Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

 

    మనసంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతి నిలిచిపొగా, అతడు చుట్టూ క్రిందికి చూశాడు.        
    దట్టంగా పొగమంచు వ్యాపించి ఉంది. అక్కడంతా రెండొందల గజాల అవతల ఉన్న దృశ్యం కూడా సరిగా కనుపించడమే లేదు. మసక మసగ్గా కనబడుతోంది ఎదురిల్లు, కలలో కనబడే దృశ్యాలలా అస్పష్టంగా.    
    ఆ మసకలోనే ఒక స్త్రీ రూపం కనబడింది.    
    ఆమె ఎదురింటి ముసలాయనగారి పడుచు భార్య అయి ఉండాలి.    
    అంత చీకటితోనే లేచి గుమ్మం ముందు ముగ్గు వేస్తోంది. ఆమె పాడుతున్న ఏదో పాట మెల్లిగా అస్పష్టంగా వినబడుతోంది. అదేం పాటో అతనికి అర్ధంకాలేదు. కానీ భూపాలరాగంలో ఏదో మేలుకొలుపు పాటలా అన్పించింది.    
    మెల్లిమెల్లిగా తెల్లవారుతోంది. మంచు కరుగుతోంది. చిన్న చిన్న మంచు స్ఫటికాలలా ఉన్న పారిజాతపు పూలని ఏరి సజ్జలో వేస్తోంది ఆమె. పొగమంచులో, వంగిన మల్లెతీగెలా వుంది.    
    పేదరికాన్ని కూడా అందమైన ఫ్రేముల్లోనే చూపించాలని తాపత్రయపడే కొంతమంది దర్శకుల సినిమాల్లోని సీనులావున్న ఆ దృశ్యాన్ని చూస్తూ వుంటే ఎంత టైం గడిచిపోయిందో కూడా తెలియలేదు బాలూకి.    
    అతను ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చేలా చేసింది ఎదురింటి ముసలాయన కేక.    
    "జానకీ!"    
    "వస్తున్నా!"    
    ఆ ముసలాయనకు కొంచెం చెముడు కూడా వుండి వుండాలి. కాస్త పెద్ద గొంతుతోనే చెప్పిందామె. పెద్దగా చెప్పినా మృదువుగానే వుందామాట.    
    బాలూ వెనక్కి తిరిగి చూసేసరికి సౌదామిని లేదు అక్కడ పిల్లవాడూ లేడు. పక్కబట్టలూ లేవు.    
    అతని ఆలోచనలకు భగ్నం కలిగించడం యిష్టంలేక నిశ్శబ్దంగా కిందికి వెళ్ళిపోయింది సౌదామిని.    
    అతనూ క్రిందికి వచ్చాడు. సాలెపురుగు గూడు అల్లటం పూర్తి చేసింది.    
                                                                12    
    అప్పటికే స్టీరియో టేప్ డెక్ ముందు కూర్చుని, కాఫీ సిప్ చేస్తూ జుబిన్ మెహతా కండక్టు చేసిన కన్ సర్డ్ వింటూ ఆ వాయులీనాల గమకల్లో లీనమైపోయి వుంది సౌదామిని.    
    "గుడ్ మార్నింగ్ డియర్!" బాలూ అన్నాడు.    
    తలెత్తి చూసి "గుడ్ మార్నింగ్" అంది నవ్వుతూ.    
    "జుబిన్ మెహతానా!" అడిగాడు.    
    "అవును! మనం మన వెర్రి ప్రోగ్రాములలోంచి బయటపడి ఇలా నిజంగా కళకి అంకితమైపోయే రోజులు ఎప్పుడు వస్తాయో?" అంది సాలోచనగా.    
    "మనం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాక జనాన్ని మన దారిలోకి తెద్దాం" అన్నాడు. ఆమె నవ్వింది. 'జనం మారరు' అన్న నవ్వు అది.    
    "అరె! మరచిపోయాను" అన్నాడు బాలూ ఉన్నట్లుండి.    
    "ఏమిటి?"    
    "ప్రీ రికార్డెడ్ క్యాసెట్స్ తయారుచేసే కంపెనీ వాళ్ళతో ఇవాళ అప్పాయింట్ మెంట్ వుంది. "ఫుట్ ప్రింట్స్ ఇన్ టైమ్" అంటే 'కాలంలో కాలి అడుగులు-' అని తర్జుమా టైటిల్ తో మన మ్యూజిక్ క్యాసెట్స్ అమ్ముతామంటున్నారు."    
    నొసటిని వేళ్ళతో నొక్కుకుంటూ కొద్ది క్షణాలు ఆలోచించింది సౌదామిని. "టైటిల్ మరీ ఏదోగా లేదూ! "మ్యూజిక్ మ్యూజిక్" అంటే థ్రిల్లింగ్ గా వుంటుందేమో" అంది.    
    "మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్" అని తనలో తనే అనుకున్నాడు బాలూ. "యా! యమ థ్రిల్లింగ్ గా వుంటుంది. చెప్పి చూస్తాను."    
    "వాళ్ళు ఒప్పుకోకపోతే గట్టిగా పట్టుబట్టకండి."    
    "నువ్వు యమ ప్రాక్టికల్ గా ఆలోచిస్తావ్ సౌదామినీ! నిజం!.... ప్రాక్టికల్ గా అంటే గుర్తొచ్చింది, ఒకసారి నాతో అర్జెంటుగా బెడ్ రూంలోకి రా!"    
    "ఇంక పనేం లేదు".    
    "పనుందంటే!"    
    "రాత్రంతా మొద్దునిద్దరపోయి తెల్లారాక ఇప్పుడా!" అంటూ చటుక్కున లేచి నిలబడి "నీళ్ళు కాగిపోతున్నాయ్! నేను స్నానం చెయ్యనా! మీరు చేస్తారా?" అంది.    
    "ఇద్దరం కలిసి చేసేద్దాం."    
    "వాళ్ళతో అప్పాయింట్ మెంట్ ఉందని చెప్పి ఇక్కడే వుండిపోతే ఎలా! పదండి."    
    "వాళ్ళతో అప్పాయింట్ మెంట్ ఉందని చెప్పి ఇక్కడే వుండిపోతే ఎలా! పదండి."    
    "వాళ్ళతో అప్పాయింట్ మెంట్ ఎలా వున్నా ఇది మాత్రం భరించలేనంత డిసప్పాయింట్ మెంట్.... సౌదామినీ ప్లీజ్!"    
    "అయ్యో? చెబితే వినిపించుకోరా!" అంది సౌదామిని అతనికి అందకుండా దూరంగా జరుగుతూ.    
    రెండేళ్ళ వయసున్న బాబు టెన్నిస్ ప్రేక్షకుడిలా గబగబా తల తిప్పుతూ తల్లిదండ్రుల మాటలు వింటున్నాడు. నాన్న అమ్మ భుజం గట్టిగా పట్టుకోవడం, అమ్మ "స్స్...అబ్బా!" అనడం చూసి, నాన్న అమ్మనేదో చేసేస్తూన్నాడని హడలిపోయి చేతిలోని చిన్న క్రికెట్ బ్యాట్ తో బాలూ మోకాలి చిప్ప పగిలేలా కొట్టాడు.    
    ప్రాణం జార్చుకుపోయింది బాలూకి. కిందకు చూశాడు. అడుగున్నర ఎత్తున్న శాల్తీ కనబడింది.    
    "నువ్వా వెధవా" అన్నాడు కోపంగా.    
    "నువ్వే వెతవ! బద్మాష్! రెడీ రాస్కెల్".    
    తిక్క రేగిపోయింది బాలూకి.    
    "మాటకి మాట చెబుతావుట్రా! బాస్టర్డ్ ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు" అన్నాడు.    
    చురుగ్గా అతనివైపు చూసి "ఎవరో నేర్పించడం ఎందుకు? మీ రిట్లాంటి చెడ్డమాటలు మాట్లాడుతుంటే వాడూ నేర్చుకోక ఏం చేస్తాడు" అంది సౌదామిని.    
    ఒక్కసారిగా తగ్గిపోయాడు బాలు. అవును ఎంతమాట అనేశాడు తను. తన స్వంత కొడుకుని బాస్టర్డ్ అన్నాడా! అంటే 'తల్లికీ తండ్రికీ పుట్టనివాడా!' అని తిట్టాడా! తన కొడుకుని.    
    తన నోటి దురుసుతనాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి, పిల్లల ముందు తిట్లు ఉపయోగించకూడదు. తను ఇప్పుడు పైలా పచ్చీసు బ్రహ్మచారి కాడు. బాధ్యతతో ప్రవర్తించవలసిన తండ్రి.    
    దాంతో కొడుకుమీద పట్టలేనంత అభిమానం ముంచుకొచ్చేసి వాణ్ణి ఎత్తేసుకుని "సారీ! నాన్నా! నువ్వు నా బంగారు కొండవి! చెప్పు నీకేం కావాలి" అని అడిగాడు గారాబంగా. "నేనూ మీతో కలిసి స్నానం చేస్తాను" అన్నాడు వాడు మరింత గారాబంగా. బాలూ అదిరిపడి వడిని వదిలేసి, మళ్ళీ మామూలు మూడ్ లోకి వచ్చేశాడు. చకచక డ్రస్ అయిపోయి తనని తీసుకు వెళ్ళడానికి వచ్చిన కంపెనీ కారు దగ్గరికి నడిచాడు.    
    సరిగ్గా కారు కదిలేముందు ఎదురింటిలో నుండి బయటకు వచ్చింది ఆమె.    
    జానకి!    
    పేర్లు గుర్తుంచుకోవడం కష్టమన్పించే తనకు ఆమె పేరు గుర్తుకు రావడం ఆశ్చర్యమనిపించింది బాలూకి.    
    నిర్మలంగా వున్న పెద్ద పెద్ద కళ్ళతో ఒక్కసారి అతనివైపు చూసి యింటి ముందుకొచ్చిన కూరలబండి దగ్గరికి నడిచించామె.   
    మంచి శకునం అనుకున్నాడు బాలు.    
    అప్పుడు పడింది ఒక పెద్ద నీటిచుక్క అతని చేతిమీద.    
    తుడుచుకుని తలెత్తి ఆకాశంవైపు చూశాడు.    
    ఆకాశంలో ఒక మూలనుంచి ఏనుగుల గుంపు పరుగెత్తి వస్తున్నట్లు వేగంగా కమ్ముకుంటున్నాయి దట్టమైన మేఘాలు.    
    ఇంకో చుక్క, అతని కనురెప్పలమీద పడి చెంపమీదకు జారింది.    
    'ఈ అకాల వర్షమేమిటి?' అనుకుంటూ కార్లో కూర్చున్నాడు బాలు. కారు కదిలింది. నిముషం తర్వాత ఏనుగు తొండాలంతటి ధారతో వర్షం పడటం మొదలెట్టింది.    
    క్యాసెట్లు తయారుచేసే కంపెనీ అది. అత్యాధునికంగా ఉంది ఆ ఆఫీసు. ఎటు చూసినా అద్దాలు అల్యూమినియం సెట్టింగ్సూ, గోడలకి తళతళలాడే ఫ్లైవుడ్ పానెలింగూ.    
    స్మార్ట్ గా వున్న సెక్రటరీ ఒకమ్మాయి అతనికి ఎదురొచ్చి, మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికే డైరెక్టుగా తీసుకెళ్ళింది.    
    మేనేజింగ్ డైరెక్టరు డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగిన మనిషిలా కనపడటంలేదు. ఏ ఆఫీస్ బాయ్ గానో చేరి స్వయం కృషివల్లా గడుసుదనంవల్లా పెద్ద పొజిషన్ లోకి వచ్చినవాడిలా వున్నాడు. నోటికి ఆగ్నేయమూలనుంచి మాట్లాడటం లాంటి కొన్ని అమెరికన్ పద్దతులు కష్టపడి అలవాటు చేసుకున్నట్లు అర్ధం అయిపోతూ వుంది. తలమీద కుడివైపు మిగిలివున్న నాలుగు వెంట్రుకలనే పొడుగ్గా పెంచి ఎడమచెవి దాకా దువ్వి, రెల్లు గడ్డితో గుడిసెకు కప్పు వేసినట్లు బట్టతలని కప్పడానికి చేసిన ప్రయత్నం వృధా అవుతోంది.    
    పలుచటి కొయ్యతో చేసిన పెట్టె తెరిచి సన్నగా పెన్సిళ్ళలా ఉన్న హవానా చుట్టలు బాలూకి ఆఫర్ చేశాడు ఆయన. బాలు వద్దన్న తర్వాత బంగారపు సిగరెట్ లైటర్ తో ఒక చుట్ట అంటించుకుని పొగ పీల్చాడు.    
    "మీ గ్రూప్ ప్రోగ్రాం చూశాను నేను."    
    "మీరు అటెండ్ అయ్యారా? ఎప్పుడూ".    
    నవ్వాడు ఆయన. "నేను అటెండ్ అవలేదు. వీడియోలో చూశాను."    
    అర్ధంకానట్లు మొహం పెట్టాడు బాలు "వీడియోలోనా?"    
    "అవును మంచి ప్రోగ్రాములు- అంటే విజయవంతమైన ప్రోగ్రాములన్నింటికి మా టాలెంటు స్కౌట్లు అటెండ్ అయి వీడియో టేప్ చేసి నాకు చూపిస్తూ వుంటారు. మీరు యిద్దరూ బాగా ఫోటోగ్రాఫ్ అవుతారు. మంచి ఫోటోక్టెనిక్ ఫేసెస్ అందుకని నాకూ ఒక ఆలోచన వచ్చింది" ఆగాడు.    
    ఏమిటన్నట్లు చూశాడు బాలు.    
    "మొదట్లో మీ గ్రూప్ పాటలు ఆడియో క్యాసెట్సుగా రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ యిప్పుడు మరో అడుగు ముందుకెళ్ళి, ఆడియో వీడియో క్యాసెట్సు రెండూ రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. మైకేల్ జాక్సన్ "థ్రిల్లర్" లాగా ఏమంటారు?"    
    ఏమంటాడు బాలూ? పెదిమలు తదిచేసుకున్నాడు. "దిస్.....దిసీజ్ ఫాంటాస్టిక్" అనుకున్నాడు.    
    "అంతటితో అయిపోయిందా ఏమిటి? నాకు చాలా ఫారిన్ వీడియో కంపెనీలతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయ్. తోర్న్, ఈ.ఎమ్.ఐ. వార్నర్ హోమ్ వీడియో, రాంక్ వీడియో - సో మెనీ! వాళ్ళలో కొంతమంది యిప్పుడు ఓరియంటల్ - అంటే మన ఇండియన్ సింగర్స్ కోసం వెదుకుతున్నారు. ఆ లక్కీఛాన్స్ మీదే కావచ్చు. నేను తలుచుకుంటే మిమ్మల్ని రాత్రికి రాత్రి వరల్డ్ ఫేమస్ చేసెయ్యగలను."    
    "థాంక్యూ సర్! థాంక్యూ సోమచ్!"    
    "అయితే ఒకటి. అమ్మకాలపై వచ్చే లాభాల్లో మీకు పర్సెంటేజి యిస్తాము కానీ, ముందుగా ఎక్కువ డబ్బు యివ్వం. టోకిన్ గా ఏదో కొంత ముట్టచెబుతాం. సరేనా!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra