Home » Kommuri venugopala rao » న్యాయానికి అటూ-ఇటూ

 

     "సారీ సర్! నో గోయింగ్ బాక్."
   
    "అదేనా నీ నిర్ణయం?"
   
    ప్రదీప్ మౌనంగా వుండిపోయాడు.
   
    "ఆల్ రైట్! వాళ్ళ తరపున డిఫెన్స్ లాయరుగా నేను పనిచేస్తున్నాను. దిస్ యీజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్."
   
    ఫోన్ డిస్ కనెక్టయింది.
   
                                   13
   
    హైదరాబాదులోనే మరో ప్రైవేటు నర్సింగ్ హోంలో రాధకు ఆపరేషన్ జరగటానికి ఏర్పాటయింది.
   
    రాధ చాలా తెలివైన పిల్ల జరగబోయేది ఆమెకర్ధమయింది.
   
    "వద్దు నాకీ ఆపరేషన్ వద్దు. నేను చేయించుకోను. నాకీ లోకాన్ని చూడాలని వుంది. మీ అందర్నీ చూడాలని వుంది. మీ అందరితోబాటూ, మీతో కలిసి, మీ చేయీ చేయీ పట్టుకుని ఆడుతూ, పాడుతూ తిరగాలని వుంది. ప్లీజ్! నా బతుకుని చీకటిమాయం చేసెయ్యకండి. నన్ను చూడనివ్వండి. నన్ను వెలుగుని చూడనివ్వండి" అని గుండెలు పగిలేలా విలపించింది.
   
    ఆమెకు నచ్చచెప్పటమూ, ఓదార్చటమూ ఎవరి తరమూ కాకపోయింది.
   
    ప్రదీప్ ఓ రోజల్లా పనిమానుకుని ఆమెకు నచ్చచెబుతూ అక్కడే వుండిపోయాడు. ప్రొద్దుటినుంచీ తిండీ తిప్పలూకూడా లేవు. చీకటి పడేదాకా అక్కడే వుండి, విశ్వప్రయత్నం మీద రాధను వప్పించి, నెమ్మదిగా కదిలాడు.
   
    కారుదగ్గరకు వస్తుంటే వెనుకనుండి "అంకుల్!" అని వినిపించింది.
   
    ఆగి తలత్రిప్పి చూసేసరికి సన్నజాజి పందిరిక్రింద నిలబడి వున్న అరుణ కనబడింది. దూరంగా వెలుగుతున్న లైటువల్ల ఆమెముఖంమీదకు కొద్దిగా కాంతి ప్రసరిస్తుంది.
   
    ప్రదీప్ వెనక్కి తిరిగివెళ్ళాడు. "ఏమిటి అరుణా!" అన్నాడు.
   
    "మాకోసం మీరు చాలా శ్రమ పడుతున్నారు" అంది. ఆమెగొంతు కొంచెం వణికినట్లయింది.
   
    "మీకోసం కాదు. న్యాయంకోసం."
   
    "ప్రొద్దుటినించీ ఏమీ తినలేదుకూడా!"
   
    "ఫర్వాలేదు ఇంటికి వెళుతున్నాగా!"
   
    "ఇంట్లోమాత్రం మీకు.... మీతో పోల్చుకుంటే అడక్కూడదుగానీ..... ఏవీ వుండదనుకోండి. మా యింట్లో భోజనం చేసి వెళ్ళకూడదా?"
   
    ఆ ఆప్యాయతకు చలించి ముఖంలోకి చూశాడు. తడిసిన కళ్ళు అప్రయత్నంగా ఆమె తలమీద చెయ్యివేసి నిమిరాడు.
   
    "ఇప్పుడు కాదు ఎప్పటికైనా పరిస్థితి చక్కబడితే...."
   
    ప్రక్కన చెట్టుచాటున ఏదో కదిలినట్లయింది.
   
    తలత్రిప్పి చూసేసరికి ఓ యువకుడు చెట్టుచాటునుంచి బయటకు వస్తూ కనిపించదు. బాగా దగ్గరకు వచ్చాక గుర్తుపట్టాడు. అంకుశం ఎడిటర్ పరాంకుశం అసిస్టెంట్ రామలింగం.
   
    "నమస్కారం సార్! మీరేదో ప్రైవేటు విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు" అన్నాడు రామలింగం.
   
    ప్రదీప్ కి చురుక్కుమంది. "ప్రైవేటు విషయాలా! ఇక్కడ పబ్లిగ్గా ఎందుకు మాట్లాడతామనుకున్నారు?" అన్నాడు వాడిగా.
   
    "కోప్పడకండి సార్! అసలు బహిరంగ ప్రదేశాల్లోనే ప్రైవేటు వ్యవహారాలు జరుగుతూ వుంటాయి. అవునుగాని పాపకు ఆపరేషన్ జరిగిందా? ఆపరేషన్ జరిగాక ఎలా వుంది? పాపతో ఇంటర్వ్యూ చెయ్యాలి" అన్నాడు రామలింగం ప్రక్కవారి ఫీలింగ్స్ తో తనకేమీ పనిలేనట్టు.
   
    "ఆపరేషన్ జరగలేదు, జరుగుతుంది."
   
    "అయితే పాపను ఇంటర్వ్యూ చెయ్యాలి. ఆ పసికందు మనసులో ఏముంది? ఆ చిన్నారి మనోభావాలెలా వున్నాయి? ఇవన్నీ వివరంగా కావాలి."
   
    "ఇప్పుడేమీ ఇంటర్వ్యూలు వద్దు. పాప చాలా షాక్ లో వుంది. ఎలాంటి సంఘర్షణలూ తట్టుకునేస్థితిలో లేదు. ఆమెను కదిలించవద్దు."
   
    "ఎక్కువ ప్రశ్నలడగను సార్! ఒకటి... రెండు"
   
    "వీల్లేదు" అన్నాడు ప్రదీప్ కటువుగా.
   
    "సరే సార్! మీరంతగా చెబుతున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాను. కాని పొరపాటున కూడా ఆ త్రిశూలంగాడికి ఇంటర్వ్యూ అవకాశమిప్పించకండి. మా ఎడిటర్ నన్ను చంపేస్తాడు" అన్నాడు రామలింగం.
   
    ప్రదీప్ ఏమీ మాట్లాడలేదు.
   
    "వస్తాను సార్! పాపం మీరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటుంటే వచ్చి..."
   
    "షటప్" అని అరుద్డామనుకున్నాడు ప్రదీప్ ఆగ్రహంగా కాని అతికష్టంమీద తమాయించుకుని ఊరుకున్నాడు.
   
    "ఇతరుల మనోభావాలు, వాళ్ళ మనసులు బాధపడటం పట్టించుకోని స్కూల్ ఆఫ్ థాట్ కు చెందిన రామలింగం నిశ్చింతగా అక్కడ్నుంచి వెళ్ళి పోయాడు. అతనికి చింత అంటూ ఏమైనా వుంటే- అది బాస్ తిడతాడన్న భయం ఒక్కటే."
   
                               * * *
   
    రాధకు ఆపరేషన్ జరిగింది. ఆమె రెండో కనుగుడ్డు కూడా పీకివెయ్యబడింది.
   
    ఇంటికి తీసుకొచ్చేశారు.
   
    ఓరోజు సాయంత్రం రాధ బయటి గదిలో మంచంమీద పడుకుని వుంది. రెండుకళ్ళకీ బాండేజెస్ వున్నాయి.
   
    హనుమంతరావు యింట్లో లేడు. బహుశా ప్రదీప్ యింటికి వెళ్ళివుంటాడు. అతని వంటరితనాన్ని చెడగొట్టి తనకు "కాలక్షేపం" కలిగేటందుకు అరుణ వంటింట్లో పనిలో వుంది. సునీత గుడికి వెళ్ళింది.
   
    రాధ గుండెల్లో సముద్రాలు పొంగుతున్నాయి. సముద్ర కెరటం అంచును తాకి తడిచేసినట్లు, గుండెల్లోంచి పొంగిన సముద్రం కంటిని తాకి తడి చెయ్యటానికి ప్రయత్నిస్తూ విఫలమై, చెమ్మగిల్లటానికి చోటులేనట్లు నిస్పృహగా వెనక్కి తిరుగుతున్నాయి.
   
    'ఓ నిర్భాగ్యురాలయిన పసిపాపా! నీ నేత్రాలలో నీరు చిగురించే అదృష్టం నీకు లేదు. నీ లేతగుండెలో ఎన్ని అగ్నిపర్వతాలైనా బ్రద్దలవనీ, సముద్రాలు పొంగనీ- నీ బాధను, దుఃఖాన్నీ అశ్రువులుగా మార్చుకునే హక్కు నీకు లేదు. నీ గుండెకూ, మనసుకూ, కంటికీ వుండే ద్వారాలన్నీ, దారులన్నీ నిర్ధాక్షిణ్యంగా మూసుకుపోయాయి. నీ బాధ, దుఃఖం బయటపడడానికి చోటులేక గిలగిల కొట్టుకోనీగాక బయటపడే మార్గంలేక అక్కడే కుమలనీ, రగలనీ, మరగనీ.'
   
    రాధ గుండెలు పగిలేలా ఏడ్చింది. హృదయవిదారకంగా ఏడ్చింది. ఒక్క కన్నీటిచుక్క బయటకు రాలకుండా ఏడ్చింది.
   
    ప్రక్కమీదినుంచి మెల్లగా లేచింది. తడుముకుంటూ తడుముకుంటూ గుమ్మందాకా వచ్చింది. బయటకు దిగటానికి మూడు మెట్లున్నాయి. మొదటి మెట్టుమీద కాలువేసి తూలి కిందపడబోయింది. చప్పున గుమ్మాన్ని పట్టుకుని పడిపోకుండా నిలద్రొక్కుకుంది. మెల్లగా ఒక్కొక్క మెట్టూ క్రిందకు దిగింది.
   
    అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంది.
   
    టైమెంతయిందో తెలీదు. రాత్రికి పగలుకూ తేడా తెలీదు. తాను ఎక్కడ నిలబడివున్నదో తెలీదు. ఇక్కడే....యిక్కడే ఓ సన్నజాజి మొక్కవుండాలి. ఆ ప్రక్కన ఓ ముద్దామందారం మొక్క.
   
    పువ్వులు ఎలా వున్నాయో!
   
    కొన్నాళ్ళకు ఎలా వుంటాయో కూడా మరిచిపోతుంది.
   
    రాధ ఏడుస్తుంది. కన్నీటిచుక్క బయటకు రాలకుండా ఏడుస్తుంది.
   
    క్రమంగా రోడ్డుమీదకొచ్చి ఒక్కొక్క అడుగూ తడుముకుంటూ, తడుముకుంటూ ముందుకు కదుల్తుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra