Home » Mainanpati bhaskar » Yama Dootha


    
    మామూలు వ్యక్తులకి గన్ లైసెన్సు రివాల్వర్ కీ, పిస్టల్ కీ ఇస్తారు గానీ స్టెన్ గన్ ఉంచుకోవడానికి ఎవరికీ లైసెన్సు యివ్వరని కానిస్టేబుల్ కి తెలుసు.

    
    కానీ అతనికి ఇంకో విషయం కూడా తెలిసింది ఈ వ్యక్తి ఎవరోగానీ మామూలు మనిషి కాడు చాలా.... చాలా పరపతి ఉన్న మనిషి అయివుంటాడు ఇతను. అందరికీ వర్తించే న్యాయసూత్రాలూ, రూల్సు ఇలాంటి వాళ్ళకి వర్తించవు. ఇలాంటివాళ్ళు ఏం చేసినా చెల్లుబాటయిపోతుంది!
    
    ఆ కానిస్టేబుల్ ఇన్నాళ్ళ సర్వీసులో నేర్చుకున్న నీతి మరొకటి ఉంది. తను జోక్యం చేసుకోలేని, చేసుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయనీ అలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తన సమాధి తనే కట్టించుకున్నట్లు అవుతుందని అతనికి బాగా తెలుసు.
    
    అందుకని అతను తక్షణం మెకానిక్ పక్షాన చేరిపోయినంత ఇదిగా ప్రవర్తిస్తూ కాబోయే కేసుని మసిబూసి మారేడుకాయని చెయ్యడంలో తన వంతు పాత్ర తాను పోషించడం మొదలుపెట్టాడు.
    
    కాసేపటి తర్వాత కొందరు పోలీసు అధికారులు వచ్చారు. ఫార్మాలిటీస్ అన్నీ ముగిశాక ఇంటికెళ్ళిపోయాడు మెకానిక్.
    
    ఇంటికి తిరిగివస్తుంటే అతనికి అనిపించింది.
    
    తనమీద హత్యాప్రయత్నం జరగడం ఇది మొదటిసారికాదు. ఇలాంటివి తన లైన్ లో చాలా సహజం!
    
    కానీ ఇంతవరకూ తనవల్ల చావు మూడినవాళ్ళేగాని తనని చంపగలిగినవాళ్ళెవరూ పుట్టలేదు.
    
    బహుశా ఇకముందు పుట్టబోరేమో కూడా!
    
    తనని చంపాలనే ఆలోచన లేటెస్టుగా ఎవరికీ వచ్చి ఉండవచ్చు?
    
    దావూద్ ఇబ్రహీం?
    
    హాజీమస్తాన్, వరదరాజు మొదలియార్ ల తర్వాత అండర్ వరల్డులో అంత పవర్ ఫుల్ డాన్ దావూద్ ఇబ్రహీమే! యంగ్ అండ్ హాండ్సమ్ గ్యాంగ్ లాండ్ బాస్!
    
    తనకీ, దావూద్ గ్యాంగ్ కీ మొదటినుంచి కూడా వైరం వుంది.
    
    కానీ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఇండియన్ పోలీస్ కి భయపడి దుబాయ్ లో తలదాచుకుంటున్నాడు.
    
    అక్కడనుంచే తనని చంపించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడా దావూద్. అండర్ వరల్డులో తను ఈ మధ్య త్వర త్వరగా పైకి వచ్చేస్తున్నాడని అతనికి తెలుసా?
    
    తన మీద హత్యాప్రయత్నం చేసిన వాళ్ళు అమెచ్యూర్ ల లాగా వున్నారు. అంత దగ్గరనుంచి అన్ని బులెట్స్ పేల్చినా కేవలం ఒకటి మాత్రమే తనకి తగిలింది.
    
    అందులో కూడా ఆశ్చర్యమేమీ లేదు.
    
    గ్యాంగ్ వార్స్ లో మామూలుగానే జరుగుతూ ఉంటుంది అది. రైఫిల్ కీ, రివాల్వర్ కీ తేడా కూడా తెలియని ఏ రిక్షావాలాకో బాగా డబ్బిచ్చి, ఓ నెల్రోజులపాటు ఫైరింగ్ లో క్రాష్ కోర్సు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి వదులుతారు బాగా దగ్గరనుంచి కాలిస్తే తప్ప చంపలేరు వాళ్ళు. దగ్గరనుంచి కాల్చినా కూడా విఫలమవుతారు ఒక్కోసారి.
    
    దావూద్ ఇబ్రహీంకి ప్రత్యర్ధి అయిన రమానాయక్ తను చచ్చిపోయేముందు కొన్నాళ్ళపాటు ఇలాంటి ట్రయినింగ్ ఇచ్చే ఫైరింగ్ స్కూల్ ఒకటి నడిపాడు బొంబాయిలో.
    
    అలాంటి స్కూలు దేన్లోనో ట్రెయినింగ్ అయిన వాళ్ళయి వుంటారా వీళ్ళు?
    
    నుదురు చిట్లించి ఆలోచించాడు మెకానిక్!
    
    దావూద్ గ్యాంగు కాకుండా ఇంకెవరయినా కూడా తన అంతం చూడాలని కాచుకుని వున్నారా? ఏమో?
    
    కారు మెకానిక్ బంగళాముందు ఆగింది. లోపలకు వెళ్ళగానే తెలిసిన ఒక నర్సింగ్ హోమ్ కి ఫోన్ చేశాడు. ఆ తర్వాత కాసేపట్లోనే ఒక డాక్టరు వచ్చాడు. అతనితోబాటు ఒక నర్సు వచ్చింది.
    
    మెకానిక్ కి బుల్లెట్ గాయాలేమీ తగలకపోయినా దుండగులు సుత్తితో కారు అద్దాలు పగలకొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అద్దాలు గుచ్చుకుని సుత్తి దెబ్బ ఒకటి కణతలకు తగిలీ, చిన్న చిన్న గాయాలయ్యాయి. వాటికి మందుపూసి డ్రెస్సింగ్ చేశాడు డాక్టర్. డ్రెస్సింగ్ చేసేముందు కోటూ షర్టూ విప్పేశాడు మెకానిక్.
    
    యాభైమూడేళ్ళ వయసు వచ్చినా, కాంక్రీటు స్లాబ్ లా ఉన్న అతని ఛాతీమీద వున్న గుబురు వెంట్రుకలనీ కండలు తిరిగి దృఢంగా కనబడుతున్న అతని చేతుల్నీ తదేకంగా చూస్తూ వుండిపోయింది నర్సు. అతన్ని చూడగానే ఏ ఆడదానికయినా సరే, తన స్త్రీత్వం గుర్తువస్తుంది తక్షణం!
    
    నర్సు చూపులని గమనించి మనసులోనే నవ్వుకున్నాడు మెకానిక్. తర్వాత ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని చూపుల్లో ఆహ్వానం నగ్నంగా కనబడుతోంది.
    
    నర్సు కనురెప్పలు అల్లల్లాడాయి. కష్టంమీద చూపులు మరల్చుకుంది ఆమె.
    
    "మీరు వెళ్ళండి డాక్టర్! ఈ నర్స్ ఇక్కడే వుంటుంది. నాకేమైనా అవసరం రావచ్చు" అన్నాడు మెకానిక్.
    
    డాక్టర్ కి అతని భావం అర్ధమయిందో లేదోగానీ, తల వూపి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
    
    "ఇలారా!" అన్నాడు మెకానిక్.
    
    మంత్ర ముగ్ధలా దగ్గరికి వచ్చింది నర్సు.
    
    నాకు చాలా రోజులనుంచి తెలుసుకోవాలని కుతూహలం! నర్సుల యూనిఫారం అంటే ఏమేం గార్మెంట్స్ ఉంటాయో అని! తెల్ల గౌను, తెల్ల స్టాకింగ్స్, తెల్ల బెల్టు... అవునా? ఇంకా...."
    
    నర్సు యూనిఫారంలో ఏమేమి గార్మెంట్స్ వుంటాయో అతనికి తెలిసేసరికి ఆ అమ్మాయి నగ్నంగా అతని బెడ్ మీద కూర్చుని ఉంది. ఆమె కళ్ళలో కాంక్ష! ఊపిరిలో వేడి!
    
    "మీ కళ్ళలో ఏదో చెప్పలేని ఆకర్షణ వుంది" అంది ఆ అమ్మాయి వెనక్కి వాలిపోతూ గుసగుసగా.
    
    నవ్వాడు మెకానిక్. తన కళ్ళలో వశీకరణ శక్తి వుందని తనకి తెలుసు. కానీ ఆ ఆకర్షణ శక్తికి ఇంతవరకూ లొంగనిది ఒకే ఒక స్త్రీ!
    
    వైశాలి!
    
    వైశాలి గుర్తుకురాగానే మెకానిక్ కి నర్సుమీద ఇంట్రెస్టు తగ్గిపోయినట్లయింది. ఆ తర్వాత ఆ నర్సే తనని ఆవేశంతో చుట్టుకుపోతుంటే తను మెకానికల్ గా శృంగారం జరుపుతూ వైశాలి జ్ఞాపకాల్లోకి జారిపోయాడు అతను.
    
    అప్పట్లో వైశాలి తనతో చేరిపోతే బాగుంటుందని ప్రపోజల్ చేశాడు తను. కానీ ఆమె తనని కాదని బిజినెస్ మాగ్నెట్ మహాజన్ దగ్గర చాలా పెద్ద పొజిషన్ లో చేరిపోయింది.
    
    చాలా ఆగ్రహం కలిగింది తనకి.
    
    కానీ కామ్ గా వుండిపోయాడు.
    
    ఎందుకని?
    
    వైశాలి లాంటి ఆడపిల్ల మీద తను యాక్షన్ తీసుకుని శిక్షించడం రామచిలక గొంతు నులమడం అంత తేలిక! కానీ వైశాలి మహాజన్ రక్షణలో వుంది.
    
    మహాజన్ మామూలు మనిషి కాడు!
    
    తనలాంటి మెకానిక్స్ ని పదిమందిని మెయిన్ టెయిన్ చేయగలిగినంత ఇన్ ఫ్లుయెన్స్, డబ్బూ ఉన్నాయి అతనికి.
    
    తను వైశాలిని ఏమన్నా చేయాలంటేముందుగా ఆమెని మహాజన్ నుంచి విడదీయాలి!
    
    అందుకని పదిరోజులు అలోచించి మంచి ప్రణాళిక తయారు చేశాడు తను. ఈలోగా మహాజన్ క్యాంపులో జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు తన కంటాక్ట్ మాన్ ద్వారా! తన దగ్గర ఉద్యోగంలో చేరిన రెండో నెలలో అడిగాడు మహాజన్ వైశాలిని.
    
    "వైశాలీ! నీ బ్యాంకు అక్కౌంట్ లో ఎంత డబ్బు వుంది?"
    
    "ఎందుకు? రెండువేలు వుండవచ్చు" అంది వైశాలి.
    
    నవ్వాడు మహాజన్.
    
    "వైశాలీ! నువ్వు ఇప్పుడు నా ఆర్గనైజేషన్ లో చాలా పెద్ద పొజిషన్ లో వున్నావు. నీ ఇమేజ్ కంపెనీ ఇమేజ్ మీద కూడా పడుతుంది. అవునా?"
    
    సందిగ్ధంగా తల పంకించింది వైశాలి.
    
    "అందుకని నేనేం చేస్తానంటే నీ అకౌంట్ లో ఒక లక్ష వేస్తాను. పార్టీలకీ, ఎన్ టర్ టైన్ మెంటుకీ, మంచి బట్టలు కొనుక్కోవడానికి దేనికీ కూడా సంకోచించకుండా ధారాళంగా ఖర్చుపెట్టు! మళ్ళీ చెప్తున్నాను. నీ ఇమేజ్ కంపెనీ ఇమేజ్ కి తగినట్లు వుండాలి" అన్నాడు మహాజన్.
    
    సంతోషంతో వెలిగిపోయింది వైశాలి మొహం.
    
    ఇదంతా తనకి మహాజన్ ఆర్గనైజేషన్ లో పని చేస్తున్న కంటాక్ట్ మాన్ ద్వారా తక్షణం తెలిసిపోయింది.
    
    అప్పుడు ప్లే చేశాడు తను ఒక మాస్టర్ స్ట్రోక్!    

    బ్రహ్మాస్త్రాన్ని మించిన అస్త్రాన్ని ప్రయోగించాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra