Home » Rabindranath tagore » Panchabhuthaalu


  

 మన భాషలో  కౌతుక, కౌతుహ శబ్దాల అర్దాలకు సంబంధం వుంది. సంస్కృత సాహిత్యంలో అనేకచోట్ల ఒకే  అర్దంలో ఈ రెండు శబ్దాలను ప్రయోగించారు. ఇందువల్ల కౌతుహల ప్రవృత్తితో కౌతుకానికి విశేష సంబంధమున్నదని ఊహించవచ్చును.
     కౌతూహల ముఖ్యాంగం నవీన లాలస. నవీనత కౌతుకానికి కూడా ముఖ్యోపకరణం. అసంగతంలో వుండే విశుద్ద నవీనత సంగతంలో వుండదు.
     కాని పదార్ద అసంగతానికి, ఇచ్చాశక్తికి విశేష సంబంధం వున్నది. ఈ సంబంధం జడ పదార్దంలో వుండదు. నిర్మలమయిన దారి వెంట నడుస్తూ హటాత్తుగా దుర్వాసన కొడితే దగ్గరలోనే దుర్గంధ పదార్దం వుందని నిశ్చయించుకుంటాం. అప్రమత్తులమయి ఉంటాం. ఏ విధంగానూ మానసిక ఉత్తేజనం కలగదు. జడ ప్రకృతిలో ఏదో కారణాన జరిగే పనులలో ఏవిధమయిన మార్పూజరగదు. ఇది నిశ్చిత సిద్దాంతం.

     కానిదారిలో  నడుస్తూ, నడుస్తూ హఠాత్తుగా ఒక వృద్దుడు నృత్యం చేయడం చూస్తాం. వాస్తవానికి అది అసంగతంగా తోస్తుంది. అది అవశ్యమూ కాదు, నియమాను సారమూ కాదు. వృద్దుడు  ఈవిధంగా ఆఛరిస్తాడని మనం ఆశించలేం.  అతనిలో ఇచ్చాశక్తి గలవాడతను. అతను ఇచ్చానుసారం నృత్యం చేస్తున్నాడు. ఇచ్చలేకపోతే నృత్యం చేయడు. జడపదార్దం తన ఇచ్చానుసారం తానేమీ చేయలేదు. అందువల్ల జడపదార్దంలో అసంగతం, కౌతుక ప్రదం ఏదీ లేదు. టీ చంచా హఠాత్తుగా టీకప్పులో నుంచి ఎగిరి సిరాబుడ్డిలో పడితే చంచావిషయంలో హాస్య విషయం కాదు. ఎందుకంటే, భావాకర్షణ  శక్తి నియమం ఉల్లంఘించే శక్తి దానికి లేదు. కాని అన్యమనస్కుడయిన లేఖకు డెవడయినా తన టీ చంచాను సిరాబుడ్డిలో  ముంచి టీ తాగడానికి యత్నిస్తే అది తప్పకుండా నవ్వు వచ్చే విషయమే. జడ పదార్దంలో నీతి లేనట్లే ఆసంగతి కూడా జడపదార్దంలో వుండదు. మనోపదార్దం  ఎక్కడ ప్రవేశించి శంక కలిగిస్తుందో అక్కడ ఔచిత్య అనౌచిత్యాలు;  సంగతా సంగతాలు ఎదురవుతాయి.
     కౌతూహలం అనేక   సమయాలలో కఠోరంగా వుంటుందని ప్రతీతి. సిరాజుద్దౌలా ఇదదరు మనుషుల గడ్డాలు ఒకదానికొకటి ముడివేసి వారిద్దరి ముక్కులలో నఎశ్యం కూరేవాడు. ఇద్దరూ తుమ్మగానే  సురాజుద్దౌలా ఆనందించేవాడని వింటున్నాను.  ఇందులో అసంగతం లేశమయినాలేదు. ముక్కులో నశ్యం కూరితే తుమ్ములు వస్తాయి. కాని ఇక్కడ కూడా ఇచ్చతోపాటు అసమంజస్యం జరిగింది. ముక్కులో నశ్యం పెట్టించుకున్న వారు తుమ్మాలని ఇచ్చగించరు. తుమ్మితే వారి గడ్డాలు పీక్కొనిపోతాయి. అయినప్పటికీ తుమ్మక తప్పదు.
      ఈ విధంగా ఇచ్చతో అవస్థకు అసంగతి కలుగుతుంది. ఉద్దేశ్యంతో కార్య అసంగత కలిగితే అందులో నిష్టురత పరిచయమవుతుంది. అనేక సమయాలలో ఏ   విషయం నవ్వు పుట్టిస్తుందో ఆ విషయం హాస్య విషయమయి తీరుతుందని అనడానికి వీల్లేదు. అందుకని పాంచభౌతిక సభలో సుఖాంత దుఃఖాంతాలు కేవలం బాధ యొక్క  భిన్న భిన్న  పరిణామాలని గగన్ దేవ్ చెప్పాడు. సుఖాంతంలో ప్రకటితమయే నిష్టురతవల్ల నవ్వు పుడుతుంది. దుఃఖాంతంలో పీడనా పరిమాణం కూడా ఇంతే వుంటుంది. మనం ఏడుస్తాం. 'టాయిటీ' ని అపూర్వ మోహవివశయై గాడిద దగ్గర ఆత్మ విసర్జన చేసినపుడు అవస్థా భేదపాత్ర కారణంగా దాని వెనక శోకం రూపం ధరిస్తుంది.
     ఆసంగతి దుఃఖాంతాలకు, సుఖాంతాలకు విషయమే. ఇచ్చతో పాటు అవస్థా అసంగతి తెలియవస్తుంది. ఫాల్ స్టాఫ్ విండ్సన్ నగర వాసినియైన విలాసవతి ప్రేమ లాలనలో నిశ్సంక చిత్రంతో అగ్రసరుడయినాడు. రామచంద్రుడు  రావణుని చంపి వనవాస ప్రతిజ్ఞ పూర్తిచేసి రాజ్యానికి తిరిగివచ్చి దాంపత్య సుఖచరమ సీమను చేరుకున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా విపత్తు మేఘం విరుచుకు పడింది. గర్బవతి సీతను  అడవిలో విడిచిపెట్టాడు. ఈ రెండు పోలికలలోనూ ఆశతో ఫలితానికి, ఇచ్చతో అవస్థకు అసంగతి గోచరిస్తుంది. అందువల్ల అసంగతి రెండు విధాలని వెల్లడవుతూ వుంది. ఒకటి హాస్య జనకం,  రెండోది దుఃఖజనకం, విరక్తి జనకం, విస్మయజనకం, దోషజనకం కూడా రెండవ శ్రేణికి చెందినవే.
     ఇంకో మాటలో, అసంగతి మన మనసును కొద్ది గాయాన్ని చేసినపుడు, దానిగాయం మర్మస్థలం వరకు పోనంతవరకు మనంగా నవ్వుతాం. కాని అది మన గుహ్య స్థానాన్ని కదిలించితే బాధ సహించరాని దౌతుంది. అపుడు మనం దుఃఖిస్తాం. వేటగాడు చాలాసేపు పొంచి వుండి దూరాన వునన తెల్లని వస్తువు హంస అని భ్రమించి తుపాకీ పేలుస్తాడు. తీరా దగ్గరకు వెళ్ళి చూస్తే అది చింకి గుడ్డముక్క. అపుడు అతను నిరాశ చెందుతాడు. మనం కూడా నవ్వుతాం. కాని ఒకమనిషి తన జీవిత  చరమ లక్ష్యంగా పెట్టుకున్న వస్తువును పొందడానికి  నిరంతర పరిశ్రమ చేసి చివరకు సఫలీకృతుడవుతాడు.  ఆ వస్తువును చేతితో తీసుకుని చూస్తే అది తుచ్చ మాయాజాలని తేలుతుంది. అటువంటి స్థితిలో మన మనసు బాధ పడుతుంది.
     ఆ కాలంలో జనం గుంపులు గుంపులుగా ఆకలికి చచ్చిపోవడం ప్రశాంత మయమని అనలేము. కాని సైతాను రసికుడయితే అతనికి ఇది కౌతుక దృశ్యమని ఊహించవచ్చు ఆ సైతాను ఆ ఆమరాత్ముధారులయిన ఆ మృతుల అతి  జీర్ణ కళేబరాలవేపు కటాక్షదృష్టి వదలి 'మీ షడ్డదర్శనాలు', మీ కాళిదాసు కావ్యాలు, ముక్కోటి దేవతలు ఎందరో వున్నారు. కాని బియ్యపు గింజలకోసం మీ అమర ఆత్మలో దిగ్విజయ మానుషం గొంతులో కొట్టుకుంటుంది.
     ఆసంగతి మెలమెల్లగా వృద్దిపొందుతూ క్రమక్రమంగా విస్మయావహమయి హాస్యంగా మారుతుంది. ఆ హాస్యం తిరిగి కన్నీరుగా పరిణమిస్తుందని స్పష్టమవుతుంది.

                            సౌందర్యంలో సంతోషం.

ప్రకాశవతి, నిర్ఘరిణి హాజరు కాలేదు. మేము నలుగురమే వున్నాము. పవన్ దేవ్ అన్నాడు;"చూడండీ! ఆనాటి ఆ కౌతుక హాస్యాన్ని గురించిన విషయం ఒకటి నాకు జ్ఞాపకం వస్తోంది. ఎక్కువగా  కౌతుకం  మన మనసులో ఏదో ఒక విచిత్ర చిత్రాన్ని  చిత్రించింది.  దానితో మనకు  నవ్వు వచ్చింది. కాని ఏ స్వలాభంవల్ల చిత్రకళమీద ఏవగింపు కలుగుతుందో దాని బుద్ది 'అబ్ స్ట్రాక్' (అనావిష్ట) విషయాలలోనే పరిభ్రమిస్తుంటుంది. కౌతుకం అలాంటి వారలను విచలితం చేయలేదు."
    పృద్వీరాజ్, "ముందుగా నీ భావం అర్దం కాలేదు. తరువాత 'అబ్ స్ట్రాక్ట్' అనే మాట ఇంగ్లీషు మాట." అని అన్నాడు.
     దానిమీద పవన్ , అన్నాడు; "ముందుగా అవరోధించే ప్రతి వాదన చేశాను. కాని తర్వాత అపరాధం నుంచి తప్పించుకోవడానికి ఉపాయం తోచలేదు. అందువల్ల బుద్దిమంతులు అందుకని నన్ను క్షమించాలి. జనులు ద్రవ్యసంపూర్ణ బహిష్కార గుణాన్ని చేష్టారహితంగా, గ్రహిస్తారు. వారు స్వభావసిద్దంగా హాస్య రసాన్ని అనుభవంచలేదు." పృద్వీరాజు తలాడించి, "ఉహూ, అలాకాదు. నువ్వు చెప్పినది సరిగా లేదు," అని అన్నాడు.
     అపుడు పవన్ దేవ్ అన్నాడు: " ఒక ఉదాహరణ చెపుతాను. మన సాహిత్యం స్త్రీ వర్ణన చేసే సమయంలో చిత్రకారుడు ఏ విశేష చిత్రం చిత్రించేవేపు లక్ష్యంచేయడు. సుమేరు, దండింబ, కదంబ, నింబఇత్యాది సుందర శబ్దాలను తీసుకుని మృదు మధుర భాషలో సింగారిస్తారు. మనం ఏ మూర్తియొక్క సంపూర్ణ  ప్రతిరూపమును చిత్రించలేము.  చిత్రించాలని యత్నించము.  అందువల్ల  మనం కౌతుక  ప్రధానాంగం  వల్ల వంచితులమవుతున్నాం. మన ప్రాచీన కావ్యాలలో ప్రశంసా ఉద్దేశ్యం దేశ ప్రజలు ద్రవ్యంతో దాని గుణాలను  సహజంగానే వేరు చేయగలరు. ఇచ్చానుసారం ఏనుగులో మాత్రమే వెల్లడిస్తున్నారు. ఇందువల్ల షోడశ ఇచ్చానుసారం ఏనుగులో మాత్రమే వెల్లడిస్తున్నారు.  ఇందువల్ల షోడశ నుంచి ఏనుగ గుణాలన్నింటినీ లుప్తంచేసి కేవలం దాని మందగతిని యావతి అనడానికి బదులు గజేంద్ర గమన అని ప్రయోగిస్తున్నారు. బృహనీకాద జంతువు ఒకసారిగా కనిపించదు. సుందర వస్తువు వర్ణన చేయడం కవి వుద్దేశమయినపుడు సుందర ఉపమానాలను వెదకి బయటకు తీయడం అవసరం. కేవలం ఉపమాన ఉపమేయ అంశాలను తీయడం కాదు. ఇతర అంశాలను కూడా మనసులో వుదయింప జేసుకోవడం స్వాభావికం. అందువలన ఏనుగ తొండంతో స్త్రీల కాళ్లూ చేతులు పోల్చడం అల్ప దుస్సాహస కార్యం కాదు. కాని మనదేశ పాఠకులు ఈ పోలికను చూసి నవ్వుకోరు. విరక్తి చెందరు. ఏనుగ తొండం యొక్క గుండ్రతనాన్ని మాత్రం తీసుకుని తక్కిన గుణాలన్నింటినీ వదలివేస్తారు. ఈ అధ్బుత శక్తి మనలో వున్నది. గృహిణి చెవి లోలకులతో సాటియేమున్నది. దీనిని తెలుసుకోవడానికి నాకు కల్పనా శక్తి లేదు. అందమయిన ముఖానికి రెండు వేపులా రెండు లోలకులు ఊగుతుంటే అవి ధరించడంలో కష్టమేమీలేదు. నా కల్పనా శక్తి అంతగా మొక్కవోవలేదు. ఇంగ్లీషు విద్య నేర్పడం వల్ల మన హసనశక్తిలో అటువంటి పరివర్తన వచ్చింది"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra