Home » Gullapalli sundaramma » Athani Lakshyam


                                    10
    సాయంత్రం పార్వతమ్మ గారు దేవాలయం నుండీ రాగానే ఏదో ఈ ప్రసక్తి తేవడంతో రఘు అభిప్రాయాన్ని ఆవిడతో చెప్పేసింది జానకి.
    'అలాగా. అయితే అలా వాడిమాట మీదే నడుచుకుంటే తీరిపోతుంది' అన్నారు పార్వతమ్మ గారు.
    'అయితే ఇది మాత్రమే అన్నాడా. మిగతా విషయాల్లో తన అభిప్రాయాన్నే మన్నా చెప్పాడా' అని అడిగారు. పార్వతమ్మ గారి వల్ల ఈ విషయాన్ని తెల్సుకున్న శర్మ గారు వెంటనే జానకి వద్ద కొచ్చి 'ఇంకేమీ చెప్పలేదు' అంది జానకి.
    'నువ్వన్నా కదిపి వాడి అభిప్రాయాన్ని కూడా తెల్సుకునుండాల్సింది . వాడి పెళ్లి విషయంలో, ఏం నిర్ణయించుకున్నాడో అది తెల్సుకోవడం మనకెంతన్నా ముఖ్యం అందుకనీ' అన్నారు రెండు చేతులూ వెనక్కు కలుపుకుని ఆలోచనగా తలొంచుకు నిల్చుని శర్మగారు. 'చేజిక్కిన అవకాశాన్నిలా , వదులుకుంటారా?' అన్నట్టు.
    'పోనీ రాత్రి భోజనం దగ్గర --'
    'వద్దు. మళ్లీ కదిపాం అంటే అందువల్ల మనకీ వాడికీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులున్నాయి' అంటూ వెళ్ళిపోయారాయన. న్యాయానికి ఆ దంపతులకి రఘూ, సుధా మామూలు పిల్లగా గనక వుండి వుంటే, రఘు ఓకే వేళ సుధని ఇష్టపడక పొతే కూడా వారు కొంతవరకూ నచ్చ చెప్పుండే వారేమో కూడా. అయితే సుధ కున్న ఈ పెద్ద  లోపాన్నుద్దేశించి అటు చేసుకోమని తాముగా రఘుతో చెప్పనూ లేక, ఇటు వద్దని ఖచ్చితంగా అననూ లేక అవస్థగా వుండడం వల్లా, ఆ నిర్ణయాన్ని రఘు మీదే వదిలి ఇన్నాళ్ళూ ఊర్కున్నారు.
    అయితే వచ్చిన సంబందాలన్నింట్లకి 'అబ్బాయి చదువు పూర్తవాలి ముందు' అని చెప్పి తప్పించు కుంటున్న ఆ దంపతులకి రఘు చదువై పోయిన కారణంగా ఇక మీదట ఏం కారణం చెప్పడమా?' అనుకుంటుండగా వారి సదుపాయం కోసమే వచ్చినట్లుగా ఒక మంచి అవకాశం లభించింది మళ్ళీ.
    తరచూ ఎవరో ఒకరు 'మా పిల్లని చూసేందుకు రండి' అంటూ తమ ఇంటి కోస్తుండడం , ఎటూ చెప్పలేక వారు ఇబ్బంది పడుతూండడం చూసి రఘూ కి చిరాగ్గానే ఉంటుంది. అందుకే,
    'ఇంతలో పెళ్లి ప్రయత్నాలేవీ లేవని చెప్పెస్తుండండి నాన్నా' అన్నాడు. ఒకరోజు శర్మ గారు మాత్రం వున్న సమయం చూసి రఘు.
    'దేనికన్నా వొ న్యాయం లేదా రఘూ, ఇన్నాళ్ళూ అంటే చదువు వంక పెట్టాం బాగుంది. ఇంకా అందర్నీ ఇలా తిప్పడం న్యాయం కాదు' అన్నారు పేపరు చూస్తూనే.
    'అది నిజమే ననుకోండి. అయినా కొన్ని నెలల్లో బహుశా నేనమేరికా వెళ్లాల్సుంటుందేమోనని అనుకుంటున్నాగా! మరి....'
    'అది నిశ్చయమేనా.'
    'అనే అనుకుంటున్నా, అదేదో సరిగ్గా తేలేకనే మీతో చెప్పొచ్చునని ఊర్కున్నాను.
    'అక్కడెంత కాలం ఉండాల్సుంటుంది.'
    'ఏమో తీసుకున్నది సర్జికల్ సెక్షన్. దాన్ని గురించి ఎన్నేళ్ళు ప్రాక్టికల్స్ చేసినా కావటమంటూ గాని, ఇన్నాళ్ళ లో అవుతుందని గాని వో పరిమితంటూ ఏం వుంది? కనీసం వో మూడు నాలుగేళ్ల పాటన్నా వుంటేనే తప్ప అంతదూరం వెళ్లి లాభం వుండదు. ఏం? ఎందుకు నాన్నా?'
    'అబ్బే! ఊర్కేనే'?...అంటూ ఈజీ చెర్ లో జారబడ్డాడాయన.
    'మరీ అంతకాలం అంతే తిరిగొచ్చేసరికే ' టూ లేట్ ' అయిపోదూ.' అన్నారు మళ్లీ.
    'దేనికీ, 'మ్యేరేజ్ ' కా.'
    'మరే?'
    'అబ్బే! ఈ కాలంలో అందువల్ల ఇబ్బందేం వుంటుంది నాన్నా' అన్నాడు నవ్వుతూ రఘు.
    'వయసుకు తేడా లేకుండా పిల్లలు దొరికేటంత మాత్రాన్న అయిపోతుందా రఘూ. మనుషులన్నాక వయసుకి తగ్గట్టూ మార్పులూ, భావాలూ -- ఇంతకీ తగినంత కారణం లేందే వెనక్కి తొయ్యడం లో అర్ధం లేదు.' అన్నారు అంతరార్ధంగా.
    'బాగుంది నాన్నా. విద్య కడ్డం అవుతుందనడం కన్నా కారణం ఇంకా ఏం వుండాలని. అయినా మీకీ విషయం లో అభ్యంతరం ఏవన్నా వుందంటే నా అభిప్రాయం మర్చుకుందుకు ప్రయత్నిస్తాన్నాన్నా.' అన్నాడు వినయంగా రఘు.
    'అంటే చదువూ అయిపోయినట్టే లెక్క గనకా, వయస్సూ ఇప్పుడు సమంగా వుంది గనకా. పెళ్లి చేసేసుకు వెళ్ళావంటే మరో ఏడాది ఇటూ అటూ అయినా అంత ఇబ్బందుండదేమోనని నేననుకున్నాను. అయినా నిర్భంధం ఏమీ లేదందులో. నీ వీలూ చూసుకుని ఎటు ఉచితమని తోస్తే అటు చెయ్యి.'
    'క్షమించండి నాన్నా' ఈ పెళ్ళి విషయం లో నేనింకా ఏ నిర్ణయానికి రాలేదు. అలా రావడం అంత సులభమైన సంగతి కూడా కాదు గనక దీనిక్కొంత కాలం పడుతుంది.'
    'అలాగా. అయితే ఆ మాట అమ్మా వాళ్ళతో చెప్పెయ్యి-- సరి ఇప్పుడీ ప్రయాణం నిశ్చయమన్న మాటేనా?' వెళ్ళబోయినాయన మళ్ళీ ఆగి అడిగారు.
    'ఆ, ఒకవేళ ప్రయాణం ఖర్చులు కూడా కొంతవరకూ మనమే భరించాల్సుంటుందేమో కూడా.'
    'దాన్ని గురించి ఏమీ ఇబ్బంది లేదు. కాదంటే ఈ సంగతి నిశ్చయం కాగానే నాకు తెలియజెయ్యి. అంతే.' అంటూ వెళ్లి పోయారాయన.
    తండ్రి వెళ్ళడం తోనే రఘు మళ్ళీ ఆలోచన్లో పడ్డాడు. నాన్న చెప్పింది వో పాయిన్టే! ఎందుకంటె ఇక్కడ రాధ జత పడ్డట్టు గా అక్కడా మరొక రెవరైనా సిద్దమయిందంటే మళ్లీ ఎట్నుంచేటోస్తుందో ఏమో? అందువల్ల ఆ పెళ్ళేదో చేసేసుకునే వెళ్తే తీరిపోతుందేమో, అని కూడా అనిపించిండతనికి. అయితే మనసుని నిలబెట్టుకోగల్గే శక్తి మనిషిలో స్వతహా వుండాలే గానీ, అది లేనప్పుడు ఈ పెళ్ళి చేసుకున్నా మన్నది ఎంతవరకూ మనిషిని అదుపులో ఉంచగల్గుతుందనీ. అదీగాక పెళ్ళంటూ ఒకటి వెలగ బెట్టుకుని వెళ్ళి తీరా అక్కడ మనో నిబ్బరాన్ని దిగజార్చు కోవడం గనక జరిగిందంటే, ఇక ఆ భార్యని క్షోభ పెట్టడం కూడా వో అపరాధం! అంతేగా!'
    అన్నట్టు రాధా రోహిణి కూడా అప్లికేషన్లు పెట్టారని తెలిసింది. అయితే మళ్లీ అక్కడా తనకీ అగ్ని పరీక్ష తప్పదా. ఎందుకు తన ప్రయత్నాల కిలా అడ్డంకు లోస్తున్నాయో అతని కర్ధం కావడం లేదు.
    రఘు అమెరికా ప్రయాణాన్ని గురించీ తెలిసే లోగా వారి కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా బొంబాయి లోని ఒక గొప్ప హాస్పిటల్లో కొన్నాళ్ళ పాటు ఎముకలకి సంబంధించిన పరిశోధన్లు జరిపే అవకాశం లభించింది రఘుకి. ఆ పరిశోధన్లో అమిత అభిమానం చూపుతున్న రఘు ఆసక్తి నుద్దేశించి తను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రఘు అక్కడి కెళ్లి ఇంకా అనుభవం సంపాదించే అవకాశం కల్పించారాయన.

                            
     అంతేకాదు , రఘు రాధాల్ని గురించి ఎవరికి తోచినట్టు వారు అనేక విధాలుగా కధలు కట్టడం తో పాటు తనకీ ఆ జంట ముచ్చటగా తోచినందున రఘు కి ఆ విషయం లోనూ ఒక సదవకాశం కల్పింస్తున్నా ననుకుంటూ రాధకి కూడా అతనితో పాటు పంపించాలన్న ప్రయత్నాల్చేస్తున్నాడాయన. అయితే హటాత్తుగా ఆఖర్న ఈ విషయం చెప్పి రఘుని ఆనంద పరచాలను కున్నందున ఇంకా ఆ విషయం బయటపెట్టలేదాయన.
    సుధని గురించిన వివరాలన్నీ కొంతవరకూ రాబట్టిన రఘు కొన్ని నెలల పాటు ముందుగా కొన్ని కొన్ని 'ఇన్ జేక్షన్స్ ' వగైరా సుధకి ఇవ్వదలచున్నందున తను బొంబాయి వెళ్ళినప్పుడు ఆపని తనని చూసుకోవలసిందిగా నళిని కి అప్పగించాడు రఘు. రాధ నిందుకు నియమించడవన్నది ఎందుకో అతనికి సమంజస మనిపించలేదు. సుధ కి రాయవెల్లూరు లో జరగవలసున్న వైద్యాన్ని గురించి ఇంట్లో మిగతాఅందరికీ ఏవంత ఆక్షేపణ లేకపోయినా పార్వతమ్మ గారికి మాత్రం ఈ వైద్యం తలపెట్టడం ఎంతమాత్రం ఇష్టం లేదు.
    'అయినా ఏదో పాటా, పద్యం అన్నీ నేర్చుకుని హాయిగా కాలక్షేపం చేస్తున్న దాన్ని అలా వుండనివ్వకుండా ఇప్పుడీ 'ఆపరేషన్' అంటూ ఒకటి పెట్టారెందుకండీ? నాకేమీ ఇష్టం లేదు.' అన్నారు వంటరిగా కూర్చుని ఏవో కాయితాల్ను దిద్దుకుంటూన్న శర్మ గారితో ఆవిడ    'ఏమో. వాడి మనసులో ఏం వుందో. అదీ గాక చంద్రుని లో మచ్చలా సుధ కున్న అ వంకర తీర్చేయ్యడం మంచిదేగా.'
    'ఏమో, నాకు భయంగా వుంది సుమండీ! మా అత్తయ్య మనవరాలి సంగతి జ్ఞాపకం లేదూ మీకు?' అన్నారు కాస్త గొంతుక తగ్గిస్తూ.
    'ఆ పిల్లకి పుట్టుక లోనే వున్నందున మాట దక్కలేదని కదూ అప్పుడంతా అనుకుంటా? అదీ గాక 'హార్ట్ ఎటాక్ ' వల్ల పోయింది కాని ఈ కారణంగా కాదను కున్నారేమో కూడా.
    'ఆ, అలా అనక మరెలా అంటార్లెండి. పదహారేళ్ళ దాకా నిక్షేపం లా వున్న పిల్లకి ఉన్నట్టుండి గుండె జబ్బెక్కడి నుంచోచ్చిందని . ఏదో ఆ సంబంధం ముడి పెట్టాలని, కొంత ముదిర్న కాలిని కోసి కొరతలు పెట్టేసరికి , జన్ని కమ్మేసిందిట. నా మాట విని ఈ ప్రయత్నం మానేయ్యమనీ మీరు స్పష్టంగా చెప్పేద్దురూ.' ప్రాధేయపడిందావిడ.
    'అబ్బే! సుధ విషయం లో అలాంటి ప్రమాదం ఏమీ వుండదు పార్వతీ. సుదకి తరవాతోచ్చిన లోపం గాని ఇది పుట్టుకలోంచీ వున్నది కాదని తెల్చేరుగా?'
    'లేదండీ మా మేనత్త పోలిక అటు వాళ్ళ మనవరాలికొచ్చినట్టే ఇటు మా తమ్ముడి కూతురికీ వచ్చుండాలి. అందువల్లనే సుధని చేసుకోమని గట్టిగా అనడాని క్కూడా , ఇది వంశ వారీగా బాధిస్తుందేమోనని నాకు భయంగానే వుంటుంది చెప్పొద్దూ.'
    'నువ్వన్నట్టూ పుట్టుక లో వుంటే అంతే అనుకో. మరి వారు ఎంతెంతో పరిశోధన్లు జరిపించి జన్మలో వచ్చింది కాదని రుజువు చేసుకున్నాడుగా.'
    'అవన్నీ సరిగ్గా తెలియ పరిచేవే అంటారా?'
    'ఆ, అందుకే ఒక్కొక్క పద్దతి కనిపెట్టడానికి ఎంతెంత ఇబ్బందులు పడుతుంటారు ఈ పరిశోధకులు. అయినా నాకూ ఇది వంశ సంప్రదాయమౌతుందేమొనన్న భయం ఇంతో అంతో వుందనుకో. వున్నా, ఒక సత్కార్యం వాడు తలపెట్టినప్పుడు వాడి ప్రయత్నాలకి నేనడ్డు పడి నిరుత్సాహ పరిచిన వాడ్నివుతానె మోనని! ఒక తండ్రి దూరాలోచన పరుడైన తన కొడుక్కి ఎంతవరకూ చెప్పోచ్చునో, అంతవరకే వాడికి బోధపరిచి అంతలో ఊర్కున్నాను.' అన్నారు చేతిలో పని కట్టి పెట్టి భార్య వేపు చూస్తూ.
    'కానివ్వండి దైవ నిర్ణయం ఎలా వుందో , అలాగవుతుంది ' అంటూ కాస్సేపేదో ఆలోచిస్తూ అలాగే నిల్చున్నాక ఇవతలి కొచ్చేశారు పార్వతమ్మ గారు.
    'అత్తయ్యా?' ఆ పక్క గదిలో పుస్తకాన్ని సర్ది పెడుతూ వారి సంభాషణంతా విన్న సుధ గడప దాటి వెళ్లిపోతున్న పార్వతమ్మ గార్ని పిలిచింది.
    'ఏవమ్మా?' తెల్లబోయి చూస్తూ సుధ వద్ద కొచ్చారావిడ.'
    'ఈ వైద్యాన్ని గురించి మీరేమీ అడ్డు చెప్పకండత్తయ్యా ' బతిమాల్తూ అడిగింది సుధ.
    'నీకు తెలీయదమ్మా--'
    'ఇందులోని కీడు మేళ్ళన్నీ నాకు బాగా తెల్సునత్తయ్యా . నామీదున్న అభిమానం కొద్దీ, మీరలా అనుకుంటున్నారు కానీ ఈఅవిటితనం కారణంగా పది మంది మధ్య నే పడుతుండే అవమానం మీకెలా అర్ధమవుతుంది?'
    'అందుకని '-
    'ఆగండత్తయ్యా . నన్ను పూర్తిగా చెప్పనివ్వండి మీవరకూ మీరంతా నా లోపాన్ని ఎత్తి చూపించకుండా ఎంతో అభిమానంగా నన్ను చూసుకోగలరు. ఎంత ఖర్చయినా చేసి నాకో భర్త ని సంపాదించి పెట్టనూ గలరు. ఆ డబ్బు మీది అభిమానం కొద్దీ నన్ను చేసుకున్న ఆ భర్తకి నామీద అభిమానం ఎందుకుంటుంది? ఒకవేళ ఒక విధమైన జాలో, లేక ఇంత ఆస్తి తన కిచ్చినందుకు సాను భూతో , నాయందతనికే పాటన్న కల్గినా 'ఆ కుంటి దాని భర్త, ఆ సొట్ట కాలు పిల్ల మొగుడూ' అంటూ నా వంకర్లని అతడికి అంటగట్టుతూ అతని సహనాన్ని కసిగా మరెలాగ రెచ్చ గొట్టి నా మీద అభిమానాన్ని మిగతా వారంతా నాశనం చెయ్యకా మానరు. ఇలా నాతొ పాటు అతన్నీ అగచాట్ల పాలు చెయ్యడం, నేను అగచాట్లు పాలవడం తప్పించి ఇందులో నే బావుకునేదేం వుందని? ఇప్పుడు చెప్పండత్తయ్యా , ఇటువంటి హైన్యపు బతుకు బతికే కన్నా ఇటో అటో తెమిల్చేసుకోవడం ఎంతో మంచిది కాదూ.'
    'అమ్మమ్మ , నా తల్లివి కదూ, అటువంటి మాటలు మాత్రం ఎప్పుడూ అనకు తల్లీ ' ఏదో సోమ్మాసే చూపుదాం పెళ్లి చేసేద్దాం' అనుకోవడమే తప్పించి, అందువల్ల నీకిన్నిన్ని ఇబ్బందులున్నా యన్నది నువ్విప్పుడు విడమరిచి చెప్పేవరకూ మాకు తోచలేదే తల్లీ. నీకు పెళ్ళీ వద్దు, పేరంటమూ వద్దు. మాకళ్ళ ముందిలా మసుల్తూన్నావంటే అంతే చాలు' అన్నారు సుధని తన గుండెలకి గట్టిగా హత్తుకుంటూ పార్వతమ్మ గారు. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra