Home » Merlapaka murali » Shrungarapuram Oka Kilomeetaru


    "దేవుడులాగానే ఇదీ అర్థం కాలేదు గురుడా."

 

    "కరెక్టే. దేవుడు అర్థం కావాలంటే వయసు ఉడిగిపోవాలి. ప్రేమ అర్థం కావాలంటే వయసు పరిపక్వం చెందాలి."

 

    "ప్రేమే దేవుడు అంటారు గదా. అలా ఎందుకని అంటారు? రెంటికీ గల సామీప్యత ఏమిటి గురుడా?"

 

    "ఏమో నరుడా! నాకూ తెలియదు."

 

    అప్పటికి అమ్మాయిలు  మరింత దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూడటం లేదు. తలవొంచుకుని ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్నది ధాన్య అని గుర్తించాడు గోపాలకృష్ణ. వెనక వస్తున్నదెవరో తెలియడం లేదు.

 

    "గురుడా! ఎవరో అమ్మాయిలు ఇటే వస్తున్నారు" నరుడు ఎగ్జయిట్ మెంట్ ను అణుచుకుంటూ అన్నాడు.

 

    "చూశానులేరా" అని "తమాషా ఏమిటంటే వాళ్ళు మనల్ని చూడకుండా మనం నడుస్తున్న పొలం గట్టుమీదకే వచ్చారు. ఈ గట్టుమీద ఇద్దరు దాటు కోవడం కష్టం. ఎవరో ఒకరు పొలంలోకి దిగి ఎదుటివాళ్ళకు దారివ్వాలి. కానీ గట్టు దిగితే బురదలో కాళ్ళు పెట్టాలి. అందువల్ల మనం వెనక్కి మళ్ళి వారికి దారిద్దాం" అంటూ అతను వెనక్కి తిరిగాడు.

 

    నరుడూ వెనక్కు మళ్ళి ఒకడుగు ముందుకేశాడు.

 

    సరిగ్గా  అప్పుడే ధాన్య వాళ్ళను చూసింది. ఆమె గోపాలకృష్ణను ఉద్దేశించి "హలో" అంటూ గట్టిగా అరిచింది.

 

    అతను ఆగి ఆమెవైపు తిరిగి పలకరింపుగా నవ్వి 'హలో' అంటూ కుడిచేయి పైకెత్తి విష్ చేసినట్టు ఊపాడు.

 

    "మనిద్దరం ఒకే గట్టుమీద నడుస్తూ ఎదురుపడటం ఫెంటాస్టిక్ గా వుంది. నువ్వు చాలాదూరం వచ్చేశావు కాబట్టి నవ్వు వచ్చేయ్. మేం వెనక్కి వెళతాం" అంది ఆమె.

 

    ఇక తప్పదని గోపాలకృష్ణ ముందుకి నడిచాడు. నరుడికి అలా పొలాల గట్లమీద నడిచే అలవాటు లేదు. అందుకే కాలు స్లిప్ అవుతుందేమోనని జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు.

 

    గోపాలకృష్ణ వాళ్ళను సమీపించాడు.

 

    ఆ సమయంలో వస్తున్నది ఎవరా అన్న క్యూరియాసిటీ కూడా లేకుండా ఆకాశాన్ని చూస్తోంది వర్ష. ఆమెకి అతను గోపాలకృష్ణ అని తెలియదు. వస్తున్నవాళ్ళు గట్టు దాటడానికి కొంత సమయం పడుతుంది గనుక వాళ్ళను చూస్తూ నిలబడడం కన్నా  అలా ఆకాశంవైపు చూడడం బావుంటుందన్న ఉద్దేశంతో అలా తల పైకెత్తి వుండిపోయింది.

 

    నీలం ఆకాశంమీద ఎర్రటి షేడ్ ను చూస్తూ ఆమె ముగ్ధురాలవుతోంది. ఆ రంగుల మిక్సింగ్ కు అబ్బురపడుతూ వుండగా గోపాలకృష్ణ పూర్తిగా గట్టుదాటి అక్కడికి వచ్చాడు.

 

    వాళ్ళు వచ్చేశరానిపించి వర్ష తలదించింది.

 

    ఆ క్షణంలో ఆమెను చూసిన గోపాలకృష్ణ ఒక్కక్షణం అలా  నిలుచుండి పోయాడు.

 

    ఆమెలోని ఏదో  తెలియని ఆకర్షణకు మంత్రముగ్ధుడై కళ్ళు ఆర్పాలన్న సంగతి కూడా మరిచిపోయాడు. ఏ స్త్రీని చూసినా కలగని అదో రకమైన  రసస్పందన మొదటిసారిగా కలిగింది అతనిలో. కొత్త అలజడికి లోనయ్యాడు.

 

    అంతవరకు ఏ స్త్రీతో పరిచయంలేని అబ్బాయి మనసుపడ్డ అమ్మాయిని తొలిసారిగా క్లోజప్ లో చూసినట్టు అతను చూస్తున్నాడు.

 

    దీన్ని గమనించిన ధాన్య "గోపాలకృష్ణా! ఆమె వర్ష. మన స్కూల్లో టీచర్" అని పరిచయం చేసింది.

 

    అతను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డట్టు అటూ ఇటూ కదిలి నమస్కారం పెట్టాడు. ఆమె కూడా రెండు చేతులూ జోడించింది.

 

    "ఇతను గోపాలకృష్ణ. మా ఊరి హీరో ఇతనే. మదనకామరాజు వంశానికి చెందిన ఏకైక పురుషుడు" ధాన్య వర్షవైపు తిరిగి చెప్పింది.

 

    అతను ఎవరో తెలియడంతో కమ్మిటపురుగు మీదపడ్డట్టు ఆమెలో జుగుప్సలాంటి భావమేదో కలిగింది. అయితే దానిని ఎక్స్ ప్రెస్  చేయకుండా భావరహితంగా చూస్తున్నట్టు వుండిపోయింది.

 

    ధాన్య గోపాలకృష్ణతో అవీ ఇవీ మాట్లాడి చివరగా  "మరిక సెలవిప్పించండి మహాశయా! అవతల నా మిత్రురాలు వెళదామన్నట్లు కళ్ళలో అర్థిస్తోంది. ఇంతకీ కృష్ణుడి దయ ఈ గోపిక మీద ఎప్పుడో" అంటూ చిలిపిగా కన్ను గీటింది.

 

    అతను నవ్వుతూ కనుమరుగయ్యే వరకు అతను అక్కడనించి కదలలేక పోయాడు.

 

    అటు తరువాత ఇద్దరూ ముందుకు సాగారు.

 

    తన గురువుగారు ఏదో  ఆలోచనలో వున్నారని గ్రహించిన నరుడు మౌనంగా వెంట నడుస్తున్నాడు.

 

    కొంతసేపటికి సడన్ గా గోపాలకృష్ణ "నరుడా! నువ్వు ఇంతకు ముందు ఓ ప్రశ్న వేశావ్ డానికి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. ప్రేమకీ, దేవుడికీ సామీప్యత ఏమిటని కదూ నువ్వు అడిగావ్."

 

    "అవును గురుడా!"

 

    ప్రేమ క్షణంలో కలుగుతుంది. దానిని సాక్షాత్కరించుకోవడానికి కొన్ని ఏళ్ళపాటు తపన పడాలి. అదే దేవుడి విషయలో అయితే కొన్ని సంవత్సరాల పాటు తప్పసు చేస్తే దేవుడు క్షణం కనిపించి మాయమై పోతాడు. ఇదే దేవుడికీ, ప్రేమకూ వున్న సామీప్యత తేడా కూడా."

 

    అంతకు ముందు కొన్ని క్షణాల వరకు ప్రేమంటే ఏమిటో చెప్పలేని గురువుగారు అంత సడన్ గా సమాధానం ఎలా చెప్పగలిగారో నరుడికి అంతు పట్టలేదు. అయితే తన అనుమానాన్ని అతను వ్యక్తపరచలేదు. ఆలోచిస్తూ వుండిపోయాడు.

 

        
                                           9

 

    ఆ పౌర్ణమి రోజున విలాసినికి గోపాలకృష్ణ దగ్గర్నుంచి పిలుపొచ్చింది. రాత్రికి రమ్మని కబురందడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయి పోయింది. ఇది నిజమని ఒక పట్టాన నమ్మలేకపోయింది.

 

    ప్రతి అయిదు నిమిషాలకోమారు తన ఒంటిని గిల్లి చూసుకుంది. ఇది కలా? నిజమా అని.

 

    ప్రపంచంలో తనంత నష్టజాతకురాలు మరొకరు లేఅరని ఆమె గట్టి అభిప్రాయం. ఇలా ఆమె భావించడానికి కారణం కూడా లేకపోలేదు. ఆమె  పెళ్ళి అయిన సంవత్సరానికి ఒక వివాహం చెడిపోవడానికి కావాల్సినంత దుర్ఘటనలు ఒకటంతట ఒకటి జరిగిపోయాయి. ప్రస్తుతం ఆమె వితంతువు. తన బతుకు ఇలా వెలిసిపోవడానికి దారితీసిన పరిస్థితుల్ని  గురించిన ఆలోచన ఆమెను సన్నబడేట్టు చేసింది. అంతకుముందుకంటే ఆమె ఇప్పుడు సన్నబడ్డా ఇది ఎక్ స్ట్రా ఆకర్షణే అయింది తప్ప ఆమె వన్నెచిన్నెలకు తెచ్చిన నష్టం ఏమీలేదు.

 

    ఆమెకిప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్లదాకా వుంటాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra