Home » Mainanpati bhaskar » Claimax

మరు నిమిషంలో తన ఇంపోర్టెడ్ కారులో కూర్చున్నాడు హరీన్.
అలా జరిగింది తన సినీ రంగ ప్రవేశం.
ఇప్పుడు ఉహతీతంగా పెద్ద హీరో అయిపోయాడుతను. హరీన్ స్థానంలో తను వున్నాడు ఇప్పుడు.
ఈ పరితితులలో హరీన్ మళ్ళీ తిరిగి వస్తే?
బహుశా తనని ఈ పిక్చర్ లో నుంచి తొలగించేస్తారు. తనతో షూట్ చేసిన ఈ రెండు రీళ్ళు తగలబెట్టేస్తాడు రఘుపతి. హరీన్ తో మళ్ళీ కొత్త షెడ్యుల్ పెట్టుకుని, కొత్తగా షూటింగ్ మొదలెడతాడు.
హరీన్ కి బదులుగా తనని బుక్ చేసుకున్న నిర్మాతలంతా అడ్వాన్సులు వాపస్ ఇవ్వమని తన వెంట బడతారు. అది కుదరకపోతే ఆ అడ్వాన్సులు వదులుకొనయినాసరే , హరీన్ తోనే తమ తమ కొత్త పిక్చర్లు మొదలెడతారు.
అప్పుడు తన స్థితి ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ తనని హీరోగా బుక్ చెయ్యడానికి ముందుకురారు. వచ్చినా ఒకటో ఆరో - చిన్న ప్రోడ్యుసర్లు వస్తారు.
రఘుపతి లాంటి పెద్ద ప్రోడ్యుసర్స్ మాత్రం నిశ్చయంగా తనవైపు కన్నెత్తి చూడరు.
అలా కాకుండా
ఒకవేళ-
హరీన్ తిరిగి  రాకుండా శాశ్వతంగా ఇక్కడే వుండిపోతే?
తన దురాలోచానకి తనకే ఒళ్ళు జలదరించినట్లయింది కిశోర్ కి.
ఏం ఆలోచిస్తున్నాడు తను? తనని ఆర్టిస్టుగా నిలబెట్టిన హరీన్ కే ద్రోహం చేయాలనా? ఎంత పెద్ద తప్పు!
కానీ ఆ వివేకం ఎక్కువసేపు నిలవలేదు కిశోర్ మనసులో. మానవత్వాన్ని స్వార్ధం మట్టికరిపించింది.
అదే అదేసమయంలో .........
హరీన్ కి కొండ అంచు మీద వున్న కిశోర్ , మధుమతీ కనబడ్డారు. అతని మోహంలో అనందం వెల్లివిరిసింది.
"కరుణా పైన వున్నది మనవాళ్ళే. మన యూనిట్ మెంబర్స్. ఇంక భయం లేదు కరుణా.......మనం బతికి బయటపడ్డాం" అన్నాడు ఉద్వేగంగా.
ఆ ప్రయత్నంగా అతని చేతిని పట్టుకుంది కరుణ. "మనం పైకి వెళ్ళేదాకా వాళ్ళు అక్కడే వుంటారంటారా?" అంది బేలగా.
"వాళ్ళు ఈపాటికి మానని చూసే వుంటారు. ఒకవేళ చూడకపోయినా , మన పిలుపు వాళ్ళకి తప్పకుండా వినబడుతుంది" అంటూ పెద్దగా ఎలుగెత్తి పిలిచాడు హరీన్. "కిశోర్! కిశోర్! మధుమతీ!"
సరిగ్గా అదే సమయంలో - మంత్రాల మల్లయ్య సైగను అందుకుని కొమ్ము బూరాలను వుదడం మొదలెట్టారు ఆటవికులు.
హరీన్ గొంతు ఆ శబ్దాలలో కలిసిపోయింది.
కొండపైన -
ఉపకారికి అపకారమే చెయ్యడానికి నిశ్చయించుకున్న కిశోర్ వెనుతిరిగి సగం స్పృహ కోల్పోయిన మధుమతిని నడిపించుకుంటూ యూనిట్ ని సమీపించాడు.
ఆ కొమ్ము బూరాల నాదం యూనిట్ మెంబర్స్ అందరికి కూడా వినబడింది. వాళ్ళందరూ స్థాణువులలాగ నిలబడిపోయి, కిశోర్ వైపు ప్రశ్నార్ధకంగా చూశారు.
"అడవి మనుషులు!" అన్నాడు కిశోర్ త్వరత్వరగా  'ఆటవికులు . బహుశా నరమాంస భక్షకులు కూడా అయి వుంటారు. మనం ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోవడం మంచిది!"
అందరూ భయంభయంగా తమ పరిసరాలని పరికించారు - అక్కడ ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా కంకాళాలు- అస్థికలు.
కిశోర్ చెబుతోంది కరెక్టే అనిపించింది వాళ్ళకి.
మరునిమిషంలో అందరూ ప్రాణభయంతో హెలికాప్టర్ వైపు పరిగెత్తడం మొదలెట్టారు.
హరీన్ కరుణచెయ్యి పట్టుకుని "కరుణా - వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నంలో వున్నారు పరుగెత్తు!' అన్నాడు.
పరుగెత్తడం మొదలెట్టారు ఇద్దరూ.
హరీన్, కరుణా పరిగెత్తిపోవడం చూసిన ఆటవికులు వారిని వెన్నాడుతూ తాము కూడా పరిగెత్తారు.
అంతమంది వడివడిగా పరిగెత్తి వస్తున్న శబ్దం, ఆ పరుగువల్ల ఉత్పన్నమయి వువ్వెత్తున లేచిన ధూళి మేఘం , కొమ్ము బూరానాదం యూనిట్ సభ్యులకి ముచ్చెమటలు పట్టేలా చేశాయి. అందరూ హెలికాప్టర్ లో ఎక్కారని నిశ్చయించుకోగానే ఇంక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇంజిన్ స్టార్ట్ చేశాడు పైలెట్ టోనీ. రెండో హెలికాప్టర్ కూడా రెడీగా నిలబడివుంది.
హరీన్, కరుణా కొండకొమ్ము మీద కాలు మోపేసరికి, రెండు హెలికాప్టర్లు కూడా గాల్లోకి లేచేశాయి. ఆకాశంలో రెండు రౌండ్లు కొట్టి, తర్వాత అదృశ్యమయిపోయాయి అవి.
అది చూడగానే హతాశురాలైపోయింది కరుణ.
కానీ హరీన్ మాత్రం స్థితప్రజ్నుడిలా అలాగే స్థిరంగా చూస్తూ నిలబడిపోయాడు.
మరికొద్దిసేపటి తర్వాత ముసలమ్మ శవాన్ని ఒక ఎత్తుగా వున్న ప్రదేశం మీద పెట్టి నిశ్శబ్ద నృత్యం చెయ్యడం మొదలెట్టారు ఆటవికులు.
మరోవైపు చిక్ లీ, మిగతా ఆడంగులు కొందరూ కలిసి చితుకులతో మంతచేసి వంటప్రయత్నం మొదలెట్టారు.
ఆ అడవులలో ముంగిసలాంటి ఒక జంతువు వుంటుంది. గజం పొడుగుతోక వుంటుంది దానికి. లావాటి ఆ తోకనిండా కొవ్వే. ఆ తోకలమీద వున్న బొచ్చుని తీసేసి, వాటిని పోట్లకాయల్లాగా ఇళ్ళ చూరులకి వేలాడదీస్తారు ఆటవికులు. అవసరమొచ్చినప్పుడు వాటిలో నుంచి ఒక ముక్కను కోసి, బాణలిలో వేస్తె ఆ కొవ్వు కరిగి, నూనెగా మారుతుంది.
తను తెచ్చిన ఆ జంతువుతోక ఒకదానిని అపళంగానే బాణట్లో వేసింది చిక్ లీ. అది నూనెగా మారి మరగడం మొదలెట్టగానే ఇంకేవేవో దినుసులు వేసి కలిపింది.
ఘాటు వాసనా అలుముకుంది ఆ ప్రాంతంలో అంతా.
ఒక గంట గడిచాక వడ్డన మొదలయింది.
అరటి ఆకులో ఎర్రటి అన్నం తెచ్చి హరీన్ ముందు వుంచింది చిక్ లీ.
"తిను!" అంది సాధికారికంగా.
అయిష్టంగా చూశాడు హరీన్.
"తిను!" అంది చిక్ లీ గద్దిస్తూ.
నెమ్మదిగా అన్నం ముద్దని నోటి దగ్గరికి పోనిచ్చాడు హరీన్. అదోరకమైన వాసన వేస్తోంది ఆ అన్నం.
"త్వరగా!" అంది చిక్ లీ.
అన్నం నోట్లో పెట్టుకున్నాడు హరీన్. అది మింగిన వెంటనే అతని ముఖకవళికలు మారిపోయాయి. త్వరత్వరగా మరి నాలుగు ముద్దలు తినేసి, నవ్వుతూ లేచి నిలుచున్నాడు. చిక్ లీ చెయ్యి అందుకున్నాడు - "దా చిక్ లీ!" అన్నాడు ఎంతో అనురాగాన్ని పలికిస్తూ.
చిక్ లీ మోహంలో అనందం వెల్లివిరిసింది.
ఇది కలా నిజమా అని కాసేపు ఆశ్చర్యపోయి చెయ్యి అందించింది హరీన్ కి.
చెట్టపట్టాలు వేసుకుని, నృత్యం చెయ్యడం మొదలెట్టారు చిక్ లీ, హరీన్ ఇద్దరూ.
తన కళ్ళను తనే నమ్మలేకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ వుంది పోయింది కరుణ.
            
                                                             21

నాయకుడి తల్లి భౌతికకాయాన్ని కొండకొమ్ముమీద వుంచి అందరూ కిందికి వచ్చేసిన తర్వాత చూస్తూ వుండగానే ముప్పయిరోజులు గడిచిపోయాయి.
అన్నిరోజులపాటు ఒక గుడిసెలో దాదాపు బందీగా వుండి పోయింది కరుణ. ఆమెకి అంతా అయోమయంగా వుంది. ఆరోజున అసలు ఏం జరిగిందో, హరీన్ వున్నట్లుండి ఎందుకలా మారిపోయాడో ఆమె కెమీ అంతుబట్టలేదు. ఎవరో అతనిమీద మత్తు మందు జల్లినట్లు హటాత్తుగా ఎందుకలా మారిపోయాడు హరీన్?
అప్పటిదాకా దిగాలుపడి కూర్చుని వున్న కరుణ చటుక్కున ఏదో స్పురించినట్లు నిటారుగా కూర్చుంది.
జరిగిందేమిటో ఇప్పుడు అర్ధమయింది ఆమెకి. మత్తుమందు!
ఆ రోజున అతనికి అన్నంలో మత్తుమందు కలిపిపెట్టి వుంటుంది చిక్ లీ. అందుకే ఆమె చుట్టూ తిరిగితిన్నాడు హరీన్. ఆ అడవిజాతుల వాళ్ళకి వశీకరణం మందులు చాలా తెలుసనీ విన్నది తను.
అవును ......అందులో అణుమాత్రం కూడా అనుమానం లేదు. నిశ్చయంగా హరీన్ కి ఏ మందో మాకో తినిపించి వుంటుంది చిక్ లీ.
ఆమెకి కలిగిన ఆ అభిప్రాయాన్ని మరింత దృడతరం చేస్తూ ఆ గుడిసె దాటగానే హరీన్, చిక్ లీ సరాగాలు వినబడ్డాయి.
"ఇదిగో పిల్లా.....నువ్వు ఆ దేశింగ్ తో ఎక్కువగా మాట్లాడకు! నాకు అసూయగా వుంటుంది!" అంటున్నాడు హరీన్.
అది వినగానే సంతోషం ఆపుకోలేకపోయింది చిక్ లీ. "నీకు అసూయా! నిజంగానేనా జింబురూ! నా చెవులని నేనే నమ్మలేకపోతున్నాను."
"అవును చిక్ లీ! నీ హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తిని నేనే! నువ్వు పరపురుషుడి వైపు కన్నెత్తి చూసినా, పన్నెత్తి పలికినా కూడా నాకు ఒళ్ళంతా తేళ్ళూ జేర్రులూ పాకినట్లుంటుంది. వాడిని నిలువునా చీరెయ్యాలనిపిస్తుంది" అన్నాడు హరీన్.
"హొయ్ హొయ్ హొయ్! ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడే అసూయా కూడా వుంటుంది. నా జింబురూ ........ఇంత ప్రేమని ఇన్నాళ్ళ నుంచి ఎక్కడ దాచేశావ్?"
"ఇక్కడ!" అన్నాడు హరీన్.
గుడిసెలో వున్న కరుణకి వాళ్ళ గొంతులు వినబడుతున్నాయి గానీ, రూపాలు కనబడటం లేదు. అందుకని ఒక్క ఉదుటున లేచి నిలబడి, అక్కడ వున్న ఒక కంతలో నుంచి తొంగి చూసింది.
చిక్ లీ చేతిని తన హృదయానికి హత్తుకున్నాడు హరీన్.
ఆ దృశ్యం చూడగానే , తన గుండెలో ఒక రెప్పపాటు రెపరెపలాడిన భావమేమిటో తనకే అర్ధం కాలేదు కరుణకి.
అది ఈర్ష్యా? అసూయా?
తనకెందుకు ఈ ఈర్ష్యాసూయలు?
అసలు హరీన్ తనకేమవుతాడని? అతనెక్కడ? తనెక్కడ? అతనొక పెద్ద సినిమా హీరో! తనొక దిక్కులేని దీనురాలు! కానీ -
ఇప్పుడింక ఆ తరతమ్యాలకు అర్ధమేముంది? ఇద్దరూ కలిసి ఈ కష్టాల లోయలోపడ్డారు. ఈ లోయలో నుంచి తాము బయటపడే చివరి అవకాశం కూడా తమ కళ్ళముందే ఎగిరిపోయింది.
అందుచేత ఈ పరిస్థితుల్లో హరీన్ చిక్ లీని చేసుకోవడమే మేలేమో! కనీసం వాళ్ళిద్దరన్నా సుఖంగా వుంటారు.
కానీ, ఎంత సమాధానపరచుకుందామన్నా సమాధానపడలేదు కరుణ మనసు - చిక్ లీ అన్న మాటలే పదేపదే గుర్తు వస్తున్నాయి ఆమెకి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra