Home » Mainanpati bhaskar » Bhama Kalapam

 

    ఆ దయాకర్ కి భారతిని ఇచ్చి పెళ్ళి చేద్దామని చూస్తున్నాడు భరత్.

 

    ఏం చెయ్యాలి తను! ఏం చెయ్యగలదు?

 

    ఈ పెళ్ళిని అపగలనా?

 

    హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చింది సుదీర. "వెళదాం పదండి." అంది భరత్ తో.

 

    అతను లుంగీలా కట్టుకున్న చీర వదిలేసి కొద్దిగా, ఆరిన తన బట్టలు తగిలించుకున్నాడు.

 

    ఇద్దరూ రోడ్డుమీదికి వచ్చారు.

 

    హైరోడ్డు మీద లారీలు వేగంగా వెళుతూన్నాయి. హైదరాబాదు వైపు వెళుతున్న ఒక లారీని చూసి పిడికిలి మూసి, బొటనవేలు ఎత్తి ఉంచి, లిప్టు కావాలని సైగ చేసింది సుదీర.

 

    లారి ఆగింది. ఎక్కారు.

 

    "ఎంత త్వరగా సిటి చేరిస్తే అంత డబ్బు ఇస్తాను" అంది సుదీర డ్రైవరుతో.

 

    లారీ డ్రైవరు ఒకసారి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూసి, యాక్సిలేటర్ పూర్తిగా తొక్కేశాడు.

 

    దెయ్యం పట్టిన దానిలా అటూ ఇటూ ఒరిగిపోతూ ఉరుకుతోంది లారీ.

 

    ఆ లారీ మీద రెండు లారీల ఎత్తున సామాను పేర్చి ఉన్నాయి. వాటిమీద టార్బాలిన్ కప్పి, తాళ్ళతో కట్టారు. మలుపు తిరిగి నప్పుడల్లా ప్రమాదకరమైన కోణంలోకి ఒరిగిపోతోంది లారీ.

 

    "ఇంకా స్పీడు" అంది సుదీర.

 

    స్పీడు ఇంకా పెంచాడు డ్రైవరు. లారిలోని ప్రతి భాగమూ విడివిడిగా శబ్దం చెయ్యడం వినబడుతోంది. వెనకనుండే చెక్క గొలుసులు కర్ణకఠోరంగా ఒరుసుకుంటున్నాయి.

 

    "లాభం లేదు. నువ్వు జరుగు. నేను డ్రైవ్ చేస్తాను. అంది సుదీర.

 

    అవమానం ఫీలయ్యాడు డ్రైవరు. పక్కన ఆడపిల్ల ఉందనే స్పృహ కూడా లేకుండా ఒక బూతుపదం ఉచ్చరించి, మరింత స్పీడు పెంచాడు. రోడ్డుని మింగేస్తూ వెళుతోంది లారీ.

 

    ఎవరో రాజకీయ నాయకుడి కోసం కట్టిన స్వాగత తోరణం ఉంది. అక్కడ బాగా దగ్గరి కొచ్చేదాకా దాన్ని గమనించలేదు లారీ డ్రైవరు.

 

    గమనించగానే సడెన్ బ్రేకు వేశాడు. బ్రేకు టైర్లు దోర్లడాన్ని ఆపింది గానీ, వేగాన్ని వెంటనే ఆపలేకపోయింది. కీచుమని రోద చేస్తూ ఇరవై గజాలు జారుతూ వెళ్ళింది లారీ. స్టీలు కమ్మిలతో చేసిన స్వాగత తోరణం లారీ మీద పేర్చిన సామాన్లకు తగిలింది. అవి ధనధన కిందపడ్డాయి.

 

    లారీ మెల్లిగా ఆగింది.

 

    డ్రైవర్ చేతిలో మూడు వంద రూపాయల నోట్లు కుక్కి కిందికి దూకింది సుదీర. భరత్ కూడా దిగాడు.

 

    ఆటే పోతున్న టాక్సిని ఆపింది సుదీర. భరత్ ఎక్కకుండానే టాక్సీ స్టార్ట్ చేశాడు డ్రైవరు. అతను భరత్ ని గమనించనే లేదు.

 

    భరత్ టాక్సిలో ఎక్కని సుదీర కూడా గమనించలేదు. 'తను తక్షణం ఇంటికెళ్ళిపోయి తండ్రితో మాట్లాడాలి. దయాకర్ ని రక్షించాలి!" అదే ఆమె మనసులో మెదులుతున్న ఆలోచన , ఆదుర్దా.

 

    నిస్పృహగా కాసేపు నిలబడి, తరువాత ఎదురుగా కనబడుతున్న చింతలతోపు వైపు చూశాడు భరత్.

 

    సరిగ్గా దయాకర్ క్యాంటిన్ కి ఎదురుగుండానే నిలబడి ఉన్నాడు తను. అటూ వైపు నడిచాడు.

 

    అక్కడ నిలబడి ఉంది భారతి. ఆమె చీర నిండా రక్తం.

 

    "భారతి! భారతి, ఏమయింది? చెప్పమ్మా. ఏం జరిగింది?" అన్నాడు భరత్ బొంగురు పోతున్న గొంతుతో.

 

    మాట్లాడడానికి నోరు తెరిచింది భారతి. నోటి వెంబడి మాట రావడం లేదు. "హ్హ! హ్హ!" అని వెక్కుతున్నట్లు రోప్పుతోంది తను.

 

    కల్లో నడుస్తున్నట్లు ఇంటి చుట్టుతా తిరిగి చూశాడు భరత్.

 

     "వద్దన్నయ్యా. నువ్వు చూడలేవన్నయ్యా!" అంటూ దుఃఖంతో వారించబోయింది భారతి. అతను ఎంత సున్నిత మనుస్కుడో ఆమెకి తెలుసు.

 

    ఆమె మాటలు వినిపించుకోకుండా నడుస్తున్నాడు భరత్. దోసిళ్ళతో రక్త తర్పణం వదిలినట్లు రక్తపు చుక్కలు, ఒక చోట మనిషి పాదాలు, నరికి పెట్టి ఉన్నాయి. ఒకచోట చేతులు, మరొక చోట మొండెం , నాలుగో చోట.........

 

    దయాకర్ తల.

 

    తల తెగి పడుతున్నప్పుడు చావుకేక వేసిన నోరు ముసుకోకుండా ఇంకా తెరుచుకునే ఉంది. మొహానికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి వున్నాయి. రెండు అగరొత్తులు కళ్ళల్లో గుచ్చి వున్నాయి.


    "న ర బ లి"

 

    కడుపుడులో తిప్పింది భరత్ కి. భయంతో, దుఃఖంతో , వాంతి వచ్చేటట్లు అనిపించింది. కాళ్ళు విపరీతంగా వణుకుతున్నాయి.

 

    భారతి దగ్గరికి వచ్చి చూశాడు. కుప్పకూలి పడిపోయి వున్న ఆమె పక్కనే ప్లేటులో మైసూరు పాకు వుంది. దానిమీద బాదం పప్పు ముక్కలతో , 'హాపీ బర్త్ డే ' అని అందంగా పేర్చి వుంది.

    
    ఇవాళ దయాకర్ బర్త్ డే అని తెలిసి స్వీటు తయారు చేసి పట్టుకొచ్చిందన్నమాట భారతి.

 

    పుట్టిన రోజే చచ్చిన రోజు అయింది దయాకర్ కి.

 

    "భారతి" అన్నాడు భరత్ రొప్పుతూ. అతని శ్వాస త్వరత్వరగా వస్తోంది.

 

    "అన్నయ్యా" అంటూ అతని భుజం మీద తల పెట్టి వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది భారతి.

 

    తల గిర్రున తిరుగుతూ ఉన్నట్లుంది భరత్ కి. కనుగుడ్లు పైరెప్పలలోకి వెళ్ళిపోతున్నాయి. ఒళ్ళు వశం తప్పి, బలహీనంగా కిందికి జారి ఒరిగిపోయాడు భరత్. తన పెంపుడు చిలక చనిపోతే వారం రోజుల పాటు తిండి తిప్పలు మానేసిన సున్నిత మనస్కుడతను.

 

    ఆ తరువాత భారతి పెట్టిన కేకలకు జనం పోగయ్యారు. అంబులెన్సు, పోలీసు వాన్లు వచ్చాయి. ఎవరో పూనుకుని, మెరుపు వేగంతో పనులన్నీ కానిచ్చి, సరిగ్గా గంట తరువాత దయాకర్ శవాన్ని దహనం చేయించేశారు.

 

    అది ఆత్మహత్యగా నమోదు అయింది పోలీసు రికార్డులలో. ఆ శవ పరిక్ష చేసిన డాక్టర్లు పోలీసు అధికారులు తమ ఆత్మలని చిరకాలం క్రితమే చంపెసుకున్నారు డబ్బు కోసం! అందుకే అలా తీర్మానించగలిగారు.

 

    అది తెలిసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టిన వాళ్ళు చాలామందే ఉన్నారు గానీ, నోరెత్తి అదేమిటని అడిగిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు!

 

    
                                                                               --------------

 

    పమిట కొంగు మొహం మీద కప్పుకుని నిశ్చలంగా పడుకుని ఉంది భారతి. ఉన్నట్లుండి ఒక్కొక్కసారి వెక్కిళ్ళు ఆపుకుంటూన్నట్లు గుండెలు ఎగిసి పడుతున్నాయి.

 

    సదాశివరావుగారు నిస్సత్తువగా పడక కుర్చీలో పడుకుని ఉన్నాడు. మాములుగా ఆరోగ్యం అంతంత మాత్రం. కూతురి దుఖం చూసి అయన పూర్తిగా జబ్బు మనిషిలా అయిపోయారు.

 

    భారతి పక్కనే కూర్చుని రుద్దమైపోయిన గొంతుతో సముదాయిస్తున్నాడు భరత్.

 

    "భారతి! ఊరుకోమ్మా! జరగవలసింది జరిగి పోయింది! ఇంక మనం చెయ్యగలిగింది ఏమి లేదు!"

 

    భారతి మాట్లాడలేదు.

 

    "భారతి! నీకు తెలుసా? దేవుడు తనకి ఇష్టమైన వాళ్ళని త్వరగా వెనక్కి పిలిపించేసుకుంటాడు! దయాకర్ అంటే దేముడికి చాలా ఇష్టమై ఉంటుంది!"

 

    "ఎంత ఇష్టమైన ఇంత దారుణంగా చంపించి పిలిపించుకుంటాడా అన్నయ్యా! ఈయన్నేనా మనం దయా సముద్రుడు, కరుణామయుడు అని పిలుచుకునేది!"

 

    "తప్పు భారతి! దేవుడు చాలా........." గొంతు దుఃఖంతో పూడుకుపోగా, మాట పూర్తీ చెయ్యలేక వెక్కుతూ ఉండిపోయాడు భరత్.

    
    భారతి అతని భుజం మీద తల పెట్టి రోదిస్తోంది.

    
    చిన్నప్పుడు భారతి గుండెల దగ్గర సూదిగా ఉన్న ఒక కొయ్య గుచ్చుకుని గాయమయితే , ఆమెకన్నా పెద్దగా తను ఏడవడం గుర్తొచ్చింది భరత్ కి. అలాంటి అనుబంధమే ఉంది వాళ్ళిద్దరి మధ్య.

 

    ఆపుకుందామని ప్రయత్నించినా అతని దుఖం ఆగడం లేదు. నీళ్ళు నిండి కళ్ళు మసక మసకగా అయిపోయాయి.

 

    ఆ మసక తెరలోనుంచి అస్పష్టంగా కనబడింది ఒక రూపం.

 

    నెమ్మదిగా కళ్ళు నులుముకుని చూశాడు భరత్.

 

    సుదీర నిలబడి ఉంది.

 

    "చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇది" అంది నెమ్మదిగా.

 

    ఎవరూ మాట్లాడలేదు.

 

    "ఎన్ని కష్టాలు వచ్చినా కూడా , ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం! అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?" అంది మళ్ళీ.

 

    చివుక్కున తల ఎత్తి చూశాడు భరత్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra