Home » Mainanpati bhaskar » Claimax

మళ్ళీ అందరూ కొండకొమ్ము మీదికి ఎక్కడం మొదలెట్టారు.
ఆదుర్దాగా హరీన్ వైపు చూస్తోంది కరుణ. ఆమె కళ్ళలో మెదులుతున్న ప్రశ్నని అర్ధం చేసుకున్నాడు హరీన్.
తాము పైకి వెళ్ళేదాకా అక్కడే ఉంటుందా హెలికాప్టర్!
ఉంటే తాము గండం గడిచి బయటపడినట్లే.
ఒకవేళ తాము పైకి వెళ్ళేలోగా హెలికాప్టర్ వెళ్ళిపోతే?

                                                                   20

ముసలమ్మ శవాన్ని మోసుకుంటూ ఆటవికులు మళ్ళీ కొండకొమ్ము మీదికి ఎక్కడం మొదలెట్టారు. హరీన్, కరుణా తన దృష్టి పధం నుంచి తప్పించుకు పోకుండా , వాళ్ళని అందరికంటే ముందు నడవమని చెప్పాడు దేశింగ్.
అక్కడ - కొండకొమ్ము మీద -
కొండ అంచుమీద నిలబడి హరీన్ కోసం వళ్ళంతా కళ్ళు చేసుకుని తొంగిచుస్తున్న మధుమతికి ఆ ఎత్తు వల్లా మనసులోని దుఃఖం వల్లా కళ్ళు తిరిగాయి. వళ్ళు తూలింది. ముందుకి ఒరిగింది ఆమె శరీరం. మరొక్క క్షణం వుంటే ఆమె లోయలో పడిపోయి వుండేదే!
కానీ ఆ చివరిక్షణంలో రెండు బలమైన హస్తాలు వెనకనుంచి మధుమతిని చుట్టేశాయి.
తనని రక్షించిన ఆ మనిషి కిశోర్ అని కూడా గమనించే స్థితిలో లేదు మధుమతి.
మధుమతి పరిస్థితిని దూరంనుంచే గమనిస్తూ వున్నాడు కిశోర్. ప్రమాదాన్ని శంకించి, దగ్గరిక వచ్చేసి, ఆమె లోయలో పడిపోకుండా ఆపాడు. ఆమెని తన చేతుల్లో పొడువుకుని , ఆమె భుజంమీదగా లోయలోకి తొంగిచుశాడు.
కింద ఏదో కలకలం వినబడినట్లయింది.
అది నిజమా? తన భ్రమా?
దృష్టి సారించి, చెవులు రిక్కించి విన్నాడు కిశోర్. అప్పుడతనికి కనబడింది ఒక విశేషం. ఈ కొండ లోయకి మధ్యగా ఒంటిస్థంభం మేడలా నిటారుగా నిలబడి వుంది. కొండని కొండచిలువలా చుట్టేస్తూ కనబడుతోంది ఒక కాలిబాట. ఎంతో పరీక్షగా చూస్తే తప్ప కనబడదది.
ఆ కాలిబాట మీద నుంచి అనేకమంది ఆటవికులు వడివడిగా పైకి వస్తున్నారు. వాళ్ళకి కొద్దిగా ముందుగా.........
కళ్ళు చిట్లించి చూశాడు కిశోర్.
ఆటవికులకి కొద్దిగా ముందు నడుస్తోంది చీరె కట్టుకుని వున్న ఒక అమ్మాయి - పట్నవాసపు మనిషిలా కనబడుతోంది ఆమె.
చిత్రంగా ఉంది ఇది.
మరింత పరీక్షగా చూశాడు కిశోర్.
ఆ అమ్మాయి పక్కనే ........ఆటవికుల దుస్తుల్లో .....అతను ఎవరు? ఎక్కడో చూసిన గుర్తు?
కొద్దిసేపటి తర్వాత గుర్తొచ్చింది కిశోర్ కి. హరీన్! ఆ అమ్మాయి పక్కనే కొదమ సింహంలా నడచి వస్తున్నది హరీన్. లోయలోపడి మరణించాడని లోకమంతా విశ్వసిస్తున్న హరీన్!
అయితే హరీన్ బతికేవున్నాడా? చనిపోలేదా? ఆ అమ్మాయి ఎవరు? ఆమెని రక్షించడానికేనా హరీన్ నదిలోకి దూకేసింది?
అయి వుండాలి.
కిశోర్ మోహంలో మెప్పుదల కనబడింది.
గ్రేట్....హరీన్ నిజంగా రియల్ లైఫ్ హీరో!
కేవలం తెరమీద సాహసకృత్యాలు చేయడమే కాదు - నిజజీవితంలో కూడా శౌర్యసాహసాలు ప్రదర్శించే మనిషి అతను. మరో విధంగా చెప్పాలంటే, మృత్యుంజయుడు ఈ హరీన్. అంతేకాదు ఇతనిలో లేని మంచి లక్షణం లేదు. ఇండస్ట్రిలో ముప్పాతిక మూడొంతుల మంది అతని ద్వారా ఏదో ఒకవిధమైన లాభం పొందినవాళ్ళే.
చివరికి తను కూడా.
తను విజయవాడ కృష్టాతీరం వదిలి, సముద్రమంత ఆశతో మద్రాసుకి చేరినప్పుడు అక్కడ తనని పలకరించిన వాళ్ళు లేరు. తన గోడు పట్టించుకున్న వారులేరు. నిరాశానిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ కొన్ని నెలలు గడిపి, చివరి ప్రయత్నంగా మరో నిర్మాత దగ్గరికి వెళ్ళాడు తను.
వెళ్ళగానే అయన తనవైపు విసుగ్గా చూసి, "చివరికి నువ్వు కూడా తెరమీద తైతక్కలాడితే చూసేదేవరయ్యా! మన సినిమాకి డబ్బులోచ్చేమాట అటుంచు - డబ్బాలూ మాత్రం రాత్తిరికి రాత్తిరి తిరిగోత్తాయ్!" అన్నాడు ఎద్దేవాగా.
అయన పలికిన ఒక్కొక్కమాట ఒక్కొక్కతూటాలా తన గుండెను తూట్లు పొడిచింది. అంతులేని ఆగ్రహం, ఆవేదన కలిగాయి తనకి. కానీ ఏమి చెయ్యలేక 'పేదవాడి కోపం పెదవికి చేటు' అని సరిపెట్టుకుని తిరిగి వచ్చెయ్యబోతుంటే, అర్ద్రమైన ఒక పిలుపు వినబడింది తనకి.
"ఒకసారి ఇటు వస్తావా?"
తిరిగి చూశాడు తను.
అక్కడికి దగ్గరలోనే ఒక కుర్చీలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు ఒకతను. చాలా సింపుల్ గా కనబడుతున్నాడు. అంచనా వేస్తున్నట్లు తనని ఆపాదమస్తకం ఎగాదిగా చూస్తున్నాడు.
కొద్ది క్షణాల తర్వాత స్పురించింది.
తను సూపర్ స్టార్ హరీన్ సమక్షంలో నిలబడి వున్నానని. ఆశ్చర్యంతో అవాక్కయిపోయాడు తను.
అప్రయత్నంగా చేతులు జోడించాడు.
చిరునవ్వు నవ్వి ఆప్యాయంగా తనపక్కనే వున్న కుర్చీ చూపించాడు. ముందుగా తను ఎవరో తెలుసుకున్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. తన నటనానుభవం గురించి తరచి తరచి అడిగాడు.
తర్వాత "నువ్వు ఇక్కడ కూర్చో!" అని చెప్పి లేచి నిర్మాత దగ్గరికి నడిచాడు హరీన్. కాసేపు ఆ రోజు తియ్యబోయే సీన్ గురించి మాట్లాడాడు ఆయనతో.
ఆ తర్వాత మూడో మనిషికి వినబడనంత మెల్లిగా అన్నాడు నిర్మాతతో.
"మన పిక్చర్లో ఆ కాలేజ్ కుర్రాడి రోల్ కి ఎవరినన్నా బుక్ చేశారా?"
"ఇంకా లేదు సార్" అన్నాడు నిర్మాత.
"ఈ కొత్త కుర్రాడి చేత ఆ రోల్ వేయిస్తే ఎలా వుంటుంది?"
"కొత్త కుర్రాడుకదండీ.......ఎలా చేస్తాడో ఏమో! ఆ రోల్ చిన్న రోలయినా చాలా ఇంపార్టెంట్ రోల్!" అన్నాడు నిర్మాత.
చిన్నగా నవ్వాడు హరీన్. "ప్రొడ్యూసర్ గారూ! మూడేళ్ళ క్రితం నేను మీ దగ్గరికి వచ్చి తొలి అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు నేను కొత్తవాణ్ణి ని చెప్పి మీరు అవకాశం ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఎక్కే గుమ్మం దిగే గుమ్మం గా ఎంతోమంది నిర్మాతల చుట్టూ తిరిగి అవకాశం సంపాదించాను. ఎస్టాబ్లిష్ అయ్యాను. ఇవాళ నన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు మీరు. కొత్తవాడని ఈ కుర్రాడిని పంపించేయ్యకండి ప్రొడ్యూసర్ జీ! అతనిలో గొప్ప నటుడున్నాడని నాకు అనిపిస్తోంది. అవకాశం ఇచ్చి చూడండి........ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?"
అతని మాటలు పనిచేశాయి . తనకి ఆ రోల్ దక్కింది.
ఆరోజు హరీన్ కీ, నిర్మాతకీ జరిగిన సంభాషణ హరీన్ తనతో చెప్పలేదు. ఆరోజు జరిగినదంతా ఆ తర్వాత మరెవరి ద్వారానో తెలిసింది.
అదే హారీన్ లోని గొప్పదనం.
అతన్ని గురించి మరొకళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిందే తప్ప తన గురించి తాను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోడు హరీన్! చెప్పుకోవడం ఇష్టం వుండదు అతనికి. ఏ మంచి పనిచేసినా కూడా గుట్టు చప్పుడు కాకుండా, మూడోకంటికి తెలియకుండా చేస్తాడు అతను.
ఆ తర్వాత తను హరీన్ కలిసినప్పుడు కృతజ్ఞత ప్రకటించబోతే వారించి అన్నాడు అతను.
"ఎందుకు తమ్ముడూ ఈ పెద్ద పెద్ద మాటలు. నేనూ ఒకప్పుడు వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినవాడినే. ఆకలికి తాళలేక అలమటించి పోయిన వాడినే. కష్టమంటే ఏమిటో నాకు తెలుసు. పైన వున్న వాడు ఎప్పుడూ కిందవున్నవాడికి సాయం చెయ్యడానికి చెయ్యి అందించాలి. ఇది ఒక్కటీ గుర్తుపెట్టుకో చాలు!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra