Home » Polkampalli santhadevi » మణిదీపం

    "పాపి చిరాయువుకదా? బాగానే వుంది. మామయ్యను చూస్తేనే బాధేస్తుంది. ఆ రోజు ఆయన ప్రాణం పోయినా బాగుండేది. వెంటనే హాస్పిటల్ కి తరలించి ఆయన్ని కాపాడుకొన్న సంతోషాల ఘడియైనా నిలువలేదు. పులిలాంటి మనిషి పిల్లిలా అయిపోయారు. ఊళ్ళో ఎవరికీ ఏ సమస్య వచ్చినా సలహాకోసం ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఊరంతటికీ ధర్మపన్నాలు చెప్పిన ఆయన, కన్నకూతురే కాలుజారిన విషయం గుర్తించలేకపోయాను. ఇప్పుడు ఎవరికీ ముఖం చూపించలేక ఇంట్లోనే వుంటుంన్నారు"

    "తప్పటడుగులు చాలామంది వేస్తారు. వాళ్ళని క్షమించవచ్చు. కాని, చేసిన తప్పును కప్పిపుచ్చుకొని మోసం చేసేవాళ్ళంటే నాకసహ్యం. ఇంతకీ మీ కాంచన తెలిసి చేసిందా? తెలియక చేసింది?"

    "తెలియక చేయడానికి టీనేజ్ కాదుగా? ముప్పయ్యేళ్ళొచ్చాక అన్నీ కామ్ గా ఆలోచించుకోగల సమర్ధత వస్తుంది మనిషికి. ఆడపిల్లకి ఇంకా తొందరగా వస్తుంది. ఎందుకిలా చేశావని అడిగాను. మిమ్మల్ని మోసగించే ఉద్దేశం తనకిలేదుట. పెళ్ళయ్యాక ఏదో సినిమాలో జరిగినట్టు మొదటిరాత్రి అంతా చెప్పేసి మీ తీర్పుకోసం నిరీక్షించాలనుకొందట"

    "పెళ్ళయ్యాక ఎందుకు? ముందే చెప్పొచ్చుకదా?"

    "మీ అమాయకం బంగారంగానూ! పెళ్ళయితే మీరు ఎటూ తప్పించుకోలేరని దాని ఎత్తు. ఒకసారి మీ భార్యగా ముద్ర పడ్డాక నిరభ్యంతరంగా తను బిడ్డ తల్లి కావచ్చునని దాని ఊహ. అసలు మీకా విషయం చెప్పేదో కాదో నాకనుమానమే. పెళ్ళయ్యాక ఏడు నెలలకే బిడ్డతల్లి అయ్యి, ఏడో నెల ప్రసవం జరిగిందన్నట్టుగా ప్రపంచాన్ని మభ్యపరిచేదనుకొంటా"

    "ప్రపంచాన్ని మభ్యపరిచేదేమోగాని ఒక డాక్టర్ని మోసగించడం అంత తేలిక కాదుకదా? ఇంతకీ కాంచన ప్రేమించి మోసపోయిందా? ఎవరైనా దౌర్జన్యం..."

    "అదంతా మనసువిప్పి చెప్పితేకదా? ఒక బలహీన క్షణంలో కాలుజారానంటుంది. అంతకుమించి ఏం చెప్పదు. రామకృష్ణ వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. కాంచన పనిచేసే కాలేజీలోనే ఇంగ్లీష్ ప్రొఫెసర్ తో సన్నిహితంగా వుండేదట. అతడు చాలా అందంగా వుంటాడట. అతడికి భార్యా బిడ్డలున్నారట"

    "మనసొకచోట, మనువొకచోట అన్నట్టుగా వుండేదన్నమాట. థాంక్ గాడ్! పెళ్ళి పేరుతో ఒక భయంకరమైన నరకంలోకి తోయబడే వాడిననుకుంటాను. అత్యంత ప్రమాదకరమైన మనిషితో జీవించాల్సి వచ్చేది. భగవంతుడు నన్ను రక్షించాడు"

    "పెళ్ళయ్యాకే కాంచన నిజస్వరూపం బయటపడితే ఏం చేసేవాళ్ళు?"

    "చెప్పానుకదా తెలిసీ తెలియక తప్పుచేస్తే క్షమించవచ్చు. అన్నీ తెలిసి మోసగించేవాళ్ళని నేను చాలా అసహ్యించుకొంటాను. బహుశ నేను కాంచనని భరించలేక పోయేవాడిననుకొంటాను"

    "కాంచన ఇలా అయిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఎలాంటి సంప్రదాయ కుటుంబంలో పుట్టింది?"

    "మనిషిని సంప్రదాయం కొంతవరకే కట్టడి చేస్తుంది. తనుండే వాతావరణం, స్నేహితులు,పరిచయాలు_ వాటి  ప్రభావం తీవ్రమైనప్పుడు సంప్రదాయం ఏమీ చెయ్యలేదు. ఇంతకీ ఆమె పరిస్థితి ఇప్పుడు ఏమిటి?"

    "ఇహ అందరికీ తెలిసిపోయింది కదా? తొమ్మిది నెలలు మోసి బిడ్డ తల్లి నౌతానంటుంది. తండ్రెవరో చెప్పకుండానే పెంచుతుందట. ఎంత అసహ్యంగా వుందో చూడండి వ్యవహారం"

    "పెళ్ళి చెడిపోయాక ఈ నిర్ణయం తీసుకొనేకంటే, ముందే ఈ నిర్ణయం తీసుకొని వుంటే నేను హర్షించేవాడిని"

    "అవివాహిత తల్లుల్ని మీరు సమర్ధిస్తారా?" షాక్ తగిలినట్టుగా అడిగింది అర్చన.

    "అందరు అవివాహిత తల్లుల గురించి నేను చెప్పలేనుగాని కాంచన విషయంలో సమర్ధించగలను. ఎందుకంటే ఆమె ఉద్యోగస్తురాలు కన్నబిడ్డను చక్కగా పెంచగల స్థోమత ఆమెకు వుంది."

    "పోషించగలిగితే చాలా? మనిషికి నైతిక విలువలు అనేవి వుండక్కరలేదా?"

    "ఏది నైతికమో, ఏది కాదో సరిగ్గా ఎవరు నిర్వహించగలరు? బలహీనక్షణం అందే కాంచన? ఈ బలహీనత ఊరికే ఏర్పడదు ఏ ఆడపిల్లకయినా! ఎదుటి మనిషి పట్ల ఎంతో ఆకర్షణ, అనురాగం వుంటే తప్ప ఆ బలహీనత ఏర్పడదు. తమ అనురాగానికి గుర్తుగా కడుపునపడ్డ బిడ్డకు తన రక్తమాంసాలు పంచి జన్మనివ్వడం అంటే చాలా గొప్ప విషయంకదా? సమాజం ఏమంటుందోనన్న భయంతో మమకారాన్ని చంపుకొని బిడ్డను కడుపులోనే చిదిమివేయడం నైతికమని ఎవరంటారు??"

    "ఇలాంటి అప్రాచ్యపు పనులను సమర్ధిస్తే సమాజం ఏం కావాలి?"

    "నిర్భయంగా తన బిడ్డకు జన్మనిచ్చి పెంచి పెద్దజేసే అవివాహిత తల్లులవల్ల ఈ సమాజం పాడైపోదు. కసుగాయాల్ని రేప్ చేసే కామందాత, కట్నం కోసం కట్టుకొన్నదాన్ని కాల్చి చంపే కిరాతకం, విశృంఖల శృంగారం, హత్యలు, దోపిడీలు, ఎన్నెన్నో పాపకార్యాలు, ఒళ్ళు జలదరింపజేసే ఘోరకృత్యాలు-మనకి తెలియకుండా ప్రతిక్షణం ఎన్నో జరిగిపోతున్నాయి. వాటన్నిటివల్లా చెడిపోని సమాజం ఒక అవివాహిత తల్లి అయితే చెడిపోతుందా?"

    "ఆ తల్లుల్ని గంగలో కలవనీయండి. తండ్రి పేరు చెప్పుకోలేని ఆ పిల్లల బ్రతుకు ఏమిటి? ఎంత నీచంగా చూడబడతారు సమాజంచేత? 'నన్నెందుకు పుట్టించావు, భగవంతుడా' అని ప్రతి క్షణం అవమానంతో రగిలిపోయే ఆ పిల్లల బాధ ఎవరు తీరుస్తారు?"   

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra