుండేది.
"అభం శుభం తెలియని పసిపిల్లని తీసుకురమ్మని కొత్త మనిషిని పంపబోయే ముందు అతడెవరో ఎలాంటి వాడో విచారించి తెలుస్కోవద్దా?"
"నాకు దూరాలోచన లేదని నీకు తెలుసు గదా! పొరపాటు ఎవరికైన వస్తుంది. జరిగిన పొరపాటు సర్ధుకోడానికి ప్రయత్నించాను. నీ కెన్నిసార్లు ఫోన్ చేసినా అందుకున్నావా? నా మాటలు విన్నావా?" నిష్టూరంగా అన్నాడు. మాటాడలేదు అణు. ఎప్పటికప్పుడు అతడి నోటి నుండి రాజీ మాట్లు వస్తాయేమోనని కొన్నేళ్ళు ఆశపడ్డానని , రాజీ భరించలేక మాట్లాడడం మానుకున్నానని చెప్పలేకపోయింది.
"నువయితే మొండిగా నా మాటలు వినిపించుకోకుండా వుండగలిగావు. కాని నేనలా వుండగలనా! ఫ్లైట్ లో యిక్కడికి వచ్చేశాను. భువనేశ్వర్ లో విధులన్నీ వాడికోసం గాలిస్తూ తిరిగాను వెధవని పోలిసుల కప్పగించాలనుకున్నాను. కాని వాడు నన్ను చావదన్ని పారిపోయాడు. చూడు ఎన్ని దెబ్బలో "తల్లి సింపతి కోసం టీచర్ కొట్టిన దెబ్బలు చూపిస్తోన్న పిల్లాడిలా అన్నాడు. ఇప్పటికి నిండా తన మీదకే ఈ సందర్భంలో కూడా తనే అతని మీద జాలిపడి ఒడార్చాలన్నట్టుగా వుందతని ధోరణి.
అణులో ఓపిక నశించిపోతోంది. ఎప్పుడూ తను మరొకరి అండగా నిలబడడమేనా?" నీకు నేనున్నాను" అంటూ తనకి అండగా నిలిచే వారెవరూ వుండరా! చుట్టూ గాడాంధకారం కమ్ముకొన్నట్లు అయిపోతున్నా కూలబడిపోకుండా శక్తి కూడదీసుకుని ముందుకు నడుస్తోంది ఇంకా లేనిపోని బరువులు మీద వేసుకోగలిగిన శక్తి లేదు.
"జలజ ఎక్కడికెళ్ళింది?" అంది మాట మారుస్తూ.
"జలజ ఇక్కడెందుకుంటుంది?" అన్నాడు జీవన్ తెల్లబోతూ అతడి ముఖంలో ఆకర్షణంతా అతనిలోని నిజాయితి. అబద్దాలు, ఎత్తుకు పై ఎత్తులు నక్కజిత్తులు యిలాంటివేం అతడి వుహలోకి కూడా రావు."
"జలజ ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను."
"జలజ- నీకు ఫోన్ చేసిందా?" నమ్మలేనట్లు అన్నాడు.
అది నిజమే జలజ ఫోన్ చేయలేదు. తనే ఫోన్ చేస్తే జలజ పలికింది. అణు మాట్లాదకపోయేసరికి విషయం అర్ధం చేసుకుని స్నేహంగా నవాడు జీవన్." జల్జ్ ఆగమ్మ కాకీ అక్కడ ఇక్కడ తిరిగి ఏదో ఒక టైములో ఆసుపత్రి కొచ్చి నానా హడావుడి చేసి పోతుంటుంది. బహుశా నువు ఫోన్ చేసినప్పుడు యిక్కడుందేమో? అప్పుడే వెళ్ళిపోయింది. కొంపదీసి జలజ నా పక్కన కూర్చుని సపర్యలు చేస్తున్నట్లు వూహించుకుంటున్నావా నువు?" అల్లరి నవు జీవన్ పెదాల పై నిజానికి అచ్చు తనలాగే వుహించుకుంటోంది. తన బలహీనతలు జీవన్ కి తెలుసు మళ్ళీ మాటలు తప్పిస్తూ,
"ఏదో ముఖ్యమైన విషయం వుందని నన్ను రమ్మంది............."
జీవన్ ముఖం గంభీరంగా అయింది." అవును ముఖ్యమైన విషయమే నీకు తెలిస్తేనే మంచిది. ఇవాళ ఒక పోలీసు కానిస్టేబుల్ నాకోసం వచ్చాడు. నన్ను కొట్టిన వాడి గురించి వివరాలడుగుతూ కాసేపు కూర్చున్నాడు. వెళ్ళబోతూ నాచేతిలో ఈ చిటి పెట్టాడు." అని దిండు కింద నుంచి చిన్న స్లిప్ తీసి యిచ్చాడు. ఏదో రఫ్ కాగితం, అంతగా చదువు రాని వాడు రాసినట్లు చికిరి బాకిరి అక్షరాలు.
"ఒరేయి జీవన్! నాతో అటలాడాలని చూడకు. నన్ను గురించి పోలీసులకి చెప్పాలని ప్రయత్నించావా నువు మిగలవు. నీ కూతురు మిగలదు, నీ డాన్సరు భార్య కూడా దక్కదు జాగ్రత్త తమాషా"
ఉత్తరం చదివి కాళ్ళు చేతులు చల్లబడుతుండగా , "అంటే?" అంది భయంగా.
"ఏముంది? పోలీసు కానిస్టేబుల్ వేషంలో వచ్చినవాడె తమాషా వాడు వెళ్ళిపోయాక ఉత్తరం చదివాక అర్ధం చేసుకున్నాను."
అణు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. రాగ ఎక్కడుంది. ఇన్ని రకాలుగా వేషాలు మార్చే చైల్డ్ రేపిస్ట్ చేతుల్లో చిక్కుకు పోయిందా! ఇప్పుడు ఏ దశలో వుంది! పాప "అమ్మా" అని ఏడిస్తే పలికేవారెవరు?
"అమ్మా!" ఏడ్పు గొంతుకతో అంది రాగ. యమ్మాయమ్మ రాగ ముఖం పైకెత్తి కళ్ళు తుడిచి" ఏడవకు బ్రెడ్ తిను" అంది.
"బ్రెడ్ వద్దు. నీ దగ్గర ఫిఫ్టి ఎన్పి వుందా?"
"దేనికి?"
"ఏదేనా పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మమ్మికి ఫోన్ చేసి సారీ చెప్తాను." గతుక్కుమంది యమ్మాయమ్మ పాపని ఎటూ కదప వొద్దని జాన్ పదిసార్లు హెచ్చరించాడు ఏ మాత్రం పాప దగ్గిరనుంచి బయటికి వార్త పొక్కినా మొత్తం అందరూ చిక్కుల్లో పడిపోతారు. అంచేత బిక్కమొహం పెట్టి, పాపని యిమిటేట్ చేస్తూ, "సారి! రాగా! నా దగ్గిర డబ్బుల్లేవు. ఒక్క రూపాయి వుంటే నీకోసం బ్రెడ్ తెచ్చేశాను. మళ్ళీ డబ్బులు తెస్తాను. అప్పుడు ఫోన్ చేద్దాం. ముందు బ్రెడ్ తిను."
"నాకొద్దు" మారాం చెయ్యబోయింది. "నువు యిలా పేచీలు పెడ్తే నిన్నొదిలేసి నేను వెళ్ళిపోతాను నిన్ను మీ మమ్మీ దగ్గరికికాని, డాడీ దగ్గరకి గాని ఎవరు తీసికెళ్ళరు పైగా ఈ అల్లరి పిల్లలు నిన్ను బాగా కొడ్తారు." ఆ గుడిసెల్లో పిల్లలంటే బెదురు పట్టుకుంది రాగకి. వాళ్ళల్లో అప్పుడే ఒక జూనియర్ గాంగ్ ప్రారంభమవుతోంది. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుందన్నట్లు వాళ్ళల్లో వాళ్ళు ముఠాలుగా చిలిపోవటాలు, ఒకరిని ఒకరు తన్నుకోవడాలు, డబ్బులతో పందాలు పెట్టుకునే ఆటలు, రహస్యంగా సిగరెట్లు తాగడాలు అక్కడి ఆడమగ పిల్లలందరిలోనూ వున్నాయి.
ఆ పిల్లలంటే భయమే కాక తన వారంటూ ఎవరూ లేని ఆ అపరిచిత ప్రదేశంలో తనని అభిమానించే యమ్మాయమ్మతో పేచీ పెట్టుకోలేకపోయింది రాగ అంచేత యిష్టం లేకపోయినా బ్రెడ్ తినేసింది. సుబ్బయ్య, యమ్మాయమ్మతో "నువిలా కూర్చుంటే పనులు జరగవు జాన్ గాడి మనసులో ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు నువ్వేళ్ళీ ఆ డాన్సర్ యింటి దగ్గిర పరిస్థితి ఎలా వుందో గమనించిరా! తొందర్లో వీలైనంత డబ్బు చేసుకొని ఇక్కడ్నుంచి బయటపడదాం" అన్నాడు.
"మరి రాగ!" అని ఆగి "నేను వెళ్ళాక యీ పిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోతేనో అన్నట్లు సైగ చేసింది. "నేనుంటాను నువు వెళ్ళు" అన్నాడు సుబ్బయ్య.
యమ్మాయమ్మ పక్కా గృహిణిలా తయారై అందమైన హేండ్ బేగ్ పుచ్చుకుని బయలుదేరింది. ఆమె వెళ్ళిన పదినిమిషాలకి సుబ్బయ్య కూడా లేచాడు. చిన్న హేండ్ బేగ్ భుజాన తగిలించుకుని రాగతో "పాపా! యిప్పుడే వస్తాను. నువు యిక్కడ్నుంచి కదలకు చుట్టూ అందరూ బాడ్ పీపుల్స్ వున్నారు? నిన్ను కొట్టి ఏడిపిస్తారు." అన్నాడు. రాగ ఏడుపు మొహంతో "నాకు భయం," అంది మరో గుడిసేలోంచి శంభూ అనే పిల్లాడిని పిలిచి అతడితో పాపని ఎక్కడికి తిరగకుండా చూస్తూ వుండమని చెప్పి వెళ్లిపోయాడు. గుడిసెలో రాగ శంభూ ఇద్దరే మిగిలారు. రాగకి తెలుగు బాగా వచ్చు. యింగ్లీషులో మాట్లాడగలదు. ఒరియా కాస్త కాస్త పట్టుకుంది. ఇద్దరూ కాస్సేపు ఒకరి నొకరు చూసుకున్నారు రాగ తినగా మిగిలిన బ్రెడ్ రేపర్లో చుట్టి వొక మూల పెట్టింది యమ్మాయమ్మ అది తెచ్చి శంభుకిచ్చింది రాగ. దాన్ని యావగా పిక్కుతిన్నాడు వాడు ఈ పిల్లలకి తిండి లేక కాదు. తింటున్న కొద్ది వారికీ కరువు ఎక్కువైనట్లుంటుంది. ఎప్పుడైనా ఏ రోజైనా తిండి దొరకేదోమోనని భయం అందుకు కర్ణం కావచ్చు. శంభూ బ్రెడ్ తినేసాక, "నేను మమ్మికి ఫోన్ చెయ్యాలి." అంది సగం అభినయంతో చూపిస్తూ "ఫోన్ యిక్కడ లేదు టెంపుల్ స్ట్రీట్ లో హొటల్ లో వుంటుంది లేకపోతే షాపులో వుంటుంది. "వాడు సగం అభినయిస్తూ ఒరియాలో చెప్పాడు. ఇద్దరికీ సంభాషణ మూడు వంతులు అభినయం ఒక ఒంతు మాటలుగా సాగుతోంది. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra