Home » Dr. dasaradhi rangacharya » చిల్లర దేవుళ్ళు

    భృంగి, నటేశ, సమీరజ, ఘటజ, మతంగ
    నారదాదు లుపాసించే ||సం||
    న్యాయాన్యాయము తెలుసును
    జగములు మాయామయమని తెలుసును.
    దుర్గుణ కాయజాది షడ్రిపుల
    జయించే కార్యము తెలుసును
    త్యాగరాజ నుత ||సం||
    హృదయ పాత్రలు మెలమెల్లగా అమృతంతో నిండాయి. పాత ముగించేసరికల్లా అడుగు ఊడి అమృతం సాంతం కారిపోయింది.
    "ఓహో! శానబాగా పాడినవయ్యా పంతులూ" అన్నారు. పూర్తి ఆనందాన్ని వ్యక్తీకరించడానికి పదాలకై తడుముతున్నారు. దొరకలేదు.
    కలగాంచి మేల్కొన్నట్లయింది, పక్క గదిలో కూచుని వింటున్న మంజరి స్థితి.
    "వనజా! ఇంకొక పాట పాడ్తే..." అంటూండగానే-
    "ఇంకొక్క పాట" అన్నారు రెడ్డిగారు.
    మంజరి ప్రాణం లేచివచ్చింది.
    కండువాతో ముఖం తుడుచుకొని మళ్ళీ వీణ మీటాడు. "గ్o గ్o గ్o" హృదయాలు ముత్యపు చిప్పల్లా విచ్చుకున్నాయి.
    మరి మరి నిన్నే మొరలిడ
        నీ మనసున దయరాదు రామా            ||మరి||
    కారి మొన విని సరగున జన నీకు
        కారణ మేమి సర్వాంతర్యామి                ||మరి||
    కరుణతో ధృవునకు ఎదుట నిల్చిన
        కథ నే విన్ననయ్యా                        ||రామా||
    సురరిపు తనయునకూ నర మృగమౌ
        సూచన లేమయ్యా                         ||రామా||
    మరిచియున్న వనచరుని బ్రోచిన
        నీ మహిమ తెలుపవయ్యా                   ||రామా||
    ధరను వెలయు త్యాగరాజ సన్నుత
        తరముగాదు ఇకనే వినవయ్యా              ||రామా||
    హృదయ విహంగాలు రెక్కలు విప్పుకొని అంబర వీధిలో విహరించి, విహరించి మళ్ళీ ఎదలో జేరాయి.
    రెడ్డిగారి కళ్ళు చెమ్మగిల్లాయి.
    మంజరి ఆనందబాష్పాలు రాల్చింది.
    వనజ పొంగిపోయింది.
    "ఎంత బాగా పాడినవయ్యా!" అన్నాడు రెడ్డిగారు ఆనందపారవశ్యంతో. కలదనుకున్నారు?" అన్నాడు.
    "రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శద్దా
    స్పర్యుత్పుకోభవతి మత్సుఖినోపి జంతుః
    తచ్చేతసా స్మరతి నూన మబోధ పూర్వం భావస్థితాణి జననాన్తర సైహృదాణి" అన్నాడు కాళిదాసు."
    "అంటే?"
    "రమ్యమైన వస్తువుల్ని చూచినప్పుడూ, మధురమైన శబ్దాన్ని విన్నప్పుడూ, సుఖంగా వున్న ఆత్మకూడా గంతులు వేస్తుంది. అతనికి తెలియకుండానే పూర్వజన్మల బాంధవ్యాలూ అనుబంధాలూ స్మరణకు వస్తాయి."
    ఒహో! ఎంత బాగా చెప్పిండయ్య కవి. నిజంగా ఇది నా పూర్వజన్మ పుణ్యమే" అన్నారు రెడ్డిగారు.
    "ఇది ఏదో పూర్వజన్మ బంధమే" అనుకుంది మంజరి.
    కాకుంటే తానింత ముగ్దురా లౌతుందా?
    "సీతారాముల పునస్సమాగమం సహితం సంగీతంవల్లనే కదండీ అయింది. లవకుశులు తంబురాలు పట్టుకొని శ్రుతిపెట్టుకొని లయ తప్పకుండా "తపస్స్వాధ్యాయ నిరంతరం.." నుండి రామాయణం మొత్తం గానం చేస్తుంటే రామునికి చిత్రపటాల్లా కథంతా కనిపించింది."
    "ఎంత తియ్యగా పాడిన్రో?"
    "తాన్ సేన్ అనే మహాగాయకుడు తన పాటతో చెట్లు చిగురింపచేశాడు. దీపాలు వెలిగింపజేశాడు. దీక్షితులవారు అమృతానందవర్షిణీ రాగం పాడి వర్షం కురిపించారు. త్యాగరాజులవారు ఒకసారి రాతిని కరిగించారు. చనిపోయిన ఒకనికి ప్రాణం పోశారు సంగీతంతో."
    "ఎట్లేట్లా?"
    "ఒక బ్రాహ్మడు తన కుటుంబంతో కలిసి బ్రాహ్మణ పల్లెకు వెళ్ళాడు. ఏ బ్రాహ్మణుడూ ఆశ్రయం ఇవ్వలేదతనికి. రాత్రి అయింది. వర్షం ప్రారంభం అయింది. దేవాలయంలో తలదాచుకుందామని వెళ్ళారు. సింహద్వారపు తలుపు లోపలినుంచి గడియవేసి ఉంది. భార్యా బిడ్డల్ని గుమ్మం ముందు కూచుండ పెట్టి గోడ ఎక్కి లోపలికి దూకాడు గడియతీయడానికి. చీకట్లో కనిపించలేదు. కోనేట్లోపడి చనిపోయాడు. బ్రాహ్మణ స్త్రీ దేవాలయం ముందు కూచుని ఆర్తనాదాలు చేస్తూంది. తిరుపతినుంచి శిష్యసమేతంగా తిరిగివస్తున్న త్యాగరాజస్వామి అక్కడికి వెళ్ళి కథ తెలుసుకున్నారు. వెంటనే తంబూరా అందుకొని "నా జీవధారా!" అనే కృతి పాడారు. బ్రాహ్మడు సజీవుడై లేచి వచ్చాడు."
    "అబ్బా! ఎంత ప్రభావం! ఎంత ప్రభావం! ఆ పాట నీకొస్తదా?"
    "వస్తుంది, కానీ ఇప్పుడు పాడలేను, మరికసారి వినిపిస్తా క్షమించండి."
    "సరేగాని, ఇంత చదువెప్పుడు నేర్చినవయ్యా?"
    "ఏదో మీ దయ."
    "ఆ మరచిన. మంజరి వీణ నేరుస్తనని చంపుక తింటున్నది. ఎప్పుడు శురు (ఆరంభం) చేస్తవు?"
    "మీ రెప్పుడంటే అప్పుడు."
    "జర బాపనాయంతో మంచిరోజు చూపించి ..ఇగో - వీణె చెప్పు. ఫిడేలొద్దు."
    మంజరి గుండె ఎగిరి గంతేసింది.
    "దసర నుంచి శురు చెయ్యరాదు?"
    'చిత్తం.'
    'దసరా ఎప్పుడే?' అడిగింది మంజరి.
    'అయిదేండ్లు' అన్నది వనజ.
    'అదేందే?' మూతి ముడిచింది మంజరి.
    'అయిదు దినాలు'
    "అట్లను. వనజ మంచిది" అని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది మంజరి.
                                                                          x    x    x
    పడుకునారు కానీ నిద్రరాలేదు రామారెడ్డిగారికి. వీణ ఎంత మధురంగా మ్రోగింది? ఇంకా రింగుమంటూనే వుంది తన చెవుల్లో. మంజరి అలా మీటగలదా! మళ్ళీ పూర్వపు ప్రశ్నే అతని ముందు ప్రత్యక్షమయింది. మంజరిమాట తీసివేయలేక సంగీతం ప్రారంభించమనైతే అన్నారు కాని, సారంగపాణి ముందు మంజరి కూచుని వీణ నేర్చుకుంటున్నట్లుగా కల్పించుకున్న ఊహాచిత్రం చూచి భరించలేక పోయారు. పాణి అలాంటివాడా? తిన్న ఇంటి వాసాలు లెక్క పెడ్తాడా? అంత వినయమూ అంత అణుకువా గలవాడు మోసం చేస్తాడా? చేయలేకపోవచ్చు. మంజరి నిండు వయసులో ఉంది. ఆమె మనసు చలించకూడదూ? ఛ, ఏమిటా ఆలోచన? మంజరి ఎక్కడ? పాణి ఎక్కడ? తన అంతస్తెక్కడ? మంజరి అంత నీచానికి దిగుతుందా! .... మంజరి....తన కూతురు! పాణి? పాణి అంత నీచానికి దిగుతాడా? అసలు ఎంత ధైర్యం చేయగలడా? హు చేస్తాడా? చేయలేడు. చేస్తే మాదార్సాబు......అలా జరగడానికి వీల్లేదు. జరగదు.
    అయినా, జాగ్రత్తపడాలనుకున్నారు. జాగ్రత్తపడాలి. ఏం చేయాలి? ఏంచేయాలి?? ఒకే ప్రశ్న అనేక అమ్ముల రూపం దాల్చి ఆయన మెదడును చీల్చసాగింది.
    ఆలోచన..... ఆలోచన.....ఆలోచన........
    చుట్ట ముట్టించారు, పారేశారు.
    ఎన్ని? ఏమో?
    మరచిపోయి నిద్ర పోదామనుకున్నారు. ఉహు - నిద్రరాందే?
    అమాంతంగా ఒక దృశ్యం గుర్తుకు వచ్చింది.
    వనజ, పాణి జంటగా తోటలోంచి వస్తున్నారు.
    అమాంతంగా ఒక ఆలోచన స్పురించింది.
    వనజ అందమైంది. చురుకైంది. తన రక్తం గదా! మంచిపిల్ల. దాన్ని ఆడబాపగా చేసి తప్పుచేశాననుకున్నారు. ఎంతకాలమని అలా ఉంటుంది పాపం అది! పాణికిచ్చి పెండ్లిచేస్తే సరి. పాణికి వనజంటే ప్రేమ ఎలాగూ ఉంది. పెళ్ళయ్యేదాకా సంగీతం పాఠం ఆగుతుందా? ఎందుకూ? పెళ్ళి చేస్తాననే విషయం వనజకు చెప్పెయ్యాలి. పాఠం చెప్పుకొనేప్పుడు మంజరితోపాటు వనజనుకూడా ఉండమనాలి.
    ఆడది భర్త అనురాగం పంచి యివ్వడానికి ఎన్నటికీ అంగీకరించదు.
    మంచి ఆలోచన వచ్చిందనుకున్నారు.
    తన చాకచక్యానికి తానే ఆశ్చర్యపోయారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra